For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

సౌందర్యం పెంచడంలో శెనగపిండి గొప్పదనం.!

|

సున్ని పిండి, పెసరపిండి, శెనగపిండి ఇవి మన ఇండియాలో చాలా పాపులర్ అయినటువంటి సౌందర్య సాధానాలు. వీటిని, వేల సంవత్సరాల నుండి సౌందర్య ఉత్పత్తిగా ఉపయోగిస్తున్నార. సున్నిపిండి శరీరానికి మర్ద చేసిన స్నానం చేసేవారు. అలాగే శెనగపిండి కూడా చాలా విరవిగా ఉపయోగిస్తారు. శెనగిపిండితో ఫేస్ ప్యాక్ కూడా వేసుకుంటారు. ఈ సాంప్రదాయకరమైన శెనగపిండిని ఒక్క చర్మ సంరక్షణలోనే కాదు, కేశ సంరక్షణలో కూడా ఉపయోగిస్తారు. కేశాలకు శెనగిపిండి ఉపయోగించడం వల్ల చుండ్రు వదలడంతో పాటు, ఇతర జుట్టు సమస్యలు కూడా వదులుతాయి. ఇక చర్మ సంరక్షణలో శెనగిపిండి ఒకగొప్ప ఔషదం అనే చెప్పాలి. ఎందుకంటే ఇది మొటిమలు, దానికి తాలుకూ మచ్చలు, చారలు, నల్ల మచ్చలు, స్కిన్ ప్యాచ్ వంటి వాటిన్నింటిని చాలా సులభంగా తొలగిస్తుంది.

ఖరీదైన రసాయనిక ఉత్పత్తులను పక్కన పెట్టి, శెనగపిండి ఉపయోగించి, అనేక బ్యూటీ ప్రయోజనాలను పొందడానికి ఇది ఒక చక్కటి అవకాశం. పెసరపిండి కానీ, లేదా శెనగపిండి కానీ, లేదా సున్నిపిండికానీ ఏదైనా సరే ఉపయోగించినప్పుడు మంచి ఫలితాలను పొందవచ్చు. పెసర పిండి, చర్మ సంరక్షణకు ఒక బెస్ట్ ప్రొడక్ట్ గా ఉపయోగించవచ్చు. శెనగిపిండిని బాడీ స్ర్కబ్ గా సాధారణంగా ఉపయోగిస్తుంటారు. ప్రస్తుత రోజుల్లో మన భారతీయ మహిళలు ఎక్కువగా హెర్బల్ రెమడీస్ ను ఉపయోగించడానికి శ్రద్ద చూపిస్తున్నారు. వీటితో అయితే ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు కనుక వీటి మీద ఎక్కువ మంది ఆసక్తిని కనబరుస్తున్నారు. మరో ప్రయోజనం ఈ నేచురల్ హెర్బల్ ప్రొడక్ట్స్ కోసం ఎక్కువగా ఖర్చుపెట్టాల్సిన అవసరం లేదు. మరియు దీర్ఘకాలం కొనాల్సిన పనిలేదు. ఇవి సహజంగానే ఎల్లప్పుడు మన వంటగదిలో నిత్యవసర వస్తువులుగా ఉంటాయి. కనుక ఎటువంటి ఇబ్బంది ఉండదు.

మరి శెనగపిండిని ఎలా ఉపయోగించాలి. దాని ప్రయోజనాలేంటో క్రింది విధంగా ఉన్నాయి. పరిశీలించండి..

సన్ టాన్:

సన్ టాన్:

వేసవిలో, సెలవుల్లో, చర్మం ఎక్కువగా సన్ టాన్ కు గురిఅవుతుంటుంది. మరి సన్ టాన్ నుండి ఆరోగ్యకరంగా బయటపడాలంటే 3చెంచాలా శెనపిండి, చిటికెడు, టమోటో జ్యూస్, అర చెంచా పెరుగు మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని సన్ టాన్ కు గురియైన ప్రదేశంలో అప్లై చేయాలి. అరగంట తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా రెగ్యులర్ గా చేయడం వల్ల మంచి ఫలితం ఉంటుంది.

ఆయిల్ ఫేస్:

ఆయిల్ ఫేస్:

మీరు ఆయిల్ ముఖంతో బాధపడుతున్నట్లైతే, అందుకు మీరు ఏం చేయాలో తెలియకపోతే, శెనగపిండిని ట్రై చేయండి. అందుకు మీరు చేయాల్సిదల్లా 4టేబుల్ స్పూన్ల శెనగపిండికి, రెండు చెంచాలా పచ్చిపాలు మిక్స్ చేసి, పేస్ట్ లా తయారు చేసి, ముఖానికి అప్లై చేయాలి. అరగంట తర్వాత ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి.

మొటిమలు:

మొటిమలు:

మొటిమలతో పోరాడటం అనేది చాలా ఇబ్బందికరమైన సమస్య, కానీ, మొటిమలను దూరంగా ఉంచడంలో శెనగపిండి ఒక అద్భుతమైన సౌందర్య సాధనంగా ఉపయోగపడుతుంది. అందుకు రెండు చెంచాలా పెసరపిండికి, రెండు చెంచాలా సాండిల్ వుడ్ పౌడర్ మిక్స్ చేయాలి. తర్వాత పాలు సరిపడా వేసి, పేస్ట్ లా చేసి ముఖానికి అప్లై చేయాలి. ఎండిన తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేయాలి.

ముఖాన్ని కాంతివంతం చేయడంలో అద్భుతంగా పనిచేస్తుంది:

ముఖాన్ని కాంతివంతం చేయడంలో అద్భుతంగా పనిచేస్తుంది:

శెనగపిండిలోని ఒక గొప్ప బ్యూటీ బెనిఫిట్ ఏంటంటే చర్మాన్ని టైట్ చేస్తుంది. స్కిన్ టైటనింగ్ కోసం ఉపయోగించే వాటిలో శెనగపిండి, నిమ్మరసం అద్భుతంగాపనిచేస్తాయి. ఒక చెంచా నిమ్మరసం, ఒక చెంచా శెనపిండి రెండింటిని పేస్ట్ లా చేసి, ముఖానికి పట్టించి ఆరిన తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి. లేదా పచ్చిపాలతో శుభ్రం చేసుకోవాలి. ఇలా ఒక వారం రోజుల పాటు చేయడం వల్ల అద్భుతమైన ఫలితాన్ని పొందవచ్చు.

మెడ/చంకల్లో నలుపుదనాన్ని పోగొడుతుంది:

మెడ/చంకల్లో నలుపుదనాన్ని పోగొడుతుంది:

చాలా మంది మహిళలో ఆ సమస్య ఇబ్బంది పెడుతుంటుంది. మెడ మీద, మరియు చంకల్లో ఎంత శుభ్రం చేసుకొన్నా నలుపు దనంతో కాస్త ఇబ్బందిగా ఉంటుంది. ఈ సమస్య నుండి బయటపడాలంటే, పెరుగు, నిమ్మరసం మరియు శెనగిపిండి మిక్స్ చేసి, ఈ మిశ్రమాన్ని మెడ మీద, చంకల్లో అప్లై చేసి 20నిముషాల తర్వాత శుభ్రం చేసుకోవాలి. ఆరిన తర్వాత గోరువెచ్చని నీటితో స్నానం చేసి, నువ్వుల నూనెను అప్లై చేయాలి.

ఫేషియల్ హెయిర్:

ఫేషియల్ హెయిర్:

ప్రస్తుత రోజుల్లో చాలా మంది మహిళలు హార్మోనులు అసమతౌల్యంతో బాధపడుతున్నారు. దాని కారణంగో ఫేషియల్ హెయిర్, అవాంచిత రోమాలు సమస్యలు తలెత్తుతున్నాయి. సౌందర్య సాధనాల్లోని శెనగిపిండి, ఈ హార్మోనల్ల అసమతౌల్యాన్ని నివారించనుంది. 3చెంచాల శెనగపిండి, ఒక చెంచా మెంతి పిండిలో మిక్స్ చేసి, మెత్తని పేస్ట్ లా తయారు చేయాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసి తర్వాత స్ర్కబ్ చేసి, చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి.

పగిలిన మరియు పొడిబారి చర్మం:

పగిలిన మరియు పొడిబారి చర్మం:

పగిలిన మరియు పొడి బారిన చర్మం చాలా మందిలో ఇబ్బంది పెట్టే చర్మ సమస్య . కానీ, శెనగపిండితో ఒక అద్భుతాన్ని చూడవచ్చు. అందుకు ఒక చెంచా శెనగపిండికి, ఒక చెంచా ఆలివ్ ఆయిల్ వేసి పేస్ట్ లా చేసి, ఈ మిశ్రమాన్ని పగిలిన మరియు పొడిబారిన చర్మానికి అప్లై చేయాలి. ఇలా తరుచూ చేస్తుంటే, రెండు వారాల్లో మంచి ఫలితం ఉంటుంది.

స్వచ్చమైన చర్మ సౌందర్యం:

స్వచ్చమైన చర్మ సౌందర్యం:

చర్మం కళంకం చెందినప్పుడు, దాని మీద మేకప్ చేయడానికి ప్రయత్నిస్తుంటాం. కానీ శెనగపిండిని ఉపయోగించడం వల్ల, ఈ సమస్యను నివారించుకోవచ్చు. రెండు చెంచాలా శెనగపిండిలో రెండు చెంచాలా పాలు పోసి మిక్స్ చేసి ఫేస్ ప్యాక్ వేసుకోవాలి. కొద్దిగా తడి ఆరిన తర్వాత ముఖాన్ని మసాజ్ చేయాలి. అంతే స్వచ్చమైన కోమలమైన చర్మం మీ సొంతం అవుతుంది.

చారలు(స్కార్స్):

చారలు(స్కార్స్):

ఇటువంటి లోతైన చారలను తొలగించుకోవాలి?ఇటువంటి ఇబ్బందికరమైన చారలను తొలగించుకోవడానికి అద్భుతంగా పనిచేసేది శెనగపిండి. పసుపు, శెనగపిండి సమంగా తీసుకొని పేస్ట్ లా తయారు చేసి చారలున్న ప్రదేశంలో అప్లై చేయాలి. అరగంట తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి.

మెరిసే చర్మం కోసం:

మెరిసే చర్మం కోసం:

మెరుస్తున్న తాజా చర్మ సౌందర్యం కోసం పెసరపిండి మరియు నిమ్మరసం మిక్స్ చేసి, ముఖానికి మాస్క్ లా వేసుకోవాలి. అరగంట తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా రెండు వారాలు చేసిన తర్వాత అద్భుతమైన మార్పును మీరు గమనించగలరు.

English summary

10 Best Beauty Benefits Of Besan Powder

The beauty uses of gram flour or chickpea flour as it is widely called in India, has become popular. The gram flour is used with other ingredients to make a fine face pack. Traditionally this gram flour is also used for hair care to help in treating dandruff and other hair problems like hair fall.
Story first published: Tuesday, August 13, 2013, 12:36 [IST]
Desktop Bottom Promotion