For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మీ చర్మఛాయను తెల్లగా మార్చే 9 హోం మేడ్ ఫేస్ ప్యాక్స్

|

ప్రతి ఒక్క మహిళా అందుంగా మరియు తెల్లని స్కిన్ టోన్ కలిగి ఉండాలని కోరుకుంటుంది. ముఖ్యంగా మన ఇండియన్ మహిళలకు ఈ కోరిక చాలా ఎక్కువ.!అందుకోసం సౌందర్యంగా కనిపించడం కోసం మరియు మీరు ప్రశంసలు అందుకోవడం కోసం కొన్ని ప్రత్యేకమైన మార్గాలు ఉన్నాయి. మరియు మీకు ఇష్టమైన స్కిన్ టోన్ పొందడానికి అవి హోంమేడ్ వస్తువులు కావచ్చు లేదా మార్కెట్లో ఉన్నవి కావచ్చు.

మార్కెట్లో లభించే బ్యూటీ ప్రొడక్ట్స్ అంత త్వరగా ఫలితాలను ఇవ్వకపోయినా, ఇంట్లో ఉండే బెస్ట్ నేచురల్ బ్యూటీ అద్భుతగా సహాయపడుతాయి. అంతే కాదు చర్మఛాయను మార్చడంతో పాటు, ఫ్యాచ్ లు లేని క్లియర్ స్కిన్ పొందేలా చేస్తాయి. మరియు పిగ్మెంటేషన్ నివారిస్తుంది. హోం మేడ్ ఫేస్ మాస్క్ వల్ల ఎక్కువ ఫలితాలను పొందినట్లు నిపుణులు చెబుతున్నారు.

స్కిన్ వైటనింగ్ ఫేస్ ప్యాక్స్

పాలపొడి మరియు నిమ్మరసం ఫేస్ ప్యాక్ :

పాలపొడి మరియు నిమ్మరసం ఫేస్ ప్యాక్ :

పాల పొడిని, నిమ్మరసంతో మరియు కొద్దిగా తేనెతో మిక్స్ చేసి, చర్మానికి ప్యాక్ వేసుకోవడం వల్ల మంచి ఫలితంట ఉంటుంది. దీన్ని కేవలం పది నిముషాల్లో తయారుచేసి ముఖానికి అప్లై చేయవచ్చు. వేసుకొన్న అరగంట తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా రెగ్యులర్ గా అప్లై చేయడం వల్ల స్కిన్ పిగ్మెంటేషన్ తొలగించి చర్మఛాయను మెరుగుపరుస్తుంది.

ఓట్ మీల్ మరియు పుల్లని పెరుగు:

ఓట్ మీల్ మరియు పుల్లని పెరుగు:

ఓట్ మీల్ ను రాత్రంతా నీటిలో నానబెట్టి, తర్వాత రోజు ఉదయం మెత్తగా గ్రైండ్ చేసి పేస్ట్ చేసి తర్వాత అందులో పుల్లని పెరుగు చేర్చి, ఆ మిశ్రమాన్ని ముఖానికి ప్యాక్ లా వేసుకోవాలి. చర్మం రంగు మార్చడంలో అద్భుత మార్పు కనిపిస్తుంది. కాబట్టి రెగ్యులర్ గా దీన్ని ఉపయోగించండి.

చర్మాన్ని తెల్లగా మార్చే బంగాళదంప గుజ్జు:

చర్మాన్ని తెల్లగా మార్చే బంగాళదంప గుజ్జు:

నిమ్మరంలోలాగే, బంగాళదుంపలో కూడా బ్లీచింగ్ ఏజెంట్స్ పుష్కలంగా ఉన్నాయి. కాబట్టి పొటాటో జ్యూస్ లేదా బంగాళదుంప పేస్ట్ ను రెగ్యులర్ గాముఖానికి అప్లై చేడం ద్వారా ఫెయిర్ కంప్లెక్షన్ తీసుకొస్తుంది. మరియు చర్మానికి ఒక పాలిష్ రంగును తీసుకొస్తుంది.

పసుపు-టమోటో ఫేస్ ప్యాక్:

పసుపు-టమోటో ఫేస్ ప్యాక్:

పసుపును టమోటో లేదా నిమ్మరసంతో మిక్స్ చేసి ముఖానికి రెగ్యులర్ గా అప్లై చేయడం వల్ల మెటిమలు, మచ్చలు లేని ఒక క్లియర్ స్కిన్ పొందడంతో పాటు, చర్మ రంగు మారుతుంది. దీన్ని రెగ్యులర్ గా అప్లై చేయడం వల్ల అద్భుత ఫలితాన్ని పొందవచ్చు.

స్వీట్ బాదం నూనెతో ఫేస్ ప్యాక్:

స్వీట్ బాదం నూనెతో ఫేస్ ప్యాక్:

ఈ స్వీట్ బాదం నూనెతో రెగ్యులర్ గా ముఖానికి మసాజ్ చేసుకోవడం వల్ల మంచి ఫలితం పొందవచ్చు. ఈ నూనె గోరువెచ్చగా చేసి ముఖ చర్మం మీద మసాజ్ చేయడం వల్ల చర్మంలో రక్త ప్రసరణ పెరుగుతుంది. రక్త ప్రసరణ ఎంత ఎక్కువగా జరిగితే చర్మంలో అంతే మెరుసు సంతరించుకుంటుంది.

అటువంటిదే మరో చిట్కా బాదంను రాత్రంతా నీటిలో నానబెట్టి, ఉదయం వాటిని మెత్తగా పేస్ట్ చేసి, అందులో కొద్దిగా మజ్జిగ మిక్స్ చేసి ముఖానికి ప్యాక్ లా వేసుకోవాలి. 20నిముషాల తర్వాత స్ర్కబ్ చేస్తూ చల్లటి నీటితో శుభ్ర ంచేసుకోవాలి. దీన్ని రెగ్యులర్ చేస్తే మీ చర్మ రంగు క్రమంగా పెరుగుతుంది.

శెనగపిండి ఫేస్ ప్యాక్:

శెనగపిండి ఫేస్ ప్యాక్:

శెనగపిండితో ఫేస్ ప్యాక్ వేసుకోవడం వల్ల చర్మ రంగు క్రమంగా పెరుగుతుంది. యవ్వనంగా మెరిసే చర్మాన్ని అందిస్తుంది. మంచి ఫలితాల కోసం శెనగపిండిలో మలై లేదా మజ్జిగను మిక్స్ చేసి ముఖానికి అప్లై చేయాలి. ఈ ఫేస్ ప్యాక్ శతాబ్దాల కాలం నుండి ఉపయోగిస్తున్నారు.

పుదీనా పేస్ ప్యాక్

పుదీనా పేస్ ప్యాక్

పుదీనా ఆకుల్లో చాలా అద్భుతమైన రిఫ్రెషింగ్ గుణాలు కలిగి ఉన్నాయి. ఇందులో ఆస్ట్రిజెంట్ మరియు ప్యూరిఫైయింగ్ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి. పుదీనా ఆకులు మెత్తగా పేస్ట్ చేసి, ముఖానికి అప్లై చేయాలి . 10-15నిముషాల తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేసుకోవడం వల్ల చర్మ బిగుతుగా చేస్తుంది, సన్ టాన్ నివారిస్తుంది. మీకు ఒక అద్భుతమైన స్పా అనుభూతిని కలిగిస్తుంది.

అరటి ఫేస్ ప్యాక్:

అరటి ఫేస్ ప్యాక్:

చర్మఛాయను మార్చడంలో అరటిపండు బాగా ఉపయోగపడుతుందని నిరూపించుకొన్నది. బాగా పండిని అరటిపండు గుజ్జుకు తేనె మరియు పెరుగు మిక్స్ చేసి, ముఖానికి అప్లై చేయడం వల్ల చర్మాన్ని ప్రకాశవంతంగా మర్చుతుంది.

గంధం ఫేస్ ప్యాక్:

గంధం ఫేస్ ప్యాక్:

జిడ్డు చర్మ తత్వం కలిగిన వారు చదనం లేదా మంచి గంధం పౌడరను నీళ్ళతో మిక్స్ చేసి, పేస్ట్ లా చేసి ముఖానికి అప్లై చేసి అరగంట తర్వాత శుభ్రం చేసుకోవడం వల్ల ఒక అద్భుత మార్పును మీరు పొందవచ్చు. ఇది చర్మరంగును మార్చడే కాదు, చర్మాన్ని ఫ్రెష్ గా ఉంచుతుంది.

English summary

9 Essential Face Packs For Skin Whitening

Every woman desires a fairer and whiter skin tone. At least all Indian women do! We are brought up with that admiration for fairness that just tends to over take everything else.
Desktop Bottom Promotion