For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఐదే..ఐదు నిమిషాల్లో బుగ్గల్లో గులాబీ మెరుపులు...!

|

ప్రతి మహిళా తమ అందం గురించి చాలా జాగ్రత్తలు తీసుకుంటారు. ముఖ్యంగా ముఖానికి పెదాలకు, కళ్ళకు చాలా ప్రాధాన్యత ఇస్తారు. అలాగే బుగ్గలు కూడా అందంగా ఉండాలని కోరుకుంటారు. ఎర్రగా గులాబీ వర్ణంలో ఉండే బుగ్గలు స్టాండర్డ్ బ్యూటీ మాత్రమే కాదు, ఆరోగ్యానికి చిహ్నం కూడా . సాధారణంగా మనం ఒక తప్పు చేస్తుంటాం. బుగ్గలకు ఫెయిర్ నెస్ క్రీమ్ పౌడర్ లేదా పేల్ స్కిన్ టోన్ ను ఉపయోగిస్తుంటాం . ఒక రకంగా ఇది ఆరోగ్యానికి మరియు తాజా లుక్ ను అంధించడానికి సహాయపడుతుంది. మీకు నిర్జీవమైన స్కిన్ టోన్ కలిగి ఉంటే, మరియు మీ శరీరంలో ఐరన్ లోపిస్తే ఇలా నిర్జీవమైన చర్మంతో కనబడుతారు.

5 Minute Tricks To Get Rosy Cheeks

మీకు కనుకు పింక్ కలర్ స్కిన్ టోన్ ఉండే గులాబీవర్ణం బుగ్గలు తాజా అందాన్నిస్తాయి. అయితే ప్రతి రోజూ ఇలాగే తాజాగా కనబడరు. ఎందుకంటే ఎప్పుడైనా మీరు లేటుగా నిద్రలేవడం లేదా నిద్రలేచే మూడ్ సరిగా లేకున్నా లేదా అలసటగా ఉన్నా బుగ్గల్లో మెరుపులు మాయం అవుతాయి. అలాంటి రోజుల్లో మీ బుగ్గల్లో తాజాదనంతో పాటు గులాబీ మెరుపు సహజంగా పొందాలంటే ఈ క్రింది చిట్కాలు పాటించండి . మేకప్ లేకుండానే 5నిముషాల్లో గులాబీ బుగ్గలను మీ సొంతం చేసుకోవచ్చు.

బుగ్గను గిల్లండి : ఇది పాతపద్దతి . బుగ్గను గిల్లితే చాలు బుగ్గ కందిపోయి. గులాబీ వర్ణంలో కనబడుతుంది. విక్టోరియన్ ఎరా ఈ ట్రిక్స్ ను ఉపయోగించి వారు బాల్ లేదా పార్టీకి వేళ్ళేవారు.

గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవడం: గోరువెచ్చని నీటితో ముఖాన్ని శుభ్రం చేసుకోవడం వల్ల, మీ ముఖంలోని రక్తం అంతా బుగ్గలదగ్గర చేరుతుంది. ఇది జస్ట్ రెండే నిముషాల్లో మార్పు తీసుకొస్తుంది. మిమ్మల్ని తాజాగా చేస్తుంది.

స్టీమ్ బాత్: మీకు అధనంగా మరో ఐదు నిముషాల సమయం ఉండే గోరువెచ్చని నీటితో స్టీమ్ హెడ్ బాత్ ను చేసుకోండి . ఇలా చేయడం వల్ల ఇది మిమ్మల్ని ఫ్రెష్ లుక్ తో కనబడేలా చేస్తుంది .

హాట్ చాక్లెట్ త్రాగండి: ఎప్పుడైతే హాట్ చాక్లెట్ త్రాగుతారో, మీ శరీరంలో వెచ్చదనాన్ని పెంచుతుంది. ఈ వెచ్చదనం మీ బుగ్గలో గులాబీ మెరుపులను తీసుకొస్తుంది.

ఒక గ్లాస్ వైన్: ఒక గ్లాస్ రెడ్ వైన్ త్రాగడం వల్ల శరీరంలోపల వేడిపుడుతుంది. ఎప్పుడైతే ఒక గ్లాస్ వైన్ త్రాగుతారో మీ బుగ్గలు తాజాగా ఫ్రెష్ లుక్ తో గులాబీ మెరుపుతో ఉబ్బుఉంటాయి.

ఫేషియల్ వ్యాయామం: మీ ముఖానికి ఫేషియల్ అప్లైచేసి, దాన్ని తీసేటప్పడు బుగ్గమీద చర్మ కొద్దిగా సాగడం వల్ల , ఈ ఫేషియల్ వ్యాయామం వల్ల బుగ్గల వద్ద బ్లడ్ చేరుకొని బుగ్గలు ఎర్రగా కందిపోతాయి.

మీకు కనున నిర్జీవమైన స్కిన్ టోన్ కలిగి ఉన్నట్లైతే ఈ సింపుల్ చిట్కాలతో బుగ్గల్లో గులాబీ మెరుపులను పొందవచ్చు.

English summary

5 Minute Tricks To Get Rosy Cheeks | ఐదే..ఐదు నిమిషాల్లో బుగ్గల్లో గులాబీ మెరుపులు...!

Every woman wants to have fresh rosy cheeks. It is the definition of beauty that has become a standard benchmark. Rosy cheeks are not just a standard of beauty, but also a sign of good health. Usually we make the mistake of associating rosy cheeks with fairness or pale skin tone. However, it is also a metaphor for good health and a fresh look. If you have pale white skin tone and no iron in your body, you will look sick.
Desktop Bottom Promotion