For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

నల్లని వలయాలను నివారించే 14 బెస్ట్ హోం రెమడీస్

By Super
|

నల్లని వలయాలు అనేవి చాలా మందిని ప్రభావితం చేసే ఒక సాధారణ బ్యూటి సమస్యగా చెప్పవచ్చు. ఇది పురుషులు మరియు మహిళలు ఇద్దరిని ప్రభావితము చేస్తుంది. కానీ మహిళల్లో మరింత ఎక్కువగా ఉంటుంది.

ముఖం యొక్క ఇతర ప్రాంతాల్లో ఉండే చర్మం కంటే కళ్ళు చుట్టూ ఉండే చర్మం చాలా సున్నితంగా మరియు పలుచగా ఉంటుంది. కాబట్టి అదనపు జాగ్రత్త అవసరం.

కంటి చుట్టూ నల్లని వలయాలు రావటానికి అనేక కారణాలు ఉన్నాయి. ఇది అలసిపోవుట వలన మరియు వంశపారంపర్యంగా వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఈ బ్యూటి సమస్యను నివారించడానికి కొన్ని చిట్కాలు ఇక్కడ ఉన్నాయి.

నల్లని వలయాలను నివారించే ఉత్తమ చిట్కాలు

నల్లని వలయాలను నివారించే ఉత్తమ చిట్కాలు

నల్లని వలయాలు చిన్న వయసులోనే ప్రారంభమవుతాయి. కానీ వృద్ధులలో మరింత ఎక్కువగా ఉంటాయి. నల్లని వలయాలను నిరోధించడానికి ఉత్తమ మార్గం తాజా పళ్ళు,పెరుగు మరియు మొలకలు, ప్రాసెస్ చేయని ధాన్యాలు,వెన్నతీసిన పాలు,కాటేజ్ జున్ను(పనీర్)​​,కాయధాన్యాలు మరియు బీన్స్ వంటి ఆరోగ్యకరమైన మరియు సమతుల్య ఆహారం తీసుకోవాలి.

నల్లని వలయాలను నివారించే ఉత్తమ చిట్కాలు

నల్లని వలయాలను నివారించే ఉత్తమ చిట్కాలు

ప్రతి రోజు వ్యాయామం మరియు ప్రాణాయామం చేయుట వలన రక్త ప్రసరణ పెరుగుట, ఆక్సిజనీకరణం,ఒత్తిడి మరియు యాంగ్జైటీ తగ్గుతాయి.

నల్లని వలయాలను నివారించే ఉత్తమ చిట్కాలు

నల్లని వలయాలను నివారించే ఉత్తమ చిట్కాలు

ప్రతి రోజు రాత్రి కనీసం 7 గంటలు నిద్ర అవసరం. ప్రతి రోజు 20 నిమిషాల ధ్యానం చేయాలి. అంతేకాక మృదువైన సంగీతం వింటూ విశ్రాంతి తీసుకోవాలి.

నల్లని వలయాలను నివారించే ఉత్తమ చిట్కాలు

నల్లని వలయాలను నివారించే ఉత్తమ చిట్కాలు

మేకప్ తొలగించడానికి తేలికపాటి టచ్ మరియు సున్నితమైన కదలికల కోసం క్రీమ్ రాయండి. ఈ ప్రాంతంలో మసాజ్ చేయవద్దు. ఎందుకంటే చర్మం బయటకు సాగవచ్చు. మీరు ముఖం మీద మసాజ్ కొరకు మర్దన చేసే ప్రొఫెషనల్ వ్యక్తిని మాత్రమే అనుమతించాలి.

నల్లని వలయాలను నివారించే ఉత్తమ చిట్కాలు

నల్లని వలయాలను నివారించే ఉత్తమ చిట్కాలు

కళ్ళు చుట్టూ ప్రత్యేకంగా రూపొందించిన క్రీమ్ ను రాయాలి. ఈ క్రీమ్ ను 15 నిమిషాల తర్వాత తేమతో కూడిన దూదితో తొలగించవలసి ఉంటుంది. రాత్రి సమయంలో క్రీమ్ ను ఉంచకూడదు. బాదం కలిగిన క్రీమ్ ను ఉపయోగించండి. ఇది చర్మంనకు పోషణ మరియు మంచి కలర్ టోన్ ను ఇస్తుంది. కళ్ళు చుట్టూ ఫేషియల్ మాస్క్ లు వాడకూడదు.

నల్లని వలయాలను నివారించే ఉత్తమ చిట్కాలు

నల్లని వలయాలను నివారించే ఉత్తమ చిట్కాలు

వెచ్చని నీటితో మీ కళ్ళు కడగడం ద్వారా కంటి అలసట నుంచి ఉపశమనం కలుగుతుంది. ఆ తర్వాత చల్లటి నీటితో కడగండి. ఇలా చేయుట వలన కళ్ళ రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది. వాటికి వచ్చే వాపునకు ఉపశమనం కలిగిస్తుంది. అంతేకాక కళ్ళు శుద్ధి మరియు సమస్యల నుండి ఉపశమనం కలిగిస్తుంది.

నల్లని వలయాలను నివారించే ఉత్తమ చిట్కాలు

నల్లని వలయాలను నివారించే ఉత్తమ చిట్కాలు

ప్రతి రోజు కళ్ళ చుట్టూ కీరదోసకాయ రసాన్ని రాసి 15 నిమిషాల తర్వాత మామూలు నీటితో శుభ్రం చేసుకోవాలి.

నల్లని వలయాలను నివారించే ఉత్తమ చిట్కాలు

నల్లని వలయాలను నివారించే ఉత్తమ చిట్కాలు

కీరదోసకాయ రసాన్ని బంగాళాదుంప రసాన్ని సమానంగా తీసుకోని ఆ మిశ్రమాన్ని రాస్తే నల్లని వలయాలు మరియు ఉబ్బు తగ్గుతుంది.

నల్లని వలయాలను నివారించే ఉత్తమ చిట్కాలు

నల్లని వలయాలను నివారించే ఉత్తమ చిట్కాలు

నిమ్మ రసంతో కీరదోసకాయ రసాన్ని సమాన పరిమాణంలో కలపండి. ప్రతి రోజు ఈ మిశ్రమాన్ని రాసి 15 నిమిషాలు తర్వాత నీటితో కడగండి.

నల్లని వలయాలను నివారించే ఉత్తమ చిట్కాలు

నల్లని వలయాలను నివారించే ఉత్తమ చిట్కాలు

టమోటా రసం కూడా చాలా మంచిది. ప్రతి రోజు టమోటా రసం రాసిన 20 నిమిషాల తర్వాత శుభ్రం చేయాలి. చల్లని నీరు లేదా చల్లని పాలను తీసుకోని కళ్ళను మూసుకొని రాసి 10 నిమిషాల తర్వాత శుభ్రం చేయాలి.

నల్లని వలయాలను నివారించే ఉత్తమ చిట్కాలు

నల్లని వలయాలను నివారించే ఉత్తమ చిట్కాలు

చల్లని టీ సంచులను మీ కళ్ళ కింద ప్రాంతంలో పెట్టడం వలన మీ కళ్ళ క్రింద ఉబ్బు తగ్గుతుంది.

నల్లని వలయాలను నివారించే ఉత్తమ చిట్కాలు

నల్లని వలయాలను నివారించే ఉత్తమ చిట్కాలు

బాదం నూనె నల్లని వలయాలకు ఉత్తమంగా పనిచేస్తుంది. పడుకొనే ముందు మీ కళ్ళ చుట్టూ ఉన్న నల్లని ప్రాంతంలో పాలు కలిపిన బాదం పేస్ట్ ను రాయాలి. మరుసటి రోజు ఉదయం చల్లటి నీటితో కడగాలి. ఈ 'చికిత్స' వలన మీ చర్మం పైన నలుపు తగ్గుతుంది.

నల్లని వలయాలను నివారించే ఉత్తమ చిట్కాలు

నల్లని వలయాలను నివారించే ఉత్తమ చిట్కాలు

పుదీనా ఆకులు చాలా బాగా పనిచేస్తాయి. మీ కళ్ళు కింద పుదీనా ఆకుల పేస్ట్ ను రాయాలి. 10-15 నిమిషాల తర్వాత శుభ్రం చేసుకోవాలి.

నల్లని వలయాలను నివారించే ఉత్తమ చిట్కాలు

నల్లని వలయాలను నివారించే ఉత్తమ చిట్కాలు

నారింజ రసాన్ని వారంలో మూడు సార్లు రాసి 20 నిమిషాల తర్వాత శుభ్రం చేసుకోవాలి.

English summary

14 best home remedies for dark circles

The skin around the eyes is far delicate and thinner than the skin on other areas of the face, so it needs extra care.
Desktop Bottom Promotion