For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఒక జెంటిల్ మ్యాన్ లా షేవింగ్ చేసుకోవడానికి చిట్కాలు

By Derangula Mallikarjuna
|

ఏపురుషుడికైనా సరే ఒక ఫర్ ఫెక్ట్ షేవ్ చేసుకోవడం ఒక గొప్ప అనుభూతి. ఇది మీరు ఒక గొప్ప భావన ఇస్తుంది మరియు విపరీతమైన మీ విశ్వాసం కలిగిస్తుంది . ఒక ముఖ్యమైన మీటింగ్ లేదా ఒక ముఖ్యమైన తేదీన మీరు చూడటానికి షార్ప్ గా మరియు మృదువువగా కనబడి ఒక జంటిల్ మెన్ లా కనబడాలనుకుంటారు. అదరి మహిళలకు ఇది సూటబుల్ కాదు, కొంతమందికి ఇది చూడటానికి చిరాకుపెడుతుంది మరియు గడ్డం ఉన్న అటువంటి పురుషులను చూడటానికి చాలా మంది మహిళలు ఇష్టపడరు. చాలా మంది మహిళలు అటువంటి హార్డ్ స్కిన్ ను మృదువుగా మార్చడానికి ప్రయత్నిస్తుంటారు.

ఒక జెంటిల్ మెన్ లా కనిపించాలంటే మీరు షేవ్ చేసుకొనే ప్రతి సారి, కొత్త రేజర్ ను, ఎంపిక చేసుకోవాలి. షేవ్ చేసుకవడానికి ముందు కొన్నింటిని రెడీ ఉంచుకోవాలి. అందుకు మార్కెట్లో వతప్పుదోవ పట్టించే సమాచారం లేదా జెల్స్ మరియు క్రీములు వంటివి మీ షేవింగ్ చాలా సున్నితం చేస్తాయంటుంటారు . ఫర్ ఫెక్ట్ షేవ్ చేసుకోవడానికి, షేవింగ్ చేసుకోవాడానికి ముందు మీరు తెలుసుకవల్సిన కొన్ని టెక్నిక్స్ ఉన్నాయి. షేవింగ్ మొదలు పెట్టడానికి ముందు మీ గడ్డం మీద బాగా నురుగు వచ్చేలా క్రీమ్ ను అప్లై చేయాలి.

Tips to shave like a gentleman

షేవింగ్ చేసుకోవడానికి ముందు చేయవల్సిన ముఖ్యమైన పనుల్లో గడ్డం కు బాగా మాయిశ్చరైజ్ చేయాలి . ముఖం మీద ఉన్న హెయిర్ ఎక్కువ మాయిశ్చరైజ్ రాయడం వల్ల ఇది ఎక్కువ తేమ గ్రహిస్తుంది మరియు డ్రై చేస్తుంది. రెండవది, షేవింగ్ కు మంచి నాణ్యమైన షేవింగ్ క్రీమ్ ను ఎక్కువ నురుగు సృష్టించే వాటిని ఉపయోగించాలి. మీ లేజర్ ఉపయోగించడానికి ముందు మీ లేజర్ షార్ప్ గా ఉండేట్లు చూసుకోవాలి. షేవింగ్ చేసుకొన్న తర్వాత, మీ చర్మానికి మాయిశ్చరైజ్ చేయడం చాలా ముఖ్యం. అలా చేయడం వల్ల ఏదైనా స్కార్స్ ఉన్న, చర్మ తెగినా, ఉపశమనం కలిగిస్తుంది.

గోరువెచ్చిన నీటిని ముఖంపై చల్లుకొని తర్వాత మైల్డ్ క్లెన్సర్ లేదా ఫేస్ వాష్ వాడాలి. ఇది గడ్డాన్ని మృదువుగా మార్చుతుంది. చర్మరంధ్రాలు బాగా తెరచుకుంటాయి. ఫలితంగా ముఖంపై బ్లేడ్ సులువుగా రన్ అవుతుంది. వెచ్చని టవల్ తో ముఖాన్ని అద్దుకోవాలి. దీని వల్ల గడ్డం మరింత మృదువుగా మారుతుంది.

గడ్డంపై వెంట్రుకలు వివిధ దశలలో పెరుగుతాయి. కాబట్టి షేవింగ్ క్రీమ్ ను గుండ్రంగా అప్లయ్ చేయాలి. దీనివల్ల ఎక్కడా ఖాళీ ఉండదు. వెంట్రుకలు నిల్చుని షేవింగ్ కు అనువుగా ఉంటాయి.

నాణ్యమైన బ్రష్‌నే ఉపయోగించండి. క్రీమ్ రాసిన తరువాత 2 నుంచి 3 నిమిషాల వరకు గడ్డపు భాగాన్ని రిలాక్సిడ్ గా ఆరనివ్వండి.

గెడ్డం పలానా దిశలో పెరిగిందని భావిస్తూ అదే దిశలో షేవ్ చేయాలి. చిన్న చిన్న స్ట్రోక్స్ వాడాలి. దీనివల్ల రేజర్ ను సరైన యాంగిల్ లో పట్టుకుని ప్రెజర్ మెయిన్ టైయిన్ చేయడానికి వీలవుతుంది.

బుగ్గలు, గడ్డం, మెడదగ్గర చర్మాన్ని కొద్దిగా లాగుతూ షేవ్ చేయాలి. దీని వల్ల ఎటువంటి ముడతలు, ఫోల్ట్స్ ఉండవు.

చీక్ బోన్స్ పై ఏవైనా వెంట్రుకలు మిగిలిపోయాయేమో చెక్ చేసుకోవాలి. అవసరమైతే మరోసారి ప్రక్రియనంతా రిపీట్ చేయాలి. వెంట్రుకలు పెరిగిన దిశ కాకుండా వ్యతిరేక దిశలో రేజర్ కదిపితే గాట్లు పడతాయి.

షేవింగ్ సందర్భంలో నాణ్యమైన బ్లేడ్‌ను ఉపయోగించటం ఉత్తమం. 5 షేవ్‌లకు ఒకసారి బ్లేడును మార్చటం మంచిది.

10 నుంచి 15 నిమిషాల షేవింగ్‌కు కేటాయించాలి. ఆదరా, బెదరాగా షేవింగ్ చేసుకుంటే పలు రకాలైన ఇబ్బందులకులోను కావల్సి వస్తుంది. తీరికగా సాయంత్రం లేదా రాత్రి సమయాల్లో షేవింగ్ చేసుకోవటం ఉత్తమం.

షేవింగ్ అనంతరం పటిక ముక్కతో గడ్డపు భాగాన్ని మర్ధానా చేస్తే చర్మం కోమలత్వాన్ని సంతరించుకోవటంతో పాటు మృదువుగా తయారవుతుంది.

English summary

Tips to shave like a gentleman

It is a great feeling for any man to get a perfect shave. It gives you a great feeling and immensely boosts your confidence.
Desktop Bottom Promotion