For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మీ చర్మానికి హనీ కలిగించే పది రకాల కాస్మొటిక్స్...!

By Super
|

దుకాణాలలో మరియు సలూన్ల లో వివిధ రకాల కాస్మెటిక్స్ మరియు చర్మ సంరక్షణకు సంబంధించిన ఉత్పత్తులు లభ్యమవుతాయి. ఈ ఉత్పత్తుల ద్వారా మహిళలు అలాగే పురుషులు ఆరోగ్యకరమైన, మృదువైన మరియు అందమైన చర్మాన్ని సొంతం చేసుకోగలుగుతారు. అయినప్పటికీ, అన్ని రకాల చర్మ సంరక్షణకు సంబంధించిన ఉత్పత్తులన్నీ మంచివి కావు. కొన్ని హనీకరమైనవి కూడా. స్త్రీల అందాన్ని రెట్టింపు చేసే కొన్ని రకాల కాస్మెటిక్స్ చర్మం పై కొన్ని ప్రతికూల ప్రభావాలను చూపిస్తాయి. ఎన్నో రకాల మేకప్ ప్రొడక్ట్స్ చర్మంపై చెడు ప్రభావం చూపిస్తాయని అధ్యయనాలలో నీరూపితమైనది. అంతే కాదు, ఈ కాస్మెటిక్స్ మరియు మేకప్ ప్రొడక్ట్స్ వల్ల కొన్ని రకాల సూక్ష్మజీవులు మీ చర్మంపై ప్రవేశించడం తో పాటు మీ చర్మపు సహజ సిద్దమైన సౌందర్యం తగ్గిపోతుంది.

మీ చర్మానికి హనీ కలిగించే పది రకాల కాస్మెటిక్స్ గురించి ఇక్కడ వివరించడం జరిగింది.


మీ చర్మానికి హానీ చేసే పది రకాల కాస్మొటిక్స్..!?

లిప్ స్టిక్ : మీ పెదవులపై తేమ లిప్ స్టిక్ వల్ల పొడిబారుతుంది. లిప్ బామ్స్ శ్రేష్టమైనవి. కొన్ని లిప్ స్టిక్ లు మరియు లీగ్ గ్లాసులలో ఉండే నూనె మరియు కెమికల్స్ మీ పెదవులను అందంగా చెయ్యడం కంటే వాటి అందాన్ని చెడగొట్టడం లో ప్రధాన పాత్ర పోషిస్తాయి. కొన్ని రకాల ఎరుపు రంగు లిప్ స్టిక్ ల లో సీసం అధిక మొత్తం లోఉంటుంది . ఇటువంటి లిప్ స్టిక్ లు వాడడం వల్ల మెదడు సమస్యలు, అజీర్ణం మరియు మానసిక సమస్యలు తలెత్తుతాయి.

మీ చర్మానికి హానీ చేసే పది రకాల కాస్మొటిక్స్..!?

మాయిశ్చరైజర్ : ప్రసిద్ది చెందిన కంపెనీలు విక్రయించే చర్మ సంరక్షిత ప్రొడక్ట్స్ లో అధిక శాతం డిటర్జెంట్స్ కి సంబంధితమైన మరియు డిటర్జెంట్స్ కలిగి ఉంటాయి. ఇవి మీ చర్మాన్ని నాశనం చేస్తాయి. చర్మం లో ఉన్న సహజసిద్దమైన రక్షణ వ్యవస్థని నిస్సారం చేస్తాయి.

మీ చర్మానికి హానీ చేసే పది రకాల కాస్మొటిక్స్..!?

కాజల్ : కంటి పై కాజల్ వాడకం వివిధ రకాల సమస్యలకు కారణం. పొడిబారిన కళ్ళు, కండ్లకలక, రసాయన విష పదార్ధాల చేరుట, గ్లాకోమా వంటి కొన్ని కంటి సమస్యలు కాజల్ వాడకం వల్ల కలుగుతాయి. అందువల్ల, కాజల్ మరియు సుర్మా వంటి కంటి లోపల వాడే కాస్మెటిక్స్ ని ఉపయోగించడం మానెయ్యాలి.

మీ చర్మానికి హానీ చేసే పది రకాల కాస్మొటిక్స్..!?

నైల్ పాలిష్ : దట్టమైన నైల్ పోలిష్ లు వాడడం వల్ల మీ గోర్ల యొక్క సహజ సిద్దమైన రంగు పాలిపోయి పసుపుపచ్చగా మారే అవకాశం ఉంది. అసిటోన్ అనే కఠినమైన రసాయనం కలిగిన నైల్ పోలిష్ గోరు యొక్క బలాన్ని క్షీణింపచేస్తుంది.

మీ చర్మానికి హానీ చేసే పది రకాల కాస్మొటిక్స్..!?

టాల్కం పౌడర్ : పుండ్లను తగ్గించే సామర్ధ్యం ఉన్న సిలికేట్స్ టాల్క్ వంటి రసాయనాలు కలిగిన టాల్కం పౌడర్ ల వల్ల ఎలర్జీ లు అలాగే ఉపిరితిత్తులలొ ఇన్ఫెక్షన్ లు కలిగే అవకాశం ఉంది. చెమట నుంచి ఉపశమనం పొందడానికి పౌడర్ ని వాడతాము. కానీ ఈ పౌడర్ ల వల్ల చర్మానికి అనేక రకాల సమస్యలు ఎదురవుతాయి.

మీ చర్మానికి హానీ చేసే పది రకాల కాస్మొటిక్స్..!?

బ్లీచ్ క్రీమ్స్ : చర్మంపై ముడతలు రాకుండా, చర్మాన్ని మృదువుగా ఉంచడానికి ప్రయత్నించే సహజ సిద్దమైన నూనె మన చర్మం లో కలిగి ఉంటుంది. బలమైన రసాయన బ్లీచ్ ల వల్ల ఈ సహజ సిద్దమైన నూనె ఉత్పత్తి తగ్గిపోతుంది.

మీ చర్మానికి హానీ చేసే పది రకాల కాస్మొటిక్స్..!?

వాక్సింగ్ : అవాంఛిత రోమాల నిర్మూలనకు వాక్సింగ్ ఉపయోగపడుతుంది. కానీ ఈ వాక్సింగ్ ఉపయోగం వల్ల చర్మం పై కొద్ది పాటి రక్త స్రావం, ఇంగ్రోన్ హెయిర్ వంటి సమస్యలు తలెత్తుతాయి. అంతే కాకుండా, ముఖం పై వాక్సింగ్ చేసేటప్పుడు చర్మం పై ఎక్కువ వత్తిడి కలుగుతుంది. చర్మం సాగిపోయే ప్రమాదం ఉంది. ముఖ చర్మం అత్యంత సున్నితమైనది కావడం వల్ల వాక్సింగ్ వల్ల చర్మపు అందం పోతుంది.

మీ చర్మానికి హానీ చేసే పది రకాల కాస్మొటిక్స్..!?

హెయిర్ కలర్స్ మరియు హెయిర్ డై : మీ జుట్టు కి రంగు వేసుకునే ముందు హెయిర్ డై వల్ల జుట్టు రాలుట, మంట, ఎరుపుదనం, తలపై దురద ఎక్కువవడం, ముఖం వాచడం మరియు శ్వాసకోస సమస్యలు వంటివి ప్రతికూల ప్రభావాల కలిగే అవకాశాలు ఉన్నాయని తెలుసుకోండి. ఈ హెయిర్ డై ల లో ఉండే వివిధ రకాల హనీకరమైన రసాయనాలు ఆరోగ్యం పై ప్రతికూల ప్రభావం చూపిస్తాయని తెలుసుకోండి.

మీ చర్మానికి హానీ చేసే పది రకాల కాస్మొటిక్స్..!?

డియోడరంట్స్ : డియోడరంట్స్ లో ఉండే కొన్ని రకాల హనీ కరమైన పదార్ధాల వల్ల చర్మానికి అలాగే శరీరానికి ఎంతో ప్రమాదమని శాస్త్రీయంగా నిరూపితమైనది. ఆల్కహాల్ అనే పదార్ధం కలిగి ఉండటం వల్ల డియోడరంట్స్ వాడకం చర్మంపై ఎరుపుదనం అలాగే దురదతో పాటు పిగ్మెంటేషన్ కలిగే అవకాశం ఉంది.

మీ చర్మానికి హానీ చేసే పది రకాల కాస్మొటిక్స్..!?

ఫ్రాగ్నన్స్ : కాస్మెటిక్స్ లో వివిధ రకాల హనీకరమైన రసాయనాలు ఉన్నాయన్న సంగతి అందరికీ తెలిసినదే. దుస్తుల్ని మృదువుగా ఉంచేందుకు ఉపయోగించే ఫాబ్రిక్ సాఫ్టనర్స్, లాండ్రీ డిటర్జెంట్స్, పెర్ఫ్యూమ్ మరియు పర్సనల్ కేర్ ప్రొడక్ట్స్, ఎయిర్ ఫ్రెషనర్స్ మరియు వివిధ రకాల ఉత్పత్తుల వల్ల ఆరోగ్యానికే కాదు పర్యావరణానికి కూడా సమస్యలే అన్న విషయం గ్రహించాలి.

English summary

10 cosmetics that can harm your skin | మీ చర్మానికి హానీ చేసే పది రకాల కాస్మొటిక్స్..!?

Various cosmetics and skin care products are widely available in stores and salons. With these products it is easier for women (and men) to achieve a healthy, smooth and beautiful skin. However, even though these products are effective, not all of these are safe.
Desktop Bottom Promotion