For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

సున్నితమైన కళ్ళకు 10 సింపుల్ మేకప్ టిప్స్ & ట్రిక్స్

By Super
|

కళ్ళ విషయంలో చాలా మంది ఎదుర్కొనే సమస్య కళ్ళ దురుద(ఇరిటేషన్)చాలా మంది ఈవిషయంలో అనుభవం పొంది ఉంటాయి. మన కళ్ళు చాలా సున్నితంగా ఉండటం వల్ల ఈ సమస్యను నివారించుకోవడం కొంచెం కష్టంగా అనిపిస్తుంది. ఈ సమస్య వల్ల మన దినచర్యలు సవ్వంగా చేయడానికి కొంచెం డిఫికల్ట్ గా ఉంటుంది. మరియు కొన్ని సార్లు మ్యానేజ్ చేయడానికి కూడా కష్టంగా ఉంటుంది.

కళ్ళ విషయంలో తగినంత జాగ్రత్తలు తీసుకోకపోతే, ముఖ్యంగా మహిళలు విషయంలో మేకప్ అప్లై చేయడం స్కిన్ ఫుల్ టాస్క్ లా అనిపిస్తుంది, మేకప్ సరిగా వేసుకోకపోతే , కళ్ళు ఎరుపెక్కడం, కళ్ళు మంటలు మరియు దురద సమస్యలు ఎదుర్కోవల్సి వస్తుంది. కాబట్టి, ఇటువంటి సమస్యలు ఎదుర్కోకుండా ఇక్కడ కొన్ని ప్రాక్టికల్ ఐమేకప్ టిప్స్ సున్నితమైన కళ్ళ మేకప్ కోసం ఇవ్వడం జరిగింది...

మేకప్ బ్రష్ లను ఎప్పటికప్పుడు శుభ్రం చేయడం:

మేకప్ బ్రష్ లను ఎప్పటికప్పుడు శుభ్రం చేయడం:

చాలా సెన్సిటివ్ గా ఉన్నకళ్ళును సురక్షితంగా ఉంచుకోవాలనుకుంటే తప్పనిసరిగా, వాటిని ఉపయోగించిన ప్రతి సారి శుభ్రం చేయాలి. లేదంటే బ్రష్ మీద సన్నని డస్ట్ చేరి, కళ్ళకు ఇన్ఫెక్షన్ అవుతుంది. ఈ సమస్యను నివారించడానికి మేకప్ బ్రష్ లకు రెగ్యులర్ క్లీనింగ్ చాలా అవసరం. షాంపుతో బ్రష్ లను శుభ్రం చేసి పొడివస్త్రంతో తుడిచి పెట్టాలి.

క్రీమీ షాడో:

క్రీమీ షాడో:

కళ్ళు చాలా సెన్సిటివ్ గా ఉన్నవారికి ఐ షాడో పౌడర్స్ అప్లై చేయడం వల్ల కూడా కొన్ని కళ్ళఇన్ఫెక్షన్ సమస్యలు వస్తుంటాయి. ఐషాడో పౌడర్స్ లో గ్లిట్టర్ లేదా మెరిసేటి ఐషాడో పౌడర్స్ కు దూరంగా ఉండాలి. ఎందుకుంటే ఇవి కూడా సున్నితమైన కళ్ళకు ఇరిటేషన్ కలిగిస్తాయి.

ఇన్నర్ ఐస్ కు లైనింగ్ వేయడం నివారించాలి:

ఇన్నర్ ఐస్ కు లైనింగ్ వేయడం నివారించాలి:

చాలా మంది మేకప్ ఆర్టిస్టులు, కళ్ళ క్రింది రెప్పలకు లోపలివైపుగా లైనింగ్ వేసుకోవడానికి వైట్ కోల్ పెన్సిల్ ఉపయోగించవచ్చుని సూచిస్తుంటారు, అయితే ఇది అప్లై చేస్తే చూడటానికి కళ్ళు అందంగా కనిపించినా, అనుకోకుండా చాలా సున్నితంగా ఉన్న కళ్ళకోసం ఇటువంటి ఇన్నర్ లైనర్ ను నివారించాలి . సున్నితమైన కళ్ళు కలిగిన వారు ఐపెన్సిల్ తో అవుట్ సైడ్ లాష్ ను అప్లై చేయవచ్చు.

ఉత్తమ ప్రొడక్ట్స్ ను ఎంపిక చేసుకోవాలి:

ఉత్తమ ప్రొడక్ట్స్ ను ఎంపిక చేసుకోవాలి:

మీ కళ్ళు చాలా సెన్సిటివ్ గా ఉన్నాకూడా, మేకప్ వేసుకోవచ్చు. ఎందుకంటే, ప్రస్తుత రోజులో వివిధ రకాల బ్రాండెడ్ మానిఫ్యాక్చర్ ప్రొడక్ట్స్ అందుబాటులో ఉన్నాయి. ముఖ్యంగా సెన్సిటివ్ కళ్ళను దుష్టిలో పెట్టుకొనే వివిధ రకాల బ్రాండ్ ఐటమ్స్ మార్కెట్లోకి వచ్చాయి. కాబట్టి,సెన్సిటివ్ కళ్ళు ఉన్నవారు, బ్రాండెడ్ ప్రొడక్ట్స్ ను ఎంపిక చేసుకోవడం ఉత్తమం.

 తరచూ మీరు ఉపయోగించే ఉత్పత్తులను మారుస్తుండాలి:

తరచూ మీరు ఉపయోగించే ఉత్పత్తులను మారుస్తుండాలి:

కొంత మంది బ్యూటీ ప్రొడక్ట్స్ ఉపయోగించకపోతే, కొన్ని నెలల తర్వాత వాటిని పడేస్తుంటారు. ఇలా చేయడం వల్ల కళ్ళకు చాలా సహాయపడుతుంది. ఇంకా ఇటుంటి బ్యూటీ ప్రొడక్ట్స్ ను తరుచూ శుభ్రం చేస్తుండాలి. లేదంటే కళ్ళ ఇరిటేషన్ కు గురిచేస్తుంది.

ప్రైమర్ అండ్ ఫౌండేషన్:

ప్రైమర్ అండ్ ఫౌండేషన్:

ప్రైమర్ మరియు ఫౌడేషన్ మేకప్ చెదిరిపోకుండా ఉండటానికి సహాయపడుతుంది. కళ్ళకు ప్రత్యేకంగా వేయడానికి ప్రైమర్ మరియు ఫౌండేషన్స్ అందుబాటులో ఉన్నాయి . ఇవి ఆర్డినరీవ వాటి కంటే చాలా స్మూత్ గా ఉంటాయి . సెన్సిటివ్ స్కిన్ ఉన్నవారు ఇటువంటి వాటిని ఎంపిక చేసుకోవచ్చు.

మస్కరా:

మస్కరా:

మస్కరా ఉపయోగించడం నివారించాలి , ఎందుకంటే వీటిలో ఉండే ఫైబర్ కళ్ళకు ఇరిటేషన్ కలిగిస్తుంది. కొంత మంది ఐలాష్ డే కిట్ ను ఎక్కువగా ఉపయోగించడానికి ఇష్టపడుతుంటారు. అంతే కాదు, ఎప్పుడు అనుసరించాల్సినది, వాటిని ఉపయోగించే ముందు ప్యాచ్ టెస్ట్ చేయడం చాలా అవసరం.

జెంటిల్ టచ్:

జెంటిల్ టచ్:

సెన్సిటివ్ గా ఉన్నకళ్ళకోసం చాలా సురక్షితమైన పద్దతులను అనుసరించాలి. క్లీన్ బ్రష్ లను ఉపయోగించడంతో పాటు, మేకప్ వేసుకోవడానికి ముందుగా మీరు ఎప్పుడు చేతులను శుభ్రం చేసుకోవాలి. చేతుల ద్వారా, గోళ్ళు ద్వారా కూడా కళ్ళు చాలా త్వరగా ఇన్ఫెక్షన్ కు గురి అవుతుంటాయి. అలాగే మేకప్ వేసేప్పుడు, తొలగించేప్పుడు కళ్ళను రుద్దకుండా నివారించాలి.

ఎప్పుడూ మేకప్ ను తొలగించాలి:

ఎప్పుడూ మేకప్ ను తొలగించాలి:

మనలో చాలా మందికి కొన్ని సందర్భాల్లో క మేకప్ తొలగించే విషయంలో మతిమరుపు లేదా బద్దం అనే సమస్యలు రెండూ సహజం. అయితే సెన్సిటివ్ ఐస్ కలిగి ఉన్నప్పుడు ఇలా చేయడం మంచి పద్దతి కాదు. మీరు ఎప్పుడూ గుర్తించుకోవల్సిన అవసరం, రాత్రి పడుకొనే ముందు మంచి క్లెన్సర్ తో లేదా మేకప్ రిమూవర్ తో మేకప్ తొలగించడం చాలా అసవరం.

 వివిధ రకాలా కలర్స్ ను ఉపయోగించాలి:

వివిధ రకాలా కలర్స్ ను ఉపయోగించాలి:

కొంత మంది కళ్ళు డిఫరెంట్ గా కనిపించడం కోసం వివిధ రకాలా కలర్స్ ను కూడా ఉపయోగిస్తుంటారు. ఇలా చేయడం వల్ల కూడా కళ్ళు ఇన్ఫెక్షన్ కు గురి అవుతాయి .కాబట్టి, కళ్లకు డార్క్ బ్లాక్ కలర్ ఐలైనర్ ఉపయోగించడం కంటే, లైటర్ షేడ్స్ ను మాత్రమే ఉపయోగించాలి. అటువంటి లైట్ లేదా డార్క్ బ్రౌన్ కలర్స్ ఉపయోగించడం వల్ల కళ్ళు కొంచెం డిఫరెంట్ గా కనబడుతాయి.

Story first published: Thursday, October 2, 2014, 9:01 [IST]
Desktop Bottom Promotion