శీతాకాలంలోనూ జిడ్డు చర్మమా...ఐతే ఈ చిట్కాలు మీకే...

Posted By:
Subscribe to Boldsky

చర్మ సౌందర్యానికి మిగిలిన కాలాల్లో తీసుకొనే జాగ్రత్తల కంటే శీతాకాలంలో మరికొంత ఎక్కువ శ్రద్ద తీసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే వాతావరణంలో మార్పుల వల్ల చర్మ పగుళ్ళు ఏర్పడి, తడి ఆరిపోయి, గీతలు ఏర్పడి అందవిహీనంగా కనబడ తారు. అందుకు కొన్ని వింటర్ క్రీములు అప్లై చేయడం వల్ల చర్మ జిడ్డుగా, ఆయిలీగా మారుతుంది. కారణం చాలా సింపుల్! ఎందుకంటే ఈ క్రీములు చర్మానికి మాయిశ్చరైజర్ గా పనిచేస్తాయి. ఇంకా చర్మం పొడిబారనియకుండా చేస్తాయి. శీతాకాలంలో చర్మాన్ని పొడిబారనీయకుండా చేసుకోవడానకి చాలా జాగ్రత్తలు తీసుకోవాలి.

మిగిలిన సీజన్ లో లాగే వింటర్ సీజన్ లో కూడా చర్మం జిడ్డుకలిగి, ఆయిలీగా ఉండటం వల్ల అసౌకర్యంగా, ఉంటుంది. మరియు ఈ ఆయిల్ ను పోగొట్టడం కూడా కొంచెం కష్టం అవుతుంది. అందువల్లే ఆయిల్ స్కిన్ ఉన్న వారు వింటర్ క్రీమ్స్ కు దూరంగా ఉంటారు. శీతాకాలంలో ఇలా క్రీమ్స్ ను వాడకపోవడం వల్ల చర్మం పొడి బారి, డల్ గా కనబడుతుంది. కాబట్టి ఆయిల్ చర్మాన్ని క్లియర్ గా మర్చి, ముఖ చర్మం అందంగ, తేమగా మార్చే క్రీములు మార్కెట్లో అనేక అందుబాటులో ఉన్నాయి. ఇవి కూడా పనిచేయనప్పుడు కొన్ని ఇంట్లోనే కొన్ని వస్తువులతో ఆయిల్ స్కిన్ కు చెక్ పెట్టవచ్చు.

Ways To Avoid Oily Skin This Winter

మిల్క్ మసాజ్: పాలతో ముఖాన్ని శుభ్రం చేసుకోవడం వల్ల దుమ్మ, ధూళిని, డెడ్ స్కిన్ ను తొలగించడమే కాదు.. ఇది మాయిశ్చరైజర్ గా పనిచేస్తుంది. బయట తిరిగి ఇంటికి చేరుకోగానే తప్పకుండా ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి. చల్లటినీటితో శుభ్రం చేసుకొని పొడి వస్త్రంతో తుడిచి పొడి ఆరనివ్వాలి. అలాగే బయటకు వెళ్లే కొన్ని నిముషాల ముందు కూడా పాలతో ముఖానికి మర్ధన చేసుకొని వెళ్ళవచ్చు. ఇలా మర్ధన చేసిన తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేసుకోవడం వల్ల ముఖంలో జిడ్డు, ఆయిల్ తొలగిపోతుంది.

వేడినీళ్ళను వాడటం మానేయాలి: వేడినీళ్ళతో ముఖాన్ని శుభ్రం చేసుకోవడం వల్ల చర్మరంద్రాలను తెరుచుకొనేలా చేయడమే కాదు.. ఇది చర్మంలో నూనె గ్రంధులు కూడా తెరచుకొనేలా చేస్తాయి. కాబట్టి శీతాకాలంలో ఆయిల్ స్కిన్ తొలగించాలనుకొంటే ఎప్పుడూ చల్లటి నీటితోనే ముఖంను శుభ్రం చేసుకోండి. చల్లటి నీటితో శుభ్రం చేసుకోవడం వల్ల చర్మ రంద్రాలను మూసుకొనే చేసి మొటిమలు, మచ్చలు ఏర్పడకుండా అడ్డుకుంటుంది.

టమోటో మసాజ్: చర్మంలో అధికంగా పేరుకొన్న ఆయిల్ ను టమోటో జ్యూస్ తొలగిస్తుంది. టమోటో జ్యూస్ లో కొంచెం నిమ్మరసం కూడా చేర్చి ముఖానికి మర్ధన చేయాలి. నిమ్మరసం ఎక్సట్రా ఆయిల్ ను, డెడ్ స్కిన్ తొలగిస్తుంది. అప్లై చేసిన రత్వాత చల్లని నీటితో శుభ్రం చేసుకోవాలి. జిడ్డు చర్మాన్ని పోగొట్టడానికి ఇదొక మంచి మార్గం.

ఎక్స్ ఫోయిలేట్: ఆయిల్ చర్మాన్ని తొలగించడానికి వారంలో కనీసం రెండు సార్లు ఎక్స్ ఫోయిలేట్ చేయడం అవసరం. అందుకు అనేక స్ర్కబ్ లు అందుబాటులో ఉన్నాయి. శీతాకాలంలో ఆయిల్ చర్మాన్ని పోగొట్టడానికి ఓట్ మీల్ లేదా బాదాం స్ర్కబ్ లు బాగా పనిచేస్తాయి. అందుకు ముఖాన్ని నీటితో శుభ్రం చేసి తర్వాత ఈ స్ర్కబ్ ను అప్లై చేయాలి. స్ర్కబ్ అప్లై చేసిన రెండు మూడు నిముషాల తర్వాత మర్ధన చేయడం వల్ల డెడ్ స్కిన్ సెల్స్, బ్లాక్ హెడ్స్, వైట్ హెడ్స్, ముఖంలో ఏర్పడ్డ ఆయిల్ ను తొలగిస్తుంది.

English summary

Ways To Avoid Oily Skin This Winter | శీతాకాలంలోనూ జిడ్డు చర్మమా...!

Your skin becomes dry during winter. And applying winter creams makes your skin looks oily and greased. The reason is simple! Winter creams are meant to moisturise the skin and prevents it from drying. As winter is a dry season, you have to care for your skin to prevent it from looking dry.
Please Wait while comments are loading...
Subscribe Newsletter