For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

యవ్వనంగా ఉండాలంటే ఇటువంటి పనులు చేయకూడదు..

By Super
|

సౌందర్యం విషయంలో అనేక కాస్మొటిక్స్ కోసం మరియు సలోన్ ట్రీట్మెంట్ల కోసం అధిక మొత్తంలో డబ్బు ఖర్చు చేసి ఉంటారు? ప్రయోజనంలేకపోయినా, మీరు ఇంకా యవ్వనం కోసం ఇంకా ప్రయత్నిస్తున్నారా?అయితే, మిమ్మల్ని ఆశ్చర్యపరిచే కొన్ని అంశాల గురించి తప్పకుండా తెలుసుకోవాలి. కొన్ని అలవాట్లు, మీ చర్మాన్నినాశనం చేస్తాయని తెలిస్తే ఆశ్యర్యానికి గురికాక తప్పదు. కాబట్టి, మీ చర్మాన్నియవ్వనంగా మరియు అందంగా ఉంచుకోవడానికి, గుర్తించుకోవల్సిన 13 విషయాలను ఇక్కడ అంధిస్తున్నాం.

మీరు తినాల్సిన ఆహారం ఏంటి:

మీరు తినాల్సిన ఆహారం ఏంటి:

అవును, మీరు తీసుకొనే ఆహారమే మీ చర్మసౌందర్యాన్ని ప్రతిబింబించేలా చేస్తుంది. కాబట్టి మీకు జిడ్డుగల చర్మం మరియు ఆయిల్ స్కిన్ బాధపడుతున్నట్లైతే , ఆయిల్ ఫుడ్స్ మరియు జంక్ ఫుడ్ తినడాన్ని మానుకోండి. యవ్వనంగా ఉండాలనుకుంటే ఆరోగ్యకరమైన మరియు సమతుల్య ఆహారానికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వండి.

బ్లీచింగ్:

బ్లీచింగ్:

మీ చర్మం సౌందర్యంలో బ్లీచింగ్ కోసం ఇంటి వద్ద సమయం లేకపోతే, సలోన్లను సందర్శించి, జాగ్రత్తగా బ్లీచింగ్ ను ఉపయోగించాలి. సెలూన్స్ లో ప్రొఫిషినల్స్ కొన్ని ఫ్యాన్సీ పేర్లును ఎంపిక చేసుకోమని అడుగుతుంటారు. వారు చూపించే అన్ని రకాల బ్రాండ్స్ మీ ముందు పెట్టడంతో మీకు ఏది ఎంపిక చేసుకోవాలో తెలియకపోవచ్చు. కాబట్టి బ్రాండ్స్ ఎంపికలో జాగ్రత్త.

ఒక మృదువైన టవల్ ను మీ వద్ద ఉంచుకోండి:

ఒక మృదువైన టవల్ ను మీ వద్ద ఉంచుకోండి:

మీ చర్మాన్ని ఎల్లప్పుడూ ఒక ఒక మృదువైన మరియు శుభ్రమైన టవల్ తో రుద్ది తుడుచుకోవాలి. ఇంకా ముఖం మీద, మెడ మీద కూడా చాలా సున్నితంగా అప్పుడప్పుడు తుడుస్తుండాలి . మీకు చెమట వల్ల చిరాకు కలిగిస్తుంది కాబట్టి పనివేళలో ఒక ఒక మృదువైన హ్యాండ్ ఖర్చిఫ్ లేదా చిన్న టవల్ ను మీ వద్ద పెట్టుకోవాలి .

శీతాకాలంలో కూడా సన్ శ్రీన్ లోషన్ వ్రాయాలి:

శీతాకాలంలో కూడా సన్ శ్రీన్ లోషన్ వ్రాయాలి:

సన్ స్ర్కీన్ లోషన్ ఒక్క వేసవిలో మాత్రమే కాదు, సంవత్సరంలో అన్ని సీజన్ లలోనూ సన్ స్క్రీన్ లోషన్ ఉపయోగించాలి. ఎందుకంటే పగులు పడే కిరణాలలో ఆల్ట్రా వయోలెట్ కిరణాలు ప్రభావం వల్ల చర్మాన్ని రక్షించుకోవడానికి అన్ని వేళలా సన్ స్ర్కీన్ లోషన్ అప్లై చేయడం ఉత్తమం.

విటమిన్ డి లో ఉండటం:

విటమిన్ డి లో ఉండటం:

నిజానికి సూర్యుడు నుండి మనకు అవసరమైనటువంటి మూలకం విటమిన్ డి లభ్యం అవుతుంది. ఇది ఒక సహజ వనరు. ఉదయం సూర్యోదయంలో వాకింగ్ చేయడం వల్ల మీ శరీరం పైన పడే సూర్యకిరణాల వల్ల మీ శరీరం విటమిన్ డి పొందుతుంది. మండుటెండలో కంటే ఉదయం వేళల్లో వచ్చే సూర్యుడు అందంగా మరియు ఔదార్యాన్ని కలిగి ఉంటాడు.

ధూమపానంకు గుడ్ బై చెప్పండి:

ధూమపానంకు గుడ్ బై చెప్పండి:

ధూమపానంకు అలవాటు పడితే, ఇటు ఆరోగ్యపరంగానే కాదు, సౌందర్యపరంగాను చాలా నష్టం జరుగుతుంది. ధూమపానం వల్ల వయస్సు మీద పడినట్లు, చిన్న వయస్సులోనే పెద్దగా కనబడేలా ప్రీమెచ్యుర్ ఏజింగ్ , ముడుతలు, బోదకళ్ళు, చర్మవ్యాధులకు, చర్మ క్యాన్సర్లకు దారితీస్తుంది.

నిద్రించడానికి ముందు మేకప్ ను తొలగించాలి:

నిద్రించడానికి ముందు మేకప్ ను తొలగించాలి:

ఎల్లప్పుడు చర్మానికి గాలి తగిలే విధంగా ఉంచాలి. కాబట్టి, నిద్రించే ముందు తప్పనిసరిగా మేకప్ తొలగించుకోవాలి. మేకప్ తో అలాగే నిద్రించడం వల్ల మీ చర్మం డీహైడ్రేషన్ కు గురిఅవుతుంది. దాంతో మీ చర్మంలో నూనె ఉత్పత్తి కి చర్మం దారితీస్తుంది. ఒక జిడ్డు మొహంతో నిద్రలేవడానికి కారణం అవుతుంది. కాబట్టి బయట నుండి ఇంటికి చేరుకోగానే మేకప్ ను తొలగించాలి.

మేకప్ తొలగింపు ప్యాడ్స్ ను ఉపయోగించాలి:

మేకప్ తొలగింపు ప్యాడ్స్ ను ఉపయోగించాలి:

మేకప్ తొలగించుకోవడానికి కాటన్ ను ఉపయోగించాలి. కాటన్ ప్యాడ్స్ మీద మేకప్ రిమూవర్ వేసి శుభ్రం చేసుకోవాలి. మేకప్ తొలగింపు ప్యాడ్స్ ను ఉపయోగించడం వల్ల పూర్తిగా, శుభ్రంగా తొలగింపబడుతుంది. మేకప్ ప్యాడ్స్ ఉపయోగించి శుభ్రపరచుకొన్న తర్వాత చల్లటి నీటితో ముఖంను శుభ్రం చేసుకోవాలి.

షేవింగ్ :

షేవింగ్ :

చర్మం మీద రేజర్లు ఉపయోగించడానికి ముందు షేవింగ్ జెల్ లేదా షేవింగ్ క్రీములు తప్పనిసరిగా ఉపయోగించాలి. ఎల్లప్పుడు షేవింగ్ చేసేటప్పుడు హెయిర్ గ్రోత్ ఏవైపు నుండి మొదలవుతుందో ఆ వైపునుండి షేవ్ చేయాలి. వ్యతిరేకంగా కాదు.

ఫ్రీ మేకప్ కోసం వెళ్ళద్దండి:

ఫ్రీ మేకప్ కోసం వెళ్ళద్దండి:

ఇది ఎంత కష్టమో మనకు తెలుసు, అప్పుడప్పుడే నేర్చుకొనేవారు వారి ప్రయోగం కోసం మనల్ని వాడుకుంటారు. అలాంటి ప్రదేశాలకు వెళ్ళే ముందు ఒక సారి ఆలోచించండి. మార్కెట్లో బ్యూటీ ప్రొడక్ట్స్ కొనే ముందు అవి చర్మానికి ఎంత వరకూ మేలు చేస్తాయి లేదా హాని కలిగిస్తాయో తెలుసుకొని మరీ కొనాలి. కొత్త బ్రాండ్స్ మరియు పరీక్షించని ఉత్పత్తులు మీ చర్మానికి చాలా హానికరం.

అన్ని రకాల ఫ్యాబ్రిక్స్ (దుస్తులు )మీకోసం కాకపోవచ్చు:

అన్ని రకాల ఫ్యాబ్రిక్స్ (దుస్తులు )మీకోసం కాకపోవచ్చు:

ఖరీదైన దుస్తులు మీ వంటి మీద అంత మంచి అనుభూతిని కల్పించకపోవచ్చు. అటువంటప్పుడు మీరు వేసుకొనేందుకు ఒక లోడ్ దుస్తులు తెచ్చుకోనవసరం లేదు. అన్ని రకాల ఫ్రాబ్రిక్స్ స్కిన్ ఫ్రెండ్లీ దుస్తులు కాదు. మీరు కొత్త బట్టలు ధరించే ముందు మొదట వాటిని వాష్ చేసి వేసుకోవాలని సలహా.

పెళ్ళి దగ్గరకొచ్చినప్పుడు బ్రైడల్ ప్యాక్ చేయకూడదు:

పెళ్ళి దగ్గరకొచ్చినప్పుడు బ్రైడల్ ప్యాక్ చేయకూడదు:

బ్రైడల్ స్పా ప్యాకేజ్ లు చాలా ఆకర్షణీయంగా కనిపించవచ్చు, కానీ చివర నిముషంలో వాటని పొందాలనుకోకూడదు. కొన్ని బ్రైడల్ సలూన్స్ లోనూ అనుభం ఉండకపోవచ్చు. మరియు వారు మీకు ఉపయోగించే అన్ని రకాల ఉత్పత్తులు మీ చర్మంకు సరిపోకపోవచ్చు, వాటిలో కొన్ని మీ చర్మానికి హాని కలిగించవచ్చు. కాబట్టి పెళ్ళిదగ్గరపడినప్పుడు చివరి నిముషంలో బ్రైడల్ ప్యాకేజ్ అదనపు ప్యాకేజిల జోలీకి పోకూడదు.

స్కిన్ ప్యాక్స్ మరియు స్ర్కబ్స్:

స్కిన్ ప్యాక్స్ మరియు స్ర్కబ్స్:

మీ ముఖానికి స్ర్కబ్బింగ్ కానీ, స్కిన్ ప్యాక్ కానీ ఉపయోగించినట్లైతే , వెంటనే మీరు బయట సూర్యకాంతిలోనికి వెళ్ళకూడదు. అలా వెళ్ళాల్సి వస్తే స్కిన్ ప్యాక్ లేదా స్ర్కబ్ చేసిన తర్వాత ఏదైనా క్రీమ్ లేదా లోషన్ అప్లై చేయాలి.

ఇప్పుడు , కొన్ని అలవాట్లను దూరం చేసుకొన్నట్లైతే మీ చర్మాన్ని సున్నితంగా మరియు ప్రకాశవంతంగా ఉంచుతుంది . మీ చర్మాన్ని ఎల్లప్పుడు యవ్వనంగా మరియు అందంగా , నవ్వుతున్నట్లు కోరుకొనేవారేతే ఈ సింపుల్ చిట్కాలను అనుసరించండి.

Desktop Bottom Promotion