For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మీరు ట్రైచేయాల్సిన అధ్భుతమైన ఐ లైనర్ ఐడియాలు

By Super
|

మీ శరీరంలోని ప్రధాన భాగాలలో మొదట చూడగానే గానించేవి కళ్ళు. ప్రతి అమ్మాయి తనవైపు దృష్టిని ఆకర్షించుకోవడానికి అత్యంత నాటకీయ, అద్భుతమైన కళ్ళను సృష్టించుకోవడానికి ప్రయత్నిస్తుంది.

ప్రతిఒక్క అమ్మాయి చేతిసంచిలో దాదాపు కనిపించే ఐ లైనర్ బహుశా అమ్మాయిలకు ఇష్టమైన మేకప్ వస్తువు. ఐ లైనర్ అప్లై చేసుకోవడానికి ఎంతో సాధన, పరిపూర్ణత్వంతో కూడిన నైపుణ్యం అవసరం. మీరు వీలైనన్ని మార్గాలలో దీనిని అప్లై చేసుకోవచ్చు. ఎంత నైపుణ్యంతో మీరు దానిని అప్ప్లై చేసుకోవచ్చో కొన్ని సూచనలు, చిట్కాలను ఇక్కడ నేను మీతో పంచుకుంటున్నాను.

 Eye Liner Ideas

ఐడియ #1 విభాగం:

మీ కళ్ళు ఎంతో నాటకీయంతో కూడిన పిల్లికళ్ళు అయిఉంటే, మీ కళ్ళు చాలా లావుగా అదేవిధంగా ఎంతో ఆకర్షణీయంగా కలిపించడానికి ఈ విధంగా చేయండి. ఈ ఉపాయం చాలా సులభం; కింది కనురెప్ప కంటే పై కనురెప్ప పై మందంగా లైనర్ ను అప్లై చేయండి, కంటి మూల భాగం లో కొద్దిగా గీయండి, మీ రూపం అద్భుతంగా కనిపిస్తుంది.

ఐడియా #2 చుక్క పెట్టండి

లైనర్ అప్లై చేసిన తరువాత ఒక చిన్న చుక్క పెడితే చాలా బాగుంటుంది. ఇది మీ కళ్ళకు చాలా అందాన్ని, అర్ధాన్ని జతచేస్తుంది. రెండు కనురెప్పలకు ఐ లైనర్ అప్లై చెయడ౦, ప్రత్యేకంగా కింది కనురెప్పల నుండి, పై కనురెప్ప మూలాలపై ఒక చిన్న చుక్కతో దాన్ని మృదువుగా చేయడం సాధారణ ఫాషన్. సహజంగా, అత్యంత నాటకీయంగా కనిపించాలంటే, ముదురు రంగును ఉపయోగించి ఆ చుక్క లైనర్ పై చక్కగా పూయండి.

ఐడియా #3 – 360 దెగ్రీస్ ఉండేట్లు చూడండి

ఇది ఐ లైనర్ అప్లై చేయడానికి మరో సాధారణ, ప్రసిద్ధ విధానం. కంటి చుట్టూ మీరు ఐ లైనర్ ని సమానంగా, తేడాలేకుండా అప్లై చేయడం చాలా అవసరం, మీ రూపం సిద్ధంగా ఉంటుంది. ఇది సాధారణ అలంకారాలలో, రాత్రి సమావేశాల సమయంలో కూడా ఇలా చేయడం మంచిది.

ఐడియా #4 విరుద్ధ అనుసంధానం

ఒక్కో సమయంలో విరుద్ధమైన రంగులు అత్యధికంగా అమ్ముడుపోవడం మరో ధోరణి. తెలుపు లేదా మరే ఇతర లైట్ షాడో ని తీసుకోండి, దానికి కను రెప్పలపై, కను బొమలపై అప్లై చేయండి. తరువాత, ఎప్పుడూ మీరు అప్లై చేసే విధంగా ఐ లైనర్ ను అప్లై చేయండి, మీ రూపంలో ఎంత తేడా ఉంటుందో ఇప్పుడు చూడండి.

ఐ డియా #5 – కేక్ లైనర్ లను పెట్టండి

కేక్ ఐ లైనర్ లు 1930, 40 కాలంలో చాలా ప్రసిద్ది చెందినవి, ఆ ధోరణి మళ్ళీ వచ్చినట్లు కనిపిస్తుంది. కేక్ లైనర్ లు మీ ముఖం ఎక్కువ కష్టపడకుండా చాలా లావుగా, అందంగా ఉండేట్టు చేస్తుంది. దీనిని మీరు కేవలం ఒక ఐ లైనర్ బ్రష్ ను ఉపయోగించి అప్లై చేసుకోవచ్చు.

ఐడియా #6 – కళ్ళకు రంగులు దిద్దండి

ఏ సమయంలోనైనా, విభాగంలోనైనా దాని అలంకరణ లేదా దుస్తులలో రంగులు చాలా పేరుగాంచినవి. నలుపు మీద రంగుల ఐ లైనర్ ని అప్లై చేయడం ఈ రోజుల్లో చాలా ప్రసిద్ది చెందింది. అందువల్ల, మీరు బ్లౌస్ లేదా టాప్ ధరించేటపుడు, మీ వేషధారణ మరింత అందంగా, ఆకర్షణీయంగా కనిపించడానికి అదే రంగు పాప్ జోడించండి.

Desktop Bottom Promotion