For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

పెళుసుబారిన గోళ్ళను నివారించడానికి 7 సులువైన మార్గాలు

By Super
|

అందరూ కూడా ఆరోగ్యకరమైన మరియు అందమైన గోర్లు కలిగి ఉండాలని ప్రయత్నిస్తుంటారు. కానీ చాలాసార్లు పెళుసు గోర్లు వారి ప్రయత్నాన్ని నాశనం చేస్తుంటాయి. పెళుసు గోర్లు పురుషులను మరియు మహిళలను సమానంగా ప్రభావితం చేసే సాధారణ సమస్యలలో ఇది ఒకటి. పెళుసు గోర్లు నిరోధింఛి వేళ్ళకు ఆరోగ్యకరమైన గోర్లు కలిగి ఉండటానికి మార్గాలు ఉన్నాయి.

పెళుసు గోర్లు అనేవి సులభంగా విచ్ఛిన్నం అయి విరిగిపోతుంటాయి. వయసు, నీటిలో ఎక్కువగా గోర్లు నానటం మరియు రసాయనాలు, నేల్ పాలిష్ ఎక్కువగా వాడటం, నిర్జలీకరణం మరియు విటమిన్ క్షీణతలు వంటివి పెళుసు గోర్లకు కొన్ని ప్రధాన కారణాలు.

థైరాయిడ్ సమస్యలు, లూపస్, సోరియాసిస్, లిచెన్ ప్లనస్, రక్తహీనత, తామర మరియు ఎండోక్రైన్ వంటి వ్యాధులు గోర్లు విరిగాతానికి దోహదపడే కొన్ని వ్యాధులు.

ఒకవేళ మీకు ఈ వ్యాధులు ఉన్నట్లయితే మరియు మీ వేళ్ళ గోర్లు సులభంగా విచ్చినమవుతుంటే తప్పనిసరిగా వైద్య సదుపాయాన్ని తీసుకోండి. ఈ వ్యాధులు ఏమి లేనట్లయితే ఈ పెళుసు గోర్లను నివారించటానికి సులభమైన నివారణోపాయాలు ఉన్నాయి. వాటిని అనుసరించండి.

గోర్లు పెళుసుబారకుండ నిరోధించటం మరియు గోర్లను ఆరోగ్యకరంగా మరియు బలంగా చేయడం ఎలా? సరే, మీ గోర్లకు సరైన సంరక్షణ మరియు దృష్టి పెట్టడం ద్వారా మరియు సమతుల్య ఆహారాన్నిభుజించటం ద్వారా, మీరు బలమైన మరియు అందమైన గోర్లు కలిగి ఉంటారు. మీరు ఆరోగ్యమైన వ్రేళ్ళగోళ్ళు కలిగి ఉండటానికి మరియు పెళుసుబారిన గోర్ల నివారణకు సాధారణ మార్గాలను కొన్నిటిని చూద్దాం.

అనేక కఠినమైన రసాయనాలు కలిగి ఉన్న డిటర్జెంట్స్ మరియు ప్రక్షాళనద్రవాలు ఉపయోగించినప్పుడు మీ గోర్లు పొరలుపొరలుగా విచ్ఛిన్నం కాకుండా మీ చేతులకు గ్లవ్స్ వాడండి. ఇతర ఇంటి పనులను చేస్తున్నప్పుడు లేదా వంటగిన్నెలను శుభ్రం చేస్తున్నప్పుడు చేతులకు గ్లవ్స్ ధరించటం మంచిది. అలాగే, తోటపని సమయంలో కూడా మట్టి వలన మీ గోర్లకు హాని కలగవచ్చు, అందువలన చేతులకు గ్లవ్స్ ధరించటం మంచిది.

ఆలివ్ ఆయిల్ ఉపయోగించండి

ఆలివ్ ఆయిల్ ఉపయోగించండి

మీరు బలహీన గోర్లు కలిగి ఉండి ముఖ్యంగా, పెళుసుబారటం మరియు విరిగిపోవటం నుండి మీ గోర్లను నిరోధించాలి అనుకున్నప్పుడు రోజులో 10-15 నిమిషాలు ఆలివ్ నూనెలో మీ వేళ్ళ గోర్లను ఉంచండి. పెళుసు గోర్లు నిరోధించడానికి ఇది చాలా సులువైన మరియు చవకైన మార్గాలలో ఒకటి.

మర్దన

మర్దన

ఒక మాయిశ్చరైజర్ తో మీ చేతులు, చర్మం పైపొర మరియు వేళ్ళగోళ్లను మసాజ్ చేయటం, టీ ట్రీ ఆయిల్ లేదా వెచ్చని కొబ్బరి నూనెతో మర్దన చేయటం వలన ఆ ప్రాంతంలో రక్తప్రసరణ ఉత్తేజపడుతుంది. ఈ విధంగా చేయటం వలన మీ గోర్లు పొడుగ్గా మరియు బలంగా పెరుగుతాయి.

నెయిల్ పాలిష్ రిమూవర్ నివారించండి

నెయిల్ పాలిష్ రిమూవర్ నివారించండి

సాధారణంగా నెయిల్ పాలిష్ రిమూవర్స్ మద్యంమీద ఆధారపడి తయారవుతాయి మరియు వీటిని తరచుగా ఉపయోగించటం వలన మీ గోర్లు బలహీనపడతాయి. వీటిని తక్కువగా ఉపయోగించండి. అసిటోన్, కఠినమైన రసాయనం ఉన్ననెయిల్ పాలిష్ రిమూవర్ ను ఎప్పుడు ఉపయోగించవద్దు, ఉపయోగించటం వలన మీ గోర్లు పొడిగా మరియు విచ్ఛిన్నం అవుతాయి.

బోయోటిన్-రిచ్ ఆహారాలు తినండి

బోయోటిన్-రిచ్ ఆహారాలు తినండి

అనేక ఇతర ఆరోగ్య ప్రయోజనాలే కాకుండా, బోయోటిన్ ఎక్కువగా ఉన్న ఆహారం తీసుకోవటం వలన మీ గోర్లు బలోపేతం అవుతాయి మరియు పెళుసు బారకుండ నిరోధించవచ్చు. బోయోటిన్ అధికంగా ఆహారం, కాలీఫ్లవర్ , అవోకాడో, గుడ్లు, తృణధాన్యాలు మరియు కాలేయం లేదా బోయోటిన్ మందులు తీసుకోవటం వలన కొంత వరకు గోర్లు పెళుసుబారకుండ నిరోధించవచ్చు.

క్యుటికల్ క్రీమ్

క్యుటికల్ క్రీమ్

విటమిన్ E ఉన్న క్యుటికల్ క్రీమ్ గోర్ల చుట్టూ మర్దన చేయటం వలన మీ దెబ్బతిన్న గోర్లు తిరిగి బలోపేతం అవుతాయి. విటమిన్ E ఆ ప్రాంతాన్ని చక్కగా పునరుద్ధరిస్తుంది మరియు అది దెబ్బతిన్నకుండా నిరోధిస్తుంది.

మల్టీ విటమిన్స్ తీసుకోండి

మల్టీ విటమిన్స్ తీసుకోండి

అవసరమైన మొత్తంలో విటమిన్ A, విటమిన్ సి, కాల్షియం తీసుకోవటం వలన మీ గోర్లు పెళుసుబారకుండ నివారించవచ్చు. మీ గోర్లు, ఎముకలు మరియు దంతాల కోసం విటమిన్ A, విటమిన్ సి, కాల్షియం చాలా ముఖ్యమైనవి, ఇందులో ఏదైనా ఒకటి లేకపోయినా అది మీ మొత్తం ఆరోగ్యానికే హాని కలిగించవచ్చు.

హైడ్రేషన్

హైడ్రేషన్

చివరిది కానీ చిన్నది, నీరు పుష్కలంగా త్రాగటం మరియు మిమ్మలిని మీరు ఆర్ద్రీకరణ స్థితిలో ఉంచుకోవడం వలన మీ గోర్లు పెళుసు బారకుండ నిరోధించవచ్చు మరియు దీనివలన మీ మొత్తం ఆరోగ్యం మెరుగుపడుతుంది. మీరు రోజుకి ఖచ్చితంగా కనీసం 7-8 గ్లాసులు త్రాగటం వలన మీ గోర్లు హైడ్రేట్ కాబడతాయి మరియు బలంగా, మెరుస్తూ ఉంటాయి. సరైన రక్షణ మరియు శ్రద్ధతో, మీ గోర్లకు బలాన్ని పునరుద్ధరించుకోండి మరియు ఆరోగ్యకరమైన మరియు అందమైన వేళ్ళగోర్లను పొందండి.

English summary

7 Easy Ways To Prevent Brittle Nails

Everyone attempts to have long, healthy and beautiful nails. But at times, brittle nails ruin the effort. Even though, brittle nails are one of the common problems that affects both men and women equally. There are ways to prevent brittle nails which helps you to have healthy finger nails.
Story first published: Tuesday, May 12, 2015, 9:15 [IST]
Desktop Bottom Promotion