For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఆమ్లా(ఉసిరి)జ్యూస్ తో 10 గ్రేట్ బ్యూటీ బెనిఫిట్స్

|

సాధారణంగా ఉసిరికాయతో తయారుచేసే ఊరగాయ, చట్నీ, జామ్ మరియు మురబ్బాను మీ అమ్మ లేదా అమ్మ చేతి వంటకాలను మీరు తిని ఉంటారు. అంతే కాదు ఈ ఉసిరికాయను కొన్ని హోం మేడ్ హెయిర్ ప్యాక్స్ లో లేదా ఇతర హోం రెమెడీస్ గా ఉపయోగించడాన్ని మీరు చూసి ఉంటారు. ఉసిరికాయ ఆరోగ్యానికి ఎలా ఉపయోగపడుతుందో మీకు తెలుసా? ఉసిరి కాయను జ్యూస్ రూపంలో లేదా ఎండబెట్టి లేదా పౌడర్ రూపం తీసుకోవడం వల్ల అనేక ఆరోగ్య మరియు సౌందర్య ప్రయోజనాలను పొందవచ్చు. ఉసిరికాయ రసం చర్మానికి మరియు జుట్టుకు అలాగే బరువు తగ్గడానికి కూడా చాలా ఉపయోగపడుతుంది.

ఉసిరి కాయ రసంలో అనేక బ్యూటీ బెనిఫిట్స్ ఉన్నాయి. అంతే కాకుండా ఇతర బ్యూటీ ప్రయోజనాలు ముఖంలో ముడుతలను మరియు సన్నని చారలను తగ్గిస్తుంది. మీ చర్మాన్ని ప్రకాశవంతంగా మార్చుతుంది, కేశాలను ఆరోగ్యంగా పెరిగేలా ప్రోత్సహిస్తుంది, చిన్న వయస్సులోనే జుట్టు నెరవడాన్ని తగ్గిస్తుంది మరియు చుండ్రును నివారిస్తుంది. ఇంకా ఆమ్లా(ఉసిరి)జ్యూస్ మీ చర్మంలోని కొల్లాజెన్ ఉత్పత్తిని ప్రోత్సహించి మిమ్మల్ని యవ్వనంగా ఉండేలా చేస్తుంది. యవ్వనస్తులుగా కనబడుతారు. ఇంకా ఆమ్లా(ఉసిరి)జ్యూస్ చర్మానికి మంచి టోనర్ గా మరియు చర్మాన్ని టైట్ చేస్తుంది. అందుకే ఈ ఆమ్లా(ఉసిరి)జ్యూస్ ను మీ రెగ్యులర్ డైట్ లో చేర్చుకొని అనేక ఆరోగ్య, బ్యూటీ బెనిఫిట్స్ ను పొందండి. ఇక్కడ మీకోసం ఆమ్లా(ఉసిరి)జ్యూస్ యొక్క కొన్ని బ్యూటీ బెనిఫిట్స్ ను అంధిస్తున్నాం....

చిన్న వయస్సులోనే పెద్దవారిగా కనబడటాన్ని తగ్గిస్తుంది:

చిన్న వయస్సులోనే పెద్దవారిగా కనబడటాన్ని తగ్గిస్తుంది:

ఆమ్లా(ఉసిరి)జ్యూస్ మీ చర్మానికి అద్భుతంగా పనిచేసి, మిమ్మల్ని యవ్వనంగా కనబడేలా చేస్తుంది. ఆమ్లా(ఉసిరి)జ్యూస్ లో పుష్కలమైన యాంటీఆక్సిడెంట్స్ ఉన్నాయి. అందువల్లే ఇది ప్రీమెచ్యుర్ ఏజింగ్, ముడుతలు, మరియు ఫైన్ లైన్స్ ను నివారిస్తుంది .

స్కిన్ పింగ్మెంటేషన్:

స్కిన్ పింగ్మెంటేషన్:

ఆమ్లా(ఉసిరి)జ్యూస్ తో ఇది ఒక గ్రేట్ బ్యూటీ బెనిఫిట్. మీరు కనుక రెగ్యులర్ గా ఆమ్లా(ఉసిరి)జ్యూస్ ను త్రాగినట్లైతే మీరు ఖచ్చితంగా ప్రకాశవంతమైన మరియు మెరిసేటి ఒక చర్మ సౌందర్యాన్ని పొందవచ్చు . మూతి, పెదవుల చుట్టు, మరియు గడం వద్ద చర్మం రంగులో మార్పు ఉంటుంది. దీనికి కారణం పిగ్మెంటేషన్. కాబట్టి ఆమ్లా(ఉసిరి)జ్యూస్ రెగ్యులర్ గా తీసుకుంటే పిగ్మెంటేషన్ తగ్గించి మీ చర్మం ప్రకాశవంతంగా మెరిసేలా చేస్తుంది.

అదనపు ఫ్యాట్ ను కరిగిస్తుంది:

అదనపు ఫ్యాట్ ను కరిగిస్తుంది:

మీరు ఎల్లప్పుడు ఫిట్ గా ఉండాలని మరియు బరువు తగ్గాలని కోరుకొనే వారైతే, అందుకు ఆమ్లా(ఉసిరి)జ్యూస్ చాలా గొప్పగా సహాయపడుతుంది . ప్రతి రోజూ ఆమ్లా(ఉసిరి)జ్యూస్ త్రాగండి. దాంతో మీ శరీరంలో ప్రోటీన్ మొటబాలిజంను పెంచుకొని, బరువు తగ్గడానికి ప్రయత్నించండి.

మీ కేశాలు ఆరోగ్యంగా :

మీ కేశాలు ఆరోగ్యంగా :

ప్రతి రోజూ క్రమం తప్పకుండా ఒక గ్లాసు ఆమ్లా(ఉసిరి)జ్యూస్ ను త్రాగడం వల్ల మీ కేశఆరోగ్యానికి చాలా మంచిది . ఎందుకంటే ఆమ్లాలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. విటమిన్ సి లోఫించడం వల్ల హెయిర్ బ్రేకేజ్, జుట్టు చిట్లడం, నిర్జీవమైన జుట్టు సమస్యలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఈ సమస్యలన్నింటికి ఒక ఉత్తమ పరిస్కారం ఆమ్లా(ఉసిరి)జ్యూస్.

చిన్న వయస్సులో జుట్టు తెల్లబడటాన్ని తగ్గిస్తుంది:

చిన్న వయస్సులో జుట్టు తెల్లబడటాన్ని తగ్గిస్తుంది:

ఇన్ని బ్యూటీ బెనిఫిట్స్ ఉన్న ఆమ్లా(ఉసిరి)జ్యూస్, మీ జుట్టు తెల్లబడటానికి ఒక అద్భుతమైన ప్రయోజని కారిగా పనిచేస్తుంది. ఎందుకంటే వీటిలో పుష్కలమైన యాంటీఆక్సిడెంట్స్ మరియు విటమిన్ సి ఉండి, ప్రీమెచ్చ్యుర్ గ్నేయింగ్ హెయిర్ ను తగ్గిస్తుంది.

చుండ్రు నివారిస్తుంది:

చుండ్రు నివారిస్తుంది:

ప్రతస్తుత రోజుల్లో మనందరిక చుండ్రు ప్రధాన జుట్టు సమస్యగా మారింది. మరి మీరు చుండ్రు నివారించుకోవాలంటే లేదా సమస్య రాకుండా ఉండాలన్నా ఆమ్లా(ఉసిరి)జ్యూస్ ను తీసుకోవాల్సిందే.

మీ చర్మానికి మంచి మెరుపును తీసుకొస్తుంది:

మీ చర్మానికి మంచి మెరుపును తీసుకొస్తుంది:

ఆమ్లా(ఉసిరి)జ్యూస్ లోని యాంటీఆక్సిడెంట్స్ మరియు విటమిన్ సి, మీ చర్మాన్ని మరింత ప్రకాశవంతంగా మార్చుతుంది మరియు చర్మంను మరింత బ్రైట్ గా కనబడేలా చేస్తుంది.

జీర్ణక్రియకు :

జీర్ణక్రియకు :

ఆమ్లా(ఉసిరి)జ్యూస్ మీ జీర్ణవ్యవస్థకు చాలా మంచిది మరియు రక్తంను ప్యూరిపై చేస్తుంది. ఈ రెండింటి లక్షణాల వల్ల అనేక చర్మసమస్యలను దూరంగా ఉంచుతుంది.

కొల్లాజెన్ ఉత్పత్తి:

కొల్లాజెన్ ఉత్పత్తి:

ఆమ్లా(ఉసిరి)జ్యూస్ వల్ల చర్మం చాలా సాఫ్ట్ గా, తేమగా మరియు యవ్వనంగా ఉంచుకోవడం కోసం చాలా అద్భుతంగా సహాయపడుతుంది. ఆమ్లా(ఉసిరి)జ్యూస్ లో విటిమన్ సి పుష్కలంగా ఉందని మీరు తెలుసుకంటే, ఇది చర్మం ఛాయను మెరుగుపరిచే కొల్లాజెన్ సెల్స్ ను చర్మంలోపల ఉత్పత్తిని పెంచుతుంది. దాంతో చర్మఛాయ తెల్లగా మార్చుకోవచ్చు.

డీహైడ్రేషన్:

డీహైడ్రేషన్:

వేసవి కాలంలో ఉసిరికాయ జ్యూస్ త్రాగడం వల్ల, శరీరాన్ని చల్లగా ఉంచి చర్మాన్నికి కావల్సినంత తేమనందిస్తుంది. మెత్తానికి శరీరాన్ని డీహైడ్రేట్ చేస్తుంది.

English summary

Beauty Uses Of Amla Juice

You must have had amla pickle, chutney, jam, murabba made by your mom or grandma. Also, you must have seen them using the Indian gooseberry in homemade hair packs or using it as some other home remedy.
Story first published: Thursday, November 14, 2013, 15:41 [IST]
Desktop Bottom Promotion