For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

కళ్ళ చుట్టూ నల్లని వలయాలు మాయం చేసే బెస్ట్ టిప్స్

|

కంటి కింద నల్లటి వలయాలా? అయితే... ఫలానా క్రీమ్ అప్లై చేయండి. కళ్ల కింద నల్లని వలయాలను పోగొట్టుకోండి.! అనే రకరకాల ప్రకటనలు చూస్తుం టాం. ఆ క్రీములను తెచ్చి కొన్నిరోజులు కళ్ల చుట్టూ రాసుకోవడం, అయినా వలయాలు తగ్గడం లేదే అని బాధపడటం.. సహజం. నల్లని వలయాలతో నిస్తేజంగా ఉన్న కళ్లు ముఖ అందాన్ని పోగొట్టడమే కాదు, మనం తీవ్ర ఒత్తిడిలోనో, ఏదైనా ఆరోగ్యసమస్యతోనో ఉన్నామనే విషయాన్ని బహిర్గతం చేస్తాయి. కలువల్లాంటి కళ్లకింద నల్లటి చారికలు ఎందుకు ఏర్పడతాయి? ఆ చారికలపైన సనసన్నని కురుపులు ఎందుకు వస్తాయి? ఎంతో సున్నితంగా ఉండే ఐ స్కిన్ గరుకుగా ఎందుకు తయారవుతుంది? ఈ వలయాలను ఏవిధంగా పోగొట్టుకోవచ్చు? ఈ వివరాలకు సంబంధించిన అన్ని వివరాలతో పాటు... దాన్ని నివారించుకోడానికి అవసరమైన ‘ముందు జాగ్రత్త'లు ఇవి...

డెర్మటాలజీలో అతిసాధారణంగా పేర్కొనే సమస్య కళ్లకింద నల్లని వలయాలు. ఇంగ్లీషులో డార్క్ సర్కిల్స్ అనే ఈ వలయాలు వయసు పైబడట్టుగా, అనారోగ్యంగా, అలసిపోయినట్టుగా బయటి వారికి తెలియజేస్తాయి. ఇవి స్ర్తీ, పురుషులిద్దరిలోనూ వస్తుంటాయి. ఈ మధ్య కాలంలో పిల్లల్లోనూ వృద్ధి చెందుతున్న డార్క్‌సర్కిల్స్ యుక్తవయసులోనూ ఎక్కువగా గమనిస్తున్నాం.

కంటి కింది నలుపునకు కారణాలు: కంటి కింద నల్ల వలయాలు కనిపించడానికి అనేక కారణాలున్నాయి, ఎడతెరిపిలేని కంటి దురద, నిద్రలేమి (ఒత్తిడి, డిప్రెషన్, నిద్రలోపాలు.), అటోపిక్ డెర్మటైటిస్, అలెర్జీలు, హె ఫీవర్, దుమ్ము, ఎగ్జిమా, పాలిపోవడం: ఏదైనా దీర్ఘకాల ఆరోగ్యసమస్య ఉంటే కళ్లచుట్టూ ఉన్న చర్మం పాలిపోయినట్టుగా కనిపిస్తుంటుంది. ఐరన్ లేదా విటమిన్ లోపాలు,

వైద్యపరంగా వచ్చే ఇతర ఆరోగ్య సమస్యలు :
వయసు:-మందంగా ఉండే చర్మం వయసు పై బడుతున్నా కొవ్వును కోల్పోతుంది. దీని వల్ల రక్తకణాలకు అవసరమైన ఆహారం అందక కళ్లకింద వలయాలు ఏర్పడతాయి.
వంశపారంపర్యం: -కుటుంబంలో తరతరాల నుంచి ఈ సమస్య ఉంటే అది వారి పిల్లలకూ వచ్చేఅవకాశాలు ఉంటాయి.
జీవనశైలి:- పొగ తాగడం, మద్యం సేవించడం, కేఫినేటెడ్ సోడాలు తీసుకోవడం.. వంటివి.
ముక్కు సమస్యలు: కంటికి ముక్కుకు సంబంధించిన సూక్ష్మరక్తనాళాలు ఒత్తిడికి లోనయినప్పుడు డార్క్ సర్కిల్స్ ఏర్పడతాయి. ఇవే కాక, పిగ్మెంటేషన్, సూర్యకాంతికి ఎక్స్‌పోజ్ అవడం., క్యాచెక్సియా(Cachexia), అదేపనిగా చదవడం, టీవీ చూడ్డం.
నిద్రలేమి , దిగులు ఆందోళన ... ఇలా కారణము ఏదైనా కావొచ్చు దీర్గాకాలంలో అవి కంటికింద నల్లటి వలయాలనుఏర్పరచడం ద్వారా ముఖ సౌందర్యం మీద ప్రభావం చూపిస్తాయి. వాటిని తొలగించుకోవడానికి బోలెడన్ని చిట్కాలుఉన్నాయి.

నివారణ చిట్కాలు:

టమోటో పేస్ట్:

టమోటో పేస్ట్:

డార్క్ సర్కిల్స్ తగ్గించడంలో ఇది ఒక బెస్ట్ హోం రెమడీ. టమోటోలాను మన ఇంట్లో ఉండే నిత్యవసర వస్తువు. ఒక టమోటో, ఒక టేబుల్ స్సూన్ నిమ్మరసం, చిటికెడు పెసర లేదా శెనగిపిండి మరియు చిటికెడు పసుసు వేసి మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. ఈ చిక్కటి పేస్ట్ ను మీ కళ్ళ చుట్టూ అప్లై చేయాలి. 20నిముషాల తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా వారంలో మూడు సార్లు చేస్తే తప్పకుండా ఫలితం కనిపిస్తుంది.

బాదం ఆయిల్:

బాదం ఆయిల్:

రాత్రిపూట పడుకునేముందు కొద్దిగా ఆల్మండ్ క్రీమ్ ను కంటి చుట్టూరాసీ నెమ్మదిగా మసాజ్ చేయాలి ఇలా క్రమం తప్పకుండా చేస్తే డార్క్ సర్కిల్స్ తగ్గుముఖం పడతాయి. అల్ఫా హైడ్రోక్సియాసిడ్స్ లేదా రెటివాల్స్ గల నైట్ క్రీమ్ ను ముఖానికి మెడకు రోజూ రాసుకుంటే మంచి ఫలితం ఉంటుంది.

రోజ్ వాటర్:

రోజ్ వాటర్:

కాటన్ పాడ్స్(పత్తి ఉండలు) తీసుకొని రోజ్ వాటర్ లో కొన్ని నిముషాలు డిప్ చేసి, ఈ కాటన్ బాల్స్ ను మీ మూసిన కళ్ళ(కనురెప్పల) మీద పెట్టుకోవాలి. పది నిముషాల తర్వాత కాటన్ ఉండలు తీసేసి, చల్లటి నీటితో కళ్ళు తుడుచుకోవడం వల్ల కళ్ళ చుట్టూ ఉన్న నల్లటి చర్మ మారి ప్రకాశవంతంగా కనిపిస్తుంది.

పుదీనా ఆకులు:

పుదీనా ఆకులు:

కాసిని పుదీనా ఆకుల్ని తీసుకుని మెత్తగా నూరాలి. ఈ మిశ్రమాన్ని కంటిచుట్టూ ప్యాక్‌లా వేయాలి. ఆరాక కడిగేస్తే చాలు.. ఎంతో మార్పు కనిపిస్తుంది.

ఆరెంజ్ జ్యూస్ మరియు గ్లిజరిన్:

ఆరెంజ్ జ్యూస్ మరియు గ్లిజరిన్:

ఆరెంజ్ జ్యూస్ మరియు గ్లిజర్ (ఒక్కో చెంచా)సమంగా తీసుకొని, బాగా మిక్స్ చేసి రెగ్యులర్ గా అప్లై చేయడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. డార్క్ సర్కిల్స్ ను తొలగించడానికి ఇది ఒక మంచి హోం రెమడీ.

కీర దోస:

కీర దోస:

కీరదోస ముక్కల్ని స్త్లెసుల్లా కోసి ఫ్రిజ్‌లో ఉంచాలి. బాగా చల్లగా అయ్యాక కళ్లపై పెట్టుకోవాలి. పదిహేను నిమిషాల తరవాత వాటిని తొలగించాలి. ఇది ఎంతో మార్పు తెస్తుంది.

బంగాళదుంప:

బంగాళదుంప:

బంగాళా దుంపలో చర్మాన్ని తేటపరిచే (SkinLightening) తత్త్వం ఉంది . ఇది ఈ సమస్యకు చక్కటి విరుగుడు . బంగాళా దుంప రసాన్ని కంటి దింద రాసి పదినిమిషాల తర్వాత చల్లటి నీటితో కడగాలి . ఇలా వారానికి రెండు సార్లు చేసుంటే నలుపు క్రమము గా విరుగుతుంది . బంగాళదుంపను తురిమి చిన్న వస్త్రంలో మూటలా కట్టాలి. ఈ మూటను ఒక్కో కంటిపై పదిహేను నుంచి ఇరవై నిమిషాల దాకా ఉంచాలి. ఆ తరవాత గోరువెచ్చని నీటిలో ముంచిన దూదితో కడిగేసుకుంటే చాలు.

నిమ్మరసం:

నిమ్మరసం:

నిమ్మరసం, టమాటరసం చెంచా చొప్పున తీసుకోవాలి. ఈ రెండింటినీ బాగా కలిపి నల్లనివలయాలపై ప్యాక్‌లా రాయాలి. ఇలా రోజుకు రెండుసార్లు చేస్తే ఎంతో మార్పు కనిపిస్తుంది. నల్లని వలయాలు క్రమంగా తగ్గుతాయి.

టీ బ్యాగ్స్:

టీ బ్యాగ్స్:

ఫ్రిజ్‌లో పెట్టి తీసిన టీ బ్యాగుల్ని కళ్లపై ఉంచడం మనలో చాలామందికి తెలిసిందే. అయితే చేసే పొరబాటేంటంటే.. వాటిని నేరుగా వాడేస్తుంటారు. ఏం చేయాలంటే.. టీ బ్యాగుల్ని ముందుగా ఫ్రిజ్‌లో ఉంచి.. ఆ తరవాత కళ్లపై పెట్టుకోవాలి. అలాగే హెర్బల్‌ టీ బ్యాగుల్ని వాడకూడదు. వాటివల్ల అంత ప్రయోజనం ఉండదు.

కన్సీలర్:

కన్సీలర్:

మీరు వాడే మేకప్‌ సామగ్రిలో మీ చర్మతత్వానికి నప్పే కన్సీలర్‌ను తీసుకోండి. దీన్ని నల్లనివలయాలు కనిపించకుండా చేయవచ్చు. కంటి అడుగున రాసుకుంటే చాలు.

English summary

Best Home Remedies For Dark Circles

Admit it, you hate those dark patches around the eyes. Dark circles under the eyes look really ugly. They are mostly caused due to lack of sleep, stress, dehydration, pigmentation, anaemic tendency and unhealthy lifestyle choices. These dark circles makes us look tired and exhausted.
Desktop Bottom Promotion