For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

నవయవ్వనానికి ప్రతీ మహిళా తెలుసుకోవాల్సిన 10 సూత్రాలు..!

By Super
|

సాధారణంగా చాలా మందికి వారి ఆరోగ్యం పట్ల ఎంత శ్రద్ధ తీసుకుంటారో..వారి అందం పట్లకూడా అంతే శ్రద్ద తీసుకుంటారు. వారు చర్మానికి మరియు కేశాలకు గోళ్ళు గురించి కొంత ప్రత్యేక శ్రద్ద తీసుకొని వారి అందాన్ని కాపాడుకుంటారు. కానీ ఈ అందమైన ప్రపంచంలో అందం గురించి తెలుసుకోవడం వాటి సలహాలను పాటించడం వంటివి చాలా అవసరం.

అందుకు కొన్ని మనం ఏం చేయాలి అనేది కొన్ని తెలుసు అయితే ఎలా చేయాలి అనేది తెలియదు. లేదా దీన్ని సవ్యంగా ఎలా చేయాలి. అది తెలుసుకోవడానికి ఇదొక మంచి సందర్భం. బ్యూటీ నిర్వహణకు వాస్తవాలను తెలుసుకోవడం అందాన్ని మెయింటైన్ చేయాలంటే ప్రతి మహిళా కొన్ని బ్యూటీ సీక్రెట్స్ తెలుసుకొని ఉండాలి. మరి ఆ బ్యూటీ సీక్రెట్ నిర్వహణ పద్దతులేంటో ఒకసారి చూద్దాం...

మీరు వాడే క్లెన్సర్ మీ చర్మ తత్వానికి సరైనదేనా?

మీది సున్నిత చర్మమైనా, మరింకేరకమైనా చర్మమైనా క్లెన్సర్ ( చర్మ ప్రక్షాళనకు వాడే క్రీం) వాడినపుడు మరింత జటిలమైన సమస్యను మోసుకు వస్తోందేమో గమనించాలి. సాధారణంగా కొన్ని క్లెన్సర్స్ ఎంత ఆరోగ్యకరమైన చర్మాని కైనా హానిచెయగలిగే తత్వాన్ని కలిగి ఉంటాయి. అందుకే క్లెన్సర్ ఎంచుకోవడం లో ఎంతో జాగ్రత్త వహించాలి. చర్మం పై ఉన్న మలినాల్ని, దుమ్ము ధూళినీ, జిడ్డు ని పోగొట్టి చర్మాన్ని కాంతి వంతంగా చేసే సున్నితమైన క్లెన్సర్ ను ఎంచుకోవాలి.

ఎక్స్ ఫాలియేషన్ మీ చర్మాన్ని కాంతివంతం చేస్తుంది.

ఎక్స్ ఫాలియేషన్ వల్ల మీరు వాడే వివిధ స్కిన్ సీ రంస్ క్రీంస్ పనితీరు మెరుగవుతుంది. దీనితో చర్మం మరింత కాంతివంతం అయ్యే అవకాసం ఉంటుంది. మొటిమలు లేదా ఇతర చర్మ సంబంధ సమస్యలు వచ్చే చర్మ తత్వం కలవారైతే చర్మ నిపుణుల పర్యవేక్షణలో సాల్సిలిక్ యాసిడ్ గల క్లెన్సర్ ను వాడడం మంచిది.

వయసు మీదబడుతున్న చర్మానికి రెటినాయిడ్స్ మంచి ఆయుధాలు

ఒకప్పుడు మొటిమల చికిత్సకోసమే అభివృద్ధి చేసిన రెటినాయిడ్స్ ముఖం పై ముడతలను పోగొట్టే లక్షణాలనూ కలిగి ఉన్నాయి. రెటినాయిడ్స్ విటమిన ఎ ద్వారా తయారు చెసిన రసాయన ఉత్పన్నాలు. ఈ రెటినాయిద్స్ ఎపిడెర్మిస్, డెర్మిస్ అనబడే బాహ్య, అంత చర్మాలను మందంగా చేస్తూ శరీరంలోని కెరాటినాయిడ్స్ ను వేగవంతం చేస్తాయి. అంతే కాదు కొల్లాజెన్ మరియు మన శరీరంలో తయారయ్యే హైల్యూరానిక్ యాసిడ్ ( ఎముకలు, కీళ్ళు, చర్మాల మధ్య కందెనలా పనిచేస్తుంది) అనబడే పిండిపదార్ధం ఉత్పత్తిని రెటినాయిడ్స్ వేగవంతం చేస్తాయి. ఇవేకాదు రెటినాయిడ్స్ వాడకం వల్ల మరో ఫలితం సూర్యుడి ప్రతాపాన్ని మన చర్మం పై తగ్గించే ప్రయత్నం చేస్తాయి. రెటినాయిడ్స్ ను రాత్రి పుట వాడితే మంచి ఫలితం ఉంటుంది.

మీ చర్మం స్వీట్ గా ఉండాలా అయితే స్వీట్ స్క్రబ్ ప్రయత్నించండి

క్రమం తప్పకుండా చర్మ తత్వానికి సరిపోయే ఫేషియల్స్ చేయించుకోవడం వల్ల ముఖ చర్మం కాంతివంతంగా ఉంటుందన్నది నిజమే అయితే ఖరీదైన ఫేషియల్స్ మాత్రమే కాదు మన ఇంట్లో నే చాలా సులువుగా ఫేషియల్ చేసుకునే మార్గాలెన్నో ఉన్నాయి. మన చర్మ సం రక్షణకు ప్రకృతి ప్రసాదించిన గొప్ప వరం పంచదార! నిజమే పంచదార తో ముఖ చర్మాన్ని కాంతివంతం చేసుకోవచ్చు. పంచదార ను స్క్రబ్ గా ముఖ చర్మం పై వలయాకారంగా రాస్తూ గోరు వెచ్చని నీటితో కడుక్కుని ఆపైన స్టవ్ పై పాత్రలో నీళ్ళూ మరిగించి ఆవిరి పట్టి చూడండి! కాంతివంతమైన చర్మం మీ సొంతం.

ఇంట్లో నే బాడి స్క్రబ్

సాధారణం గా ముఖ చర్మానికి ఇచ్చిన ప్రాధాన్యత మిగతా భాగాలలో చర్మానికి ఇవ్వరు. చాలా మటుకు నిర్లక్ష్యం చేస్తుంటారు. అందుకే మోచేతులు, కాళ్ళు, మడమలు, ముంజేతులు మృదుత్వాన్ని కోల్పోయి కాంతి విహానంగా ఉంటాయి. ఒకరకంగా చెప్పాలంటే రోజువారీ వాడే సబ్బులు కూడా ఇందుకు కారణం కావచ్చు. ఏది ఏమైనా ముఖ చర్మం తో పాటు మిగతా శరీరాన్ని కూడా నిర్లక్ష్యం చేయకుండా జాగ్రత్తలు పాటిస్తే మృదుత్వాన్ని సంతరించుకుంటాయి. పంచదార, కొబ్బరి నూనె, కొన్ని తులసి ఆకులను మెత్తగా నూరి చర్మానికి పట్టించి స్క్రబ్ చేసుకుని ఆవిరి పడితే మంచి ఫలితం ఉంటుంది. ఈ బాడీ స్క్రబ్ ని తరచూ వాడడం తో కాంతివంతమైన మృదువైన చర్మం మీ సొంతం అవుతుంది.

ప్రతి మహిళ తెలుసుకోవల్సిన 10 బ్యూటీ సీక్రెట్స్..!

పేడిక్యూర్ మరియు మెనీక్యూర్ : చేతులు మరియు పాదాల ను అందంగా తీర్చిదిద్దుకోవాలంటే పెడిక్యూర్ మెనిక్యూర్ లను నెలకొకసారైనా చేసుకోవాలి. గోరు వెచ్చటి నీటిలో షవర్ జెల్ ను వేసి మెనిక్యూర్ చేసుకునే ముందు చేతులను ఓ అయిదు నిముషాలపాటు ఉంచితే క్యూటికిల్స్ మెత్తపడి మెనిక్యూర్ కు సిద్ధంగా ఉంటాయి.

పెడిక్యూర్:

పెడిక్యూర్:

ఇకపెడిక్యూర్ అంటే పాదాల దగ్గరికి వస్తే ఒక్క ప్యూమైస్ స్టోన్ తో పాదాలను రుద్దడం సరిపోదు కాస్త పెట్రోలియం జెల్లీ తీసుకుని పాదాలకు పూసి సెల్లోఫెన్ తో 15 నిముషాలు చుట్టీ ఉంచండి. మృదువైన పాదాలు ఇట్టే రెడీ అవుతాయి. ఈసారి ప్రయత్నించండి.

జుట్టుకి సరైన పోషణ :

పొడిబారిన జుట్టూ కి డీప్ కండీషనింగ్ చాలా ముఖ్యం, అయితే సరైన రీతిలో వాడడం ముఖ్యం. ఏదైనా మార్కెట్ లో దొరికే నిపుణులు సూచించిన కండీషనర్ అయినా లేదా ఇంట్లోనే తయారు చేసుకున్నదైనా ( ఆలివ్ ఆయిల్ తలకు పట్టించి ఎండలో కాసేపు కూర్చుంటే మంచి కండీషనింగ్) వాడే తీరులో జాగ్రత్తలు పాటించాలి. ముందు జుట్టూ కొసలనుండీ మొదలు పెట్టి మధ్య భాగం వరకు పైపైకి అప్లై చేయాలి. కుదుళ్ళను తాకకుండా ఉండడం ముఖ్యం. ఎందుకంటే కుదుళ్ళు సహజ సిద్ధంగా మన జుట్టూ కి కావాల్సిన నూనె ను ఉత్పత్తి చేస్తాయి. కండిషనింగ్ చేసేటప్పుడూ కుదుళ్ళవరకూ వెళితే ఆ సహజ సిద్ధ ప్రక్రియ కు ఆటంకం కలిగించినట్లే.

చుండ్రు సమస్యకు షాంపూ వాడుతున్నారా? జాగ్రత్త సుమా!

చుండ్రు అనేది కేవలం మాడు పొడి బారితే వచ్చే సమస్య అనీ భావించి సాధారణం గా చాలా మంది దానికోసమై ప్రత్యేకంగా రూపొందించిన షాంపూ వాడుతుంటారు. కానీ చుండ్రు సమస్య కు ఒక బలీయమైన కారణం ఉంది. మనం తలపై ఉపయోగించిన షాంపూ సరిగా పోయేలా కడగక పోతే మాడుపై ఉండిపోయిన షాంపూ చుండ్రుకి కారణం అవ్వచ్చు. ఇలా అయ్యే సందర్భాలు చాలా ఎక్కువ. అందుకే షాంపూ వాడిన ప్రతీ సారి బాగా ఎక్కువ నీటితో జుట్టు శుభ్రపరచుకోవాలి.

 మీ తలకట్టూ మీ వయస్సును నిర్ధారించగలదు:

చిన్న జుట్టూ తో ఉండే పిక్సీ హెయిర్ కట్ ప్రస్తుతం ఫ్యాషన్ ప్రపంచం లో రాజ్యం ఏలుతున్నాయి. కానీ చిన్న తలకట్టు మీ వయస్సుని మరింత పెంచి చూపించే ప్రమాదం ఉంది. చెవుల వెనుక భాగం లో కొద్దిగా జుట్టూ కనిపించే లా హెయిర్ కట్ ఉంటే మీ మెడ ప్రాంతం జుట్టు తో కప్పి ఉంచబడి మీ వయస్సు ని కనబడనీయదు. ఈ సారి హెయిర్ కట్ కు వెళ్ళేటప్పుడు ఈ విషయాన్ని గుర్తుంచుకోండి.

English summary

10 Beauty Secrets Every Woman Shoud Know | ప్రతి మహిళ తెలుసుకోవల్సిన 10 బ్యూటీ సీక్రెట్స్..!

Most people know how to treat their skin, hair and nails. But "knowing" in the beauty world is often a practice in misinformation or overly general advice. That is, we may know what to do, but we don't know how to do it.
Desktop Bottom Promotion