For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

పంచదారతో చర్మానికి అద్భుత సౌందర్య ప్రయోజనాలు

|

సాధారణంగా మన రెగ్యులర్ డైట్ లో పంచదార తప్పని సరిగా తీసుకొనే ఒక ఆహార పదార్థం. పంచదారను రోజులో ఏదో ఒక రూపంలో తీసుకుంటుంటాం . అయితే అధికంగా పంచదారను ఉపయోగించే వాళ్ళు బరువు పెరగడం మాత్రం కాయం. ఇంకా పంచదారను ఎక్కువగా ఉపయోగించడం వల్ల చర్మానికి కూడా హానీ కలిగిస్తుంది. చర్మ మీద ముడుతలు మరియు బ్రేక్ అవుట్స్ ఏర్పడుతాయి. అయితే అంత ఖచ్చితంగా వెంటనే పంచాదారను మానేయాలని లేదు. తక్కువ మోతాదులో తీసుకోవడం వల్ల అన్ని రకాల శ్రేయస్కరం. అయితే ఎక్స్ టర్నల్ గా పంచదార వల్ల చాలా ఉపయోగాలున్నాయి. మొటిమలను నివారించడాని పంచదారను స్ర్కబ్బింగ్ ఉపయోగించవచ్చు. పెదాలు సున్నితంగా తేమగా ఉండేందుకు ఉపయోగించవచ్చు . లిప్ స్టిక్ ఎక్కువ సమయం పెదాల మీద నిలిచి ఉండేందుకు బాగా సహాపడుతుంది. ఇన్ని ప్రయోజనలు కలిగిన ఉన్న పంచదారను వైట్ గోల్డ్ అంటారు. మరి ఈ వైట్ గోల్డ్ (పంచదార)తో బ్యూటీ బెనిఫిట్స్ ఏంటో ఒకసారి చూద్దాం..

Benefits Of Sugar For Your Skin

షుగర్ స్ర్కబ్: షుగర్ ఒక నేచురల్ బ్యూటీ వస్తువు. చర్మాన్ని ఎక్స్ ఫ్లోయేట్ చేస్తుంది . మీరు షుగర్, లెమన్ జ్యూస్ తేనె మిక్స్ చేసి ముఖానికి స్ర్కబ్ చేయడం వల్ల చాలా ఎఫెక్టివ్ గా ఫలితానలు అంధిస్తుంది . షుగర్ స్ర్కబ్ చాలా మన్నికైనది మరియు ఇది డెడ్ స్కిన్ సెల్స్ ను తొలగిస్తుంది. చర్మాన్ని ప్రకాశవంతంగా మార్చుతుంది . చర్మరంధ్రాల్లో చేరిన అన్ని రకాల దుమ్ముధూళిని శుభ్రం చేస్తుంది.

చర్మాన్ని సున్నితంగా చేస్తుంది: పంచదార చర్మాన్ని ఎక్స్ ఫ్లోయేట్ చేయడం మాత్రమే కాదు, బ్రౌన్ షుగర్ , ఆలివ్ ఆయిల్ మిశ్రమంతో స్ర్కబ్ చేయడం వల్ల చర్మాన్ని తేమగా, సాఫ్ట్ గా మరియు కాంతివంతంగా ఉంచడంలో అద్భుతంగా సహాయపడుతుంది. బ్రౌన్ షుగర్ స్పటికలు మీ చర్మానికి చాలా కఠినంగా అనిపిస్తే, బ్రౌన్ షుగర్ ను పౌడర్ చేసి అందులో ఆలివ్ ఆయిల్ మిక్స్ చేసి అప్లై చేయడం వల్ల చర్మం సున్నితంగా మారుతుంది .ఆలివ్ ఆయిల్లో విటమిన్ ఇ మరియు ఓమేగా 32 ఫ్యాటీ యాసిడ్స్ సహజంగానే చర్మాన్ని మాయిశ్చరైజ్ చేస్తుంది. బ్రౌన్ షుగర్ చర్మరంధ్రాల్లో చేరిన మురికిని తొలగిస్తుంది.

చర్మంలో నూనెను సమతుల్యం చేస్తుంది : పంచదారతో మరో గొప్ప ప్రయోజనం ఇది చర్మంలో ఆయిల్ బ్యాలెన్స్ చేస్తుంది . షుగర్ లో రెండు ముఖ్యమైన కాంపోనెంట్స్ గ్లైకోలిక్ యాసిడ్ మరియు ఆల్ఫా మైడ్రాక్సి యాసిడ్స్ కలిగి ఉంటాయి. ఈ రెండు కాంపోనెంట్స్ చర్మంలోని ఫర్ ఫెక్ట్ ఆయిల్ బ్యాలెన్స్ చేస్తుంది . అవి మీ చర్మాన్ని మరీ పొడిబారనివ్వకుండా లేదా మరీ ఎక్కువగా జిడ్డుగా లేకుండా సమతుల్యం చేస్తుంది. దాంతో మీరు ఆరోగ్యకరమైన మరియు రేడింట్ స్కిన్ పొందవచ్చు.

టాక్సిన్స్ నుండి రక్షణ కల్పిస్తుంది: పంచదారలో నేచురల్ యాంటీఏజింగ్ గుణాలున్నాయి. షుగర్ స్ర్కబ్ మీ చర్మాన్ని శుభ్రం చేస్తుంది . చర్మ కణాలకు టాక్సిన్ చేరకుండా సహాయపడుతుంది . దీర్ఘకాలంలో వ్రుద్యాపం ఛాయలు ఏర్పడకుండా కాపాడి చర్మం యవ్వనంగా ఉండేలా సహాయపడుతుంది.

అద్భుతమైన క్లెన్సర్: పంచదార వల్ల ఓ అద్బుతమైన బ్యూటీ బెనిఫిట్ ఏంటంటే పంచదారలో ఉండో గ్లైకోలిక్ యాసిడ్, ఉండటం వల్ల ఇది డెడ్ స్కిన్ సెల్స్ మరియు చర్మ దిగువను పేరొకొన్న దుమ్ము మరియు ధూలిని తొలిగించి చర్మాన్ని క్లీన్ గా ఉంచుతంది. చర్మ రంధ్రాలను పూర్తిగా శుభ్రపరిచ మొటిమలను, మచ్చలను పూర్తిగా తొలగిస్తుంది. ఇది వివిధ రకాల టాక్సిన్స్ నుండి చర్మానికి రక్షణ కల్పిస్తుంది. రెండు చెంచాల పంచదారలో కొన్ని చుక్కల తేనె మరియు బాదాం ఆయిల్ వేసి బాగా మిక్స్ చేసి చర్మ మీద మర్ధన చేయాలి.

లిప్ కేర్ : చాలా మంది మహిళలు పెదాల మీద పొడి బారిన, ఎండిన చర్మంతో బాధపడుతుంటారు. కాబట్టి పంచదారతో పెదాలను సున్నితంగా మాయిశ్చరైజింగ్ గా ఉంచుకోవచ్చు . ఆలివ్ ఆయిల్ లో కాస్ట్రో సుగర్ వేసి బాగా మిక్స్ చేసి పెదాల మీద స్ర్కబ్ చేయాలి. ఇలా చేయడం వల్ల పెదాలు కాంతివంతంగా సున్నితంగా మెరుస్తుంటాయి. డల్ నెస్ తగ్గిపోతుంది. ఇంకా పంచదారను లిప్ గ్లాస్ గా కూడా ఉపయోగించి లిప్ స్టిక్ ఎక్కువ సమయం నిలిచి ఉండేలా చేస్తుంది.

ఇన్ని సుగుణాలున్న పంచదారు ఇంటర్నల్ గా తక్కువ మోతాదులో ఎక్స్ టర్నల్ గాఎక్కువ మోతాదులో తీసుకోవడం ఇటు ఆరోగ్యంతో పాటు అటు అందాన్ని కూడా కాపాడుకోవచ్చు. అందాన్ని మెరుగుపరుచుకోవచ్చు.

English summary

Benefits Of Sugar For Your Skin

Sugar is generally considered pretty evil by most people. It is something that leads to weight gain, cellulite and a hoard of health problems. But as far your skin is considered, there are many benefits of sugar.
Desktop Bottom Promotion