For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

‘నీ కోల కళ్ల మెరుపుకొక్క ఓం నమ:’ మత్తుకళ్ళు-మేకప్ టిప్స్

|

అమ్మాయిలు సాధారణంగా ఒక చూపు చూస్తేనే, ‘నీ కోల కళ్ల మెరుపుకొక్క ఓం నమ:' అంటూ అబ్బాయిలు పాటందుకుంటారు. మరి, ఆ కళ్ళని స్మోకీ లుక్ లో మేకప్ చేసుకుంటే చూసిన వారు కూడా మత్తులో మునగాల్సిందే. అమ్మాయిల అందాన్ని మరింతగా ఇనుమడింపజేసే స్మోకీ ఐస్ మేకప్ ఎలా వేసుకోవాలో తెలుసుకుందామా...

అమ్మాయిల ముఖసౌందర్యంలో కళ్లది ప్రత్యేక స్థానం. అందుకే వాటిని కలువరేకుల్లా తీర్చిదిద్దుకుంటూ ఉంటారు. ఇప్పుడు లేటెస్ట్ గా స్మోకీ ఐస్ తో క్లాసీ లుక్ ఇస్తున్నారు. ఇంతకీ ఈ మేకప్ ఎలా వేసుకోవాలో చూద్దాం..

కన్నీలర్ తో:

కన్నీలర్ తో:

స్మోకీ ఐస్ మేకప్ లో ముందుగా కళ్ల చుట్టూ అంటే కళ్లక్రింద, కంటి రెప్పపైన మీ స్కిన్ కలర్ కు మ్యాచ్ అయ్యే కన్సీలర్ అప్లై చేసుకోవాలి. మనం సాధారణంగా ఉపయోగించే మినరల్ మేకప్ పౌడర్ కూడా ఒక మంచి కన్సీలర్ గా పనిచేస్తుంది. కాబట్టి, మీ స్కిన్ టోన్ కు మ్యాచ్ అయ్యే కన్సీలర్ ని కళ్ళ చుట్టూ రాసుకోవాలి.

ఐ లైనర్ తో

ఐ లైనర్ తో

కన్సీలర్ అప్లై చేసిన తర్వాత కళ్ళకింద, పైన కూడా లైనర్ తో లైనప్ చేసుకోవాలి. ఒక వేళ మీవి చిన్న కళ్ళయితే కంటి కింది రెప్పకు మధ్య భాగం నుంచి లైనర్ తో లైన్ప్ ఇవ్వాలి. పెద్దకళ్లైతే ఒక మూల నుంచి మరో మూలకు నేరుగా లైనప్ చేసుకోవచ్చు. మీరు లిక్విడ్ ఐలైనర్ కనుక ఉపయోగిస్తున్నట్లైతే అది స్ట్రెయిట్ గా రావడానికి ముందు డాట్స్ లా పెట్టి వాటిని కలుపుకుంటే సులవుగా లైనప్ చేయడానికి వీలవుతుంది.

ఐ షాడో(నీడలా వచ్చేలా)

ఐ షాడో(నీడలా వచ్చేలా)

ముందుగా మీరు ఏ కలర్ ఐ షాడో వేసుకోవాలని అనుకుంటున్నారో నిర్ణయించుకోవాలి. ఆ తర్వాత ఐషాడో బ్రష్ తో మనం ముందుగా గీసుకున్న లైనర్ ని జాగ్రత్తగా కంటి చుట్టూ రుద్దాలి. ఇలా చేయడం వల్ల కంటి చుట్టూ ఒక షాడో లాంటి లుక్ వస్తుంది. మీకు అనుభం ఉంటే ఈ పని మీ చేతివేలితో కూడా చేయవచ్చు.

చివరిగా

చివరిగా

చివరిగా మీరు ఎంచుకున్న షేడ్ ని పెద్ద ఐ సాడో బ్రష్ తో అప్లై చేసుకోవాలి. అయితే మీరిలా అప్లై చేసుకునే ఐ షేడ్ తో ముందుగా వేసుకున్న షాడో లుక్ మ్యాచ్ అవ్వాలి. అలా కంటి చుట్టూ జాగ్రత్తగా అప్లై చేయడం వల్ల ఒక ఫర్ఫెక్ట్ లుక్ వస్తుంది. అయితే స్మోకీ ఐ మేకప్ ఇక్కడితో అయిపోలేదు. ఇందులో చేయాల్సిన ఇంకొన్ని ఉన్నాయి..

ఐ లాషెస్ సరైన ఆకృతిలో

ఐ లాషెస్ సరైన ఆకృతిలో

మనం స్మోకీ ఐ మేకప్ ద్వారా కళ్లను హైలైట్ చేయాలనుకున్నప్పుడు ఒక్క మేకప్ చేస్తే సరిపోదు. ఐ లాషెస్ కూడా తీరైన ఆకృతిలో ఉండేలా చూసుకోవాలి. అప్పుడే ఆ క్లాసీ లుక్ వస్తుంది. తర్వాత మస్కారా అప్లై చేసుకోవాలి. ఒక వేళ మీరు బాగా హైలైటింగ్ గా కనిపించాలని అనుకున్నప్పుడు రెండు లేదా మూడు సార్లు మస్కారా అప్లై చేయవచ్చు. లేదంటే సింపుల్ గా ఉండాలనకున్నప్పుడు ఒక సారి అప్లై చేస్తే సరిపోతుంది.

శుభ్రం చేయండి

శుభ్రం చేయండి

ఈ విధంగా మేకప్ అంతా పూర్తైన తర్వాత కంటి కింద లేదా పైన ఎక్కడైనా షాడో పౌడర్..ఏమైనా పడితే దాన్ని శుభ్రం చేయాలి. అప్పుడే చక్కటి లుక్ మీ సొంతమవుతుంది.

పెదాలు కూడా

పెదాలు కూడా

ముఖంలో కళ్ళని ఇంత చక్కగా హైలైట్ చేసుకుని, లిప్స్ అలా వదిలేస్తే ఏం బాగుంటుంది చెప్పండి? అందుకే లైట్ కలర్ లైనర్ తో షేప్ ఇచ్చి, చాలా లైట్ లిప్ స్టిక్ వేసుకుంటే స్మోకీ ఐ మేకప్ కంప్లీట్ లుక్ వతస్తుంది. ఒకవేళ మీరు కావాలనకుంటే డార్క్ షేడ్స్ కూడా ఎంపిక చేసుకోవచ్చు. అయితే ఇవి గా డామినేటింగ్ గా ఉంటాయి. కాబట్టి కళ్లని హైలైట్ చేయాలనకున్నప్పుడు లైట్ షేడ్స్ ఎంచుకోవడం ఉత్తమం.

చూశారుగా స్మోకీ ఐ మేకప్ ఎలా వేసుకోవాలో..ఇంకేంటి ఆలస్యం..మీరు కూడా ట్రై చేసి క్లాసీ లుక్ లో మెరిసిపోండి మరి..

English summary

Get Smokey Eyes: Makeup Tips

If you are up for a fancy event or concert then it would be ideal to create a nice dramatic smokey eye look. When it comes to eye makeup there is nothing sexier than the classic smokey eye look. This stunning look will never go out of style.
Story first published: Wednesday, July 30, 2014, 16:43 [IST]
Desktop Bottom Promotion