For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

టీనేజర్స్ కోసం ఆయుర్వేధిక్ బ్యూటీ టిప్స్

By Super
|

అందంగా ఉండాలనుకోవడం ప్రతి ఒక్కరికీ ఇష్టమే. మనందరం కూడా అందుకు తగు శ్రధ్ద తీసుకొని ప్రతి ఒక్కరు మనల్నిచూడాలనుకుంటారు. యవ్వనంలో ఉండే అమ్మాయిల, టీనేజ్ గర్ల్స్ , ముఖ్యంగా అందం కోసం బ్యూటీ ప్రొడక్ట్స్ కోసం ఎక్కువ గా డబ్బును కర్చు చేస్తుంటారు . మార్కెట్లో వచ్చే ప్రతి కొత్త ప్రొడక్ట్స్ ప్రయోగిస్తూ ఉన్న అందాన్ని కాస్తా పోగొట్టుకుంటుంటారు. అలా మార్కెట్లో లభించే రసాయనిక బ్యూటీ ఉత్పత్తుల కాకుండా నేచురల్ గా లభించే బ్యూటీ టిప్స్ ను పాటిస్తే ఎక్కువ లాభం ఉంటుంది.

టీన్స్ కోసం బెస్ట్ ఆయుర్వేధిక్ బ్యటీ టిప్స్:

తేనె మరియు అల్లం పేస్ట్:

తేనె మరియు అల్లం పేస్ట్:

తేనె మరియు అల్లంను పేస్ట్ లా తయారుచేసి ఈ మిశ్రమాన్ని ప్రతి రోజు దంతక్షయానికి ముందే అప్లై చేయాలి. ఇది మీ ముఖంలో చాలా వరక ముడుతలను నిరోధిస్తుంది.

ఆలివ్ ఆయిల్:

ఆలివ్ ఆయిల్:

ఆలివ్ ఆయిల్ తో చర్మానికి మసాజ్ చేయడం వల్ల చర్మంలో రక్తప్రసరణ బాగా పెంపొదిస్తుంది మరియు చర్మాన్ని బిగువుగా చేస్తుంది. కాబట్టి ఆలివ్ ఆయిల్ ను ప్రతి రోజూ ముఖానికి మసాజ్ చేయండి. ఇక్కడ ముఖ్యంగా గుర్తించుకోవల్సింది. ఆలివ్ ఆయిల్ ను అపసవ్యదిశలో రుద్దాలి.

ఆపిల్:

ఆపిల్:

ఆపిల్ ముక్కలను చాలా పల్చగా సన్నని ముక్కలుగా కట్ చేసి, ఆ ముక్కలతో ముఖం మొత్తం మర్ధన చేయాలి. పది నిముషాల తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఆయిల్ స్కిన్ నియంత్రించడబడుతుంది.

ఆరోగ్యకరమైన హల్ది(పసుపు):

ఆరోగ్యకరమైన హల్ది(పసుపు):

తాజాగా ఉండే పసుపు కొమ్ములను గ్రైండ్ చేసి, పౌడర్ చేసి దానికి కొద్దిగా నిమ్మరసం చేర్చి మెత్తగా పేస్ట్ లా చేసుకోవాలి. ఈ పేస్ట్ ను ముఖానికి అప్లై చేయాలి. ఇలా చేయడం వల్ల సన్ టాన్ ను తొలగించడానికి బాగా సహాయపడుతుంది.

స్వీట్ తేనె:

స్వీట్ తేనె:

తేనె మరియు నిమ్మ మరియు వెజిటేబుల్ ఆయిల్ ను బాగా మిక్స్ చేసి, ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేయాలి. పది-పదిహేను నిముషాల తర్వాత శుభ్రం చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల పొడి చర్మం తొలగిపోతుంది. ఇది డ్రై స్కిన్ కు చాలా మంచి మాయిశ్చరైజర్ గా పనిచేస్తుంది.

ఫ్రూట్ లంచ్:

ఫ్రూట్ లంచ్:

మీ రెగ్యులర్ డైట్ లో తాజా పండ్లను చేర్చుకోవడం అలవాటు చేసుకోవాలి. పండ్లను ఉప్పు మరియు పంచదార వంటివి వాడకూడదు.

ఐడియల్ డ్రింక్:

ఐడియల్ డ్రింక్:

ప్రతి రోజూ ఉదయం కాలీ కడుపుతో రెండు గ్లాసుల నీళ్ళు తాగడం అలవాటు చేసుకోవాలి. ప్రతి రోజూ ఉదయం నీళ్ళు తాగడం వల్ల చర్మం ఆరోగ్యకరంగా మరియు మంచి మెరుపుతో ఉంటుంది.

బట్టర్:

బట్టర్:

సన్ టాన్ ను మాయం చేసి అద్భుతమైన గుణాలు బట్టర్ లో ఉన్నట్లు నిరూపితమైనది. మీరు కొన్ని రోజులు క్రమం తప్పకుండా మజ్జిగతో ముఖంను శుభ్రం చేసుకోవాలి మరియు దాని తర్వాత వ్యత్యాసాన్ని గమనించవచ్చు. ఇది నేచురల్ యాంటీఆస్ట్రిజెంట్ (ఒక సహజ రక్తస్రావ నివారిణిగా ఉన్నప్పటికీ, టోనర్ గా మరియు జిడ్డు చర్మాన్ని నిరోధించే శక్తి ఉంటుంది.

మార్నింగ్ బజ్:

మార్నింగ్ బజ్:

ప్రతి రోజూ మద్యహ్నానం, రాత్రి తీసుకొనే ఆహారం కంటే ఉదయం తీసుకొనే ఆహారం ఎక్కువ కాలరీలున్న ఆహారాన్ని తీసుకోవాలి. రాత్రి తీసుకొనే ఆహారం చాలా తక్కువగా తీసుకోవాడం వల్ల పగలు మరియు మద్యాహన్నం కంటే రాత్రిలో కాలరీలను కరించే సామర్థ్యం ఎక్కువగా ఉంటుంది.

మాయిశ్చరైజ్:

మాయిశ్చరైజ్:

గోరువెచ్చని నీటితో స్నానం లేదా వార్మ్ ఫేస్ వాష్ చేసిన తర్వాత మాయిశ్చరైజర్ ను అప్లై చేయడం చర్మానికి చాలా మంచిది.

ద్రాక్ష:

ద్రాక్ష:

3 టేబుల్ స్పూన్ల ఓట్ మీల్ ను ద్రాక్షరసంతో మిక్స్ చేసి, చిక్కటి పేస్ట్ లా తయారుచేయాలి . ఈ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి 15నిముషాలు అలాగే వదిలేసి, తర్వాత గోరువెచ్చని నీటితో తొలగించుకోండి. ఇలా చేయడం వల్ల చర్మం చాలా త్వరగా ఆరోగ్యంగా మరియు మృదువుగా తయారువుతుంది.

English summary

Ayurvedic Beauty Tips For Teens

Who will not have the desire to look beautiful? We all want to be the cynosure and look stunning among a crowd.
Desktop Bottom Promotion