For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

శెనగపిండితో అమేజింగ్ స్కిన్&హెయిర్ బ్యూటీ బెనిఫిట్స్

|

స్త్రీ అందానికి ప్రతి రూపం. ఆ అందం నాజూకైన చర్మంతో మరింత ఇనుమడిస్తుంది. చర్మం ఆరోగ్యంగా, అందంగా ఉండటమే కాకుండా శుభ్రంగాను ఉంచుకునేందుకు ప్రయత్నించాల్సి వుంటుంది. కాని నేటి ఆధునిక కాలంలో చాలామంది మహిళలు, తమ చర్మసౌందర్యంపై ప్రత్యేక శ్రద్ధ కనబరచలేక పోతున్నామని తెగ ఆందోళన పడుతుంటారు. అలాంటి వారు కాసింత సమయం కేటాయించి కొన్ని చిట్కాలు పాటిస్తే సరి....

శెనగపిండితో రకరకాల వంటకాలు తయారు చేస్తారు. శెనగపిండి వంటింటి వస్తువే అయినా దీన్ని బ్యూటీ ప్రొడక్ట్ గా ఉపయోగిస్తారు. శెనగ పిండి చర్మ సంరక్షణకు ఏవిధంగా పనిచేస్తుందో అందరికీ తెలసిన విషయమే. అందుకే ఎక్కువగా ఫేస్ మాస్క్ లుగా శెనగపిండి వేసుకొంటుంటారు. ఇది ఇప్పటి ఆచారమో... పద్దతో కాదు. పూర్వ కాలం నుండి వస్తున్న పద్దతే మన పూర్వ కాలంలో కూడా శెనగపిండి, సున్నిపిండిని నలుగు పెట్టుకొని తర్వాత స్నానం చేసేవారు. శెనగపిండిలో అనేక బ్యూటీ బెనిఫిట్స్ ఉన్నాయి. ఇది గ్రేట్ మాయిశ్చరైజర్ గా మరియు ఎక్స్ ఫ్లోయేటర్ మరియు మొటిమలను తొలగించడంలో మరియు జిడ్డు చర్మాన్ని పోగొట్టడంలో, ఫేషియల్ హెయిర్ గ్రోత్ గా, నల్లగా మారిన భుజాలు మరియు మెడ. మరియు పొడి బారిన, నిర్జీవమైన కేశాలకు అన్నింటికి శెనపింగా మంచి ప్రయోజనం చేకూర్చుతుంది.

శెనగపిండి చర్మంలో పేరుకొన్న మురికి తొలగించి ముఖానికి కాంతిని నింపుతుంది. కాబట్టి మీ చర్మ కాంతిని పెంచుకోవాలనుకుంటే శెనగపిండితో ఫేస్ మాస్క్ వేసుకొని అందాన్ని రెట్టింపు చేసుకోవచ్చు. శెనగపిండిలో యాంటిసెప్టిక్ గుణాలు కలిగి ఉండటం వల్ల చర్మసంరక్షణకు బాగా ఉపయోగపడుతంది. కాబట్టి ముఖంలో మొటిమలు, వాటి తాలూకు మచ్చలు వున్నట్లైతే ఈ ఫేస్ మాస్క్ పద్దతులను ఉపయోగించి కోమలమైన చర్మ సౌందర్యాన్ని సొంతం చేసుకోవచ్చు. శెనగపిండితో ఇతర బ్యూటీ బెనిఫిట్స్ కూడా ఉన్నాయి. బ్యూటీకి అవి ఏవిధంగా ఉపయోగిస్తారో ఒక సారి చూద్దం..

ఫేస్ ప్యాక్: శెనగపిండి చర్మానికి చాలా అద్భుతంగా పనిచేస్తుంది. ఇది అన్ని రకాల చర్మఛాయలకు(పొడి చర్మం మరియు ఆయిల్ చర్మం) ఉపయోగపడుతుంది. మీ చర్మం ఆయిల్ గా ఉంటే, శెనపిండి మరియు పెరుగు లేదా శెనగపిండి-రోజ్ వాటర్ ను మిక్స్ చేసి ఫేస్ ప్యాక్ గా వేసుకోవాలి. ఈ ఫేస్ ప్యాక్ వల్ల చర్మంలోని మలినాలు తొలగిపోతాయి మరియు చర్మాన్ని సున్నితంగా మార్చుతుంది. మీకు పొడిచర్మం ఉంటే ఈ మాయిశ్చరైజింగ్ శెనగపిండి ఫేస్ ప్యాక్ ను అప్లై చేయాలి. అందుకు శెనగపిండి, తేనె, చిటికెడు పసుపు, కొద్దిగా పాలు వేసి బాగా పేస్ట్ లా చేసి ముఖానికి అప్లై చేయాలి. 20నిముషాల తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేయడం వల్ల పొడి చర్మం తొలగిపోతుంది.

Beauty Benefits Of Besan

నేచురల్ టాన్ రిమూవర్: ఇది నేచురల్ రిమూవర్ గా పనిచేస్తుంది. 4-5బాదంపప్పులను పౌడర్ చేసి, దానికి ఒక టీస్పూన్ పాలు, నిమ్మరసం మరియు శెనగపిండి చేర్చి బాగా మిక్స్ చేసి, ముఖానికి పట్టించాలి. తర్వాత ముఖాన్ని శుభ్రంగా కడుగుకోవాలి. ఇది సన్ టాన్ తొలగించడానికి చాలా ప్రభావవంతంగా పనిచేస్తుంది. దీన్ని మీరు రెగ్యులర్ గా ఉపయోగించవచ్చు. దీన్ని ఉపయోగించి ప్రకాశవంతమైన చర్మ సౌందర్యాన్ని పొందండి.

మొటిమలు తొలగించడానికి: మీ చర్మం మొటిమలను మచ్చలకు గురియైనప్పుడు?చింతాల్సిన పనిలేదు. సింపుల్ గా శెనగపిండిలో కొద్దిగా సాండిల్ వుడ్(గంధంపొడిని)మిక్స్ చేసి మెత్తటి పేస్ట్ లా తయారు చేసి, ఈ మిశ్రమాన్ని ముఖానికి పట్టించాలి . 20 నిముషాల తర్వాత శుభ్రం చేసుకోవాలి. కనీసం వారానికి లేదా రెండు వారాలకొకసారి ఇలా చేయడం వల్ల మంచి ఫలితం చూడవచ్చు.

ఫేషియల్ హెయిర్ గ్రోత్: మీ బామ్మగారు లేదా మీ అమ్మగారు వారు ముఖాన్ని శుభ్రం చేయడానికి ఇప్పటికీ శెనగపిండి ఉపయోగించడం మీరు గమనించే ఉంటారు. ఫేషియల్ హెయిర్ గ్రోత్ ముఖ్యంగా నోరు, గడ్డం చుట్టూ ఉన్న, ముఖ్యంగా ముఖం మీద సన్నని జుట్టును పెరుగుదల వదిలించుకోవటం కసం ఈ సాంప్రదాయక పద్దతిని ఉపయోగిస్తుంటారు. శెనపిండి మరియు పసుపు పేస్ట్ లా తయారు చేసి ప్రతి రోజూ ఉదయం సాయంత్రం రెండు పూటలా ఉపయోగించండి.

నల్లగా మారిన భుజాలు మరియు మెడ: చాలా మంది మహిళలు వారి చేతులు ముఖ్యంగా మోచేతులు మరియు మెడను విస్మరిస్తుంటారు. ఫలితంగా ఈ ప్రదేశాల్లో డార్క్ గా మారుతుంది. అయితే, ఈ శరీర భాగాలను నిర్లక్ష్యం చేయడం కంటే ఈ సులభ మాస్క్ మరియు మసాజ్ లను ప్రయత్నించండి. అందమైన చేతులు మరియు మెడను సొంతం చేసుకోండి. పెరుగు మరియు పసుపు కూడా మిక్స్ చేసి నల్లగా మారిన శరీర భాగాల మీద అప్లై చేయడి. అరగంట అలాగే వదిలేసి, తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి.

డల్ అండ్ డ్యామేజ్ హెయిర్: అవును, శెనగపిండి కేశాలకు కూడా అద్భుతంగా పనిచేస్తుంది. మీ కేశాలు డల్ గా మరియు డ్యామేజ్ కలిగి ఉంటే, పెరుగు మరియు శెనగపిండి మిశ్రమాన్ని మీ కేశాలకు పట్టించి తలస్నానం చేసుకోవాలి. దాంతో మీ కేశాలు మంచి షైనింగ్ తో మరియు మరింత బలంగా పెరగడానికి సహాయపడుతుంది. ఇంకా ఇది చుండ్రును తొలగించడంలో అద్భుతంగా పనిచేస్తుంది.

English summary

Beauty Benefits Of Besan

Besan (Gram flouror chana ka aata) is known to have qualities which enhance your beauty. It has been traditionally used as a beauty ingredient, especially in India. Not to mention, it is one of the main ingredients of a body scrub that is a traditional beauty treatment for brides-to-be.
Story first published: Saturday, June 29, 2013, 15:53 [IST]
Desktop Bottom Promotion