For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

అన్ని వయసుల స్త్రీలు లోపం లేకుండా మేకప్ వేసుకోవడానికి అనుసరించదగ్గ చిట్కాలు

|

మనకి వయసు మీద పడూతున్న కొద్దీ కొన్ని నిజాలని అంగీకరించాలి.మనం ఇరవైల్లో ఉన్నప్పుడు వేసుకున్న బ్లాక్ మినీ స్కర్ట్ మనకి ఇప్పుడు అంత బాగా నప్పకపోవచ్చు.అలాగే కాస్త వయసొచ్చాకా తెల్లవారుఝాము మూడింటివరకూ మెలకువగా ఉండి మరునాడు పొద్దున్నే రోజువారీ కార్యకలాపాలని ఉత్సాహం గా కెఫీన్ అవసరం లేకుండా ప్రారంభించలేము.అలాగే యువతతో కూడా పోటీ పడలేము.కానీ మేకప్ ని లోపం లేకుండా వేసుకోవచ్చు,ఒక పక్క మన శరీరం వయసు మార్పులకి గురి అవుతన్నా కానీ.

యువతులయినా, కాస్త వయసులో పెద్దవారయినా, ఎవరైనా సరే కింద ఇచ్చిన మేకప్ ట్రిక్స్ ఉపయోగించి వయసుతో పాటు వచ్చే చిన్న చిన్న మార్పులని దాచి పెట్టి అందం గా కనిపించవచ్చు.ఆ మేకప్ ట్రిక్స్ ఏమిటో చూద్దామా

మొట్ట మొదట మాయిశ్చరైజర్ తో మొదలుపెట్టాలి

మొట్ట మొదట మాయిశ్చరైజర్ తో మొదలుపెట్టాలి

మీ చర్మం జీవం తో ఉట్టిపడాలంటే మాయిశ్చరైజర్ ని మించిన సాధనం లేదు. ఎప్పుడైనా సరే మేకప్ వేసుకునే ముందు, మాయిశ్చరైజర్, లిప్ బాం,ఐ క్రీం ని దగ్గర పెట్టుకోండి. మాయిశ్చరైజర్ కి ప్రైమర్ కూడా తోడయితే మీ మేకప్ బేస్ బాగా కుదిరి ఏ రకమైన ఫౌండేషన్ అయినా మీ చర్మం మీద సహజం గా కనిపిస్తుంది

లిక్విడ్ కన్సీలర్స్ నే ఎంచుకోండి

లిక్విడ్ కన్సీలర్స్ నే ఎంచుకోండి

మనకి వయసు పైబడే కొద్దీ ముఖం మీద సన్నని గీతలు ఎక్కువవుతుంటాయి.వాటిని మేకప్ ద్వారా కప్పవచ్చు.మీ కళ్ళకి రంగు అద్దే ముందు క్లిక్ పెన్ లిక్విడ్ ఐ కన్సీలర్ ని వాడి చూడండి.వ్యాక్స్ ఆధారిత కన్సీలర్ ని వాడకపోవడం వల్ల మీరు వేసుకున్న ఫౌండేషన్ అదీ బయటి తొంగి చూడకుండా ఉండి, ముఖానికి సిల్కీ ఫినిష్ వస్తుంది.

కొద్దిగా ఫేస్ పౌడర్ ని అద్దడం

కొద్దిగా ఫేస్ పౌడర్ ని అద్దడం

ఫౌండేషన్ రాయడం అయ్యాకా దాని మీద కాస్త ముఖానికి వాడే పౌడర్ అద్ది ఫౌండేషన్ నిలబడేటట్లు చేయాలి.ప్రసిద్ధ మేకప్ ఆర్టిస్ట్ మీగన్ లనౌక్స్ ప్రకారం ఇలా చెయ్యడం వల్ల ఇతర పౌడర్లయిన బ్లష్ లేదా బ్రాంజర్ లని అద్దడం తలిక.ఒక పౌడర్ మరొక పౌడర్ తో పూర్తిగా కలిసిపోతుంది.కానీ మీరు లిక్విడ్ ఫౌండేషన్ వాడి దాని మీద నేరుగా బ్లష్ ని అద్దితే ముఖం పొడిబారినట్లు కనిపిస్తుంది.మీరు కనుక ఇరవైలు లేదా ముప్ఫైల్లో ఉంటే మీ బుగ్గల మీద అద్దే ఏ పౌడర్ నయినా కొద్ది పరిమాణం లోనే ఉపయోగించాలి.అందువల్ల మీ బుగ్గలు రోజంతా తాజాగా మరియు సహజంగా ఉంటాయి.

మేకప్ ని కిందనుండి మొదలుపెట్టండి

మేకప్ ని కిందనుండి మొదలుపెట్టండి

గురుత్వాకర్షణ శక్తి మీ చర్మాన్ని మరియు శరీరాన్ని కిందకి లాగి సాగతీసెస్తోంటే(వయసుమీద పడే కొద్దీ సాగే చర్మం )ఆ ప్రభావం మన మేకప్ మీద పడకుండా జాగ్రతపడాలనుకుంటాము.కింద నుండి మేకప్ మొదలెట్టడం వల్ల మీ ముఖం మీద మీకు కంట్రోల్ వస్తుంది.లనౌక్స్ సలహా ఏమిటంటే మొదట మీ బుగ్గల మీదనుండి మొదలెట్టి పైకి అనగా కళ్ళ వైపు మేకప్ సాగాలి.బ్లష్ ని అద్దేటప్పుడు బుగ్గలమీద ఎత్తుగా ఉన్న భాగం మీద మొదలెట్టి మన ముఖం మీద ఉన్న జుట్టు చివరి కొసలవైపు సాగాలి.అలాగే ఐ షాడో ఎప్పుడూ కిందకి జారకూడదు.ఐ షాడో అద్దాకా మీ వేలితో కన్ను వెలుపలి భాగం నుండి కనుబొమ్మ వైపు గా రుద్దడం వల్ల కళ్ళని దాటి బయటకి వచ్చిన ఐషాడో ని క్లీన్ చేయవచ్చు.

కంటి రెప్పలని కర్ల్ చేయడం

కంటి రెప్పలని కర్ల్ చేయడం

మనలో చాలా మందికి మస్కారా చాలా ముఖ్యం మేకప్ వేసుకునేటప్పుడు. రెప్పలు పల్చగా ఉన్నా,కళ్ళు మగతగా ఉన్నట్లున్నా మస్కారా వీటినన్నింటినీ దాచిపెట్టెస్తుంది.ఐ లాష్ కర్లర్ ఉపయోగించడం వల్ల మన కళ్ళు మరింత కాంతివంతం గా గ్లామరస్ గా కనిపిస్తాయి.రెప్పలని కర్ల్ చేయడం వల్ల మీ కళ్ళు మరింత విప్పారి మీ నీలి లేదా బ్రౌన్ కలర్ లేదా ఆకుపచ్చని కనుగుడ్ళ అందం మరింత ఇనుమడిస్తుంది.అలాగే వయసు మీద పడుతున్నకొద్దీ కనురెప్పల కర్లర్ బాగా అవసరం.వయసు పెరిగే కొద్దీ రెప్పలు తిన్నగా అయిపోవడం వల్ల కళ్ళు మూతలుపడీనట్లుగా ఉండీ చిన్నవిగా కనిపిస్తాయి.

English summary

Flawless Face Makeup Application Tricks for Every Age: Beauty tips in telugu

Flawless Face Makeup Application Tricks for Every Age: Beauty tips in telugu. As we age there are a few hard truths we need to accept. Our favorite black mini doesn’t look as good as it did in our 20s. We can’t stay up until 3 am and then rise the next morning resilient and ready to tackle the day without ca
Story first published: Saturday, September 19, 2015, 17:02 [IST]
Desktop Bottom Promotion