For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

కళ్లకు మస్కారా పెట్టుకునే విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి...

|

అమ్మాయిలకు అందమే ప్లస్ పాయింట్. అందులోనూ కళ్ళు, పెదాలు ప్రధాన పాత్రను పోషిస్తాయి. అందుకే కాభోలు మహా మహా కవులు కళ్ళు, అదరాలు, ముక్కు, చెవులు మీద కవితలు, పాటులు, వర్ణనలు రాస్తేస్తుంటారు. ముఖంలో అందంగా కనిపించేవి, చూడగానే ఆకట్టుకొనేవి, కళ్ళు, పెదాలు. సోగకళ్ల అందానని పొగిడించుకోవాలని కోరుకోని అమ్మాయిలుండరంటే అతిశయోక్తి కాదు. అందుకే కళ్లకు కూడా మేకప్ తో ఆకర్షణీయంగా తీర్చిదిద్దుకుంటారు.

సున్నితమైన కళ్ళకు 10 సింపుల్ మేకప్ టిప్స్ & ట్రిక్స్

అయితే సెన్సిటివ్ కళ్లున్న వారు మాత్రం మేకప్ విషయంలో కొంచెం జాగ్రత్తగా వ్యవహిరంచాలని సూచిస్తున్నారు సౌందర్య నిపుణులు. ముఖ్యంగా కళ్లకు మస్కారా అప్లై చేసుకునేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తప్పనిసరిగా అనుసరించాలని సూచిస్తున్నారు . మరి ఆ జాగ్రత్తలేంటో ఒకసారి తెలుసుకుందాం....

sensitive eyes

వాటర్ ఫ్రూఫ్ మస్కరా వద్దు:
బ్యూటీ ప్రొడక్ట్స్ లో చాలా వరకూ మనం సహజంగా వాటర్ ఫ్రూఫ్ రకాలకే మొదటి ప్రాధాన్యం ఇస్తాం. అయితే సున్నితమైన కళ్లు కలిగిన వారు వాటర్ ఫ్రూఫ్ మస్కారా జోలికి వెళ్లకపోవడమే మంచిది. ఎందుకంటే ఇవి గాఢంగా ఉండడమే కాకుండా తొలగించే సమయంలో కూడా ఇబ్బంది పెడుతాయి . మరి వాటర్ ఫ్రూఫ్ కాని మస్కరాల వల్ల ఏ సమస్యా ఉండదా అంటే..ఖచ్చితంగా ఉంటుందనే చెప్పవచ్చు . అయితే సమస్యనునివారించుకోవడానికి మంచి నాణ్యత కలవి ఎంపిక చేసుకోవడం మంచిది.

sensitive eyes

పరీక్షించాలి:
మొదటి సారి మస్కారా ఉపయోగించేవారైనా లేదా పాతదాన్ని పక్కన పెట్టి, కొత్తవాటిని కొన్నవారైనా...ముందుగా మస్కారాను ఓసారి పరీక్షించడం మేలు. దీనికోసం కొనుగోలు చేయాలనుకున్ మస్కారాను అరచేతిపై కాస్త రాసి, కొంత సమయం వరకూ వేచి చూడాలి. చేతిపై ఎలాంటి దురద, ఇతర ఇన్ఫెక్షన్స్ రాకపోతే అప్పుడు మాత్రమే దాన్ని కనురెప్పలకు ఉపయోగించాలి. ఎందుకంటే మస్కారా మీ కళ్లకు పడకపోతే వెంటనే పొడిబారిపోయి, కంటి నుంచి నీరు కారడం, కళ్లు మండడం వంటివి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.

మేకప్ విషయంలో మీరు చేసే తప్పిదాలు వెంటనే మానేయాల్సినవి

sensitive eyes

కనురెప్పలకు దూరంగా:
చాలా మంది మస్కారా వాడేటప్పుడు కనురెప్పల మొదళ్ల నుండి పెట్టేస్తుంటారు. ఇలా చేస్తే రెప్పలు బాగా పొడవుగా, అందంగా కనిపిస్తాయని అనుకుంటారు. కానీ ఇది వాస్తవం కాదు. మస్కారాను ఎప్పుడూ రెప్పల మొదళ్ల నుంచి పెట్టుకోవద్దని కంటి సంబంధిత నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా కళ్లు, కనురెప్పలు సున్నితంగా ఉండే వారైతే ఈ సలహాను తప్పకుండా పాటించాలి. కనురెప్పల మొదళ్లు కనుపాపలకు అతి చేరువలో ఉండే ప్రదేశం కాబట్టి మస్కారాలో ఉండే రసాయనాలు కంటి ఆరోగ్యాన్ని దెబ్బతీసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.

sensitive eyes

నిద్రించే ముందు మస్కార తప్పనిసరిగా తొలగించాలి:
పార్టీ నుంచి తిరిగి రావడం ఆలస్యమైందనో లేక ఓపిక లేదనో కొందరు రాత్రి పడుకోబోయే ముందు ముఖానికి వేసుకున్న మేకప్ తొలగించకుండా అలాగే నిద్రపోతారు. ఇదంత మంచిది కాదు. ముఖ్యంగా సెన్సిటివ్ కళ్లున్న వారు కంటికి పెట్టుకొన్న కాటుక, ఐలైనర్ తో పాటు మస్కారాను కూడా ఖచ్చితంగా తొలగించాల్సిందే. లేదంటే మరుసటి రోజు కళ్లు నీరసంగా కనిపిస్తాయి. ఇలా చేయడం వల్ల కనురెప్పలు త్వరగా పొడిబారి, ఊడిపోయే అవకాశం కూడా ఉంటుంది. ఫలితంగా కళ్లు వాటి సహజ సౌందర్యాన్ని కూడా కోల్పోవచ్చు.

sensitive eyes

మార్చాల్సిన సమయం:
సౌందర్య ఉత్పత్తులు ఏవైనా ఒక నీర్ణీత సమయం తర్వాత మార్చుకుంటూ ఉండాలి. ముఖ్యంగా కళ్లు అన్నిటికంటే సున్నితమైనవి కాబట్టి వీటి విషయంలో ప్రత్యేక శ్రద్ద తీసుకోవాలి. సౌందర్య ఉత్పత్తులను ఆరునెలలకోసారి మార్చాలని సౌందర్య నిపుణులు సలహా ఇస్తుంటారు. అయితే మస్కారా విషయంలో ఇంకాస్త ముందుగానే జాగ్రత్తపడడం మంచిదని వారు అభిప్రాయ పడుతున్నారు. ఎంత నాణ్యమైనదైనా సరే..ప్రతి మూడు నెలలకొక్కసారి మస్కారాను మార్చాల్సిందే అంటున్నారు నిపుణులు. ఎందుకంటే ఇందులో ఉండే బ్యాక్టీరియా చేరి కంటి ఆరోగ్యాన్ని దెబ్బతీసే అవకాశాలున్నాయట. సెన్సిటివ్ కళ్లున్న వారికైతే కంటి నుంచి నీరు కారడం, కళ్లు ఉబ్బడం, కనురెప్పల పైభాగం ఎర్రగా మారి దురదపెట్టడం మొదలైన ఇబ్బందులను ఎదుర్కోవలసి ఉంటుంది. మస్కారా వాడడం వల్ల ఏదైనా ఇబ్బంది ఎదురైతే, వెంటనే కంటి వైద్యులను సంప్రదించాలి.

Story first published: Tuesday, December 1, 2015, 13:11 [IST]
Desktop Bottom Promotion