For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

కళ్ళద్దాలతో అందంగా కనపడటం ఎలా?

By Super
|

అందం సంగతి ఎలావున్నా అసలు కళ్ళు కనిపించాలంటే కళ్ళద్దాలు తప్పదు. చత్వారమో, తలనొప్పో వచ్చి డాక్టర్‌ దగ్గరకి వెడితే కళ్ళజోడు రాసిస్తాడు. అందులో అందం వెతుక్కోవడంలో అర్థం లేదుకానీ, నూటికి 99 శాతం కళ్ళజోడు కొనుక్కోవడానికి ఎన్నో తంటాలు పడుతుండటం మనం చూస్తూనే ఉంటాం. ఏ ఫ్రేము ముఖానికి సూటవుతుందా అని అదిమార్చి అదీ, అది మార్చి ఇదీ పెట్టుకుని చూసేసుకుంటూ ఉంటారు. కాబట్టి కళ్ళజోడు గురించి చెప్పక తప్పదు.

కళ్ళజోడు ధరించేవారు ఎలాంటిది కొనుక్కోవాలి అనుకున్నప్పుడు ముఖ్యంగా మూడు విషయాలను పరిగణనలోకి తీసుకోవాలి. ఒకటి కళ్ళజోడు బాగా కనిపించేదిగా ఉండాలి. రెండోది కళ్ళజోడు పెట్టుకోవడం వల్ల అందం పెరగాలి గానీ తగ్గిపోకూడదు. మూడు, ప్రస్తుత ట్రెండ్‌ను అనుసరించి కళ్ళజోడును ఎంపిక చేసుకోవాలి. దీనితోపాటు మీ ముఖాకృతిని బట్టి సెలక్షన్‌ ఉండాలి. కళ్ళద్దాలు స్మార్ట్, సాసీ మరియు ఆధునికంగా కనపడటానికి ఒక గొప్ప మార్గం. ఇక్కడ కళ్ళద్దాలతో అందంగా కనపడటానికి మార్గాలు ఇస్తున్నాము.

మీ కనుబొమ్మలను బాగా అందంగా తయారుచేసుకోండి

మీ కనుబొమ్మలను బాగా అందంగా తయారుచేసుకోండి

మీ కనుబొమ్మలను చక్కగా మరియు ఒక మంచి ఆకారంలో ఉంచుకున్నప్పుడు, మీరు కళ్ళద్దాలు ధరించినప్పుడు మీ కళ్ళు ప్రత్యేకంగా అందంగా కనపడతాయి. ఖాళీగా ఉన్న మీ కనుబొమ్మలను అందంగా తీర్చిదిద్దటానికి ఒక బ్రో లైనర్ కాని లేదా బ్రో పౌడర్ కాని ఉపయోగించండి.

కన్సీలర్ ఉపయోగించండి

కన్సీలర్ ఉపయోగించండి

కళ్ళద్దాలు మీ కళ్ళ కింద చీకటి వృత్తాలు, ముడుతలను లేదా లోపాల ప్రత్యేకతను చెప్పక చెప్పుతాయి. దీనిని నివారించటానికి, కృష్ణ వృత్తాలు మరియు మచ్చల మీద ఒక చుక్క కన్సీలర్ వేయండి. తరువాత స్పాంజ్ తో అద్దండి.

సరి అయిన ఐ షాడో వాడండి

సరి అయిన ఐ షాడో వాడండి

మీ కళ్ళద్దాల ఫ్రేమ్ కు తగిన రంగును వాడండి.మీ కళ్ళు మరియు మీ అద్దాలు ప్రత్యేకంగా కనపడాలంటే మీ ఫ్రేమ్ కు వ్యతిరేక రంగు వాడండి. సహజంగా కనపడాలంటే, సహజమైన రంగులు వాడండి.

కంటి లైనర్ వర్తింపచేయండి

కంటి లైనర్ వర్తింపచేయండి

మీ కళ్ళు పాప్ గా కనపడటానికి కంటి లైనర్ ను వర్తింపచేయండి. మీరు కేవలం మీ కళ్ళ యొక్క అంచు మాత్రమె లైన్ చేయండి, కాని కంటి చివరలదాకా పొగలాగా ఐ లైనర్ వాడవొద్దు. మిమ్మలిని చూడగానే ఇంత అద్భుతంగా ఉన్నారా అని అనిపించాలి కాని మిమ్మలిని చూసి భయపడకూడదు.

బోల్డ్ లిప్ కలర్ ఉపయోగించండి

బోల్డ్ లిప్ కలర్ ఉపయోగించండి

మీరు బ్రౌన్ లేదా నలుపు రంగుతో ఉన్న కళ్ళద్దాల ఫ్రేమ్ కలిగి ఉన్నట్లయితే, దానికి ముదురు ఎరుపు లేదా మంచి హాట్ పింక్ రంగు కాని వేయండి. మీకు కలర్ ఫ్రేమ్ ఉన్నట్లయితే, దానికి రోజీ పింక్ రంగు వాడండి.

జుట్టు రంగు కూడా సరిగా ఉంచుకోండి

జుట్టు రంగు కూడా సరిగా ఉంచుకోండి

అమ్మాయిల జుట్టు పైన ఒక రంగు, క్రింద ఒక రంగు ఉండి కళ్ళద్దాలు ధరించటం బాగుండదు. మీ జుట్టును లూజ్ గా ఉంచి, దానిని ఫ్రేమ్ రంగుతో సరిపోయే బాండ్స్ పెట్టండి లేదా ఒక లూజ్ బన్ తీసుకుని పైకి కట్టండి లేదా పోనిటైల్ గా కట్టండి. మీరు చాలా అందంగా కనపడతారు.

English summary

How to look pretty in glasses?


 Glasses are a great way to look smart, sassy and sophisticated. Here are ways to look pretty in glasses.
Desktop Bottom Promotion