For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

వేసవిలో చర్మ సౌందర్యం పాడవకుండా కాపాడే వంటింటి వస్తువులు..!

|

ప్రస్తుతం వేసవి ఎండలు మండిపోతున్నాయి. ఒంట్లో నీరంతా మాయం అవుతోంది. దాంతో డీహైడ్రేషన్. డీహైడ్రేషన్ వల్ల అనేక ఆరోగ్య సమస్యలు. అందుకే సమ్మర్ లో ఆరోగ్యం గురించి మరింత ఎక్స్ ట్రా కేర్ తీసుకోవడం చాలా అవసరం. అయితే మనం ప్రతి నిత్యం ఉపయోగించే కొన్ని వస్తువులను మనం మర్చిపోతున్నాం వాటిని వినియోగించకోకపోవడం వల్ల చర్మ మీద చాలా ప్రభావాన్ని చూపెడుతుంది. ఉదా: వేసవి కాలంలో చర్మం మరియు కేశ సంరక్షణకు సరైన జాగ్రత్తలు పాటించకపోతే మీ అందం మీద మరియు కేశాల మీద దీర్ఘకాలంలో నిజంగా హాని కలిగిస్తాయి. చర్మం పేలగా తయారవ్వడమే కాదు చూడటానికి కూడా డల్ గా కనిపిస్తారు. కాబట్టి సమ్మర్ లో చర్మ గురించి జాగ్రత్తలు తీసుకోవడం చాలా అవసరం.

వేసవి చర్మ సంరక్షణకు వంటింటి వస్తువులు కొన్ని ఉపయోగించవచ్చు. ఇవి ప్రతి నిత్యం మన ఇంట్లో ఉన్న వస్తువులు. ఉదా: నిమ్మ, పెరుగు, క్రీమ్ లేదా పాలు వంటివి వేసవికాలంలో చర్మసంరక్షణకు చాలా ప్రభావంతగా పనిచేసి, చర్మ సౌందర్యాన్ని కాపాడుతాయి. వేసవి కాలంలో ఎదరయ్యే సన్ టాన్, సన్ బర్న్ మరియు మీ చర్మాన్ని మెరిపించేలా మార్చుకోవడానికి ఇవి బాగా సహాయపడుతాయి. ఇక్కడ మరికొన్ని బ్యూటీ వస్తువులు ఉదా: టమోటో మరియు పుచ్చకాయ వంటివి వేసవిలో మీ శరీరాన్ని చర్మాన్ని చల్లగా ఉంచడమే కాకుండా ఫ్రెష్ గా కనబడేలా చేస్తాయి. సమ్మర్ లో మనం ఉపయోగించాల్సిన బ్యూటీ ఇనిగ్రెంట్స్ ఏంటో ఒక సారి చూద్దాం:

వేసవిలో చర్మసౌందర్యాన్ని కాపాడే 10 కూలింగ్ టిప్స్..!

పెరుగు: పెరగు శరీరానికి మరియు చర్మానికి చల్లదనాన్ని కలిగిస్తుంది, ఇంకా సన్ టాన్ తో పోరాడి, చర్మాన్ని కూల్ గా ఉంచుతుంది. మరి సమ్మర్ లో మీ చర్మ మెరిపించే ఈ పెరగుతో ఫేస్ ప్యాక్ వేసుకోవడం చాలా అవసరం.

వేసవిలో చర్మసౌందర్యాన్ని కాపాడే 10 కూలింగ్ టిప్స్..!

పాలు: పాలు పొడి చర్మానికి అద్భుతంగా పనిచేస్తాయి. ఇంకా చర్మాన్ని టైట్ చేస్తుంది. మాయిశ్చరైజ్ గా ఉంటుంది. పాలతో మీరు రెగ్యులర్ గా మసాజ్ చేయడం వల్ల చర్మం రంగు మార్చుకోవడానికి సహాయపడుతుంది.

వేసవిలో చర్మసౌందర్యాన్ని కాపాడే 10 కూలింగ్ టిప్స్..!

కీరదోస: కీరదోసకాయ సమ్మర్ వెజిటేబుల్ అని చెప్పవచ్చు. ఎందుకంటే కీరదోసకాయలో ఆరోగ్య గుణగణాలతో పాటు బ్యూటీ బెనిఫిట్స్ కూడా పుష్కలంగా ఉన్నాయి. కాబట్టి కీరదోసకాయతో ముఖాన్ని మసాజ్ చేసి మెరిసే చర్మ సౌందర్యాన్ని సొంతం చేసుకోండి.

వేసవిలో చర్మసౌందర్యాన్ని కాపాడే 10 కూలింగ్ టిప్స్..!

పుచ్చకాయ: ఇది చర్మానికి చల్లదనాన్ని ఇవ్వడంతో పాటు, తాజాగా కనబడేలా చేస్తుంది. మెరిసే చర్మాన్ని నేచురల్ గా పొందాలనుకుంటే ఈ పుచ్చకాయను అధికంగా తినాలి. తినడంతో పాటు ముఖానికి మాస్క్ లా వేసుకోవాలి.

వేసవిలో చర్మసౌందర్యాన్ని కాపాడే 10 కూలింగ్ టిప్స్..!

టమోటో: టమోటో టమోటా వృద్ధాప్యం రానివ్వకుండా పోరాడుతుంది. ఇంకా ముఖంలోని సన్నని గీతలు మరియు ముడుతలను తగ్గిస్తుంది. సన్ టాన్ తో పోరాడ శక్తిని కూడా కలిగి ఉండి, చర్మానికి రక్షణ కల్పిస్తుంది. కాబట్టి టమోటోతో ఫేస్ ప్యాక్ వేసుకోవడం చాలా మంచిది.

వేసవిలో చర్మసౌందర్యాన్ని కాపాడే 10 కూలింగ్ టిప్స్..!

స్ట్రాబెర్రీ: చర్మాన్ని శుభ్రపరచడంతో పాటు వృద్ధాప్యం రానివ్వకుండా పోరాడి, చర్మాన్ని టైట్ గా ఉండేలా చేస్తుంది. మరియు ముఖంలో మంచి మెరుపును తీసుకొస్తుంది.

వేసవిలో చర్మసౌందర్యాన్ని కాపాడే 10 కూలింగ్ టిప్స్..!

మామిడి: ఈ సమ్మర్ ఫ్రూట్ ను తినడానికి మాత్రమే కాదు బ్యూటీ వస్తువుగా కూడా ఉపయోగించి చర్మానికి కొత్త అందాన్ని తీసుకురావచ్చు. మామిడిపండ్లను తినడమే కాదు అప్పుడప్పుడు మామిడి గుజ్జుతో ఫేస్ ప్యాక్ వేసుకోవడం కూడా చాలా అవసరం.

వేసవిలో చర్మసౌందర్యాన్ని కాపాడే 10 కూలింగ్ టిప్స్..!

సాండిల్ ఉడ్ పౌడర్: ఇది చర్మానికి చల్లదనాన్ని ఇవ్వడంతో పాటు ముఖాన్ని తాజాగా ఉంచడంతో పాటు సన్ టాన్ నుండి విముక్తి పొందవచ్చు. సాండిల్ ఉడ్ పౌడర్ ను పాలు లేదా పెరుగుతో మిక్స్ చేసి ముఖానికి ఫేస్ ప్యాక్ లా వేసుకోవడం వల్ల మంచి ఫలితం ఉంటుంది.

వేసవిలో చర్మసౌందర్యాన్ని కాపాడే 10 కూలింగ్ టిప్స్..!

ఐస్: తక్షణం ఫ్రెష్ గా కనబడాలన్నా? మరియు సమ్మర్ హీట్ తో పోరాడాలన్నా ఐక్యూబ్ తో ముఖం మీద స్ర్కబ్ చేయాలి. దాంతో ముఖం శుభ్రపడటంతో పాటు ముఖం మీద మొటిమలు మచ్చలను తగ్గిస్తుంది.

వేసవిలో చర్మసౌందర్యాన్ని కాపాడే 10 కూలింగ్ టిప్స్..!

రోజ్ వాటర్: వేసవిలో శరీరానికి చల్లదనం ఇవ్వడంతో పాటు మెరిసే చర్మ సౌందర్యాన్ని సొంతం చేసుకోవడానికి రోజ్ వాటర్ లో దూదిని ముంచి ముఖం మొత్తం మసాజ్ చేయాలి.

English summary

Beauty Ingredients You Need In Summer | వేసవిలో చర్మసౌందర్యాన్ని కాపాడే 10 కూలింగ్ టిప్స్..!


 As summer is here, you need to take much care of your health. There are few things that we usually miss out and this affects our skin. For example, lack of skin and hair care during summers can be really harmful in a long run.
Story first published: Tuesday, April 23, 2013, 11:58 [IST]
Desktop Bottom Promotion