For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మొటిమలు నివారణకు అద్భుతంగా పనిచేసే వంటింటి వస్తువులు...!

|

సాధారణంగా చాలా మంది ముఖంలో మొటిమలతో ఇబ్బంది పడుతుంటా. మొటిమలు అన్ని వయస్సుల వారు ఎదుర్కొంటున్న సాధారణ చర్మ సమస్య. ముఖ్యంగా టీనేజర్స్ లోనూ మరయు పెద్దవాళ్ళలో ఎక్కువగా కనబడే చర్మ సమస్య. ఈ మొటిమలు సాధారణంగా వాతావరణ కాలుష్యం వల్ల చర్మ మీద దుమ్ము, ధూళి చేరడం, జిడ్డు చర్మం, బ్లాక్ హెడ్స్ మరియు వైట్ హెడ్స్ వల్ల కూడా మొటిమలకు రావడానికి కారణం అవుతుంది.

ముఖం మీద కానీ, లేదా శరీరంలో ఏ ఇతర భాగాల్లో ఎరుపు రంగు మచ్చలు ఏర్పడటానికి వివిధ కారణాలు ఉండవచ్చు. ఉదాహరణకు సెబాసియస్ గ్లాండ్స్(నూనె గ్రంథులు)ఎక్కువగా ఉండటం చేత కూడా చర్మ మీద మొటిమలు ఏర్పడటానికి కారణం అవుతాయి. ఇంకా హార్మోనుల అసమతుల్యత మరియు అనారోగ్యకరమైన ఆహారం, దుమ్ము మరియు సూర్యరశ్మి వంటి ఇతర సాధారణ కారణాలు కూడా మొటిమలు ఏర్పడటానికి కారణం కావచ్చు.

మొటిమల నివారణకు మన ఇంటి ఔషధాలు..!

నిమ్మరసం: మొటిమల నివారణకు సిట్రస్ పండ్లు బాగా సహాయపడుతాయి. నిమ్మరసాన్ని కానీ లేదా తాజా నిమ్మ చెక్కతో కానీ మొటిమలున్న ప్రదేశంలో మసాజ్ చేయడం వల్ల అద్భుతమైన ఫలితాన్నిస్తుంది. అంతే కాదు మీరు రెగ్యులర్ గా ఉపయోగించే ఫేస్ ప్యాక్స్ లో నిమ్మరసాన్ని కూడా కలిపి ఉపయోగించుకోవచ్చు.

మొటిమల నివారణకు మన ఇంటి ఔషధాలు..!

తేనె: చర్మ సంరక్షణలో మనం తరచూ తేనెను ఉపయోగిస్తుంటాం. చర్మం నునుపుగా, సున్నితంగా, టైట్ గా మారడానికి మాయిశ్చరైజింగ్ గా ఉపయోగిస్తుంటాం. తేనెలో యాంటీయాక్సిడెంట్స్ కలిగి ఉండటం వల్ల చర్మాన్ని శుభ్రం చేసి మొటిమలను నివారిస్తుంది.

మొటిమల నివారణకు మన ఇంటి ఔషధాలు..!

ఓట్ మీల్: మొటిమలు, మచ్చల నివారణకు వంటగది వస్తువులు బాగా సహాయపడుతాయి. ఓట్ మీల్ చర్మం పెలుసుబారకుండా చేస్తుంది. డెడ్ స్కిన్ సెల్స్ ను తొలగిస్తుంది. ముఖ్యంగా మొటిమలతో వచ్చిన మచ్చలు తగ్గిస్తుంది. కాబట్టి, ఉదయం బ్రేక్ ఫాస్ట్ చేసే ముందు ఓట్ మీల్ ను పాలతో కలిపి పేస్ట్ లా చేసి ముఖానికి పట్టించాలి.

మొటిమల నివారణకు మన ఇంటి ఔషధాలు..!

బేకింగ్ సోడా: ఇది మరో వంటగది వస్తువు. ఇది నేచురల్ క్లీనర్ గా పనిచేస్తుంది. బేకింగ్ సోడా తో మొటిమల మీద మసాజ్ చేయడం వల్ల మంచి ఫలితాన్నిస్తుంది. ఇది మొటిమలను నివారించడమే కాకుండా ముడతలను తొలగిస్తుంది.

మొటిమల నివారణకు మన ఇంటి ఔషధాలు..!

టమోటో: టమోటోలో విటమిన్ ఎ మిరయు సిట్రిక్ యాసిడ్ అధికంగా ఉండటం వల్ల సెరమ్ ఉత్పత్తిని తగ్గిస్తుంది. సీరం అధికంగా ఉత్పత్తి కావడం వల్ల కూడా మొటిమలు ఏర్పడటానికి కారణం అవుతుంది. కాబట్టి, ఈ వంటింటి వస్తువు టమోటోతో ముఖాన్ని మసాజ్ చేయండి.

మొటిమల నివారణకు మన ఇంటి ఔషధాలు..!

అలోవెరా: ఇది వంటింటి వస్తువు కాదు. అయినప్పటికీ దీన్ని సాధారణంగా మన ఇల్లలో పెంచుకుంటుంటాం. కాబట్టి దీన్ని ఉపయోగించి మొటిమలను నయం చేసుకోవచ్చు. అలోవెరా జెల్ ల్లో యాంటీఇన్ల్ఫమేటర్ గుణాలు మెండుగా ఉండటం వల్ల మొటిమల నివారణకు బాగా సహాయపడుతుంది.

మొటిమల నివారణకు మన ఇంటి ఔషధాలు..!

పెరుగు: ఈ డైరీ ప్రొడక్ట్ మరొక వంటగది వస్తువు. ఇది ప్రభావంతంగా పనిచేసి, మొటిమలను నివారిస్తుంది. కాబట్టి మీరు రెగ్యులర్ గా వేసుకొనే ఏదైనా ఫేస్ ప్యాక్ లోనైనా సరి పెరుగును మిక్స్ చేసి ముఖానికి పట్టించి ముఖానికి పట్టించాలి. అలాగే కొద్దిగా తేనె, పెరుగు, నిమ్మరసం, సాండిల్ వుడ్ పౌర్ అన్నింటిని మిక్స్ చేసి ఫేస్ ప్యాక్ వేసుకొంటే మొటిమలు నయం అవుతుంది.

మొటిమల నివారణకు మన ఇంటి ఔషధాలు..!

స్ట్రాబెర్రీ: బెర్రీస్ మెరిసే చర్మ సంరక్షణకు బాగా సహాయపడుతాయి. అదే విధంగా మొటిమలు లేని చర్మంగా మార్చుతాయి . కాబట్టి కొన్ని స్ట్రాబెర్రీలను మెత్తగా పేస్ట్ చేసి, అందులో కొద్దిగా తేనె మిక్స్ చేసి ముఖానికి ప్రతి రోజూ అప్లై చేయడం వల్ల మొటిమలు త్వరగా నివారించబడుతాయి.

మొటిమల నివారణకు మన ఇంటి ఔషధాలు..!

సీ సాల్ట్: మొటిమల నివారణకు నిమ్మరసం, సీసాల్ట్ బెస్ట్ ఫేస్ స్క్రబ్. సీ సాల్ట్ చర్మాన్ని శుభ్రపరిచి, మొటిమలను పోగొడుతుంది.

మొటిమల నివారణకు మన ఇంటి ఔషధాలు..!

ఇంగువ: సాదారణంగా దీన్ని హింగ్ అని పిలుస్తారు. ఇంగువను నీటిలో కలిపి మొటిమలు మీద మసాజ్ చేయడం వల్ల మొటిమలు బ్రేక్ అవుట్ అవుతాయి. ఈ పేస్ట్ మొటిమల మచ్చలను కూడా తగ్గిస్తుంది.

మొటిమల నివారణకు చాలా చికిత్సా పద్దతులున్నాయి. అయితే మొటిమలు నయం కావడానికి కొంత సమయం పడుతుంది. చాలా వరకూ మొటిమల నివారణలో చికిత్స పద్ధతుల్లో రసాయనాలు అధికంగా వాడం వల్ల ఒక సమస్యకు మరో సమస్య తోడవుతుంది. కాబట్టి రసాయ క్రీములు వాడటం కంటే కొన్ని ఇంటి చిట్కాలను పాటించి చర్మ సమస్యలను దూరం చేసుకోవచ్చు. అవి ఖచ్చితంగా మీ వంటగదిలోనే సులభంగా దొరికేటటువంటి వస్తువులతోనే మొటిమలు నయం చేసుకోవచ్చు. ఉదాహరణకు ఆలివ్ ఆయిల్, లవంగాలు లేదా తేనె వంటివి ప్రతి ఇంట్లోను నిల్వ ఉంటాయి. కాబట్టి మీరు సహజ పద్దతుల ద్వారా మొటిమలు నివారించుకోవాలంటే ఇంటువంటి కొన్ని వంటింటి వస్తువులను ఉపయోగించండి. మొటిమల నివారణలో ఉపయోగపడే కొన్ని వంటగది వస్తువులు...

English summary

10 Kitchen Ingredients To Cure Acne | మొటిమల నివారణకు మన ఇంటి ఔషధాలు..!

Acne is a common skin problem faced by people of all ages. It is most commonly a skin problem for teens as well as adults. Acne is an inflammation in the skin that causes whiteheads, blackheads and in worst cases, pimples.
Story first published: Friday, February 15, 2013, 13:04 [IST]
Desktop Bottom Promotion