For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

చర్మరక్షణకు ఇంట్లో తయారుచేసే మాయిశ్చరైజర్స్

By Super
|

సాదారణంగా మాయశ్చరైజర్స్ అనేవి సహజంగా లేదా కృత్రిమంగా ఉంటాయి. వీటిని మీరు రసాయనాల చర్యల భయం లేకుండా ఉపయోగించడానికి వీలుగా ఇంట్లోనే తయారుచేసుకోవటం ఉత్తమం. ఇంటిలో తయారు చేసిన మాయశ్చరైజర్స్ అద్భుతంగా ఉంటాయి. అంతేకాక చవకగా మరియు ఆరోగ్యకరమైన ఎంపికగా ఉంటాయి. కమర్షియల్స్ మాయశ్చరైజర్స్ ఖరీదు ఎక్కువగా ఉంటుంది. ఈ వాణిజ్య మాయశ్చరైజర్స్ లలో వివిధ పెట్రోలియం ఉత్పత్తుల వంటి హానికరమైన రసాయనాలు చాలా ఉంటాయి.

కొన్ని ఏళ్ళుగా వాణిజ్య ప్రకటనలలో మీ చర్మ సమస్యలకు బ్రాండ్ మాయశ్చరైజర్స్ చూస్తూనే ఉన్నాము. కానీ,నిజానికి ఇంట్లో తయారుచేసుకొనే మాయశ్చరైజర్స్ హానిచేయని విధంగా ఉంటాయి. సున్నితమైన చర్మం కోసం ఇంట్లో తయారుచేసుకొనే మాయశ్చరైసర్స్ ఉపయోగించటం ఒక సురక్షిత ఎంపిక అని చెప్పవచ్చు. అయితే కెమికల్స్ మీ చర్మంను నాశనం చేయవచ్చు. అందువల్ల సహజమైన ఉత్పత్తులను వాడటం ముఖ్యం.

సున్నితమైన చర్మ రకాల కోసం ఇంటిలో తయారు చేసిన మాయశ్చరైజర్స్ మీ చర్మం సమస్యలకు చాలా సహజంగా మరియు వేగంగా పనిచేస్తాయి. ఇంట్లో తయారుచేసిన మాయశ్చరైజర్స్ ఉపయోగించడం ద్వారా, మీరు ప్రధానంగా మీ ఆరోగ్యానికి ఏటువంటి దుష్ప్రభావాలను లేకుండా మీ సమస్యలను వదిలించుకోవచ్చు. మీరు మీ సొంత ఆరోగ్య ఉత్పత్తులను తయారు చేసుకోవటం వలన లాభదాయకంగాను మరియు సంతృప్తిగాను ఉంటుంది. శీతాకాలంలో సమర్థవంతమైన మాయిశ్చరైజర్ కోసం అందరూ ఎదురుచూస్తూ ఉన్నారు. ఇక్కడ కొన్ని అద్భుతమైన ఆలోచనలు ఉన్నాయి.

బాడి మాయిశ్చరైజర్

బాడి మాయిశ్చరైజర్

రెండు టేబుల్ స్పూన్ ల నిమ్మ రసం,ఒక స్పూన్ ఆలివ్ నూనె,1/3 కప్పు పాలు మూడింటిని బాగా కలపాలి. దీనిని రిఫ్రిజిరేటర్ లో ఉంచి ప్రతి రోజు ఇంట్లో మాయిశ్చరైజర్ గా ఉపయోగించవచ్చు.ఇది సున్నితమైన చర్మం కోసం ఇంట్లో తయారుచేసుకొనే ఒక మంచి మాయిశ్చరైజర్ అని చెప్పవచ్చు.

ఫేస్ మాయిశ్చరైజర్

ఫేస్ మాయిశ్చరైజర్

ఒక టేబుల్ స్పూన్ కొబ్బరి నూనె,ఒక టేబుల్ స్పూన్ తేనె,ఒక టేబుల్ స్పూన్ నిమ్మరసం మూడింటిని బాగా కలపాలి. దీనిని దీర్ఘకాలం ఉపయోగించడం కోసం ఒక రిఫ్రిజిరేటర్ లో నిల్వ చేయవచ్చు. అలాగే సున్నితమైన చర్మం కోసం ఇంట్లో తయారుచేసుకొనే ఒక మంచి మాయిశ్చరైజర్ గా ఉన్నది.

స్నానం తర్వాత మాయిశ్చరైజర్

స్నానం తర్వాత మాయిశ్చరైజర్

బాదం,కొబ్బరి,నువ్వుల నూనెలు మూడింటిని 10 స్పూన్స్ చొప్పున తీసుకోని కలపాలి. దీనిని ఒక సీసా లో ఉంచండి. స్నానం తర్వాత, మీరు మృదువైన మరియు సిల్కీ చర్మం కొరకు ఈ మిశ్రమంను రాయాలి. ఇంట్లో తయారుచేసిన మాయిశ్చరైజర్ ప్రయత్నించి తేడాను గమనించండి.

రిఫ్రెష్ మాయిశ్చరైజర్

రిఫ్రెష్ మాయిశ్చరైజర్

ఒక దోసకాయతో ఒక స్పూన్ నిమ్మరసం,రెండు స్పూన్ల ఆలివ్ నూనె కలిపి మిశ్రమంగా తయారుచేయాలి. దీనిని రిఫ్రిజిరేటర్ లో ఉంచి మీకు అవసరమైనప్పుడు ఉపయోగించండి.

పొడి చర్మం కోసం కలబంద మాయిశ్చరైజర్

పొడి చర్మం కోసం కలబంద మాయిశ్చరైజర్

నాలుగు స్పూన్ల కలబంద జెల్,ఒక స్పూన్ బాదం నూనె,ఒక స్పూన్ ఆలివ్ నూనె,కొన్ని చుక్కల రోజ్ ఆయిల్ కలిపి తయారుచేసుకోండి. ఈ మిశ్రమం మీ పొడి చర్మంను ఆర్ద్రీకరణ స్థితిలో ఉంచటానికి సహాయపడుతుంది.

సాధారణ చర్మం కోసం కలబంద మాయిశ్చరైజర్

సాధారణ చర్మం కోసం కలబంద మాయిశ్చరైజర్

నాలుగు స్పూన్ల కలబంద జెల్,ఒక స్పూన్ బాదం నూనె తీసుకోని కలపాలి. దీనిని గది ఉష్ణోగ్రత వద్ద నిల్వ ఉంచాలి. సాధారణ చర్మం కోసం ఇంట్లో తయారుచేసుకొనే మాయిశ్చరైజర్ గా ఉపయోగించాలి.

గులాబీ రేకుల మాయిశ్చరైజర్

గులాబీ రేకుల మాయిశ్చరైజర్

కొన్ని చుక్కల నీటిలో గులాబీ రేకులను వేసి బాయిల్డ్ చేయాలి. దీనిని వడబోసి దానిలో 2 టేబుల్ స్పూన్ల కలబంద రసం కలపాలి. మీ ఫ్రిజ్ లో భద్రపరుచుకోండి. చర్మం ఆర్ద్రీకరణ స్థితిలో మరియు మృదువుగా ఉండటానికి నిరంతరం రాస్తూ ఉండండి. అలాగే దీనిని సున్నితమైన చర్మం కోసం సురక్షితంగా ఉపయోగించవచ్చు.

కొబ్బరి నూనె మాయిశ్చరైజర్

కొబ్బరి నూనె మాయిశ్చరైజర్

కొబ్బరి నూనెను ఒక మంచి మాయిశ్చరైజర్ అని పిలుస్తారు. ఒక గిన్నెలో కొబ్బరి నూనె,విటమిన్ E మరియు లవెందర్ కలపాలి. ఉత్తమ ఫలితాల కోసం క్రమం తప్పకుండా ఉపయోగించండి. సున్నితమైన చర్మం కోసం ఇంట్లో తయారుచేసుకొనే మంచి మాయిశ్చరైజర్ గా ఉంది.

పాల మాయిశ్చరైజర్

పాల మాయిశ్చరైజర్

పాలలో రెండు స్పూన్ల ఆలివ్ నూనె ను కలపాలి. దానికి రెండు స్పూన్ల నిమ్మరస వేసి బాగా కలపాలి. సున్నితమైన చర్మం కోసం ఇంట్లో తయారుచేసుకున్న ఒక అద్భుతమైన మాయిశ్చరైజర్ గా ఉంది. ఈరోజే ప్రయత్నించండి.

English summary

Best Homemade Moisturiser For Winter

Moisturisers can be natural or synthetic. It is better to prefer homemade moisturisers, so that you can use it without the fear of reactions of chemicals. Homemade moisturisers are excellent, comparatively inexpensive and healthy option.
Desktop Bottom Promotion