For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మొటిమలు, మచ్చలు లేని చర్మం కోసం 3 అద్భుతమైన రోజ్ వాటర్ రిసిపిలు

By Super Admin
|

మొటమలు చర్మంలో చాలా ఇబ్బంది కలిగించే సమస్య. చిన్న పెద్ద తేడా లేకుండా అందరిలో వస్తుంటాయి . ఇవి ఎక్కువగా ముఖంలోనే కబడుతాయి. అదే విధంగా మెడ, భుజాలు, వీపు, మోచేతుల వద్ద ఏర్పడుతుంటాయి. ఇలాంటి మొటిమలను వెంటనే నివారించకపోతే పర్మనెంట్ గా మచ్చలు ఏర్పడుతాయి.

హార్మోనుల్లో మార్పు వల్ల , టీనేజ్ లో వారికి మొటిమలు ఇబ్బంది కలిగిస్తాయి . కొందరిలో ఆయిల్ ఫుడ్స్, ఫాస్ట్ ఫుడ్స్, చాక్లెట్ వల్ల తరచూ మొటిమలు ఏర్పడుతాయి.అయితే వీటికి సరైన నిరూపణలేవీ లేవు . మొటిమలకు మరో కారణం కూడా ఉంది, చర్మం మురికి పడటం వల్ల కూడా ఇలా జరగుతుంది . మొటిమలకు ఒత్తిడి కారణకాదు కానీ, పరిస్థితిని మరింత తీవ్రం చేస్తుంది.

 3 Amazing Rosewater Recipes For Acne-Free Skin

మొటిమలను నివారించడానికి రోజ్ వాటర్ గొప్పగా సహాయపడుతుందని నిరూపించబడినది. రోజ్ వాటర్ ను రోజా పువ్వు రేకులతో, మంచి సువానతో ఉండేట్లు నీటిలో మరిగించి తయారుచేస్తారు. ఇది స్కిన్ టోనర్ గా బాగా పనిచేస్తుంది.రోజ్ వాటర్ తో పాటు మరికొన్ని పదార్థాలను మిక్స్ చేసి చర్మానికి అప్లై చేయడం వల్ల మొటిమలు నివారించడంతో పాటు, చర్మకాంతి పెరుగుతుంది.

 3 Amazing Rosewater Recipes For Acne-Free Skin

నిమ్మరసం మరియు రోజ్ వాటర్ సమంగా తీసుకుని, కాటన్ ప్యాడ్ మీద వేసి మొటిమలున్న ప్రదేశంలో అప్లై చేయాలి. అరగంట తర్వాత శుభ్రం చేసుకోవాలి. ఇది మొటిమలు, మచ్చలను తొలగించడం మాత్రమే కాదు, చర్మ సమస్యలను నివారించడంలో కూడా సహాయపడుతుంది.

మొటిమల నివారణకు ఉపయోగించే పదార్థాలు
ఒక టేబుల్ స్పూన్ సోర్ క్రీమ్
ఒక టేబుల్ స్పూన్ పెరుగు
ఒక టేబుల్ స్పూన్ ఓట్ మీల్
ఒక టేబుల్ స్పూన్ రోజ్ వాటర్
4చుక్కల నిమ్మరసం

 3 Amazing Rosewater Recipes For Acne-Free Skin

తయారీ

పైన సూచించిన పదార్థాలన్నింటిని మిక్స్ చేసి మొటిమలు ఎక్కువగా ఉన్న ప్రదేశంలో అప్లై చేసి డ్రై అయిన తర్వాత శుభ్రం చేసుకోవాలి. గోరువెచ్చని నీటితో కడిగేసుకోవాలి. మొటిమలను నివారించడంలో చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది.

రోజ్ వాటర్ , ఫుల్లర్స్ ఎర్త్ ను పేస్ట్ లా చేసి, ముఖానికి అప్లై చేయాలి. డ్రై అయిన తర్వాత శుభ్రంగా కడిగేసుకోవాలి. చర్మంలో మెటిమలను తొలగించడానికి ఇది అద్భుతమైనది.

English summary

3 Amazing Rosewater Recipes For Acne-Free Skin

Rosewater has been proved to be phenomenal in the treatment of acne. Rose water is a flavoured water made by steeping rose petals in water. It is a great skin toner. One can apply the following mixtures made with rose water to the acne-affected areas of the skin and get relief:
Desktop Bottom Promotion