For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

చర్మ మరియు జుట్టు సమస్యలకు పరిష్కార మార్గం కర్పూరం..!

|

కర్పూరం (Camphor) : ఇది మైనములా తెల్లగానూ పారదర్శకంగానూ వుండో ఒక ఘాటైన వాసన గల పదార్థము. స్వభావము : మంగలకరం , శుభప్రదమైన కర్పూరం అనాదికాలం నుండి వినియోగం లో ఉంది . భారత దేశం లో అన్ని ప్రాంతాలవారు కర్పూరం శుభకార్యాలకు తప్పనిసరిగా వాడతారు . పరిమళాలను వెదజల్లే కర్పూరం ఆలయాలలో హరతి ఇవ్వడానికి వినియోగించడం చిరకాలం నుండి వస్తుంది.

కర్పూరంలో గొప్ప ఔషధ గుణాలున్నాయి. ఒక ఘాటైన సువాసన గల కర్పూరం రసాయనిక ఆకర్షణ మాత్రమే కాదు. కర్పూరంను జుట్టు మరియు చర్మ సమస్యల చికిత్సకు దశాబ్దాల నుండి ఉపయోగిస్తున్నారు. ఇందులో అనేక బ్యూటీ బెనిఫిట్స్ ఉండటం వల్ల దీన్ని వివిధ రకాల ఆయుర్వేద బ్యూటీ ట్రీట్మెంట్స్ కోసి ఉత్తమ ప్రయోజనాలను అందించడం కోసి కర్పూరంను ఉపయోగిస్తున్నారు.

మొటిమలు మరియు మచ్చల నివారణకు కర్పూరంను విస్తృతంగా ఉపయోగిస్తున్నారు. కర్పూరంను కరిగించి ముఖం మీద మర్దన చేయడం వల్ల మొటిమలను, వాటి వల్ల ఏర్పడ్డ మచ్చలను నివారించవచ్చు. మరి కర్పూరం ఆరోగ్యకరమైన చర్మ సంరక్షణకు ఏవిధంగా ఉపయోగపడుతుందో తెలుసుకోవాలంటే ఈ సుగంధ కర్పూరం యొక్క బ్యూటీ బెనిఫిట్స్ ను ఒక సారి పరిశీలించండి...

చర్మ - జుట్టు సమస్యలకు పరిష్కారం కర్పూరం..!

చర్మం దురుద: చర్మ సమస్యలు దురస, చిరాకు వంటి సమస్యల నివారణకు కర్పూరంను ఉపయోగించవచ్చు. ఈ సమస్య ఉన్న ప్రదేశంలో కర్పూరంను మర్ధన చేయడం వల్ల తక్షణ ఉపశమనం కలిగిస్తుంది.

చర్మ - జుట్టు సమస్యలకు పరిష్కారం కర్పూరం..!

కాలిన గాయాలను మాన్పుతుంది: కర్పూరాన్ని నీటిలో అరగదీసి కాలిన గాయల మీద రాయాలి. ఇలా ప్రతి రోజూ చేయడం వల్ల కాలిన గాయాలు సులభంగా తగ్గిపోతాయి. కాలిన వెంటనే రాయాలి లేదంటే చర్మం మంట మరియు చికాకు కు దారితీస్తుంది.

చర్మ - జుట్టు సమస్యలకు పరిష్కారం కర్పూరం..!

మొటిమలు: మొటిమలను మరియు మచ్చలను నివారించడానికి మనం ఒక అద్భతమైన ఔషదం కావాలనుకుంటాం. అందుకు కర్పూరాన్ని బెస్ట్ బ్యూటీ ట్రీట్మెంట్ గా ఉపయోగించవచ్చు. కర్పూరం యాంటీఇన్ల్ఫమేటరీ ఔషదం. అందవల్లే ఇది మొటిమలు, మచ్చలకు అద్భుతంగా పనిచేస్తుంది. చర్మ సమస్యలు మరియు మొటిమలు, మచ్చలకు పూర్తిగా నివారించుకోవడానికి కర్పూరాన్ని ఒక అద్భుతమైన ఔషధంగా ఉపయోగించవచ్చు.

చర్మ - జుట్టు సమస్యలకు పరిష్కారం కర్పూరం..!

చర్మం దద్దుర్లు, మచ్చలు: మీ చర్మం మీద ఇన్ఫెక్షన్ వల్ల దద్దుర్లు, గీతలు ఏర్పడితే, ఆ ప్రదేశంలో కర్పూరాన్ని మర్దన చేస్తే చాలు. కర్పూరాన్ని ఆ ప్రదేశంలో రుద్దడం వల్ల చర్మం దద్దుర్ల నుండి తక్షణ ఉపశమనం అంధిస్తుంది.

చర్మ - జుట్టు సమస్యలకు పరిష్కారం కర్పూరం..!

పగిలిన పాదాలు: కర్పూరం యొక్క మరొక బ్యూటీ బెనిఫిట్ గరుకుగా ఉన్న పగిలిన పాదాలను ఉపశమనం కలిగిస్తుంది. అందమైన పాదాలను సొంతం చేస్తుంది. అందుకు కొద్దిగా కర్పూరాన్ని నీటిలో వేసి ఆనీటిలో కొద్దిసేపు పాదాలను నానబెట్టుకోవాలి. 5-10నిముషాల తర్వాత కాళ్ళను బయటకు తీసి స్ర్కబ్బర్ తో రుద్ది శుభ్రం చేసుకోవాలి.

చర్మ - జుట్టు సమస్యలకు పరిష్కారం కర్పూరం..!

హెయిర్ గ్రోత్: మీరు నమ్మండి కర్పూరం జుట్టుకు కూడా ప్రయోజనాలు కలిగిస్తుంది. ఇతర హేర్బల్ ఆయిల్స్ తో కర్పూరం నూనెను మిక్స్ చేసి తలకు పట్టించడం వల్ల హెయిర్ గ్రోత్ మరియు మైండ్ రిలాక్స్ చెంది ఒత్తిడిని తగ్గిస్తుంది. ఇంకా ఇది జుట్టు కణాలకు బలాన్ని చేకూర్చుతుంది. కేశాలకు మంచి మెరుపును అంధిస్తుంది. కర్పూరం నూనెలో గుడ్డు, పెరుగు వేసి బాగా మిక్స్ చేసి తలకు పట్టించి అద్భుతమైన ఆశ్చర్యకరమైన ప్రయోజనాలను గమనించండి.

చర్మ - జుట్టు సమస్యలకు పరిష్కారం కర్పూరం..!

ట్రీట్ హెయిర్ లాస్: హెయిర్ గ్రోత్ ను పెంచడంతో పాటు, హెయిర్ లాస్ కాకుండా పోరాడా గుణాలు ఇందులో పుష్కలంగా ఉన్నాయి. ప్రస్తుత రోజుల్లో హెయిర్ లాస్ అనేది కామప్ ప్రాబ్లెమ్ కాబట్టి కర్పూరం ఆయిల్ తో మీ తలకు మసాజ్ చేసి మంచి ఫలితాలను పొందండి.

English summary

Camphor's Beauty Benefits | చర్మ - జుట్టు సమస్యలకు పరిష్కారం కర్పూరం..!

Camphor has many medicinal properties. The strong aroma of camphor is not the only attraction of this chemical. Camphor has been used since decades to treat hair and skin problems. It has many beauty benefits that is why, in Ayurveda various beauty treatments are done using camphor.
Desktop Bottom Promotion