For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

చిన్న కళ్ళు ఉన్నవారికి మేకప్ చిట్కాలు

By Super
|

కళ్ళు భావ వ్యక్తీకరణకు ముఖ్యమైన లక్షణం అని చెప్పవచ్చు. మీ కళ్ళు మీలో ఉన్న ఫీలింగ్స్ ను చూపిస్తాయి. అయితే కళ్ళు మంచి,చెడు ఫీలింగ్స్ రెండింటిని వ్యక్తపరుస్తాయి. సాధారణంగా ప్రజలు పెద్ద కళ్ళు అంటే ఇష్టపడతారు. నిజానికి చేపల వంటి ఆకారం కలిగి,పెద్ద అందమైన కళ్ళు కలిగిన అమ్మాయిలు అందముగా ఉంటారు. కేవలం కాజల్ మరియు మాస్కరా రంగులను ఉపయోగించి అందమైన పెద్ద కళ్ళుగా చేయవచ్చు.

కానీ చిన్న కళ్ళు కలిగిన అమ్మాయిలు ఏమి చేయాలి. కొన్నిసార్లు చిన్న కళ్ళు మరియు బుగ్గలు ఉబ్బినట్టుగా ఉండి చూడటానికి ఒక చెడ్డ లుక్ కలిగి ఉంటారు. అలాగే చిన్న కళ్ళు ఉన్నవారు మేకప్ వాడరు. అందువల్ల ఇంకా చిన్నగా కనపడతాయి. చిన్న కళ్ళు పెద్దగా కనపడటానికి అందుబాటులో కొన్ని మేకప్ చిట్కాలు ఉన్నాయి.

చిన్న కళ్ళు ఉన్నవారికి మేకప్ చిట్కాలు ఈ విధంగా ఉన్నాయి.

Eye Makeup Tips For Small Eyes

మాస్కరా

చిన్న కళ్ళుకు మాస్కరా ఉపయోగించి మరింత అందముగా తయారుచేయవచ్చు. సాధారణంగా చిన్న కళ్ళు ఉన్నవారికి మందపాటి మాస్కరా ఉపయోగించాలి. కంటి రెప్పల మీద ఉన్న రోమములకు మాస్కరా మందముగా వేస్తె కళ్ళు అందముగా కనిపిస్తాయి. అలాగే పైన,క్రింద ఉన్న కంటి రెప్పల మీద ఉన్న రోమములకు మాస్కరా ఉపయోగించాలి. కంటి పరిమాణం పెరిగి కళ్ళు మరింత ఆకర్షణీయముగా కనపడతాయి. మీరు కంటి మాస్కరా ఉపయోగించే ముందు కంటి రెప్పల మీద ఉన్న రోమముల ఆకృతి కొరకు ఒక కర్లర్ ను ఉపయోగించవచ్చు.

ఐ లైనర్

చిన్న కళ్ళ మేకప్ కోసం ఒక ఐ లైనర్ ఉంది. మీ కళ్ళకు సరైన ఆకారం ఇవ్వటానికి సహాయపడుతుంది. మాస్కరా ప్రభావాన్ని మెరుగుపర్చడానికి తేలికపాటి రంగు లేదా తెలుపు రంగు ఐ లైనర్ ను ఉపయోగించవచ్చు. మీరు ముదురు రంగు ఐ లైనర్ ను కూడా వాడవచ్చు. రెండు ఐ లైనర్ లను ప్రయత్నించి మరియు పరీక్షించి వాటిలో ఒకదానిని ఎంచుకోండి.

షాడోస్

చిన్న కళ్ళ మేకప్ కోసం ఐ షాడో ఉత్తమంగా మరియు చూడటానికి బాగుంటుంది. సాయంత్రం సమయంలో గ్రే,నలుపు,పర్పుల్,డార్క్ షేడ్స్ మొదలైన రంగులను ఉపయోగించాలి. మధ్యాహ్నం సమయంలో పింక్,బ్రౌన్,మెరూన్ రంగులను ఉపయోగించాలి. యువతులు ముదురు రంగులను ఉపయోగిస్తే చాలా అందంగా కనపడతారు. మీరు ఉపయోగించే షేడ్ మీరు ధరించే బట్టలు మరియు ఉపకరణాలకు మ్యాచ్ అయ్యేలా ఉండాలి.

ప్రైమర్ మరియు ఫౌండేషన్

నిజానికి మొట్టమొదట ఐ మేకప్ కోసం ఉపయోగిస్తారు. ఏదైనా ఫౌండేషన్ లేదా ఐ షాడోస్ రాయటానికి ముందు ప్రైమర్ ను ఉపయోగిస్తారు. ఇది ఎక్కువ సమయం వరకు మేకప్ చెక్కుచెదరకుండా ఉంచడానికి సహాయపడుతుంది. ఫౌండేషన్స్ మరియు కన్సిలర్స్ డార్క్ సర్కిల్స్ మరియు ఇతర లోపాలను తగ్గించేందుకు సహాయం చేస్తాయి.

షిమ్మర్

చిన్న కళ్ళ మేకప్ కోసం షిమ్మర్ పొడి ఉపయోగించుట వలన మీ కళ్ళకు మెరిసే ఎఫెక్ట్ వస్తుంది. ఇది చిన్న కళ్ళ కారణంగా ఉండే బుగ్గల ఉబ్బును తగ్గించేందుకు సహాయం చేస్తుంది. షిమ్మర్ ను జాగ్రత్తగా వాడాలి. ఎందుకంటే ఎక్కువగా వాడుట వలన ముఖం గాడీగా లేదా ఫేక్ గా కనిపిస్తుంది. షిమ్మర్ పొడిని కేవలం కన్ను రెప్పలు మరియు కన్ను క్రింద భాగంలో మాత్రమే ఉపయోగించాలి.

చిన్న కళ్ళ కోసం కొన్ని మేకప్ చిట్కాలు ఉన్నాయి. రాత్రి పడుకునే ముందు మేకప్ మొత్తంను తొలగించాలని గుర్తుంచుకోవాలి. ఎల్లప్పుడూ మంచి నాణ్యత గల మేకప్ ను ఉపయోగించాలి. కళ్ళు మనకు బహుమతి వంటిది. అందువల్ల మనం వాటిని సురక్షితంగా మరియు ఆరోగ్యకరముగా ఉంచుకోవాలి.

English summary

Eye Makeup Tips For Small Eyes

Eyes are the most expressive feature of our face. Eyes can show what you are feeling about a particular situation. Eyes express your feeling, both good and bad. Generally, people are very fond of big eyes.
Desktop Bottom Promotion