బబల్ బ్యూటీ ‘హన్సిక’కూ ఇష్టమైన, ఆ మూడు బ్యూటీ ప్రొడక్ట్స్

Posted By:
Subscribe to Boldsky

ముట్టుకుంటే మాసిపోయే పసిడి అందాల హన్సిక అందచందాలు ఏమటని ఆశ్చర్య కలగక మానదు. ఎందుకంటే ఆ క్యూట్ ముఖంలో చిన్నగా ఉన్నకళ్ళు కైపెక్కిస్తుంటే, పెదవులపైన చిరనవ్వులు చిందుస్తుంటే ఆమె అందం మరికొంత సేపు చూడాలనిపిస్తుంది. మరి ఆమె అందం యొక్క రహస్యం ఏమిటో తెలుసుకోవాలంటే ఈ కథనం చదవాల్సిందే...ఇవి ఎవరో చెప్పిన రాసిన మాటలు కాదు.. ఓ మినీ ఇంటర్వ్యూ లో ఆమె చెప్పిన బ్యూటీ సీక్రెట్సే...మరి ఈ బబల్ బ్యూటీ యొక్క బ్యూటీ సీక్రెట్ ఏంటో చూద్దామా...హన్సికది అందమైన మెరిసేటి చర్మం ఆ బ్యూటీ మరింత అందంగా కనబడేలా చేస్తుంది. అంతే కాదు ఆమె తన బాడీని మరింత సెక్సీగా మార్చుకోవడానికి కొన్ని ఆరోగ్య మరియు బ్యూటీ చిట్కాలను తన దిన చర్యలో పాటిస్తుంటుంది. అందువల్ల ఆమె మరింత అందంగా కనబడుతుంది. అందుకు ఆమె త్వరగా నిద్ర పోయి, టైమ్ కు భోజనం చేసి, పండ్లు, గ్రీన్ సలాడ్స్ ను ఎక్కువగా తీసుకొంటానంటోంది.. వీటితో పాటు మరికొన్ని...

మేకప్ కు సంబంధించి మీరిచ్చే సలహా..?నిజానికి నేను కెమెరాముందు లేకపోతే మేకప్ చేసుకోను. ఒక వేళ నేనేదైనా పార్టీకో, ఈవెంట్ కో వెళ్ళాల్సివచ్చినా తేలిగ్గా లిప్ స్టిక్ మాత్రం వేసుకుంటాను. ఎప్పుడూ సింపుల్ గా ఉండటానికి ఇష్టపడుతాను. బ్రాండ్స్ విషయానికి వస్తే, ఎస్టీలాడర్ లిప్ స్టిక్ లేదా క్లినిక్ ఎంచుకుంటాను అంతే అంటున్నారు.

Hansika Beauty

మీ శిరోజాలకు ఏం వాడతారు? నా శిరోజాల గురించి బాగా జాగ్రత్త వహిస్తాను. షూటింగ్ వల్ల ఎక్కువ ప్రభావితమవుతాయి. కాబట్టి ప్రతి రోజూ వాస్ చేసుకోవాలి. నేను ఆమ్లా, పపాయ్ పౌడర్లు వాడుతుంటాను. మా అమ్మ హెయిర్ స్పెషలిస్ట్ కావడంతో అంతకుమించి నన్నేమీ చేయనివ్వదు. ఈ పౌడర్లన్ని ఇంట్లోనే తయారు చేసుకొని ఉపయోగిస్తుంటాం అంటోంది.

మీ బ్యాగ్ లో ఉండే బ్యూటీ ప్రోడక్ట్స్ ఏమిటి? పెర్ ఫ్యూమ్, హ్యాండ్, బాడీలోషన్, నేనెప్పుడూ జాన్సన్స్ బేబీ లోషన్ ను నా వెంట ఉంచుకుంటాను. అది మాయిశ్చరైజర్ మాదిరి పనిచేస్తుంది. నాకు మూడు ఫేవరెట్ ఫెర్ ఫ్యూమ్ బ్రాండ్స్ ఉన్నాయి. అవి ఎస్టీలాడర్, నినారిస్పి, ఛానల్. ఈ మూడు నా వెంట ఉంటాయి. ఎప్పుడూ ఫ్రెష్ గా ఉండటం అంటే నాకు ఇష్టం. అని చెబుతోంది. ఈ దేశముదురు బ్యూటీ..

English summary

Bubble Beauty Hansika Beauty Secret...! | బబల్ బ్యూటీ హన్సిక బ్యూటీ సీక్రెట్...

Bubble beauty Hansika cannot do without her handbag and it’s contents, which include her cosmetics. “I can’t step out without my kit including a perfume, body lotion and even a Johnson’s baby lotion, as it works as a moisturiser for me. I am brand conscious and pick cosmetics from premium brands. That is the secret of my good looks,” says the young actress, who likes to remain as fresh as possible. “That’s the key,” she adds.
Story first published: Tuesday, September 18, 2012, 11:49 [IST]
Please Wait while comments are loading...
Subscribe Newsletter