For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మొటిమలు-ముడుతలను తొలగించే అద్భుత ఔషధం గ్రీన్ టీ..!

|

గ్రీన్ టీ యొక్క ఆరోగ్యప్రయోజనాలు ఎన్ని ఉన్నాయో అందరికీ తెలిసిన విషయమే. గ్రీన్ టీ మీద అనేక అధ్యయనాలతో పాటు, వివిధ వార్తా పత్రికలు, ఆన్ లైన్ న్యూస్ లు వల్ల గ్రీన్ టీ బాగా ప్రచుర్య పొందేలా చేసారు . అయితే గ్రీన్ టీతో అందానికి ఉన్న ప్రయోజనాల గురించి మాత్రం అంతగా తెలియజేయలేదు. గ్రీన్ టీలోని యాంటీయాక్సిడెంట్స్ ఫ్రీరాడికల్స్ డ్యామేజ్ ను రిపేర్ చేయడానికి సహాయపడుతుందిని మనందికి తెలిసిన విషయమే . అయితే గ్రీన్ టీ లో కొన్ని ప్రత్యేకమైన యాంటీఆక్సిడెంట్స్ మరియు ఇతర ఆరోగ్యకరమైన పోషకాలు ఉండటం చేత అందానికి కూడా గొప్ప ప్రయోజనాలను అందిస్తుంది.

ఉదా: గ్రీన్ టీ ఇటు చర్మానికి మరియు అటు కేశాలకు కొన్ని అద్భుతమైన..ఆశ్చర్యకరమైన ప్రయోజనాలను కలిగిస్తుంది. అటువంటి కొన్ని ప్రయోజనాలు కొన్ని మీకోసం...

Complete Beauty Benefits Of Green Tea

1. యాంటీ ఏజింగ్: చర్మలో పాడైపోయిన లేదా డెడ్ స్కిన్ సెల్స్ తిరిగి పునరుద్ధరణ ప్రక్రియను వేగవంతం చేయడానికి సహాయపడే యాంటీ ఆక్సిడెంట్స్ గ్రీన్ టీలో పుష్కలంగా ఉన్నాయి. గ్రీన్ టీ తాగడం వల్ల మీ చర్మం ముందు కంటే మెరుగ్గా తక్కువ వయస్సు ఉన్న వారుగా కనబడుతారు మరియు చర్మ టైట్ గా కనిపిస్తుంది. గ్రీన్ టీ ముడుతలతో వ్యతిరేకంగా పనిచేస్తుంది మరియు మీ చర్మ మీద ఉన్న డార్క్ పాచెస్ ను మీ చర్మం నుండి అదృశ్యం చేయవచ్చు.

2. మొటిమలతో పోరాడుతుంది: చర్మంలోపల నిల్వఉన్న టాక్సిన్స్ (విషాల)వల్ల మొటిమ తరచుగా ఏర్పడుటాన్ని గ్రీన్ టీ అడ్డుకుంటుంది. చర్మ లో దాగిఉన్న అన్ని రకాల టాక్సిన్స్ ను బయటకు పంపడానికి బాగా సహాయపడుతుంది. ఇది ఖచ్చితంగా ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ వల్లే జరుగుతుంది. చర్మంలో దాగిఉన్న టాక్సిన్ బయటకు నెట్టియేబడి, మొటిమలను నివారించి మీ చర్మం కళకళలాడేలా చేస్తుంది.

3. సన్ ప్రొటక్షన్ : గ్రీన్ టీ త్రాగటం మరియు మీ చర్మంపై గ్రీన్ టీని అప్లై చేయడం వల్ల మీ చర్మాన్ని హానికరమైన ఆల్ట్రా వయోలెట్ కిరణాల నుండి రక్షింపబడుతుంది. ఇది మీ చర్మాన్ని శుభ్రపరచడంలో మిరయు వేసవి వేడినుండి సన్ టానింగ్ నుండి మీ చర్మాన్ని కాపాడటంలో చాలా బాగా సహాయపడుతుంది.

4. చర్మాన్ని మెరిసేలా చేస్తుంది: చర్మంలో దాగిఉన్న టాక్సిన్స్ మరియు మాలిన్యాలను చర్మం నుండి పూర్తిగా బయటకు నెట్టివేయబడేలా చేయడంతో చర్మం ప్రకాశవంతంగా మరియు తేలికపాటి చర్మం కనిపిస్తూ స్పష్టంగా ఉంచుతుంది. మెరిసే మరియు స్పాట్ లెస్ చర్మం కోసం ప్రతి రోజూ గ్రీన్ టీ తాగడం మేలు.

5. స్కిన్ క్యాన్సర్ నుండి రక్షింపబడుతుంది: గ్రీన్ టీ లో ఉన్న అనేక రకాలైన యాంటీఆక్సిడెంట్స్ క్యాన్సర్ తో పోరాడే లక్షణాలను కలిగి ఉంటుంది. ఇది చర్మక్యాన్సర్ నిరోధించడానికి ప్రత్యేకించి వర్తిస్తుంది. అంతే కాకుండా, సూర్యుని నుండి వెలువడే హానికరమైన యూవీ కిరణాల నుండి చర్మానికి రక్షణ కల్పిస్తుంది.

6. బరువు తగ్గిస్తుంది: గ్రీన్ టీ రెగ్యులర్ గా తీసుకోవడం వల్ల మీ జీవక్రియలను వేగవంతం చేస్తుంది మరియు జీర్ణక్రియ సమస్యలను నివారిస్తుంది. అంటే మీరు తీసుకొనే ఆహారాన్ని వేగవంతంగా మరియు చక్కగా జీర్ణమయ్యేలా సహాయపడుతుంది. అందుకే గ్రీన్ టీ మిమ్మల్ని త్వరగా స్లిమ్ గా మార్చడానికి సహాయపడుతుంది.

7. జుట్టు రాలడాన్ని అరికడుతుంది: గ్రీన్ టీ జుట్టు రాలడానికి అరికడుతుంది . ఆధునిక జీవనశైలివల్ల దీర్ఘకాలిక సమస్య నుండి బయటపడాలంటే గ్రీన్ టీ ని తప్పనిసరిగా తీసుకోవాలి. గ్రీన్ టీ తాగడం వల్ల హెయిర్ రూట్స్ కు బలాన్ని అందిస్తుంది మరియు జుట్టు పెరగడానికి సహాయపడే హెయిర్ పోలీసెల్స్ ను ఉద్దీపన చేయబడుతుంది. గ్రీన్ టీ మీ కేశాలకు అప్లై చేయడం వల్ల ప్రీ మెచ్యుర్ గ్రేయింగ్ హెయిర్ ను నివారిస్తుంది.

English summary

Complete Beauty Benefits Of Green Tea | గ్రీన్ టీ తో సౌందర్యం మీ సొంతం...!

Green tea and its health benefits have been greatly extolled by the media lately.Green tea works wonder for your skin and hair. Here are some of the most effective beauty benefits of green tea.
Story first published: Thursday, May 2, 2013, 11:16 [IST]
Desktop Bottom Promotion