For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

పెళ్ళి సౌందర్యం ఉట్టిపడేలా తీసుకోండి ఈ జాగ్రత్తలు..!

|

మాఘమాసం వచ్చేసింది. ఎటు చూసినా పెళ్లిసందడే. పెళ్లి అనగానే, బోలెడెంత జాగ్రత్తలు సౌందర్యం మీద ముంచు కొస్తుంది అమ్మాయిలకు. గబగబా ఫేషియల్స్‌, ఫేస్ ప్యాక్స్‌, మొదలగు సందడంతా ఉదయం, సాయంత్రం, రాత్రి చేసేస్తుంటారు. మరి పెళ్ళి అనగానే ఎందుకు అంత తొందర, ఆ తొందరే వద్దు. అతివేగం ప్రమాదం. నాలుగు రోజులు ముందు నుంచి కాకుండా తాంబూలాలు ముందు నుంచే రెగ్యులర్‌ కేర్‌ తీసుకుంటే పెళ్ళి సమయానికి పెళ్లిరోజు నాడు చిన్న ప్యాక్‌ వేసుకొని పెళ్లి పీటల మీద కూర్చున్నా మీరే అందంగా మెరిసిపోతారు. మరి వీటితో పాటు ఏమేమి పాటించాలో తెలుసుకుందామా!

1. పెళ్లికి సంబంధించిన ఏ విషయాలు మీరు ఆలోచించకండి. అలాగే మీ పెద్దల మాటలు, పట్టింపులను లైట్‌గా తీసుకోండి. ఇవన్నీ పెళ్లిలో మామూలే. తెలిసి, తెలియనితనంతో ఏదేదో ఊహించుకుని బాధపడుతుంటారు. పెళ్లికూతురు లేదా పెళ్లికొడుకు.

2. పెళ్లికి చాలారోజుల ముందు నుంచి జాగ్రత్తలు తీసుకోవడం వల్ల ముఖం ఆకర్షణీయంగా, సౌందర్యవంతంగా ఉంటుంది.

3. అందుకు కేవలం ఫ్రూట్స్‌ ఉపయోగించి చేసిన ఫేస్ ప్యాక్స్‌, మాస్కులే వాడండి.

12 tips for perfect skin care on your wedding

4. ప్రతి రోజూ కళ్ల కింద రోజ్‌వాటర్‌ లో ముంచిన కాటన్‌ క్లాత్‌ ను లేదా కాటన్ బాల్స్ ను ఉంచుకుంటే కళ్లు ఆకర్షణీయంగా ఉండడంతో పాటు కళ్ల కింద నల్లని వలయాలు కనిపించకుండా పోతాయి.

5. సరైన నిద్ర అవసరం. పెళ్లి అనగానే సహజంగా అందరికి ఫోన్స్‌ చేయటం బిజి బిజిగా అయిపోతారు. దానికి తోడు గంటలు గంటల కొద్ది అబ్బాయి, అమ్మాయిల ఫోన్‌ సంభాషణ. అలాంటి వాటిని తగ్గించటం లేదా స్వస్తి చెప్పి వేళకి పడుకొనేలా చూడండి.

6. ఫేస్‌ క్లెన్సర్‌లు కాంతివంతం, సహజమైన మెరుపును చర్మానికి ఇస్తుంది. దానితో పాటు మసాజ్‌ వల్ల రక్తప్రసరణ జరిగి తెలియని నూతన ఉత్సాహం వస్తుంది.

7. ప్రతి రోజూ ఉదయం నిద్ర లేవగానే ఫ్రిజ్‌వాటర్‌ని ముఖం మీద చల్లుకోండి. పొడిచర్మం గలవారు సోప్‌ వాడండి.

8. ఆయిలీ చర్మం గలవాళ్లు ఓట్స్‌ పిండిని, నిమ్మపండు రసంని కలిపి పేస్ట్‌ లా తయారుచేసుకుని దానిని ముఖానికి బాగా స్ర్కబ్ చేయాలి. ఇలా చేయటం వల్ల మొటిమలు రాకుండా వుంటాయి.

9. ఇక ముఖ్యంగా ఆహారంలో జాగ్రత్తలు వేపుడు కూరలకు, నూనెపదార్థాలకు దూరంగా ఉండడమే మంచిది. ఉదయం లేవగానే నిమ్మరసం, తేనెలను కలిపి తాగండి.

10. అలాగే చేతివేళ్ల విషయంలో జాగ్రత్తలు పాటించండి. వంటపాత్రలు కడగటం, బట్టలు ఉతకడం లాంటి వాటిని చేయవద్దు. వేళ్ల ఆకృతి చక్కగా ఉండాలంటే గోళ్లు నీట్‌గా పద్ధతిగా అందంగా కట్‌ చేసుకోండి.
రాత్రిపూట వేళ్లకి, చేతులకి, పెదాలకి కోల్డ్‌క్రీమ్‌ అప్లయ్ చేయండి.

11. పెళ్లికి ముందు రోజుల్లో, ప్రతిరోజూ కొద్దిగా పంచదారని తీసుకుని అందులో నిమ్మరసం వేసుకొని రెండు చేతులను బాగా స్ర్కబ్ చేయండి. పంచదారా కరిగేవరకూ ఇలా చేస్తే చేతివేళ్ల చర్మానికి మెరుపు వస్తుంది. తేనెతో కూడా ఇలా చెయ్చొచ్చు.

12. ప్రతి రోజూ రాత్రి నిద్రపోయే ముందు వేడిపాలు తీసుకోండి. పెళ్లి ఇంకా అయిదారు రోజులు ఉందనగా పెళ్లి దగ్గర పడే కొద్ది ఎంత వద్దనుకున్నా ఏదో తెలియని ఉద్వేగం ఆవహిస్తుంటుంది. అలాంటప్పుడు రోజుటిలా నిద్రరాదు. వేడిపాలు తీసుకోవటం వల్ల నిద్ర త్వరగా వస్తుంది. ఈ చిన్న చిన్న చిట్కాలు పాటించడం వల్ల పెళ్ళి సౌందర్య ఉట్టి పడుతుంటుంది.

English summary

12 tips for perfect skin care on your wedding | పెళ్ళికి ముస్తాబు ఇలా...!

Here is a simple countdown list with some wedding tips to help you make sure that your skin looks as flawless as you would like your wedding day to be and some skin care products to help! Don't forget to plan for your glowing bridal skin ahead of time!
Story first published: Saturday, February 16, 2013, 12:40 [IST]
Desktop Bottom Promotion