For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

గోరింటాకు ముద్దమందారంలా ఎర్రగా పండాలంటే..!

|

పంటలేని గోరింటను అరచేతుల్లో పూయించడం అంటే అతివలకు అత్యంత ఇష్టమైనది. మందారంలా పూసినా, గులాబీలా పూసినా చేతులను చూసుకొని మురిసిపోతుంటారు. పెళ్లిళ్లలో, పండగల్లో మగువల మనసుల్లో వెంటనే మెదిలేది మెహిందీయే కదా. అసలు ఏ సందర్భమూ లేకుండా చేతులకు గోరింటాకు పెట్టకోవడం కూడా ఒక వేడుకే కదా. అందమైన ఆకుపచ్చని హెన్నా డిజైన్లు... చేతులకు, కోమల పాదాలకు ఇనుమడింపజేసే ఈ అందం..చూసి తీరవలసిందే కాని మాటల్లో చెప్పలేనిది. గోరింటా అరచేతుల్లో పెట్టుకుంటే కలలు నిజం చేస్తుందన్నది నమ్మకం. ఇక కేశాలకు పట్టిస్తే చక్కటి రంగుతో జుట్టు మెరిసేలా చేస్తుందన్నది వాస్తవం...

ప్రాచీన కాలం నుండి నేటి రకు చక్కటి రంగు కోసం గోరింటాకు పేస్ట్ తయారీలో ఎన్నో రకాల పద్దతులను అనుసరిస్తూ వచ్చారు. గోరింటాకు అందంగా, ఎర్రగా పండి చేతులకు, పాదాలకు చక్కని అందం రావాలంటే ముందుగా గోరింటాకు నాణ్యనతను పరిశీలించాలి. గోరింటాకు మిశ్రమాన్నా సరైన పద్దతిలో తయారు చేసుకోవాలి. అంతే కాదు గోరింటాకు బాగా ఎర్రగా పండాలంటే కొన్ని చిట్కాలు మీకోసం...

గోరింటాకు ఆకులను కానీ లేదా పొడిని కానీ వేడినీళ్లు కలిపి రాత్రంతా నానబెట్టుకోవాలి. ఇంకా బ్లాక్‌ టీలో కనుక కలిపి నానబెట్టినట్లైతే మరింత డార్క్‌ కలర్‌తో గోరింట పండుతుంది. మెహిందీ లేదా హెన్నాకు కాఫీ పౌడర్‌ కలిపుకొని రాత్రంతా నానబెట్టాలి. తర్వాత రోజు చేతులకు పెట్టుకోవడం వల్ల చేతులు పెట్టుకొన్నట్లైతే కాఫీ బ్రౌన్‌ కలర్‌లో పండుతుంది. నిమ్మరసంలో పంచదార వేసి చిక్కటి సిరఫ్‌లా తయారు చేసుకోవాలి. మెహింది చేతులకు పెట్టుకొన్న తర్వాత తడి ఆరే సమయంలో ఈ లెమన్‌ సుగర్‌ సిరఫ్‌ను చేతులకు అప్లై చేయాలి. దాని వల్ల మెహిందీ చేతిలో ఎండిపోయినా రాలిపోకుండా తిరిగి తడిగా ఉండేలా చేస్తుంది ఈ సిరఫ్‌.

టోనర్ కానీ లేదా ఆస్ట్రిజెంట్ కానీ అప్లై చేయాలి

టోనర్ కానీ లేదా ఆస్ట్రిజెంట్ కానీ అప్లై చేయాలి

గోరింటాకు పెట్టుకొనే ముందు చేతులకు టోనర్ కానీ లేదా ఆస్ట్రిజెంట్ కానీ అప్లై చేయాలి. ఇలా చేయడం వల్ల చర్మంలోని ఏదైనా అదనపు నూనెలు ఉన్నప్పుడు తొలిగించడానికి సహాయపడుతుంది.

గోరింటాకు(మెహిందీని)రాత్రంతా నానబెట్టాలి:

గోరింటాకు(మెహిందీని)రాత్రంతా నానబెట్టాలి:

గోరింటాకు ఆకులను కానీ లేదా పొడిని కానీ వేడినీళ్ళు కలిపి రాత్రంతా నానబెట్టుకోవాలి. ఇంకా బ్లాక్ టీలో కనుక కలిపి నానబెట్టినట్లైతే మరింత డార్క్ కలర్ తో గోరింట పండుతుంది.

మెహిందీకి కాఫీపౌడర్ మిక్స్:

మెహిందీకి కాఫీపౌడర్ మిక్స్:

మెహిందీ లేదా హెన్నాకు కాఫీ పౌడర్ కలిపుకొని రాత్రంతా నానబెట్టాలి. తర్వాత రోజు చేతులకు పెట్టుకోవడం వల్ల చేతులు పెట్టుకొన్నట్లైతే కాఫీ బ్రౌన్ కలర్ లో పండుతుంది.

 నిమ్మరసం మరియు పంచదార:

నిమ్మరసం మరియు పంచదార:

నిమ్మరసంలో పంచదార వేసి చిక్కటి సిరఫ్ లా తయారు చేసుకోవాలి. మెహింది చేతులకు పెట్టుకొన్న తర్వాత తడి ఆరేసమయంలో ఈ లెమన్ సుగర్ సిరఫ్ ను చేతులకు అప్లై చేయాలి. దాని వల్ల మెహిందీ చేతిలో ఎండిపోయినా రాలిపోకుండా తిరిగి తడిగా ఉండేలా చేస్తుంది ఈ సిరఫ్.

మెహిందీని పెట్టుకొన్న తర్వాత కనీ 6గంటల సమయం అలాగే ఉంచాలి:

మెహిందీని పెట్టుకొన్న తర్వాత కనీ 6గంటల సమయం అలాగే ఉంచాలి:

గోరింటాకు చేతులకు పెట్టుకొన్న తర్వాత అది చేతుల మీద కనీసం ఆరుగంట సమయం అన్నా ఉండేట్లు చూసుకోవాలి. అందుకు లెమన్ సుగర్ సిరఫ్ ను మధ్య మధ్యలో రాస్తుంటే మీరు కోరుకొన్న కలర్ మీ చేతుల్లో పండుతుంది.

లవంగాల ఆవిరి పట్టించడం:

లవంగాల ఆవిరి పట్టించడం:

లవంగాలను ఒక పాన్ లో వేసి వేయించాలి. వేయించే సమయంలో వచ్చే పొగ మీద రెండు చేతులను ఒక అంగుళం దూరంలో పెట్టి ఆవిరి పట్టించాలి. ఆ పొగ చేతులకు వేడి పుట్టించి మెహిందీ మరింత ఎర్రగా పండేలా చేస్తుంది.

24గంటల పాటు సోప్ వాడకూడదు

24గంటల పాటు సోప్ వాడకూడదు

మెహింది పెట్టుకొన్న తర్వాత చేతులకు 24గంటల పాటు సోప్ వాడకూడదు.

English summary

Tips To Make Mehndi Last Longer

The festive season is on the roll. Starting from the auspicious occasion of Raksha Bandhan, the Indian festivals and the preparations for it has begun. This festive season serves as an excuse not only to buy clothes and eat food but it is also an excuse to beautify oneself.
Story first published: Friday, August 23, 2013, 16:28 [IST]
Desktop Bottom Promotion