చలికాలంలో ఎదురయ్యే చర్మ సమస్యలకు రక్షణ ఇలా...

Posted By:

శీతాకాలం వచ్చిందంటే చాలు సమస్యలు చుట్టుముడుతాయి. చలి శరీరంపై తీవ్ర ప్రభావం చూపుతుంది. అందాన్ని వికారంగా మారుస్తుంది. చాలా మంది మహిళలు, టీనేజ్ గర్ల్స్ కు శీతాకాలంలో చర్మం పొడిబారుతుంది. జుట్టు నిర్జీవంగా మారుతుంది. ఇలాంటి సమస్యల నుంచి రక్షించుకోవడానికి తగినంత శ్రధ్ద తీసుకోవడం చాలా అవసరం. ఇలా చేస్తే మెరిసే అందం మీ సొంత అవుంతి.

టోనింగ్: చలికాలంలో రోజూ రెండు సార్లు టమాటా రసం తాగడం వల్ల ఆరోగ్యానికి చాలా మంచిది. టమోటా రసంతో శరీరానికి కావల్సిన ‘సి' విటమిన్ అందుతుంది. రోజూ తీసుకొనే డైట్ లో టమోటా రసం తప్పనిసరి చేసుకోవాలి. టమోట రసం చర్మానికి టోనింగ్ లా పనిచేస్తుంది. కమలాపండ్లు తీసుకోవడం చర్మానికి చాలా మంచిది. ఈ పండ్లు టోనింగ్ లా పనిచేసి నిగారింపునిస్తాయి. ముఫ్పై ఏళ్ళు పైబడ్డవారు ఫ్రూటీ ఫేస్ ప్యాక్ వాడితే వారి చర్మం కాంతివంతమవుతుంది. పండిన బొప్పాయి, తేనె, విటమిన్ ఇ క్యాప్సూల్స్, స్కిమ్డ్ మిల్క్, కొద్ది చుక్కలు గ్లిజరిన్ లు కలిపి పేస్టులా తయారు చేసుకోండి. ఈ పేస్ట్ ను ముఖంపై, మెడపై రాసుకొని, ఆరిన తర్వాత కొద్దిసేపటికి ముఖం శుభ్రం చేసుకోవాలి. దాంతో మెరిసే చర్మం మీ సొంతమవుతుంది.

చలికాలంలో ఫ్రెష్ గా ఉండాలంటే: చలి ఎంతగా ఉన్నా స్నానం చేయడం మాత్రం మరవొద్దు, గులాబీ, తులసి ఆకులను గోరువెచ్చని నీటిలో వేసుకుని స్నానం చేయడం వల్ల, చర్మం కాంతివంతంగా మెరవడానికి సహాయపడుతుంది. కాచిన పాలలో గోధుమపిండి కలుపుకుని స్క్రబ్ లా తయారుచేసి, ఈ స్ర్కబ్ ని ముఖానికి రుద్దుకుంటే చర్మం శుభ్రపడుతుంది. ఇలా స్ర్కబ్ చేయడం వల్ల చర్మం మీద ఉన్న మృతకణాలు తొలగిపోతాయి. దుమ్మ, ధూళి తొలగిపోతుంది. టైమ్ లేదనుకొనేవారు ఉదయాన్నే ఆలివ్ ఆయిల్ లేదా కొబ్బరి నూనెను స్నానం చేసే సగం నీళ్ళలో వేసుకుని స్నానం అయిన తర్వాత ఒంటిపై నూనె కలిపిన నీళ్లను పోసుకోవాలి. ఈ కాలంలో విటమిన్ ఇ', ‘సి'లు శరీరానికి చాలా మంచిది.

అందమైన అధరాల కోసం చలికాలంలో పెదవులు పగలడం, పొడిబారడం సాధారణ సమస్య. వీటి నుండి బయట పడటానికి తేనె, నిమ్మరసం, ఆలివ్ ఆయిల్ లను గ్లిజరిన్ తో కలిపి పెదవులపై రాసుకోవాలి. ఆ తర్వాత స్ట్రాబెర్రీ, స్కిమ్డ్ మిల్క్, తేనెలను కలుపుకుని పెదాలకు రాసుకోవాలి. దాంతో అధరాలు సున్నితంగా లేలేతగా కనబడుతాయి.

మోచేతులు, మోకాళ్ళ సంరక్షణ: చాలా మంది మహిళలకు మోచేతులు, మోకాళ్ళు, నల్లగా, మొద్దుగా మారుతాయి. వీటిని నివారించడానికి బాగా పండిన అరటిపళ్ళను మెత్తగా చిదిమి అందులో పంచదార వేసి, ఈ మిశ్రమాన్ని మోచేతులకు, మోకాళ్ళకు రాయండి. ఇలా కొద్దిరోజులు క్రమం తప్పకుండా చేస్తే మార్పు కనిపిస్తుంది. దాంతో పాటు నిమ్మ కాయను కోసి సగం ముక్కపై ఉప్పు రాసి ఆ ముక్కతో మోచేతులు, మోకాళ్లపై రుద్దితే నున్నగా మారతాయి.

కోమలమైన పాదాల కోసం: చలి వాతావరణంలో పాదాల పగుళ్ళు తరచూ వేధించే సమస్య. పాదాలు తరచూ ఇన్ ఫెక్షన్ కు గురవుతుంటాయి. అలాంటప్పుడు సబ్బుతో పాదాలను శుభ్రంగా కడగాలి. పాలకూర ఉడికించిన నీళ్ళలో పాదాలను ఉంచాలి. ఇలా చేస్తే పాదాల పగుళ్ళు తగ్గుతాయి. బయటకు వెళ్ళేటప్పుడు సాక్సులు వేసుకోవాలి. రాత్రి పడుకునేముందు పాదాలను శుభ్రంగా కడిగి, గ్లిజరిన్, వేజలిన్ సమపాళ్ళలో కలుపుకుని పాదాలకు రాయాలి. పడుకునే ముందు మెత్తటి సాక్సులు వేసుకోవాలి. ఇలాంటి జాగ్రత్తలు తీసుకుంటే చలికాలంలో ఎదురయ్యే చాలా సమస్యల నుండి బయటపడవచ్చు.

Read more about: body care, skin care, home facials, winter, చర్మ సంరక్షణ, ఫేషియల్స్, శీతాకాలం
English summary

Winter Skincare Tips for Glowing Fresh Skin | చలికాలంలోనూ చెదరని సౌందర్యం....

The weather outside may be unsightly, but your skin doesn't have to be. How to banish dry skin and give your winter skin care regimen a boost.
Story first published: Wednesday, November 14, 2012, 16:45 [IST]
Please Wait while comments are loading...
Subscribe Newsletter