For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మనస్సు దోచే నెయిల్ పాలిష్ మరింత ట్రెండీగా...!: బ్యూటీ టిప్స్

|

ఒకప్పుడు నెయిల్ పాలిష్ వేసుకోవడానికి ప్రత్యేకమైన సందర్భం ఉండాల్సిందే...ముఖ్యంగా ఇంట్లో శుభకార్ాయలు, పెళ్లిళ్లు, ఫంక్షన్లకు ప్రత్యేకంగా తయారైనప్పుడు నెయిల్ పాలిష్ ని ఉపయోగించే వారు. అయితే ఇప్పుడు కాలం మారింది. ఇప్పటితరం అమ్మాయిలకు రోజూ నెయిల్ పాలిష్ ఉండాల్సిందే...కొందరైతే వేసుకున్న డ్రెస్సుకు మ్యాచింగ్ గా రోజూ నెయిల్ పాలిష్ మార్చుకొని వేసుకోవాల్సి పరిస్థితి ఇప్పుడు.

READ MORE: హాట్ హాట్ గా మదిని దోచేసే నెయిల్ పాలిష్ కలర్స్

మరికొందరైతే వేసుకొన్న నెయిల్ పాలిష్ మీద రకరకాల డిజైన్లు వేస్తూ నెయిల్ ఆర్ట్ తో మెరిపిస్తున్నారు. అయితే నెయిల్ పాలిష్ వేశాక ఆర్ట్ వేయడం పాత ట్రెండ్. నెయిల్ పాలిష్ తోనే కొత్త డిజైన్లు సృష్టించడం కొత్త ట్రెండ్ అంటున్నారు కొంత మంది డిజైనర్లు. దానికి తగినట్లే కొన్ని రకాల పాలిష్ లనూ సృష్టించారు. అవేంటో చూద్దాం...

అయస్కాంతంతో:

అయస్కాంతంతో:

ఈ నెయిల్ పాలిష్ చూస్తుంటే కాదేది కళకు అనర్హం అగుపిస్తుంది. దీన్ని వేసుకోవడానికి ఉపయోగించే పరికరం ఏంటో తెలుసా...? అయస్కాంతం! ఈ మధ్య కాలంలో ఈ రకం నెయిల్ పాలిష్ బాగా ప్రాచుర్యం పొంది యువతను అయస్కాంతంలా తన దగ్గరికి లాక్కుంటోంది. ‘మ్యాగ్నెటిక్ నెయిల్ పాలిష్'గా పిలుచుకొనే దీన్ని ఉపయోగించడం చాలా తేలిక. ఈ నెయిల్ పాలిష్ లో మెత్తటి ఇనుప పొడి ఉంటుంది. ఒక్కసారి నెయిల్ పాలిష్ వేసుకున్నాక అయస్కాంతాన్ని గోరుకు దగ్గరగా పెట్టాలి. అంతే..మన గోర్లపై రెండు రంగుల్లో డిజైన్ ఏర్పడుతుంది.

పెచ్చులుగా :

పెచ్చులుగా :

డిజైనర్ల దృష్టి వైవిధ్యంగా ఉంటుందో ఈ డిజైన్లను చూస్తే తెలుస్తుంది. గోడ మీద పెచ్చులు ఊడిపోతున్నట్లుగా కనిపించే ఈ డిజైన్ ‘క్రాక్ట్ నెయిల్ పాలిష్' వేసుకోవడం వల్ల ఏర్పడుతుంది. ఈ రంగును నెయిల్ మీద వేసిన కాసేపటికే ఆ రంగు ఎక్కడికక్కడ విడిపోతుంది. ముందుగా ఏదైనా లేత రంగే బేస్ కోట్ వేసుకొని పై నుంచి ముందురు రంగు క్రాక్డ్ పాలిష్ వేస్తే అది విరిగినట్లుగా మారి రెండు రంగులు చక్కటి డిజైన్ లా కనిపిస్తాయి.

మూడ్ ని బట్టి:

మూడ్ ని బట్టి:

మూడ్ ని బట్టి రంగు మారే నెయిల్ పాలిష్ గురించి ఎప్పుడైనా విన్నారా? ముఖ్యంగా శరీర ఉష్ణోగ్రత కాస్త అటుఇటుగా ఉన్నా వెంటనే ఈ గోళ్ల రంగు కలర్ మారిపోతుంది. మీరు ఏసి గదిలో కూర్చున్నా, పరిసరాల వేడికి మీకు చెమట పట్టినా, చివరికి మీ గోళ్లకు కాస్త తడి అంటినా...ఆ మార్పును తెలియజేసే సెన్స్ ఈ రంగుల్లో ఉంటుంది. ఇలా మన శరీరం ఎదుర్కొనే ప్రభావాలను బట్టి ఈ మూడ్ నెయిల్ పాలిష్' కూడా రంగులు మారుతుందన్నమాట.

నక్షత్రాలు :

నక్షత్రాలు :

నెయిల్ పాలిష్ లోనే నక్షత్రాలు, హృదయాకారాలు, వెండి, బంగారు రంగులలో కలగలిసినవి అందుబాటులోకి వస్తున్నాయి. నిజానికి దీన్ని నెయిల్ పాలిష్ అనలేం. ఎందుకంటే సాధారణ నెయిల్ పాలిష్ వేసుకున్న తర్వాత పారదర్శకంగా ఉండే ఔటర్ కోటింగ్ ఇవ్వడానికే ఈ అకారాలున్న కోట్ ని ఉపయోగిస్తాం..ఆకోటింగ్ వేసుకునే క్రమంలో దీంట్లో ఉన్న నక్షత్రాలు, ఇతర సింబల్స్ గోళ్లకు అతుక్కుని అందంగా కనిపిస్తాయి.

చీకట్లో మెరిసేవి:

చీకట్లో మెరిసేవి:

చీకట్లో మెరిసే నియాన్ కలర్ నెయిల్ పాలిష్ ను ఎప్పుడైనా ట్రై చేశారా? పోనీ గోళ్లకు రంగు వేసుకోగానే గది నిండా సువాసన వెదజల్లుతూనే ఉండే ఫ్లేవర్ ఫెర్ ఫ్యూమ్ పాలిష్ ని ఎప్పుడైనా వేసుకొన్నారా? కొన్ని పెద్ద పెద్ద కంపెనీలు రకరకాల ఫ్లేవర్ లలో ఫెర్ ఫ్యూమ్ గోళ్లరంగుల్ని తయారుచేసి అమ్ముతున్నారు.

గోళ్లకు రంగు వేసుకొన్నాక అది పూర్తిగా ఆరనివ్వాలి

గోళ్లకు రంగు వేసుకొన్నాక అది పూర్తిగా ఆరనివ్వాలి

గోళ్లకు రంగు వేసుకొన్నాక అది పూర్తిగా ఆరిపోయేంత వరకూ జాగ్రత్తగా ఉండకపోతే ఒక్క క్షణంలో పాడైపోతుంది. ఈ సమస్యను దృష్టిలో పెట్టుకొని తయారుచేసిందే ‘క్విక్ డ్రైయింగ్ నెయిల్ పాలిష్', ఈ పాలిష్ వేసుకున్న కొన్ని క్షణాల్లోనే ఆరిపోతుంది.

మీ మనస్సు దోచే నెయిల్ పాలిష్ మరింత ట్రెండీగా..

మీ మనస్సు దోచే నెయిల్ పాలిష్ మరింత ట్రెండీగా..

ఇలాంటి మరెన్నో రకాలు మార్కెట్లో వచ్చి మనల్ని రారమ్మంటూ పిలుస్తున్నాయి....మీరు కూడా ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే ఇవన్నీ ట్రై చేసి మీ గోళ్లను అందంగా ముస్తాబు చేసేయండి మరి..!ఇలాంటి మరెన్నో రకాలు మార్కెట్లో వచ్చి మనల్ని రారమ్మంటూ పిలుస్తున్నాయి....మీరు కూడా ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే ఇవన్నీ ట్రై చేసి మీ గోళ్లను అందంగా ముస్తాబు చేసేయండి మరి..!

English summary

Trending Nail Polish Colours: Telugu Beauty Tips

We love to paint our nails and make them shine with different and bright colours. While few women love to wear bright nail colours, there are many who loves to keep it simple with light shades. Nail polish colours keep changing with fashion trends. Even seasonal changes brings in new variety of nail colours in the market.
Story first published: Tuesday, July 7, 2015, 17:33 [IST]
Desktop Bottom Promotion