For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

చాక్లెట్ ఫేషియల్ తో అద్భుతమైన బ్యూటీ బెనిఫిట్స్.!

|

చాక్లెట్ అంటే ఇష్టపడి వాళ్లు ఉండరేమో. చాక్లెట్ చూడగానే తినేయాలనిపిస్తుంది. మంచి రుచికరమైన ఒక్క చాక్లెట్ తింటే చాలా ఆటోమెటిక్‌గా మూడ్ మారిపోతుంది. చాక్లెట్ ఆరోగ్యానికే కాదు.. సౌందర్యానికి కూడా చాలా దోహదపడతాయని శాస్త్రవేత్తలు అంటున్నారు. ఇంట్లో తయారు చేసుకునే చాక్లెట్ ఫేషియల్ చర్మ సమస్యలు నివారించడానికి సాయపడుతుంది. ముఖం మీద ముడతలు, చారలు రాకుండా నివారిస్తుంది. చిన్న వయసులోనే పెద్దవాళ్లుగా కనబడేవారికి ఇవి ఎంతగానో ఉపయోగపడతాయి. వృద్ధాప్యంలో వచ్చే అల్జీమర్స్ వ్యాధిని నివారించవచ్చు. చాక్లెట్‌లో ఉపయోగించే కోకోలోని పోషకాల్లో ఫ్లెవనాల్ ఉంటుంది. అవి అల్జీమర్స్‌ని దూరం చేస్తాయి. ఇందులో ఆరోగ్యకరమైన కొవ్వు మరియు యాంటిఆక్సిడెంట్స్ అత్యధికంగా ఉంటాయి. ఇవి చర్మాన్ని సురక్షితంగా ఉండేలా చేస్తుంది.

చాక్లెట్ వాక్సింగ్ మరియు చాక్లెట్ ఫేషియల్ గురించి పార్లర్స్ లేదా సాలూన్స్ లో వినేఉంటారు. ఈ చాక్లెట్ ఫేషియల్ ను ఎక్కువగా సెలబ్రెటీలు ఉపయోగిస్తుంటారు. చాక్లెట్ వాక్సింగ్ సురక్షితం మరియు స్కిన్ ఫ్రెండ్లీ పద్దతిలో చర్మ మీద సన్నని హెయిర్ ను తొలగిస్తుంది . ఇంకా చాక్లెట్ ఫేషియల్ యాంటీ ఏజింగ్ లక్షణాలు ఇందులో పుష్కలంగా ఉన్నాయి. ఈ నోరూరించే చాక్లెట్స్ వృద్ధాప్యం ఛాయలు రానియకుండా పోరాడుతుంది. మరియు చర్మాన్ని టైట్ చేస్తుంది. మరి చాక్లెట్ తో బ్యూటీ బెనిఫిట్స్ ను ఒక సారి పరిశీలించండి.

స్ర్కబ్: మీరు చాక్లెట్ పౌడర్ ను పాలతో మిక్స్ మరియు పెరుగుతో మిక్స్ చేసి హోం మేడ్ స్ర్కబ్ లా చేయవచ్చు. ఇది చర్మాన్ని శుభ్రపరుస్తుంది. మరియు చర్మాన్ని ప్రకాశవంతంగా మార్చుతుంది చాక్లెట్ పౌడర్ ను పాలతో బాగా మిక్స్ చేసి తర్వాత ముఖం తడిచేసుకొని, తడి మీదే ముఖం, మెడ మీద చాక్లెట్ ఫేషియల్ ను అప్లై చేసుకోవాలి. పది నిముషాల తర్వాత ముఖాన్ని బాగా స్ర్కబ్ చేయాలి. 5 నిముషాల తర్వాత చల్లటి నీళ్ళతో శుభ్రం చేసుకోవాలి.

యాంటీఏజింగ్: ముఖంలో ఎటుంటి చారలు మరియు మొటిమలు, మచ్చల తాలూకు లక్షణాలు కనిపించినా అందురూ చాలా బాధపడుతుంటారు. వృద్ధాప్యం ఛాయలు ముఖంలో కనబడనీయకుండా పోరాడతుంది. చాక్లెట్ ను పాలలో మిక్స్ చేసి బాగా మెత్తగా చేసి ముఖానికి పట్టించాలి. ఇలా వారంలో రెండు మూడు సార్లు చేయడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. ఇది ముఖంలో సన్నని చారలను దాచేస్తుంది.

మెరిసే చర్మం: బ్యూటీ బెనిఫిట్స్ లో చాక్లెట్ ఫేషియల్ చాలా ప్రసిద్ధి చెందినది. ఈ రుచికరమైన చాక్లెట్ ముఖంలో ఫెయిర్ నెస్ ను తెప్పింస్తుంది. మరియు చర్మ రంగును మెరుగుపరుస్తుంది. కోకాపౌడర్ ను పాలు, తేనె మరియు ఓట్ మీల్ తో మిక్స్ చేసి, ఈ మిశ్రమాన్ని ముఖం మరియు మెడ మీద అప్లై చేసి, 15-20నిముషాలు ఆరనివ్వాలి. తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేయడం వల్ల ముఖం మెరుస్తుంటుంది. ఇలా కొన్ని వారాల పాటు క్రమం తప్పకుండా చేయడం వల్ల మంచి ఫలితం ఉంటుంది.

డిటాక్స్ స్కిన్: కోకా పౌడర్ ను కెఫిన్ తో మిక్స్ చేసినప్పుడు అది బెస్ట్ బ్యూటీ ప్రొడక్ట్ గా మారుతుంది. ఇది చర్మానికి డిక్స్ ఫై చేస్తుంది. ఈ మిశ్రమాన్ని ముఖానికి మసాజ్ చేయడం వల్ల ఆయిల్ చర్మం మరియు నిర్జీవమైన చర్మం నుండి ఉపశమనం కలిగిస్తుంది. చాక్లెట్ ఫేస్ ప్యాక్స్ స్కిన్ ప్రొన్స్ ను ఓపెనె చేసి, డెడ్ స్కిన్ సెల్స్ ను తొలగిస్తుంది.

సన్ టాన్: హాట్ సీజన్ లో సన్ డ్యామ్ చాలా సాధారణం. కాబట్టి సూర్య రశ్మి నుండి వెలువడే హానికరమైన యూవీ కిరణాల నుండి చర్మాన్ని కాపాడుకోవాలంటే చాక్లెట్ ఫేస్ ప్యాక్ చేసుకోవాలి. ఈ బ్యూటీ ప్రొడక్ట్స్ లో ఫ్లెవనాయిడ్స్ మరియు యాంటీఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉండి చర్మాన్ని సున్నితం చేస్తుంది. ప్రీమెచ్యుర్ స్కిన్ ను తొలగిస్తుంది. సన్ టాన్ నివారిస్తుంది.

ఇంట్లో తయారు చేసుకొనే చాక్లెట్ ఫేషియల్ చాలా సులభం. ఒక సాస్ పాన్ లో డార్క్ చాక్లెట్ బార్ ను చిన్న ముక్కలుగా చేసి వేసి తక్కువ మంట మీద చాక్లెట్ కరిగే వరకూ వేడి చేయాలి. చాక్లెట్ పూర్తిగా కరిగిన తర్వాత స్టౌ మీద నుండి పక్కకు తీసి పెట్టుకోవాలి. అందులో స్వచ్చమైన తేనె కలుపుకోవాలి. ఈ రెండిటిని బాగా మిక్స్ చేయాలి. ఇలా మిక్స్ చేసిన ఈ పదార్థాన్ని గోరు వెచ్చగా అయ్యేంత వరకూ పక్కన పెట్టుకోవాలి. ఇది చల్లారిన తర్వాత ముఖానికి అప్లై చేయాలి. వేడిగా వేసుకొంటే చర్మానికి హాని కలుగుతుంది. దీన్ని ముఖానికే కాదు, స్నానం చేయడానికి పది నిమిషాల ముందు శరీరానికి కూడా బాగా పట్టించి తర్వాత స్నానం చేయవచ్చు. అలా చేయడం వల్ల చాక్లెట్ మాస్క్ చర్మ గ్రంధులపైనా బాగా పనిచేసి చర్మాన్ని ప్రకావంతంగా మెరిసేలా చేస్తుంది.

చాక్లెట్ వల్ల ఒక్క బ్యూటీ బెనిఫిట్స్ మాత్రమే కాదు, అద్భుతమైన హెల్త్ బెనిఫిట్స్ కూడా ఉన్నాయి. పరిమితంగా చాక్లెట్లు తినడం వల్ల మతిమరుపు సమస్య కూడా దూరమవుతుందట! అలాగే డార్క్ చాక్లెట్లు తినడం వల్ల, రెడ్ వైన్ తాగడం వల్ల గుండెకు మేలు చేస్తాయని హృద్రోగ నిపుణులు చెబుతున్నారు. మహిళలకు రుతుక్షికమంలో ఈస్ట్రోజన్, ప్రొజెస్టిరోన్ స్థాయిలు తగ్గుతాయి. దాంతో కడుపులో నొప్పి, కోపతాపాలు పెరుగుతాయి. ఐతే బెర్రీలు, క్యాల్షియం, విటమిన్ ఈ, బీ6, మెగ్నీషియం వంటివి వీటిని అదుపులో ఉంచుతాయి. ఇందుకు డార్క్ చాక్లెట్లు దోహదపడతాయని శాస్త్రవేత్తలు అంటున్నారు. అయితే.. కోకో, మితిమీరిన క్యాలరీలున్న చాక్లెట్లకు దూరంగా ఉండాలని హెచ్చరిస్తున్నారు. ఎక్కువగా తినడం వల్ల దంతాలు పుచ్చిపోయి, దెబ్బ తింటాయి. బరువు పెరుగుతారని చెబుతున్నారు.

English summary

Beauty Benefits Of Chocolates

We all love to eat chocolates and seldom spare a few bites for others. It is delicious and tempting! Dark chocolate is known for its health and beauty benefits. Yes, you read it right. Dark chocolate which was considered fattening earlier has become famous for beauty treatment these days.
Story first published: Friday, June 21, 2013, 10:50 [IST]
Desktop Bottom Promotion