For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

శీతాకాలంలో చర్మ సంరక్షణకోసం ఆయుర్వేదిక చిట్కాలు

By Mallikarjuna
|

ఆయుర్వేదం వైద్యానికి మరియు ఔషదాలకు పురాతన భారతీయ శాస్త్రంగా ఉంది. ఆయుర్వేధ ఔషధాలు వివిధ రకాలు, పొదలు, మూలికలు మరియు సుగంధ ద్రవ్యాల కలయికలతో తయారు చేస్తారు. ఆయుర్వేద ఔషధాలు చాలా ప్రభావంతంగా పనిచేస్తాయి. ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. ఎందుకంటే ఆయుర్వేద ఔషధాలలో వివిధ రకాల ప్రయోజనాలు కలిగి ఉంటాయిఅందువల్లే ఇది అంత ప్రజాదరణ పొందుతున్నది.

మన శరీరంలో ప్రతి అవయవానికి సంబంధించిన వ్యాధుల చికిత్సకు ఆయుర్వేదంను ఉపయోగిస్తున్నారు. అదే విధంగా, ఆయుర్వేదంలో కొన్ని మందులు మరియు పద్దతుల ఎటువంటి చర్మ సంబంధిత వ్యాధులనైన నయం చేస్తుంది. మన శరీరంలో చర్మం చాలా సున్నితమైనది. చర్మం కణజాలం వాతావరణ మార్పు, కాలుష్యం మరియు అంటువ్యాధులు వంటి విషయాల్లో దెబ్బతిన్నవచ్చు . శీతాకాలంలో చర్మ సంరక్షణ కోసం కొన్ని ఉపయోగకరమైన ఆయుర్వేద చిట్కాలు ఉన్నాయి . డ్రై వింటర్ మీ చర్మానికి మరింత పొడిగా మరియు రఫ్ గా మార్చుతుంది . ఆయుర్వేద ఔషదం శీతాకాలంలో మీ చర్మానికి మరింత అదనపు రక్షణ కల్పిస్తుంది .

వింటర్ సీజన్ లో చల్లని వాతావరణంలో చాలా మంది చర్మం పొడిబారడం, చర్మం పగుళ్ళు, పెదాల పగుళ్ళు మరియు రఫ్ స్కిన్ కు గురి అవుతుంటారు. కాబట్టి, శీతాకాలంలో మీ చర్మంను మరింత సాఫ్ట్ గా మరియు సున్నితంగా ఉంచడానికి ఆయుర్వేద చిట్కాలు ఉన్నాయి. మరి ఆ చిట్కాలేంటో ఒక సారి చూద్దాం...

Ayurvedic skin care tips for the winter

1. మసాజ్ - పొడిబారిన మరయు కఠినమైన చర్మం కోసం ఆయుర్వేదంలో హాట్ ఆయిల్ మసాజ్ ను ప్రోత్సహిస్తుంది. బ్రహ్మి మరియు నీమ్ వంటి ఆయుర్వేద పదార్థాలను ఉపయోగించి హాట్ ఆయిల్ తయారుచేసి, మసాజ్ ల కోసం ఉపయోగిస్తుంటారు. ఆయిల్ మసాజ్ చర్మానికి పోషణ అందిస్తుంది. ఆయుర్వేధ ఆయిల్ మసాజ్ చర్మాన్ని హైడ్రేషన్ లో ఉంచతుంది. శీతాకాలంలో చర్మానికి రెగ్యులర్ ఆయిల్ మసాజ్ చాలా మంచిది. కాబట్టి, మార్కెట్లో అనేక ఆయుర్వేద ఆయిల్ అందుబాటులోఉన్నాయి .

2. ఫేస్ మాస్క్: శీతాకాలంలో , చర్మానికి ఫేస్ ప్యాక్స్ లేదా ఫేస్ మాస్క్ లను ఉపయోగించాలి . హెర్బల్ ఫేస్ ప్యాక్ లు చర్మానికి తిరిగి మాయిశ్చరైజ్ ను అందిస్తాయి. అందుకు మీరు రజ్ వాటర్, ఆమ్లా, అలొవెరా, పసుపు, లేదా ఇతర నేచురల్ పదార్థాలను ఉపయోగించవచ్చు. వీటిని మీరు పాలు లేదా పాల క్రీమ్ తో మిక్స్ చేసి ఉపయోగించుకోవచ్చు. అటువంటి ఒక ఫేస్ మాస్క్ అలొవెరాజెల్ ఉపయోగించి తయారుచేయవచ్చు. ఈ మిశ్రమాన్ని మీముఖానికి పట్టించి కొన్ని నిముషాలు ఎండిన తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి. మరో ఎంపిక ఈ మిశ్రమాన్ని పాలు మరియు రోజ్ వాటర్ ను ఉపయోగించి ప్రతి రోజూ ముఖాన్ని శుభ్రం చేసుకోవచ్చు. రెగ్యురల్ గా ఉపయోగించడం వల్ల మరింత ప్రకాశవంతంగా మరియు తేమగా ఉంచతుంది.

3. ఆరోగ్యకరమైన ఆహారం: శీతాకాలంలో ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం చాలా అవసరం.ముఖ్యంగా వింటర్ సీజన్ లో అదనపు హెర్బ్స్ మరియు సుగంధ ద్రవ్యాలును చేర్చుకోవాలి. అందులో ముఖ్యంగా ఆమ్లా, షతావరి, అశ్వగంధ, ట్రిఫల మరియు మరికొని ఇతరములు. ఈ అన్ని హెర్బ్ లోనూ శరీరంలో శోషింపబడి, టాక్సిన్స్ ను బయటకు నెట్టివేస్తుంది. శీతాకాలంలో ఆరోగ్యానికి మేలు చేసే వివిధ రకాల ఆయుర్వేద చౌపన్ ప్రాష్ అందుబాటులో ఉన్నాయి. ఆయుర్వేద మూలికలు చర్మాన్ని తేమగా ఉంచుతాయి. చౌపన్ఫ్రాష్ ను రెగ్యులర్ గా ఒక చెంచా తీసుకోవడం వల్ల ఇది చర్మానికి మరియు శరీరానికి చాలా మేలు చేస్తుంది మరియు అనేక పండ్లను మీ రెగ్యులర్ డైట్ లో చేర్చుకోండి .

4. తగినంత నీరు: ఇది చర్మం సంరక్షణ చిట్కా. ఇది ప్రతి సీజన్ కు ఇది చాలా సాధారణం . మన చర్మంలని కణాలను రిపేర్ చేయడానికి తిరిగి పునరుత్పత్తి అవ్వడానికి ఇవి బాగా సహాయపడుతాయి. ఆయుర్వేదం చర్మం సంరక్షణ చిట్కాల్లో దీన్ని ప్రోత్సహిస్తుంది. ఆయుర్వేదం ప్రకారం, నీరు అన్నింటికి మూలం. శీతాకాలంలో బయటి వాతావరణం పొడిగా ఉండటం వల్ల మీరు ఎక్కువగా నీరు తీసుకోవాలని సలహా. అందుకు ప్రతి రోజూ 8నుండి 10గ్లాసుల నీరును తీసుకోవాలి.

5. స్నానపు ఉత్పత్తులు - ఆయుర్వేదం ప్రకారం శీతాకాలంలో కఠినమైన సబ్బులు ఉపయోగించకూడదు. రసాయనాలతో తయారుచేసిన సోపులు చర్మాన్ని డీహైడ్రేట్ చేస్తుంది మరియు చర్మాన్ని మరింత కఠినంగా చేస్తుంది. కాబట్టి, సోపులకు బదులుగా పాలు, క్రీమ్, పసుపు, మరియు శెనగపిండిని ఉపయోగించండి . ఇది మీ చర్మనిర్మాణం మెరుగుపరచడానికి మరియు చర్మం మృదువైనది చేయడానికి సహాయం చేస్తుంది .

ముఖ అందం , ఆరోగ్యం రెండూ ఒకదానిపై ఒకటి ఆధారపడి ఉంటాయి . ఆరోగ్య కరమైన అందం ఆశించదగినది . అదే అందరూ కోరుకొనేది కూడా . అయితే అనాదిగా వస్తున్న ఆయుర్వేదం ద్వారా అందాన్ని ఆరోగ్యాన్ని ఒకేసారి సొంతం చేసుకోవచ్చు . స్త్రీల సౌందర్య పోషణకు ఆయుర్వేదం ఎన్నో గృహవైద్యాలను ఉదహరించింది . ఆయుర్వేద వైద్యంతో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా మీరు అందం ఆరోగ్యం సొంతం చేసుకోండి .

English summary

Ayurvedic skin care tips for the winter

Ayurveda is an ancient Indian science of medicine and healing. Ayurveda medicines are made from a combination of various shrubs, herbs and spices.
Desktop Bottom Promotion