For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

బీర్ లో ఉన్న టాప్ 10 సౌందర్యవర్థక గుణాలు...!

|

బీర్ చాలా పాపులర్ అయినటువంటి ఆల్కహాలిక్ బెవరేజ్. బీర్ వల్ల వివిధ రకాల హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయని చాలా మంది అభిప్రాయం. ఇది శరీరంలోని టాక్సిన్స్ (విషాలను లేదా వ్యర్థాలను)బయటకు పంపిస్తుంది . మరియు కిడ్నీ స్టోన్స్ ను తొలగిస్తుందని గట్టి అభిప్రాయం ఉంది. అయితే మీరు బీర్ యొక్క బ్యూటీ బెనిఫిట్స్ తెలుసుకొన్నట్లైతే ఆశ్చర్య పడక మానరు. బీర్ తీసుకోవడం వల్ల మరియు అప్లై చేయడం వల్ల చర్మానికి చాలా ప్రయోజనాలున్నాయి. అంటే బీర్ త్రాగడం వల్ల మరియు బీర్ ను చర్మానికి అప్లై చేయడం వల్ల కూడా చర్మానికి మంచిదని అర్థం.

బీర్ వల్ల చర్మానికి మాత్రమే సంబంధించి ఉపయోగాలు మాత్రమే కాదు. బీర్ వల్ల కేశాలకు కూడా అద్భుతమైన ప్రయోజనాలను అంధిస్తుంది . బీర్ బెస్ట్ నేచురల్ హెయిర్ కండీషనర్ గా మనకు అందుబాటులో ఉంది. అందువల్ల బీర్ యొక్క బ్యూటీ బెనిఫిట్స్ మెండుగా ఉండటం వల్ల పూర్తి శరీర ఆరోగ్యానికి ఉపయోగించబడుతున్నది. చర్మానికి మరియు కేశాలకు బీర్ ను వివిధ రకాలుగా ఉపయోగించవచ్చు . బీర్ త్రాగడం కంటే ఎక్స్ టర్నల్ గా ఉపయోగించడం చాలా ఆరోగ్యకరం మరియు చర్మానికి క్షేమం. అయితే బీర్ ను ఎక్కువగా తీసుకోవడం వల్ల ఇంటర్నల్ గా ఆరోగ్యానికి కొంత వరకూ హాని కలిగిస్తుంది. ఒబేసిటికి దారితీస్తుంది మరియు లివర్ ను పాడు చేస్తుంది. కాబట్టి మితంగా తీసుకోవడం చాలా ఆరోగ్యకరం. మరి బీర్ వల్ల ముఖ్య బ్యూటీ బెనిఫిట్స్ ఏంటో ఒకసారి చూద్దాం...

బీర్ తో ఆశ్చర్యకరమైన బ్యూటీ బెనిఫిట్స్..!

బీర్ చర్మాన్ని హైడ్రేట్ (తేమ)గా ఉంచుతుంది: బీర్ చర్మానికి తగినంత హైడ్రేషన్ ను కలిగిస్తుంది. అధిక వేడి వల్ల చర్మాన్ని రక్షించుకోవడానికి బీర్ బాత్ చేసేవారు ఈజిప్షియన్లు.

బీర్ తో ఆశ్చర్యకరమైన బ్యూటీ బెనిఫిట్స్..!

హెయిర్ కండీషనర్: బీర్ బెస్ట్ హెయిర్ కండీషర్ . తలకు షాంపూ చేసిన తర్వాత బీర్ తో తలను వాష్ చేయడం వల్ల మీ కేశాలు సున్నితంగా మరియు షైనింగ్ తో మెరుస్తుంటాయి.

బీర్ తో ఆశ్చర్యకరమైన బ్యూటీ బెనిఫిట్స్..!

చర్మ కాంతిని పెంచుతుంది: చర్మంలో పల పేరుకొన్న టాక్సిన్స్ ను తొలగించడానికి బీర్ బాగా సహాయపడుతుంది. చర్మం నుండి ఎప్పుడైతే మలినాలు(టాక్సిన్స్) తొలగిపోతాయో అప్పుడు మీ ముఖంలో సహజ అందాన్ని చూడవచ్చు. కాంతివంతమైన చర్మం మీ సొంతం చేసుకోవచ్చు.

బీర్ తో ఆశ్చర్యకరమైన బ్యూటీ బెనిఫిట్స్..!

చర్మాన్ని సున్నితంగా చేస్తుంది: బీర్ మీ చర్మాన్ని సున్నితంగా మార్చుతుంది . చర్మానికి శ్వాస తగలడానికి మరియు కావల్సినంత మాయిశ్చరైజర్ అంధించడానికి, చర్మాన్ని సున్నితత్వం కోసం బీర్ ను ఉపయోగించవచ్చు . బీర్ లో ఉండే విటమిన్ బి చర్మాన్ని సున్నితంగా మార్చుతుంది.

బీర్ తో ఆశ్చర్యకరమైన బ్యూటీ బెనిఫిట్స్..!

బీర్ మీ కురుల విలువను పెంచుతుంది: మీ కేశాలను బీర్ తో శుభ్రం చేయడం వల్ల కురులు ఒత్తుగా మంచి షైనింగ్ తో మెరుస్తుంటాయి. బీర్ హెయిర్ క్వాలిటీని పెంచుతుంది.

బీర్ తో ఆశ్చర్యకరమైన బ్యూటీ బెనిఫిట్స్..!

బీర్ చర్మ పిహెచ్ ను నిర్వహిస్తుంది: బీర్ చర్మంలోని పిహెచ్ ను సమతుల్యం చేస్తుంది. చర్మంలో పిహెచ్ సరిగా లేనట్లైతే చర్మం అనేక చర్మసమస్యలను ఎదుర్కోవల్సి ఉంటుంది. పొడి చర్మం మరియు జిడ్డు చర్మం ఏర్పడుతుంది.

బీర్ తో ఆశ్చర్యకరమైన బ్యూటీ బెనిఫిట్స్..!

బీర్ వయస్సు మీదపడనియ్యదు: బీర్ లో యాంటీఆక్సిడెంట్స్ ఉండటం వల్ల వయస్సు మీద పడనియ్యకుండా కాపాడుతుంది. చర్మం ఇన్ఫ్లమేషన్ కు గురికాకుండా కాపాడుతుంది. ముఖ్యంగా వయస్సును కాపాడుకోవచ్చు.

బీర్ తో ఆశ్చర్యకరమైన బ్యూటీ బెనిఫిట్స్..!

చర్మ క్లెన్సింగ్ కోసం బీర్: చర్మ రంద్రాలను శుభ్రపరిచే సామర్థ్యం బీర్ లో మెండుగా ఉన్నాయి. ఇది ఆల్కాహానిక్ నేచర్. మరియు ఆల్కహాల్ ఒక పర్ ఫుల్ ఏజెంట్ అని మనందరికి తెలుసు .

బీర్ తో ఆశ్చర్యకరమైన బ్యూటీ బెనిఫిట్స్..!

బీర్ బబుల్ బాత్: మీ వద్ద డబ్బు ఎక్కువగా ఉన్నా..అధికంగా బీర్ కొనే సామర్థ్యం ఉంటే బీర్ ను కొని స్విమ్మింగ్ పూల్ లో వేసి బబుల్ బాత్ చేయడం వల్ల చర్మానికి అద్భుతమైన బ్యూటీ బెనిఫిట్స్ ను అంధిస్తుంది . బీర్ తో ఇటు చర్మ మరియు అటు హెయిర్ బ్యూటీ బెనిఫిట్స్ ను పొంది మీ సౌందర్యాన్ని పదింతలు రెట్టింపు చేసుకోవండి...

బీర్ తో ఆశ్చర్యకరమైన బ్యూటీ బెనిఫిట్స్..!

బీర్ మొటిమలతో పోరాడుతుంది: బీర్ లో కొన్ని యాంటీబ్యాక్టీరియల్ గుణాలు ఉన్నాయి . అవి మొటిమలతో పోరాడటానికి బాగా సహాయపడుతాయి. కాబట్టి బీర్ ను మీ ఫేస్ ప్యాక్స్ లలోని మిక్స్ చేసికొని ప్యాక్ వేసుకోవడం వల్ల మొటిమలు లేని క్లియర్ స్కిన్ మీ సొంతం అవుతుంది.

English summary

10 Beauty Benefits Of Beer | బీర్ తో ఆశ్చర్యకరమైన బ్యూటీ బెనిఫిట్స్..!

Beer is a very popular alcoholic beverage. Many people have said that beer has many health benefits. It is good for flushing out toxins and removing kidney stones. However, you will be surprised to know that beer has beauty benefits too. Beer is good for the skin in both edible and applicable form. Meaning, both drinking and applying beer is good for the skin.
Desktop Bottom Promotion