For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ముక్కుమీద జిడ్డు,ఆయిల్:నివారించేందుకు 6బెస్ట్ టిప్స్

|

ఎల్లప్పుడు అందమైన చుర్మం సౌందర్యం కలిగి ఉండటం ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. అదే అందాన్ని ముక్కు దెబ్బతీస్తే అందం మొత్తం వ్యర్థం అవుతుంది. మీకు జిడ్డు చర్మం(ఆయిల్ స్కిన్) ఉన్నప్పుడు అది మీ ముక్క మీద కూడా చేరుతుంది. దాంతో మీరు నిజంగా సమస్యను ఎదుర్కోవల్సి వస్తుంది. ఆయిల్ ముక్క బ్లాక్ హెడ్స్ కు, మురికి మరియు జిడ్డుగా మారి మీ చర్మాన్ని అనారోగ్యకరంగా కనబడేలా చేస్తుంది. దీన్ని నిర్లక్ష్యం చేయడం వల్ల ముఖ్యం మీద మాత్రమే కాదు, ఇది ముఖం మొత్తం వ్యాప్తి చెందుతుంది. ఇది ఒకేఒక సరిష్కార మార్గం మీరు చర్మాన్ని ,ముక్యంగా ముక్కును జిడ్డులేకుండా , క్లీన్ గా ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలి. అందుకు ఇక్కడ కొన్ని మంచి రెమడీస్ ఉన్నాయి. అవి మీ ఆయిల్ ముక్కను చాలా తేలికగా నివారిస్తాయి .

క్లీన్ గా ఉంచడం ఒక మంత్రం: చాలా మంది చర్మంలో సెబాసియస్ గ్రంథులు ముఖ్యంగా ముఖం ప్రాంతంలో ఉంటాయి , అదీ మీ ముక్కు కూడా ప్రధానం. ముక్కు మీద జిడ్డు తొలగించి మీ ముఖ చర్మాన్ని అందంగా ఉంచుకోవడానికి ఒక ప్రధానమైన చిట్కా చర్మ రంధ్రాలను శుభ్రంగా ఉంచుకోవడం . చర్మ రంధ్రాలు అదనపు నూనెను విడుదల చేస్తాయి మరియు దాంతో మురికి చేరుతుంది. ఈ హానికరమైన టాక్సిన్స్ ను తొలగించడానికి ఒకే ఒక మార్గం చర్మాన్ని రోజంతా శుభ్రంగా ఉంచుకోవడం.

6 Remedies For An Oily Nose

శుభ్రం చేయడానికి నీళ్ళు: ముఖ్యం శుభ్రం చేయడానికి మంచి నీళ్ళతో రోజులో అప్పుడప్పుడు ముఖాన్ని శుభ్రం చేసుకుంటుండాలి . ఇలా ముఖాన్ని నీళ్ళతో కడగడం వల్ల చర్మం శుభ్రపడుతుంది. మురికిని మరియు అధనపు నూనెను తొలగిస్తుంది.అలాగే మీరు స్కిన్ క్లెన్సింగ్ ఉత్పత్తులను కూడా మీ ముఖానికి ఉపయోగించాలి. అయితే వీటిని రోజుకు 2సార్లు మించి ఉపయోగించకూడదు. ఆయిల్ స్కిన్ నివారించడానికి నీళ్ళతో శుభ్రం చేయడం ఒక ఉత్తమ మార్గం.

కిచెన్ రెమెడీ : చర్మంలోని నూనె మరియు మురికిని తొలగించడానికి నిమ్మరసం ఒక మ్యాజిక్ చేస్తుంది. ఒక కాటన్ పాడ్ తీసుకొని దానికికొన్ని చుక్కల నిమ్మరసం వేసి, మీ ఆయిల్ స్కిన్ ను తుడవాలి. ఇలా ప్రతి రోజూ రెండు మూడు సార్లు చేయాలి. ఇది ఆయిల్ ముక్కు సమస్యను నివారిస్తుంది.

తేనె మరియు బాదం : తేనె మరియు బాధం ప్రక్రుతిలో చాలా సులభంగా అందుబాటులో ఉండే పదార్తాలు, మరియు ఇవి చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తాయి . ఒక హోం మేడ్ ఫేషియల్ స్ర్కబ్ కు కొన్ని చుక్కల తేనె మరియు బాదం పౌడర్ మిక్స్ చేసి ముక్కు మీద స్ర్కబ్ చేయడం వల్ల ముక్కు మీద అదనపు నూనె మరియు మురికితో పోరాడి చక్కటి చర్మ సౌందర్యం ఇస్తుంది.

స్ర్కబ్బింగ్ : మీకు ఎక్కువ సమయం లేనప్పుడు, ఒక మంచి ఫేషియల్ స్ర్కబ్ ను కొని, ఒక మంచి ఫేషియల్ స్ర్కబ్ ను కొని, ముఖం మీద నిధానంగా స్క్రబ్ చేయాలి ముఖ్యంగా ముక్క మీద రాసి, మర్ధన చేయాలి. తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేసుకోవడం వల్ల మీరు సున్నితమైన చర్మం మరియు ఆయిల్ ఫ్రీ చర్మం పొందగలు . ఇలా వారంలో 2,3సార్లు చేయడం వల్ల ఉత్తమ ఫలితాలను పొందవచ్చు . ఇది ముక్కు మీద బ్లాక్ హెడ్స్ ను నివారించడానికి కూడా ఉపయోగపడుతుంది.

వెనిగర్ మ్యాజిక్: ఆయిల్ స్కిన్ ను నివారించడంలో వెనిగర్ అద్భుతంగా సహాయపడుతుంది. వెనిగర్ మరియు కొద్దిగా నీళ్ళు మిక్స్ చేసి, అందులో కాటన్ పాడ్స్ ను నానబెట్టి, ముఖం మీద , ముక్కు మీద నిధానంగా రుద్ది, 15నిముషాలు అలాగే ఉంచి తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి.

English summary

6 Remedies For An Oily Nose

While a glowing skin is always prized, flaunting a ‘glowing' nose is not. If you have an oily skin, and most of it accumulates on your nose, you are in real trouble. An oily nose is a storehouse of blackheads, dirt, and grease that makes your skin look unhealthy.
Desktop Bottom Promotion