For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

చర్మ రక్షణ కోసం 10 ఆరోగ్యకరమైన ఆకులు

By Lakshmi Perumalla
|

యువతులు ముఖ్యంగా కాలేజ్ కు వెళ్ళే అమ్మాయిలు, అలాగే ప్రతి ఒక్కరు ఆరోగ్యకరమైన మరియు మెరిసే చర్మం ఉండాలని కోరుకుంటారు. సహజ చర్మ సంరక్షణ అనేది అన్నింటి కంటే ఎక్కువ ప్రాముఖ్యత కలిగి ఉంది. ఎందుకంటే అమ్మాయిలు ఎల్లప్పుడూ అద్భుతముగా మరియు ఇతరుల కంటే బిన్నంగా ఉండాలని అనుకుంటారు. ఆరోగ్యకరమైన చర్మ సంరక్షణ మరియు అందం కోసం ఆకులు ప్రధానమైన ఎంపికలుగా ఉన్నాయి. ఈ ఆకులు ఆరోగ్యకరమైన చర్మం కొరకు సహజ మూలికలను అందిస్తాయి.

మీకు ఆరోగ్యకరమైన చర్మ సంరక్షణ ఆకులు అందించే మూలికల గురించి మీ మనస్సులో ఒక ప్రశ్న కలిగి ఉండవచ్చు. ఈ చర్మ సంరక్షణ ఆకులు ఉత్తమమైనవా? అవును అవి మంచివి! సహజ మూలికలు చర్మంనకు అద్భుతమైన గ్లో ఇస్తాయి. అలాగే వాటిని వాడుట వలన ఆరోగ్యానికి ఏటువంటి దుష్ప్రభావాలు ఉండవు. క్రింది సహజ చర్మ సంరక్షణ అందించడం కొరకు ప్రభావవంతమైన సహజ మూలికలు కొన్ని ఉన్నాయి:-

 వేప ఆకులు

వేప ఆకులు

వేప ఆకులు ఆరోగ్యకరమైన ప్రకాశించే చర్మాన్ని ప్రోత్సహిస్తాయి. ఇది చర్మ సంరక్షణ ఆకులలో ఉత్తమ హెర్బ్ అని నిరూపణ జరిగింది. వేప ఆకులు పొడి మరియు గులాబీ రేకుల పొడి నిమ్మరసంలో కలిపి పేస్ట్ చేసి చర్మం పై రాస్తే చర్మం ప్రకాశవంతముగా మెరుస్తుంది.

అవెకాడో పండు

అవెకాడో పండు

అవెకాడో పండు కూడా చర్మంను సహజంగా ప్రకాశవంతము చేస్తుంది. అంతేకాక దెబ్బతిన్న మరియు పొడి చర్మ సమస్యల చికిత్సకు ఉపయోగిస్తారు.అవెకాడో పండు సులభంగా దెబ్బతిన్న చర్మంను నయం చేసే ప్రోటీన్ మూలం సమృద్దిగా కలిగి ఉంది.

గంధం

గంధం

గంధం కూడా అత్యంత ఆరోగ్యకరమైన చర్మ సంరక్షణ ఉత్పత్తులకు మరియు మందులకు ఒక కీలక అంశంగా ఉంది. ఇది చర్మ సంరక్షణ ఆకులు అందించే అద్భుతమైన హెర్బ్ గా ఉంది. మొటిమలు, దద్దుర్లు మరియు మోటిమలు వంటి సాధారణ చర్మ సమస్యలపై పోరాడే సామర్థ్యం కలిగి ఉంది. ప్రభావిత చర్మంపై గంధంను రాస్తే చర్మంపై ఓదార్పు ప్రభావాన్ని కలిగిస్తుంది.

పసుపు

పసుపు

పసుపు అద్భుతమైన సహజ చర్మ సంరక్షణ మరియు ఆరోగ్యకరమైన సహజ మెరుపును అందిస్తుంది. దీనిలో యాంటీ ఫంగల్ మరియు యాంటీ శోథ లక్షణాలు ఉండుట వలన మొటిమలు,చర్మరోగాలు మరియు పిగ్మెంటేషన్ వంటి చర్మ సమస్యలపై పోరాటానికి సహాయపడుతుంది.

కలబంద

కలబంద

కలబంద ఆరోగ్యకరమైన చర్మ సంరక్షణ ఆకు మరియు మెరిసే మరియు ఆరోగ్యకరమైన చర్మాన్ని అందిస్తుంది. కలబందలో యాంటీ శోథ లక్షణాలు మరియు నయం చేసే లక్షణాలు ఉండుట వలన చర్మం పై పొర రక్షణ మరియు చర్మంపై వాపును తగ్గిస్తుంది.

బాదం ఆకులు

బాదం ఆకులు

బాదం ఆకుల నుంచి తయారు చేసే నూనె చర్మాన్ని ఆరోగ్యకరముగా మరియు మెరిసేలా చేయడానికి బాగా పనిచేస్తుంది.బాదం ఆకులు చర్మాన్ని తేమగా ఉంచుతాయి. అలాగే శీతాకాలంలో చేతి ఉత్పత్తులు తయారీలో విస్తృతంగా ఉపయోగిస్తున్నారు.

చమోమిలే

చమోమిలే

చమోమిలే సహజ చర్మ సంరక్షణ మరియు చర్మ ప్రయోజనాల కోసం విస్తృతంగా ఉపయోగించే మరొక సమర్థవంతమైన హెర్బ్ గా ఉంది. దీనిలో ఆల్ఫా బిసబోలో అనే సమ్మేళనం ఉండడం వలన చర్మంపై ముడుతలు మరియు లైన్లను తగ్గిస్తుంది.

విచ్ హాజెల్

విచ్ హాజెల్

విచ్ హాజెల్ ప్రభావవంతమైన ఆరోగ్యకరమైన చర్మ రక్షణను అందిస్తుంది. సిబం ఉత్పత్తిని తగ్గించి తద్వారా చర్మంను శుభ్రంగా మరియు ఆయిల్ లేకుండా చేస్తుంది. ఈ మూలిక పూర్తిగా సహజమైనది. అంతేకాక చర్మంపై ఎరుపు గుర్తులు మరియు వాపు తగ్గించడంలో సహాయపడుతుంది.

తులసి

తులసి

తులసి ఆకులు చర్మ ఉపరితలంపై వచ్చే మొటిమలు మరియు డార్క్ వలయాల సమస్య చికిత్సలో ఒక కీలక పాత్ర పోషిస్తాయి. అంతేకాక ప్రత్యేక రక్తస్రావ నివారిణి లక్షణాలను కలిగి ఉంటుంది.

చర్మానికి సహజమైన ప్రకాశవంతం ఇవ్వడంలో అద్భుతమైన ప్రభావాలను చూపే ఉత్తమమైన మూలికలు ఉన్నాయి.మీ చర్మ రకానికి సరిపోయే నిజమైన హెర్బ్ కోసం వెళ్ళండి.

Desktop Bottom Promotion