For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఆరెంజ్ లోని అద్భుతమైన బ్యూటీ ప్రయోజనాలు

|

ఆరోగ్యాన్ని, అందాన్ని పెంచే సుగుణాలను తనలో నింపుకున్న నారింజను ఇంగ్లీషులో ఆరెంజ్‌ అని పిలుస్తుంటారు. పిల్లలు పెద్దలు ఇష్టంగా తినే పండ్లలో ఆరెంజ్ ఒకటి. దీనిలో పుష్కలంగా ఉండే సి విటమిన్ చర్మానికి నిగారింపు ఇస్తుంది. ఆరంజ్ లో ఫైబర్ శాతం ఎక్కువ కాబట్టి జ్యూస్ లా కాకుండా తొనలతో తినడమే మంచిది. తినడానికే కాదు, బ్యూటీ కేర్ కోసం కూడా ఆరంజ్ ఫ్రూట్ ని ఉపయోగించవచ్చు.

ఆరెంజ్‌లో ఉన్న సి విటమిన్, పొటాషియం మరియు ఫోలిక్ ఆసిడ్ కలిగివుండటం ద్వారా చర్మ సౌందర్యాన్ని మరింత మెరుగు పరుస్తుంది. స్కిన్ డామేజ్, ఎల్లో పిగ్మెంట్లకు ఆరెంజ్ జ్యూస్‌నో రోజూ తీసుకోవడం ద్వారా చెక్ పెట్టవచ్చునని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. ప్రతి రోజూ 200 ఎం.ఎల్ ఆరెంజ్ జ్యూస్ తాగడం ద్వారా 60ఎంజీ విటమిన్ సి లభిస్తుందని పరిశోధనలో తేలింది. అంతే కాదు, ఆరెంజ్ తొక్కను కూడా అనేక ఫేస్ ప్యాక్ లలో ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. మార్కెట్లో లభించే అన్ని రకాల ఫేస్ ప్యాక్ లలో ఆరెంజ్ తొక్క పౌడర్ లేదా ఆరెంజ్ జ్యూస్ ను ఉపయోగించడం లిస్ట్ లో తప్పని సరిగా ఉంటుంది.

అంతే కాదు, ఇంట్లో తయారుచేసేకొనే కొన్ని రకాలా ఫేస్ ప్యాక్ లలో పాలు, తేనెతో కూడా ఆరెంజ్ తొక్కను ఉపయోగిస్తున్నారు. ఆరెంజ్ లోని విటమిన్ సి చర్మం తత్వాన్ని మెరుగుపరుస్తుంది, టానింగ్ తో పోరాడుతుంది మరియు వయస్సు మీద పడనీయ్యకుండా చేస్తుంది. అంతే కాదు, చర్మం ప్రకాశవంతంగా మెరిసేలా చేస్తుంది. ఆరెంజ్ తొక్కను పడేయకుండా ఎండలో ఎండబెట్టి, పొడి చేసి పాలు, తేనెతో మిక్స్ చేసి ఫేస్ ప్యాక్ వేసుకోడం వల్ల అనేక చర్మ సమస్యలు పొడిచర్మం, మొటిమలు, నిర్జీవమైన మరియు టాన్డ్ స్కిన్ ను తొలగించుకోవచ్చు. శీతాకాలంలో ఆరెంజ్ ఎక్కువగా అందుబాటులో ఉంటాయి. కాబట్టి శీతాకాలంలో వీటిని తీసుకోవడం వల్ల అటు అరోగ్యంతో పాటు, చర్మ సౌందర్యాన్ని మెరుగుపరచుకోవచ్చు. మరి ఈ ఆరోగ్య ప్రధాయిని ఆరెంజ్ ఈ చలికాలంలో చర్మాన్ని ఏవిధంగా రక్షిస్తుందో చూద్దాం...

చర్మం క్లియర్ (శుభ్రం)చేస్తుంది:

చర్మం క్లియర్ (శుభ్రం)చేస్తుంది:

స్వచ్చమైన చర్మం పొందడానికి మీరు ఆరెంజ్ ఫేస్ ప్యాక్ ను అప్లై చేయండి. అందుకు ఆరెంజ్ జ్యూస్ లేదా ఆరెంజ్ తొనలతో ముఖం మీద మర్ధన చేయండి. ఇది ముఖం శుభ్రం చేయడంతో పాటు, చర్మ రంగును నేచురల్ గా మార్చుతుంది.

డార్క్ స్పాట్స్(నల్ల మచ్చలను) తొలగిస్తుంది:

డార్క్ స్పాట్స్(నల్ల మచ్చలను) తొలగిస్తుంది:

ఆరెంజ్ ను పాలు లేదా క్రీమ్ తో మిక్స్ చేసినప్పుడు ఆరెంజ్ బెస్ట్ బ్యూటీ ప్రొడక్ట్ గా పనిచేస్తుంది. అంతే కాదు ఇది చర్మం మీద డార్క్ స్పాట్స్ ను తొలగిస్తుంది.

డెడ్ స్కిన్ సెల్స్ ను తొలగిస్తుంది:

డెడ్ స్కిన్ సెల్స్ ను తొలగిస్తుంది:

ఆరెంజ్ వల్ల మరో అద్భుత ప్రయోజనం ఇది. ఆరెంజ్ తొక్క యొక్క పొడిని పెరుగుతో మిక్స్ చేసి ముఖానికి అప్లై చేయాలి. ఇలా చేయడం వల్ల డెడ్ స్కిన్ సెల్స్ తొలగిపోయి, చర్మానికి కొత్త కాంతిని తీసుకొస్తుంది.

బ్లాక్ హెడ్స్ ను నివారిస్తుంది:

బ్లాక్ హెడ్స్ ను నివారిస్తుంది:

ఆర్కెంజ్ స్ర్కబ్ చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది మరియు బ్లాక్ హెడ్స్ ను రిమూవ్ చేస్తుంది.

డార్క్ సర్కిల్స్:

డార్క్ సర్కిల్స్:

ఆరెంజ్ తొనలను మద్యకు వెడల్పుగా కట్ చేసి కళ్ళ మీద పెట్టుకొని 10-15నిముషాలు అలాగే వుండనివ్వాలి. ఇది అలసిన కళ్ళకు ఉపశమనం కలిగిస్తుంది మరియు కళ్ళ క్రింద డార్క్ సర్కిల్స్ ను నివారిస్తుంది.

మెరిసే చర్మం కోసం:

మెరిసే చర్మం కోసం:

మెరిసే చర్మం కోసం ఆరెంజ్ తొనలను ముఖానికి అప్లై చేయాలి. ఆరెంజ్ యొక్క ప్రయోజనం, వీటిలోని విటమిన్ సి మరియు యాంటీ ఆక్సిడెంట్స్ చర్మాన్ని అద్భుతంగా పనిచేస్తాయి. ఇది చర్మాన్ని శుభ్రపరిచి, బ్లింషెస్ ను తొలగిస్తుంది.

యాంటీ ఏజింగ్ :

యాంటీ ఏజింగ్ :

ఆరెంజ్ లోని మరో అద్భుతమైన బ్యూటీ బెనిఫిట్ , ఆరెంజ్ లోని యాంటీఆక్సిడెంట్ చర్మంను టైట్ చేస్తుంది మరియు మాయిశ్చరైజర్ గాపనిచేస్తుంది.

నేచురల్ బ్లీచ్:

నేచురల్ బ్లీచ్:

మీరు చర్మం మీద నల్ల మచ్చలను తొలగించుకోవాలంటే, ఆరెంజ్ రసాన్ని, నిమ్మరసంతో మిక్స్ చేసి మరియు కొన్ని చుక్కల తేనెను మిక్స్ చేసి ముఖానికి అప్లై చేయాలి . ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసి, 10నిముషాలు పాటు మసాజ్ చేయాలి. తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేయడం వల్ల మెరిసేటి, ప్రకాశవంతమైన చర్మాన్ని పొందవచ్చు.

గోళ్ళ యొక్క డిస్కలేరేషన్ నివారిస్తుంది :

గోళ్ళ యొక్క డిస్కలేరేషన్ నివారిస్తుంది :

మీకు డ్రై మరియు ఎల్లో నెయిల్స్ ఉన్నప్పుడు, ఆరెంజ్ జ్యూస్ లో కొద్దిసేపు నాననివ్వండి . అలాగే ఆరెంజ్ తొనలను గోళ్ళ మీద కొద్దిసేపు పెట్టుకొన్నా సరే గోళ్ళ యొక్క డిస్కలరేషన్ తొలగిపోతుంది.

టాన్ నివారిస్తుంది:

టాన్ నివారిస్తుంది:

చర్మం యొక్క రంగును (ముఖ్యంగా సూర్యరశ్మి వల్ల నల్లబడే చర్మాన్ని) పూర్తిగా తగ్గిస్తుంది.ఇది ఒక బెస్ట్ బ్యూటీ బెనిఫిట్. ఆరెంజ్ లోని సిట్రస్ యాసిడ్ టాన్ తొలగించడానికి అద్భుతంగా సహాయడపడుతుంది. చర్మం మెరిసేలా చేస్తుంది.

English summary

Amazing Beauty Benefits Of Juicy Oranges

Orange is widely used as a beauty product. It is the juicy citrus fruit which can be consumed to stay healthy and the waste peels can be used for effective skin care. In most of the face packs, you will find orange peel or juice in the ingredients list. This is because orange has many properties which makes it skin-friendly.
Story first published: Friday, October 25, 2013, 13:24 [IST]
Desktop Bottom Promotion