For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

డార్క్ లిప్ స్టిక్ తో సెలబ్రెటీల్లా మెరిసిపోవాలంటే...!

|

ప్రస్తుత రోజుల్లో డార్క్ లిప్ స్టిక్ అనేది సరికొత్త ట్రెండ్. వివిధ ఫంక్షన్లు, మరియు చాలా ఈవెంట్స్ లలో చాలా మంది సెలబ్రెటీ డార్క్ రెడ్ లిప్ స్టిక్ వేసుకొని ఉండటాన్ని మనం గమనించే ఉంటాం. చాలా మంది మహిళలు డార్క్ లిప్ స్టిక్ ధరించడానికి చాలా వెనుకాడుతారు. డార్క్ లిప్ టస్టి వేసుకోవడం విచిత్రమేమి కాదు మరియు కొత్తాకాదు. ఎందుకంటే డార్క్ లిప్ స్టిక్ వేసుకొనే విధానంలో కొన్ని ట్రిక్స్ తెలుసుకొన్నట్లైతే మీరు అందంగా కనబడేలా చేయడానికి సహాయపడుతుంది మరియు డార్క్ లిప్ స్టిక్ వేసుకొన్నా మీరు సౌకర్యవంతంగా ఫీలవుతారు.

మీరు డార్క్ లిప్ స్టిక్ వేసుకోవాలనుకున్నప్పుడు అది మీ వేసుకొనే దుస్తులకు మరియు ఇతర యాక్సెసరీస్ కు మరియు మీ స్కిన్ టోన్ కు మ్యాచ్ అయ్యేవిధంగా చూసుకోవాలి. ఉదా: మీరు డార్క్ గా ఉంటే కనుక మీకు వైన్ రెడ్ లిప్ స్టిక్ మీ స్కిన్ టోన్ కూ మ్యాచ్ కాకపోవచ్చు. మరియు మీరు వేసుకొనే డార్క్ లిప్ స్టిక్ మ్యాట్ ఫినిష్ లేదా గ్లాసీ లిప్ స్టిక్కా అని ముందే నిర్ణయించుకోవాలి. మీ వ్యక్తిగత ఎంపిక మరియు అవుట్ ఫిట్(దుస్తులు)లను బట్టి డార్క్ లిప్ స్టిక్ ఎంపిక చేసుకోవాలి. ఉదా: మీరు షిమ్మర్ బ్లూ ఫ్రాక్ ధరించేటట్లు అయితే గ్లాసీ లిప్స్ ను నివారించండి. ఈ డ్రెస్ మీదకు డార్క్ మ్యాట్ లిప్ స్టిక్ బాగా నప్పుతుంది. ప్రకావశంతమైన మరియు మెరిసే దుస్తుల మీదకు బాగా నప్పుతుంది.

డార్క్ లిప్ స్టిక్ వేసుకొనేవారు తప్పని సరిగా డార్క్ లిప్ పెన్సిల్ తో ఔట్ లైన్ ధరించడం చాలా ముఖ్యం. అప్పుడు పూర్తి లుక్ ఉంటుంది. ఇది మీకు స్పెషల్ ఎఫెక్ట్ ను మరియు పెదాల షేప్ ను జతచేసి, ఇతరులను ఆకట్టుకునే చేస్తుంది. డార్క్ లిప్ స్టిక్ కు గోల్డ్ మేకప్ టిప్స్ తక్కువ అలంకరణ మరియు న్యూట్రల్ గా ఉండేందుకు ఇష్టపడుతారు. అయితే, చాలా మంది ప్రముఖ సెల్రెటీలు ఈ మేకప్ తో బ్రేక్ అప్ చేసారు. ఎక్కువ మేకప్ తో డార్క్ లిప్ స్టిక్ ను జత చేశారు. మీరు మరీ డార్క్ లిప్ స్టిక్ వేసుకోదలచుకుంటే మేకప్ తో పాటు కళ్ళ మేకప్ మీద కూడా దృష్టి పెట్టాలి. మీ బుగ్గలు ప్లెయిన్ గా వదిలేయాలి అయితే కళ్ళ మాత్రం అద్భుతంగా కనబడేలా మేకప్ చేసుకోవాలి. ఉదాహరణకు మన సెలబ్రెటీలు డార్క్ లిప్ స్టిక్ ను ఏవిధంగా వేసుకొన్న వారి స్టైల్ మరియు అందాన్ని ఒక సారి పరిశీలించండి.

డార్క్ లిప్ స్టిక్ తో అందంగా కనబడాలంటే..!

ఆక్స్ బ్లడ్ లిప్స్: క్రీమీ వైట్ డీప్ నెక్ గౌను మీదికి దీపికా పదుకొనే డార్క్ రెడ్ లిప్ స్టిక్ తో..మెస్సీ హెయిర్ స్టైల్ తో ఫ్యాషన్ ఈయర్ రింగ్స్ తో అద్భుతంగా కనిపిస్తున్నారు.

డార్క్ లిప్ స్టిక్ తో అందంగా కనబడాలంటే..!

డార్క్ పర్పుల్ లిప్స్: డార్క్ లిప్ స్టిక్ ధరించిన ఈ సెలబ్రెటినీ చూడండి ఎంత అందంగా కనిపిస్తుందో. కరిష్మా టాప్ టు బాటమ్ అన్ని మ్యాచీ మ్యాచీగా ధరించింది. డార్క్ పర్పుల్ అవుట్ ఫిట్ మీదకు డార్క్ లిప్ స్టిక్ తో పాటు డార్క్ ఔట్ లైన్ ఐస్ తో చాలా స్టైలిష్ గా కనబడుతోంది. డార్క్ నెయిల్ పాలుష్ అద్భుతంగా కనిపిస్తోంది.

డార్క్ లిప్ స్టిక్ తో అందంగా కనబడాలంటే..!

చెర్రీ రెడ్: ఈ దుస్తుల్లో ఈష గుప్త చాలా మోడ్రన్ గా కనబడుతన్నారు ఆమె వేసుకొన్న మేకప్ చాలా ఫర్ ఫెక్ట్ గా కుదిరింది. లైట్ కలర్డ్ గౌన్ మీదకు రెడ్ లిప్ స్టిక్ చాలా లైట్ ఐ మేకప్ ఆమె అందాన్ని మరింత క్లాసీగా మార్చింది.

డార్క్ లిప్ స్టిక్ తో అందంగా కనబడాలంటే..!

మ్యాట్ ఆక్స్ బ్లడ్ లిప్స్: మీరు అందంగా నవ్వడానికి మరియు స్టైలిష్ గా కనబడటానికి ఈ లిప్ స్టిక్ చాలా అద్భుతంగా నప్పుతుంది. క్యాజువల్ అవుట్ ఫిట్ లోకి ఈ మేకప్ టిప్స్ ను పాటించవచ్చు . డార్క్ ఆక్స్ బ్లడ్ లిప్స్ , డార్క్ ఐ మేకప్ చూడటానికి చాలా అద్భుతంగా ప్రకాశవంతంగా కనబడుతోంది.

డార్క్ లిప్ స్టిక్ తో అందంగా కనబడాలంటే..!

వైన్ రెడ్: కరీనా కపూర్ రెడ్ కలర్ దుస్తులు మరియు రెడ్ కలర్ లిప్ స్టిక్ ధరించడం అంటే చాలా ఇష్టం. మినిమల్ మేకప్ మీదకు వైన్ రెడ్ గ్లాసీ లిప్స్ ఫర్ ఫెక్ట్ లుక్ ను ఇస్తోంది.

డార్క్ లిప్ స్టిక్ తో అందంగా కనబడాలంటే..!

బ్లడ్ రెడ్: మీరు ట్రెడిషినల్ అవుట్ ఫిట్ ధరించేటప్పుడు, మీరు ఆ దుస్తుల మీదకు హైలైటెడ్ కలర్ డార్క్ లిప్ స్టిక్ ధరిస్తే అద్భుతంగా ప్రకాశవంతంగా కనిపిస్తారు. దాంతో పాటు అవుట్ ఫిట్ కు సూట్ అయ్యే ఐ మేకప్ కూడా చాలా అవసరం. కళ్ళకు కాజల్ వేసుకోవడం వల్ల ఒక ఫర్ ఫెక్ట్ లుక్ అందిస్తుంది.

డార్క్ లిప్ స్టిక్ తో అందంగా కనబడాలంటే..!

డార్క్ పింక్: పింక్ ఫెమినైన్ కలర్. కాబట్టి పింక్ లోనే వివిధ రకాల షేడ్స్ తో ప్రయోగం చేయండి . ఈ డార్క్ ఫింక్ గ్లాసీ లిప్ స్టిక్ వేసుకొంటే చాలా స్టైలిష్ గా ఉంటుంది. దానికి తోడు మత్తుకళ్ళ మేకప్ మరింత డిఫరెంట్ గా కనబడేలా చేస్తుంది.

డార్క్ లిప్ స్టిక్ తో అందంగా కనబడాలంటే..!

ఆరెంజ్: ఇది అద్భుతమైన మరియు బ్రైట్ సమ్మర్ లిప్ కలర్ . ఈ లిప్ కలర్ దీపికా పదుకొనే ధరించి మరింత అందంగా కనబడుతోంది. ఇది మినిమమ్ మేకప్ మీదకు అద్భుతంగా కనిపిస్తోంది. పైకనురెప్ప మీద ఐలిడ్ ఐలైనర్ అప్లై చేస్తే చాలు. అద్భుతంగా కనిపిస్తారు.

డార్క్ లిప్ స్టిక్ తో అందంగా కనబడాలంటే..!

ప్లమ్ రెడ్: ఈ సమ్మర్ లో ప్లమ్ కలర్స్ చాలా ట్రెండీగా కనిపిస్తున్నాయి. ప్లమ్ రెడ్ లిప్ స్టిక్ లూషియస్ లిప్స్ లైక్ ప్రియాంకా చోప్రా...

డార్క్ లిప్ స్టిక్ తో అందంగా కనబడాలంటే..!

బ్రైట్ రెడ్ లిప్ స్టిక్: మీరు బ్రైట్ రెడ్ అవుట్ ఫిట్ ధరిస్తున్నట్లైతే ఆ అవుట్ ఫిట్ కు మ్యాచ్ అయ్యే బ్రైడ్ రెడ్ లిప్ స్టిక్ ను ఎంపిక చేసుకోండి. ఇది మీ అందానికి మరింత డొమెస్టిక్ ఎఫెక్ట్ ను ఇస్తుంది. మరియు మీకళ్ళ మేకప్ హైలైట్ చేయాలి.

డార్క్ లిప్ స్టిక్ తో అందంగా కనబడాలంటే..!

రెడ్ మ్యాట్ లిప్స్: మీ పెదాలు కలర్ఫుల్ గా కనిపించాలంటే మేకప్ లేకుండా స్మైల్ చేయండి. అయితే ఇది మీకు ఒక ఫర్ ఫెక్ట్ ఉదాహరణ. మీకళ్ళను లేదా మీ బుగ్గలను హైలైట్ చేయాల్సిన పనిలేదు. ఒక తిన్ లైన్ కాజల్ అప్లై చేస్తే చాలు..

English summary

Wear Dark Lipstick Like Celebrities! | డార్క్ లిప్ స్టిక్ తో సెలబ్రెటీల్లా మెరిసిపోవాలంటే...!

Dark lipsticks are a new trend these days. We can see various celebrities wearing dark red lips at several events and functions. Women often feel hesitant in carrying dark lips. Wearing a dark lipstick is nothing different nor new.
Story first published: Tuesday, May 28, 2013, 16:30 [IST]
Desktop Bottom Promotion