For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ముఖం చర్మంపై నల్ల మచ్చలను తొలగించుకోవాలా?

By Super
|

ముఖం ఎంత అందంగా ఉన్నా సరే, ఒక చిన్న మచ్చ ఉంటే చాలు, ఎంతి కనిపిస్తూ అసహ్యంగా చేస్తుంది. అదే డార్క్ స్పాట్, సన్ స్పాట్ లాగ అన్నమాట. ముఖంలో ఒక చిన్నచిన్న మచ్చలు, ముఖం, చేతులు, మరియు భుజాల మీద కనిపిస్తుంటాయి. చాలా మంది మహిళల్లో ముఖం మీద ఏర్పడే డార్క్ స్పాట్స్ మహిళలు బ్యూటీకేర్ లో చిరాకు కలిగించే హర్డిల్స్ ఒకటి. ముఖం మీద ఈ అవాంచితడార్క్ స్పాట్స్ ను తొలగించుకోవడానికి కొంత సమయం తీసుకొనే ప్రక్రియ.కానీ కష్టం కాదు.

మీ చర్మం మీద ఏర్పడ్డ అవాంఛిత డార్క్ స్పాట్స్ మరియు డార్క్ పాచెస్ ను సహజపద్దతిలో నివారించుకోవడానికి, అద్భుతమైన చర్మ సంరక్షణా చిట్కాలు, అద్భుతమైన హోం రెమడీస్ ఇక్కడ కొన్ని ఉన్నాయి. ఏజ్ స్పాట్స్, లివర్ స్పాట్స్, సన్ స్పాట్స్, మెలస్మా, పిగ్మెంటేషన్ మరియు చర్మం యొక్క డార్క్ డిస్ కలరేషన్ తొలగించడానికి ఉల్లిపాయ, వెనిగర్, మరియు నిమ్మ జ్యూస్ బెస్ట్ హోం రెమడీస్ ఉన్నాయి.

నిమ్మరసం:

నిమ్మరసం:

మీరు ముఖం మీద బ్రౌన్ స్పాట్స్ (గోధుమ మచ్చలు) నివారణ కోసం నిమ్మరసం పరిహారంగా ఉపయోగించవచ్చు. ముఖం మీద బ్రౌన్ ఏజింగ్ స్పాట్స్ చికిత్సకు నిమ్మరసం హోంమేడ్ రెమడీస్ లో ఇది ఒకటి. ముఖంలో బ్రౌన్ స్పాట్స్ తొలగించడానకి కాటన్ బాల్స్ ను నిమ్మరసంలో ముంచి నల్ల మచ్చలున్న ప్రదేశలో మర్దన చేసి 15నిముషాలు తర్వాత శుభ్రం చేసుకోవాలి. ఈ హోం రెమడీ డార్క్ స్పాట్స్ ను వాడిపోయేలా చేస్తాయి మరియు బ్లాక్ స్కిన్ డిస్ కలరేషన్ ను సహజంగానే తేలిక చేస్తుంది.

టమోటా రసం:

టమోటా రసం:

ఫేస్ బ్లెమ్ షెష్, డార్క్ డిస్ కలరేషన్, ఫ్రీక్లెస్, మరియు డార్క్ పిగ్మెంటేషన్ తగ్గించేందుకు నిమ్మరసం మరియు టమోటా రసం యొక్క మిశ్రమం కూడా ప్రతి రోజూ అప్లై చేసే ఒక గొప్ప హోం రెమడీ. ఇది ముఖం మీద డార్క్ స్పాట్స్ (గోధుమ మచ్చలు) వదిలించుకోవటం ఒక సమర్థవంతమైన పరిష్కారం మార్గం.

 ఉల్లిపాయ రసం:

ఉల్లిపాయ రసం:

ఇంకా మీరు ఉల్లిపాయ రసం 1 టేబుల్ స్పూన్ మరియు 2 టేబుల్ స్పూన్ల తేనె మిక్స్ చేసి, ఈ రెండింటి కాంబినేషన్ ను డార్క్ స్పాట్స్ ఉన్న ప్రదేశంలో 15నిముషాల పాటు అప్లై చేయవచ్చు. ముఖంలో బ్రౌన్ ఏజ్ స్పాట్ ను వేగంగా వదిలించుకోవటం కోసం ఒక బెస్ట్ హోమ్ రెమడీలలో ఒకటి.

పాలు-తేనె:

పాలు-తేనె:

ముఖం మీద బ్రౌన్ స్పాట్స్ (గోధుమ మచ్చలు) వదిలించుకోవటం కోసం, పుల్లని పాలు, క్రీమ్, మరియు తేనె మూడింటిని మిక్స్ చేసి, ఈ మిశ్రమాన్ని మాస్క్ లాగా ముఖం, మెడ, చేతులు మరియు కాళ్ళకు కూడా అప్లై చేయవచ్చు. చర్మంలో డార్క్ స్పాట్స్ మరియు బ్రౌన్ ఏజ్ స్కిన్ స్పాట్స్ ను తొలగించడానికి ఇది ఒక ప్రభావవంతమైన నేచురల్ పద్దతి.

ఎర్రముల్లంగి రసం:

ఎర్రముల్లంగి రసం:

మీ ముఖం మీద ఎర్రముల్లంగి రసం దరఖాస్తు చేయడం చర్మంపై(బ్రౌన్ స్పాట్స్( గోధుమ మచ్చలు)తొలగించడానికి ఉత్తమ నివారణలలో ఒకటి. ముఖంలో బ్రౌన్ స్పాట్స్ ను నేచురల్ గా తొలగించడానికి 10 నిముషాలు అప్లై చేయడం ఉత్తమం.

నారింజ రసం

నారింజ రసం

ఒక మిక్సింగ్ బౌల్లో నిమ్మరసం, క్యారెట్ రసం మరియు పార్స్లీ రసంతో పాటు నారింజ రసం వీటన్నింటిని సమాన భాగాలుగా తిసుకొని బాగా మిక్స్ చేసి కలిపి. ఒక పత్తి బంతి సహాయంతో ముఖం మరియు మెడ మీద గోధుమ మచ్చలు ఈ మిశ్రమం వర్తించు మరియు ముఖం మీద గోధుమ మచ్చలు చికిత్స కోసం 30 నిమిషాల తర్వాత ఆఫ్ కడగడం. ఈ ముఖం, వయస్సు మచ్చలు, మరియు చిన్న చిన్న మచ్చలు బ్రౌన్ మచ్చలు తొలగించడానికి ఉత్తమ హోమ్ నివారణలు ఒకటి.

పసుపు ఆవాలు!

పసుపు ఆవాలు!

ముఖం మీద డార్క్ మచ్చలు వదిలించుకోవటం మరొక ఉత్తమ మార్గం పసుపు ఆవాలతో మాస్క్ వేసుకోవడం. కొన్ని పసుపు ఆవాలు మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. దీనికి కొద్దిగా పాలు కలిపి ఫేషియల్ మాస్క్ రెడీ చేసుకోవాలి. ఈ ఫేస్ మాస్క్ ను ముఖానికి అప్లై చేసి 20 నిముషాల పాటు అలాగే ఉంచి తర్వాత శుభ్రం చేసుకోవడం వల్ల ముఖంలో డార్క్ ప్యాచెస్ తొలగిపోతాయి.

స్ట్రాబెర్రీ మరియు ఆప్రికాట్!

స్ట్రాబెర్రీ మరియు ఆప్రికాట్!

స్ట్రాబెర్రీ మరియు ఆప్రికాట్ ను రెండింటిని కలిపి మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. తర్వాత ఈ పేస్ట్ ను ముఖం మీద డార్క్ స్పాట్స్ మరియు రెడ్ స్పాట్స్ ఉన్న ప్రదేశంలో ఈ పేస్ట్ ను అప్లై చేయాలి . అంతే కాదు, ఇది ముఖంలో డార్క్ స్పాట్స్ తో పాటు , బ్రౌన్ స్పాట్స్ , ఏజ్ స్పాట్స్, లివర్ స్పాట్స్ మరియు చిన్న చిన్న మచ్చలు కూడా వదిలించుకోవడానికి ఇది ఒక బెస్ట్ హోం రెమడీ.

చందనం పొడి!

చందనం పొడి!

ముఖం, మెడ, చేతుల మీద ఏర్పడ్డ బ్రౌన్ స్పాట్స్ తొలగించడానికి హోం మేడ్ స్ర్కబ్ కూడా చాలా బాగా సహాయపడుతుంది. అందుకు ఎరుపు మరియు తెలుపు చందనం పొడిని మిక్స్ చేసి, అందులో ఓట్ మీల్ పౌడర్ కూడా వేసి, అరకప్పు పాలు పోసి మెత్తగా పేస్ట్ లా తయారు చేసుకోవాలి. ఈ స్ర్కబ్ ను వారంలో 3సార్లు కనుక ఉపయోగించినట్లైతే మంచి ఫలితం ఉంటుంది. ఈ స్క్రబ్ ను డార్క్ స్పాట్స్ ఉన్న ప్రదేశం ముఖం, మెడ, చేతుల మీద సున్నితంగా తరచూ రుద్దడం వల్ల కొన్ని రోజలుకు మార్పు కనిపిస్తుంది.

మజ్జిగ!

మజ్జిగ!

ముఖంలో డార్క్ స్పాట్ తొలగించుకోవడంతో పాటు ముఖంలో డిస్ కలరేషన్ ను వదిలించుకోవటం కోసం, ఇది ఒక బెస్ట్ హోం రెమడీ. టమోటా రసం మరియు మజ్జిగ మిశ్రమం చాలా ప్రభావవంతమైన హోం రెమడీ. టమోటా రసం 2 టేబుల్ స్పూన్లుతో, మజ్జిగను 4 టేబుల్ కలపాలి. ఇప్పుడు దీన్ని బాగా మిక్స్ చేసి తర్వాత చర్మంపై బ్రౌన్ స్పాట్స్ , ఏజ్ స్పాట్స్ ఉన్న ప్రదేశంలో అప్లై చేయాలి.

వెల్లుల్లి రసం !

వెల్లుల్లి రసం !

ఒక టేబుల్ స్పూన్ ఉల్లిపాయ రసం, ఒక టేబుల్ స్పూన్ వెల్లుల్లి రసం మిక్స్ చేసి, ఈ మిశ్రమాన్ని డార్క్ స్పాట్స్ ఉన్న ప్రదేశంలో అప్లై చేసి 15 నిముషాల తర్వాత శుభ్రం చేసుకోవావలి. బ్రౌన్ స్పాట్స్ ను మాయం చేయడంలో ఇది ఒక బెస్ట్ హోం రెమడీ.

బంగాళాదుంప రసం !

బంగాళాదుంప రసం !

ముఖం మీద నల్ల మచ్చలను తొలగించడంలో ఒక సహజ పద్దతి.పచ్చి బంగాళాదుంప రసం ముఖం మీద డార్క్ మచ్చలు ఉన్న ప్రదేశంలో 15-20నిముషాలు అప్లై చేయాలి.

కలబంద గుజ్జు !

కలబంద గుజ్జు !

మీ ముఖ చర్మం మీద, డార్క్ స్పాట్స్, రెడ్ స్పాట్స్, ఎల్లో స్పాట్స్ తో మీరు చాలా విసుగు చెంది ఉంటే, మీరుఈ ఏజ్ స్పాట్ మచ్చలకు అలోవెరా ఎంపిక చేసుకోవాలి . తాజాగా ఉన్న కలబంద గుజ్జును లేదా అలొవెరాజెల్ ను ముఖానికి రోజుకు రెండు సార్లు రాయడం వల్ల మంచ ఫలితం ఉంటుంది. చర్మ సంరక్షణలో నేచురల్ పద్దతుల చాలా సమర్థవంతంగా పనిచేస్తాయి.

సాండిల్ ఉడ్ పౌడర్ !

సాండిల్ ఉడ్ పౌడర్ !

ముఖంలో డార్క్ స్పాట్స్ ను తగ్గించడంలో సాండిల్ ఉడ్ పౌడర్ మరియు నీళ్ళు మిక్స్ చేసి ముఖానికి అప్లై చేయాలి. ఇది ముఖంలో బ్రౌన్ స్పాట్స్, లివర్ స్పాట్స్ లేదా సన్ స్పాట్స్, మరయు ఇతర చర్మ సమస్యలను నివారించడంలో ఇది ఒక బెస్ట్ హోం రెమడీ.

విటమిన్ ఇ ఆయిల్ !

విటమిన్ ఇ ఆయిల్ !

మీ ముఖం మీద డార్క్ స్పాట్స్ చికిత్సకు, విటమిన్ ఇ ఆయిల్ ను ముఖానికి అప్లై చేయాలి. కొన్ని రోజులు క్రమం తప్పకుండా విటమిన్ ఇ ఆయిల్ ను రాస్తుడం వల్ల నల్ల మచ్చలు కనబడకుండా పోతాయి. ఈ నేచురల్ ట్రీట్మెంట్ వల్ల , మొటిమల తాలూకు మచ్చలు, ఏజ్ స్పాట్స్, లివర్ స్పాట్స్ మరియు బ్రౌన్ స్పాట్స్ తొలగించడానికి ఉపయోగకరంగా ఉంటుంది.

ఆపిల్ సైడర్ వెనిగర్ !

ఆపిల్ సైడర్ వెనిగర్ !

మీ చర్మంపై గోధుమ మచ్చలు వదిలించుకోవటం కోసం ఆపిల్ సైడర్ వెనిగర్ తాగడం, ఒక ఉత్తమమైన హోమ్ నివారణలలో ఒకటి. ఒక గ్లాసు నీళ్ళలో 2టేబుల్ స్పూన్ల ఆపిల్ సైడర్ వెనిగర్, తేనె మిక్స్ చేసి తాగాలి. ఇలా తరచూ చేయడం వల్ల ముఖంలో డార్క్ స్పాట్స్ తొలగిపోతాయి.

నిమ్మరసం, అలొవెరాజెల్, మరియు ఆపిల్ సైడర్ వెనిగర్ !

నిమ్మరసం, అలొవెరాజెల్, మరియు ఆపిల్ సైడర్ వెనిగర్ !

ఒక టేబుల్ స్పూన్ నిమ్మరసం, అలొవెరాజెల్, మరియు ఆపిల్ సైడర్ వెనిగర్ ను సమంగా తీసుకొని, అరకప్పు పెరుగులో వేసి బాగా మిక్స్ చేయాలి ఈ మిశ్రమాన్ని బ్రౌన్ స్పాట్స్ ఉన్న ప్రదేశంలో అప్లై చేసి అరగంట పాటు అలాగే ఉండాలి. ఈ మాస్క్ డార్క్ స్పాట్ సన్ స్పాట్స్ ను లైట్ గా మార్చేస్తుంది.

 6నుండి 8 గ్లాసుల నీరు !

6నుండి 8 గ్లాసుల నీరు !

చర్మం మీద ఏర్పడ్డ చిన్న చిన్న లేత నలుపు మచ్చలు, బుగ్గల మీద ఏర్పడ్డ మచ్చలని తొలగించడంలో నీరు గొప్ప హోం రెమడీ. ప్రతి రోజూ 6నుండి 8 గ్లాసుల నీరు తాగడం వల్ల , హానికరమైన విషాన్ని తీసివేయుటకు, చర్మం తడిగా ఉంచడానికి, మరియు క్రమంగా చర్మం డార్క్ స్పాట్స్ మరియు బ్రౌన్ స్పాట్స్ తొలగించడానికి సహాయపడుతుంది.

సన్ స్ర్కీన్ లోషన్ !

సన్ స్ర్కీన్ లోషన్ !

చర్మం మీద బ్రౌన్ స్పాట్స్ ఏర్పడటానికి కారణం సూర్య రశ్మిలోని హానికరమైన యూవీ కిరణాలు. కాబట్టి సూర్య రశ్మి నుండి మీ చర్మాన్ని రక్షించుకోవడా చాలా అవసరం. కాబట్టి మీరు బయటకు వెళ్ళే ముందు సన్ స్ర్కీన్ లోషన్ తప్పకుండా రాసుకోవాలి.

ముఖంలో ఎర్ర, నల్లమచ్చలు తొలగించే బెస్ట్ టిప్స్!

ముఖంలో ఎర్ర, నల్లమచ్చలు తొలగించే బెస్ట్ టిప్స్!

ఈ హోం రెమడీస్ తో మీకు మంచి మార్పును తీసుకొస్తుంది. అయితే వీటిని పాటించేటప్పుడు కొంత సమయం పడుతుంది. కొంత ఓపికగా క్రమం తప్పుకుండా ఈ చిట్కాలను పాటించినట్లైతే తప్పకుండా మంచి ఫలితాన్ని పొందవచ్చు. ఈ చిట్కాలు పాటించిన తర్వాత కూడా మీ చర్మంలో ఎటువంటి మార్పు కనిపించకపోతే అప్పుడు మీరు ఖచ్చితంగా డెర్మటాలజిస్ట్ ను (స్కిన్ స్పెషలిస్ట్ ను )కలవాలి.

English summary

Best Home Remedies to Get Rid of Brown Spots on Face

Dark spots such as sun spots and melasma appear on your face, hands and shoulders. The occurrence of brown spots on the face is one of the most irritating hurdles in beauty care for many women. Getting rid of the unwanted brown spots on face is a time consuming process but not difficult at all.
Desktop Bottom Promotion