For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

వేసవిలో ఏర్పడే చర్మ సమస్యలు గురించి తెలుసుకోండి....

|

సాధారణంగా సమ్మర్ లో సన్నీ డేస్ కు చాలా మందికి ఎక్సైటింగ్ గా ఉంటుంది. ఎందుకంటే బయట టూర్లు, వేసవి విడుదులు బయట ప్రదేశాల్లో ఎక్కువగా గడపడానికి చాలా మంది ఇష్టపడుతారు. అందుకు అనుకూలంగానే పిల్లలకు పెద్దలకు వేసవి సెలవులు కూడా ఉంటాయి. వేసవిలో మీరు ఎక్కువ కాలం కుటుంబ సభ్యలతో గడపడానికి, మీరు అనుకున్న ప్రదేశాలను సందర్శించడానికి, మీరు అనుకున్న పనులను పూర్తి చేయడానికి వేసవి కాలం అనుకూలంగా ఉంటుంది. అయితే, అదే సమయంలో వేసవి వేడి చర్మ సమస్యలను కూడా గురిచేస్తుంది . మరి ఈ వేసవిలో స్వేచ్చగా ఎంజాయ్ చేయాలంటే, ఈ వేసవి వేడి నుండి చర్మాన్ని రక్షించుకోవడానికి తీసుకోవల్సిన జాగ్రత్తల గురించి తెలుసుకోవడానికి ఇదొక మం సమయం.

సూర్యరశ్మి నుండి వెలువడే యూవి కిరణాలు, మరి వేడి మనల్ని అనేక చర్మ సమస్యలకు గురిచేస్తుంది. సూర్యుని నుండి వెలువడే యూవి కిరణాలు వల్ల చర్మ వదులవ్వడం, ముడుతలు పడటం, ఊహించని మొటిమలు, వయస్సు మీద పడేలా కనిపించడం ఇలా వివిధ రకాల చర్మ సమస్యలకు దారితీస్తుంది. వేసవి కాలంలో సూర్యుని నుండి వెలువడే యూవీ కిరణాలు వల్ల చర్మంలోని ఎలాస్టిన్ (ఫైబర్)ను డ్యామేజ్ చేస్తుంది మరియు చర్మం వదులవ్వడం, స్ట్రెచ్ మార్క్స్(చర్మం మీద చారలు) ఏర్పడ్డం వంటి సమస్యలు కూడా మొదలవుతాయి.

వేసవి కాలంలో ఆరోగ్యకరమైన మరియు మెరిసే చర్మం పొందడం మనకు చాలేంజ్. ముఖ్యంగా వేసవి కాలంలో ప్రయాణాలు, బయట ఎక్కువ సమయాన్ని గడిపేవారికి, సైట్ వర్క్ లేదా ఇతర ప్రొఫిషినల్ డిమాండ్స్. ఒక వేళ మీకు బయట ప్రదేశాలకు వెళ్ళాలనిపించకపోవడం, వేసవిని ఎంజాయ్ చేయాలనే ఫీలింగ్ లేకపోవడం ఉన్నట్లైతే, అందుకు కారణం చర్మ సమస్యలున్నట్లు గుర్తించాలి. ఈసమస్యలతో బాధపడటం కంటే సమ్మర్ స్కిన్ ప్రాబ్లమ్స్ ను నివారించుకోవడం మంచిది. కాబట్టి, ఏదైన చర్మ సమస్య ఏర్పడటానికి ముందే వాటి తగిన జాగ్రత్తలు తీసుకుంటే మంచిది. వేసవిలో సాధారణంగా ఎటువంటి చర్మ సమస్యలు ఎదురౌతాయో తెలుసుకుంటే..తెలిసుంటే తప్పనిసరిగా వాటి నుండి బయటపడవచ్చు . మరి వేసవిలో వచ్చే 10ప్రధాన చర్మ సమస్యలేంటో గుర్తించండి:

వేసవిలో ఏర్పడే చర్మ సమస్యలతో తస్మాత్ జాగ్రత్త...

సన్ బర్న్: యూవీ (ఆల్ట్రావయోలెట్ )కిరణాలు వల్ల సన్ బర్న్ (చర్మం కమిలడం, నల్లబడం )కారణం కావచ్చు. కాబట్టి చర్మం మీద అతి వేడి కిరణాలు పడకుండా చర్మాన్ని కాపాడుకోవాలనుకుంటే ఉదయం 10 నుండి సాయంత్రం 4గంట వరకూ బయటకు వెళ్ళకపోవడమే మంచిది. మరియు సన్ స్ర్కీన్ లోషన్ ను ఉపయోగించడం వల్ల సన్ బర్న్ నుండి కొంత ఉపశమనం పొందవచ్చు.

వేసవిలో ఏర్పడే చర్మ సమస్యలతో తస్మాత్ జాగ్రత్త...

సమ్మర్ రాషెస్(వేసవిలో చర్మ మీద ఏర్పడే చారలు): వేసవి కాలంలో యూవి కిరణాల వల్ల వాతావరణంలో అతి వేడి మరియు హుముడిటి వల్ల సమ్మర్ రాషెస్ ఏర్పడటానికి కారణం అవుతుంది. మరియు చర్మ సమస్యలు చిరాకు అనిపిస్తుంది. చర్మం మీద చిన్న చిన్నని పింక్ కలర్ మొటిమలు ఏర్పడుతాయి. ఇవి శరీరం మొత్తంలో కనబడుతుంటాయి. వీటికి కొన్ని ప్రింక్లీ హీట్ పౌడర్స్ ను ఉపయోగించడం వల్ల ఉపశమనం పొందవచ్చు.

వేసవిలో ఏర్పడే చర్మ సమస్యలతో తస్మాత్ జాగ్రత్త...

వేసవి మొటిమలు: వేడి వల్ల శరీరంలో చెమటలు పెరుగుతాయి. ఇంకా హుముడిటి ఆయిల్ స్కిన్ క్రీమ్స్ లేదా సన్ స్క్రీన్ లోషన్ల వల్ల కూడా మొటిమలు పెరగుతాయి. చర్మానికి అప్లై చేసే క్రీములు చెమటతో కలిసిపోవడం వల్ల చర్మరంధ్రాల్లో మురికి ఏర్పడి మొటిమలకు దారితీసి వేసవిలో చిరాకు పెట్టేస్తాయి.

వేసవిలో ఏర్పడే చర్మ సమస్యలతో తస్మాత్ జాగ్రత్త...

పొడి చర్మం: వేసవి కాలంలో వేడితో శరీరంలో అధిక చెమటల వల్ల డిహైడ్రేషన్ కు గురికావల్సి వస్తుంది. డీహైడ్రేషన్ వల్ల చర్మ పొడిగా మారుతుంది. హెయిర్ కండీషనర్స్ ను అధికంగా ఉపయోగించడం వల్ల కూడా ఈ సమస్య ఏర్పడుతుంది . ఈ సమస్య నివారణకు అధిక నీరు తీసుకోవడం కొన్ని స్కిన్ హెల్తీ మాయిశ్చరైజర్స్ రాయడం వల్ల చర్మాన్ని కాపాడుకోవచ్చు.

వేసవిలో ఏర్పడే చర్మ సమస్యలతో తస్మాత్ జాగ్రత్త...

పాదాలు: పాదాలను కప్పి ఉంచే షూలను ధరించడం వల్ల అధికంగా చెమటలు పడుతాయి. దాంతో పాదాల్లో ఇన్ఫెక్షన్లు ఏర్పడి ,చర్మ సమస్యలతో పాటు గోళ్ళు దెబ్బతింటాయి.

వేసవిలో ఏర్పడే చర్మ సమస్యలతో తస్మాత్ జాగ్రత్త...

పగిలిన పెదాలు: వేసవి కాలంలో పగిలిన పెదాలు మరో ముఖ్య సమస్య.ఇది పొడి చర్మం వల్ల ఏర్పడుతుంది. కాబట్టి, వేసవికాలంలో సాధ్యమైనంత వరకూ అధికంగా నీరు త్రాగం, మన్నికైన లిప్ బామ్స్ ఉపయోగించడం వల్ల చర్మ సమస్యల నుండి బయట పడవచ్చు.

వేసవిలో ఏర్పడే చర్మ సమస్యలతో తస్మాత్ జాగ్రత్త...

ఊహించని స్కిన్ టోన్: మన శరీరం మీద పడే అధిక యూవి కిరణాలు ఊహించని విధంగా చర్మంలో మొటిమలు, ఇతర సమస్యలను ఏర్పరుస్తాయి.

వేసవిలో ఏర్పడే చర్మ సమస్యలతో తస్మాత్ జాగ్రత్త...

బికిని లైన్ రాషెస్: బికినీలు ధరించడం వల్ల తొడలవద్ద ఎక్కువ చెమట, బిగుతైన దుస్తులు ధరించడం వల్ల పూర్ హైజీన్ వల్ల మీ చర్మాన్ని పొడి బారేలా చేస్తాయి . కాబట్టి ఇన్నర్ దుస్తులు కూడా కాటన్ వై ఉంటే మేలు.

వేసవిలో ఏర్పడే చర్మ సమస్యలతో తస్మాత్ జాగ్రత్త...

ఫ్లాకీ స్కిన్: చర్మం డీహైడ్రేషన్ కు గురి అవ్వడం వల్ల ఫ్లాకీ స్కిన్ ఏర్పడుతుంది. కాబట్టి వేసవిలో వాటర్ బేస్డ్ మాయిశ్చరైజర్స్ రెగ్యులర్ గా ఉపయోగించాలి. మరియు అధికంగా నీరు త్రాగాలి. చర్మం మీద డెడ్ స్కిన్ తొలగించడానికి వారానికి రెండు సార్లైనా స్ర్కబ్బింగ్ చేసుకోవాలి.

వేసవిలో ఏర్పడే చర్మ సమస్యలతో తస్మాత్ జాగ్రత్త...

జుట్టు సమస్య: ఇది ముఖ్యంగా డీహైడ్రేషన్ వల్లే కలుగుతుంది . అధిక వేడి వల్ల అధిక చెమట, చెమటతో పాటు దుమ్ము, ధూళి చేరడం వల్ల జుట్టు రాలడం జరుగుతుంది. కాబట్టి జుట్టురక్షణ కోసం ఎక్స్ ట్రా కేర్ తీసుకోవడం చాలా ముఖ్యం.

English summary

10 Summer Skin Problems To Beware Of | వేసవిలో ఏర్పడే చర్మ సమస్యలతో తస్మాత్ జాగ్రత్త...

The warm sunny days of summer are extremely exciting. It is a great time to plan an outing or a trip. Summer gives you the opportunity to spend more time outdoors doing the things you love. But at the same time, summer brings a lot of skin problems along with it. It is time to start thinking about getting your skin ready for the hottest season of the year, if you want to enjoy the sun and freedom of summer.
Story first published: Wednesday, March 27, 2013, 10:59 [IST]
Desktop Bottom Promotion