For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

నిమ్మ రసంతో 15 ఆశ్చర్యకరమైన బ్యూటీ బెనిఫిట్స్..!

|

నిమ్మరసంతో కొన్ని అద్భుతాలు జరుగుతాయంటే ఆశ్చర్యం కలగక మానదు. ఎందుకంటే, నిమ్మరసం అనేక బ్యూటీ బెనిఫిట్స్ మరియు హెల్త్ బెనిఫిట్స్ కలిగి ఉన్నాయి కాబట్టి. అయితే, నిమ్మరసాన్ని హెల్తీ డ్రింక్ గా తాగడం, సలాడ్స్ మీద గార్నిష్ గా రుచి అంధించడానికి మాత్రమే కాదు, అనేక ఆరోగ్య సౌందర్య ప్రయోజనాలను అంధించడంలో అద్భుతంగా పనిచేస్తుంది.

ఆరోగ్యపరంగా వివిధ రకాలుగా ఉపయోగపడే నిమ్మరసంలో అనేక సౌందర్య గుణాలు కూడా ఉన్నాయి. నిమ్మరసంలో సిట్రస్ యాసిడ్ పుష్కలంగా ఉండటం వల్ల ఇది శరీరానికి మరియు చర్మానికి ఆశ్చర్య కరమైన ప్రయోజనాలను కలిగిస్తుంది. అవేంటో మీరు తెలుసుకోవాలంటే ఈ క్రింది వ్యాసంను పరిశీలించాల్సిందే...

సహజంగానే కాంతివంతమైన చర్మ సౌందర్యాన్ని పొందవచ్చు:

సహజంగానే కాంతివంతమైన చర్మ సౌందర్యాన్ని పొందవచ్చు:

నిమ్మరసంలో సహజ బ్లీచింగ్ గుణాలు కలిగి ఉన్నాయి. ఇది చర్మాన్నికి చాలా మంచిది. మరియు ఇది చర్మానికి ఒక నేచురల్ లైటనింగ్ ఏజెంట్ గా కూడా పనిచేస్తుంది. అందువల్లే నిమ్మరసాన్ని అనేక వాణిజ్య మరయు హోం మేడ్ బ్యూటీ పరిష్కారాల్లో ఉపయోగిస్తుంటారు. ముఖం, లేదా చర్మం మీద ఏర్పడ్డ, డార్క్ స్పాట్స్, నల్లమచ్చలు, పిగ్మెంటేషన్ తొలగించుకోవడానికి లేదా కనబడనియ్యకుండా చేయడానికి నిమ్మరసాన్ని వివిధ ఫేస్ ప్యాక్ లలో లేదా చర్మానికి నేరుగా అప్లై చేయడం జరుగుతుంది.

నిమ్మరసంతో యవ్వనంగా కనిపించవచ్చు:

నిమ్మరసంతో యవ్వనంగా కనిపించవచ్చు:

నిమ్మరసం మీలో వయస్సు పైబడే లక్షణాలను, వయస్సు పైబడే మచ్చలను వదిలించుకోవడానికి సహాయపడుతుంది. చర్మం మీద ఏర్పడ్డ ముడుతలతో పోరాడటానికి సహాయపడే యాంటీఆక్సిడెంట్స్ నిమ్మరసంలో పుష్కలంగా ఉన్నాయి. ముడుతులు రాకుండా వ్యతిరేకించే ఫేస్ ప్యాక్ లో కొన్ని చుక్కల నిమ్మరసం మరియు బాదం నూనె కూడా వేసి బాగా మకి్స్ చేసి, ముఖానికి ప్యాక్ లా వేసుకోవాలి. 20నిముషాల తర్వాత ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి. వయస్సు మీద పడుతున్న లక్షణాలు ముఖంలో కనబడుతుంటే నిమ్మరసం మరియు ఆపిల్ సైడర్ వెనిగర్ సమంగా తీసుకొని, బాగా మిక్స్ చేసి ముఖానికి అప్లై చేయాలి.

జిడ్డు చర్మాన్ని నివారిస్తుంది:

జిడ్డు చర్మాన్ని నివారిస్తుంది:

మొటిమలు, బ్లాక్ హెడ్స్, మరియు ఇతర చర్మ సమస్యలకు ముఖ్య కారణం జిడ్డు చర్మం. అటువంటి చర్మానికి నిమ్మరసం అద్భుతంగా పనిచేస్తుంది. నిమ్మరసంలోని సిట్రిక్ యాసిడ్ చర్మంలోని నూనె గ్రంధులను, కణాలను విచ్ఛిన్నం చేయడానికి సహాయపడుతుంది., మరియు చర్మం మృదుత్వాన్ని పొందుతుంది. నునుపుగా ఉండేలా సహాయపడుతుంది. అందుకు చేయాల్సిందల్లా నిమ్మరసంలో కొన్ని చుక్కల నీళ్ళు కలిపి, కాటన్ బాల్స్ ను నీటిలో నిమ్మరసంలో డిప్ చేసి ముఖానికి అప్లై చేయాలి. దీన్ని ప్రతి రోజూ చేయడం వల్ల జిడ్డు చర్మానికి చెక్ పెట్టవచ్చు.

చర్మంలో చైతన్యం మరియు మృదుత్వాన్ని నింపుతుంది:

చర్మంలో చైతన్యం మరియు మృదుత్వాన్ని నింపుతుంది:

తాజాగా ఉండే నిమ్మరసం మీ ముఖ చర్మాన్ని మృదువుగా మరియు తాజాగా ఉంచడానికి సహాయపడుతుంది. ఒక మృదువైన మరియు ప్రకాశవంతమైన చర్మాన్ని పొందాలనుకుంటే ముఖం, మోకాళ్ళు, మరియు మోచేతులకు నిమ్మరసాన్ని అప్లై చేయాలి. ఇంకా నిమ్మ తొక్కలను ఉపయోగించి చర్మం మీద రుద్దడంవల్ల నేచురల్ టానిక్ లా పనిచేస్తుంది మరియు చర్మాన్ని శుభ్రపరుస్తుంది. నిర్జీవమైన మరియు పొడి చర్మాన్ని తగ్గించి చర్మంలో చైతన్యం నింపడానికి నిమ్మకాయ నూనెను ఉపయోగిస్తారు.

అందమైన పెదాలు:

అందమైన పెదాలు:

నిమ్మరసం పెదాలకు కూడా అద్భుతంగా ఉపయోగపడుతుంది. పగిలిన, పొడి బారిన మరియు గాయం అయిన పెదాలను నివారించాలనుకుంటే నిమ్మరసాన్ని పెదాలకు రాయాలి. మిల్క్ క్రీమ్ మరియు తేనె, నిమ్మరసంను మిక్స్ చేసి, ఈ నేచురల్ లిప్ బామ్ ను పెదాలకు రాయడం వల్ల పెదాలకు మాయిశ్చరైజర్ గా ఉపయోగపడుతుంది. మరియు ఇది పగుళ్ళను నివారిస్తుంది.

చంకల్లో నలుపుదనాన్ని తగ్గించడం కోసం:

చంకల్లో నలుపుదనాన్ని తగ్గించడం కోసం:

మీరు ఏదైనా పార్టీకి లేదా స్నేహితులతో కలవడానికి వెళ్ళవల్సి వచ్చినప్పుడు ముఖంలో, చేతుల మీద, చంకల్లో నల్లగా ఉన్న చర్మం మీకు, ఎదుటి వారికి కూడా ఇబ్బంది కలిగించవచ్చు. చెమట,వేడి మరియు కాలుష్యం వల్ల చంకల్లో నల్లగా మారడం మరియు శరీరం నుండి దుర్వాసనం కలగడానికి దారితీస్తుంది. ఈ సమస్య నుండి బయటపడాలంటే కొన్ని చుక్కల నిమ్మరసంలో కాటన్ బాల్స్ ను డిప్ చేసి లేదా నిమ్మకాయను మద్యకు కట్ చేసి, మీ చంకల్లో రుద్దాలి. !అంతే డార్క్ చర్మం కాస్త కాంతివంతంగా, మారి మీరు స్లీవ్ లెస్ దుస్తులు ధరించి కూడా వెళ్ళవచ్చు.

బలమైన మరియు అందమైన గోర్లు:

బలమైన మరియు అందమైన గోర్లు:

పెళుసైన మరియు పసుపు గోర్లుతో బాధపడుతున్నారా?బాధపడనవసరం లేదు. ఎందుకుంటే మీ బ్యూటీ కిట్ లో నిమ్మకాయ దీర్ఘకాలం నుండి ఉందికాబట్టి. కొంత నిమ్మరసంలో మీ వేళ్ళను డిప్ చేయడం వల్ల గోర్లను బలోపేతం చేస్తుంది. మరియు ఇది గోళ్ళ యొక్క డల్ నెస్ మరియు పసుపు వర్ణంను తొలగించడానికి సహాయపుడుతుంది.

మొటిమలకు శాశ్వత పరిష్కారం:

మొటిమలకు శాశ్వత పరిష్కారం:

నిమ్మరసం మొటిమలను నివారించడంలో మరియు ఇతర చర్మ సమస్యలను నివారించడంలో చాలా ప్రభావవంతంగా పనిచేస్తుంది. నిమ్మకాయలోని విటమిన్ సి మీ చర్మాన్ని ఆరోగ్యంగా మరియు మెరిసేలా ఉంచుతుంది. చర్మంలోని బ్యాక్టిరియాను నిరోధించడానికి మరియు ఇతర చర్మ సమస్యలను వధించడానికి నిమ్మకాయలోని ఆల్కలైన్ బాగా సహాయపడుతుంది.

అందమైన చేతుల కోసం నిమ్మకాయ:

అందమైన చేతుల కోసం నిమ్మకాయ:

ముఖం తర్వాత బహిర్గంతం అయ్యే ప్రదేశం చేతులు, కాబట్టి మీరు చేతుల మీద కూడా తగినంత శ్రద్ద తీసుకోవడం చాలా అవసరం. అందుకు కొద్దిగా నిమ్మరసం మరియు తేనె మరయు బాదం ఆయిల్ తీసుకొని బాగా మిక్స్ చేసి చేతులకు మసాజ్ చేయాలి. ఇలా రెగ్యులర్ గా చేయడం వల్ల మీ చేతులు మృదువుగా మరియు శుభ్రంగా ఉంచడానికి బాగా సహాయపడుతుంది. అలాగే మోచేతుల నలుపుదన్నాన్ని వదిలిస్తుంది.

స్లిమ్ గా మార్చడంలో పరమాధ్భుతంగా ప్రయోజనాలను కలిగిస్తుంది:

స్లిమ్ గా మార్చడంలో పరమాధ్భుతంగా ప్రయోజనాలను కలిగిస్తుంది:

నిమ్మరసంలో పెక్టిన్ ఫైబర్ పుష్కలంగా ఉంది. ఇది ఆకలి కోరికలను తగ్గించడానికి బాగా సహాయపడుతుంది. పెక్టిన్ కలిగిన ఆహారాలు ఆరోగ్యానికి చాలా మంచిది. ఎందుకంటే ఇవి లోక్యాలరీలను మరియు లోఫ్యాట్ ను కలిగి ఉంటాయి. మరియు అవి బ్లడ్ షుగర్ మరియు ఇన్సులిన్ లెవల్స్ ను సమతుల్యంగా ఉంచుతుంది. నిమ్మరసం, వేడినీళ్ళతో తీసుకొన్నప్పుడు, శరీరంలో జీవక్రియలను వేగవంతం చేస్తుంది. ఇది మీ శరీరంలోని క్యాలరీలన్ కరిగించడానికి మరయిు బరువు తగ్గించడానికి బాగా సహాయపడుతుంది.

నోటిని తాజాగా ఉంచి, దంతాలను శుభ్రంగా ఉంచుతుంది:

నోటిని తాజాగా ఉంచి, దంతాలను శుభ్రంగా ఉంచుతుంది:

నిమ్మరసం చెడు శ్వాస(చెడు వాసనను) దూరంగా ఉంచడానికి సహాయపడుతుంది. ఇంకా పళ్ళ నొప్పులను నుండి మరియు చిగురు వాపులను నుండి ఉపశమనం కలిగిస్తుంది. తెలుపు మరియు మెరిసే దంతాలు పొందడానికి నిమ్మతొక్కతో చిటికెడు సాల్ట్, చిటికెడు బేకింగ్ సోడా వేసి పళ్ళు రుద్దాలి.

చుండ్రును వదిలిస్తుంది:

చుండ్రును వదిలిస్తుంది:

మీరు చుండ్రు మరియు దురదతో ఇబ్బంది పడుతున్నట్లు భావిస్తున్నారా?అందుకు ఆందోళన చెందాల్సిన పనిలేదు. ఇటువంటి సమస్యలను దూరంగా ఉంచడానికి నిమ్మతొక్క బాగా సహాయపడుతుంది. నిమ్మతొక్క లేదా నిమ్మరసంతో తల మాడుకు మర్ధన చేయాలి. మర్ధన చేసిన తర్వాత కొన్ని నిముషాలు అలాగే ఉంచి తర్వాత తలస్నానం చేయాల్సి ఉంటుంది.

మీ జుట్టును హైలైట్ చేయడం లేదా జుట్టు రంగను తొలగించడానికి సహాయపడుతుంది:

మీ జుట్టును హైలైట్ చేయడం లేదా జుట్టు రంగను తొలగించడానికి సహాయపడుతుంది:

మీ జుట్టును హైలైట్ గా మార్చుకోవాలన్నా మరియు హెయిర్ కలర్ ను తొలగించుకోవాలన్నా, నేచురల్ పద్ధతుల్లో నిమ్మరసాన్ని ఉపయోగించుకోవచ్చు. నిమ్మరసాన్ని తలకు, కేశాలకు బాగా పట్టించి అరగంట పాటు అలాగే ఉంచేయాలి. ఇది సహజంగా హైలైట్ అవుతుంది . నిమ్మరసంలోని సిట్రస్ యాసిడ్ కేశాల రంగును నేచురల్ గా పొందడానికి సహాయపడుతుంది.

మంచి జీర్ణక్రియ కోసం:

మంచి జీర్ణక్రియ కోసం:

సరైన, తేలికపాటి జీర్ణక్రియ మీ శరీరంలో జరగలేదని మీరు భావిస్తున్నట్లైతే, అందుకు నిమ్మరసం చాలా ఎఫెక్టివ్ గా సహాయపడుతుంది. ఒక గ్లాసు గోరువెచ్చని నీటికి కొద్దిగా నిమ్మరసం మరియు కొద్దిగా తేనె మిక్స్ చేసి ఉదయం పరగడుపున తాగడం వల్ల శరీరంలో అనవసరమైన వ్యర్థాన్ని విషాన్ని బయటకు ఫ్లష్ అవుట్ చేస్తుంది. ఆరోగ్యకరమైన జీర్ణ వ్యవస్థ మెరిసేటటువంటి చర్మ సౌందర్యాన్ని అంధిస్తుంది.

నిమ్మకాయలోని ఆరోగ్య ప్రయోజనాలు:

నిమ్మకాయలోని ఆరోగ్య ప్రయోజనాలు:

నిమ్మరసంతో అనేక ఆరోగ్యప్రయోజనాలున్నాయి. మీ జీర్ణక్రియను కంట్రోల్లో ఉంచడంతో పాటు, గొంతు నొప్పి, హార్ట్ బర్న్, చర్మం దురద వంటి సమస్యల నుండి ఉపశమనం కలిగిస్తుంది. మరియు గాయాలను మాన్పడానికి మరియు ఎముకలు మరియు కణజాలాల కనెక్టివిటిని ఆరోగ్యంగా ఉంచడానికి బాగా సహాయపడుతుంది.

మానసిక స్థితికి తగినంత శక్తి

మానసిక స్థితికి తగినంత శక్తి

శరీరం యొక్క తేజం పెంచడానికి మరియు శక్తిని అంధించడానికి నిమ్మరసం బాగా సహాయపడుతుంది. నిమ్మతైలంలోని సువాసన, మీ మానసిక స్థితికి తగినంత శక్తిని కలిగిస్తుంది. దాంతో ఒత్తిడి మరియు వ్యాకులత నుండి విశ్రాంతి కల్పిస్తుంది.

English summary

15 Surprising Beauty Benefits of Lemon

Lemon has been a miracle cure since ages. However, other than being a part of your drink or a squeeze over that healthy salad, this citrus fruit is a sure shot cure for several other things.
Story first published: Tuesday, August 20, 2013, 17:38 [IST]
Desktop Bottom Promotion