For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

బ్లాక్ హెడ్స్&డెడ్ స్కిన్ నిరించే డైపీల్ ఫేస్ మాస్క్

|

ముందుగా, డిఐవై అంటే ‘డు ఇట్ యువర్ సెల్ఫ్' డై పీల్ మాస్క్ లు అంటే ఫేస్ మాస్క్ లు. వీటని సాధారణంగా మనం ఇంట్లోనే తయారుచేసుకోవచ్చు. డైపీల్ మాస్క్ లను చాలా అరుదుగా చేసుకుంటుంటారు. అనేక ఫేస్ మాస్క్ లను ఇంట్లోనే చాలా సులభంగా తయారుచేసుకోవచ్చు. పీల్ మాస్క్ తయారుచేయడం కొంచెం కష్టమైన పనే. ఎందుకంటే ఈ పీల్ మాస్క్ లో కొంచెం చిక్కగా ఉండి, చర్మానికి అతుక్కోనేలా చేసి, తిరిగి వాటిని తొలగించడానికి సులభంగా ఉండాలి.

అయితే, డై పీల్ మాస్క్ మీ చర్మంలో ఏర్పడ్డ బ్లాక్ హెడ్స్ తొలగించడానికి చాలా ఉత్తమమైన మార్గం. ఈ డైల్ ఫీల్ మాస్క్ లు చాలా ఉత్తమంగా ఉంటాయి. ఎందుకంటే ఇవి నేచురల్ వి కాబట్టి. మీ చర్మంలో బ్లాక్ హెడ్స్ మరియు డెడ్ స్కిన్ సెల్స్ ను నివారించడానికి మీరు డబుల్ ఫేస్ మాస్క్ రిసిపిలు అవసరం అవుతాయి.

మీరు ఇంట్లో సులభంగా తయారుచేసుకోగల డైపీల్ మాస్క్ లు ఇక్కడ కొన్ని ఉన్నాయి. వాటిని ట్రై చేయండి...

DIY Peel Off Masks To Try At Home

ఎగ్ వైట్ ఫేస్ మాస్క్ రిసిపి:
మీ ముఖం మీద బ్లాక్ హెడ్స్ ను తొలగించుకోవాలనుకుంటున్నారా? అయితే ఒక ఒక టేబుల్ స్పూన్ షుగర్ ను పౌడర్ లా చేసి, అందులో గుడ్డులోని తెల్లని సొన వేసి బాగా మిక్స్ చేసి ముఖం మొత్తం అప్లై చేయాలి. తర్వాత దాని మీద ఒక ఆర్గానికి టిష్యూ పేపర్ ను కూడా మీ ముఖం మీద అప్లై చేయాలి. నిధానంగా ముఖం మొత్తం సర్ధడం వల్ల, మీరు అది తొలగించడానికి చాలా సులభం అవుతుంది. తర్వతా టిష్యు మీద మరో సారి ఎగ్ వైట్ షుగర్ మిశ్రమాన్ని మరో సారి కోట్ చేయవచ్చు. ఈ డై పీల్ మాస్క్ ను 8-10నిముషాలు ముఖం మీద అలాగే ఉంచాలి. అది ఎండిన తర్వాత టిష్యు పేపర్ ను తొలగించడ వల్ల బ్లాక్ హెడ్స్ ను మీ టిష్యుపేపర్ కు అత్తుకొని ఉండటాన్ని మీరు గమనించవచ్చు.

గ్రీన్ టీ మరియు లెమన్ ఫేస్ మాస్క్ రిసిపి:
మొదట కొంచె గ్రీన్ టీని రెడీ చేసుకోవాలి తర్వాత అందులో కొద్దిగా నిమ్మరసం మిక్స్ చేసి, రెండు బాగా కలిసిపోయేలా స్పూన్ తో బాగా మిక్స్ చేయాలి. తర్వాత అందులో జెలటిన్ పౌడర్ కూడా జోడించి, మూడింటిని బాగా మిక్స్ చేయాలి. ఈ మిశ్రమాన్ని 30సెకండ్స్ ఓవెన్ లో వేడి చేసి, తర్వాత తిరగి బాగా మిక్స్ చేసి, ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేయాలి. ముఖం పూర్తిగా ఈ మిశ్రంతో కవర్ చేసి, పది నిముషాలు అలాగే ఉండనివ్వాలి . తర్వాత నిధానంగా డైల్ పీల్ మాస్క్ ను మీ ముఖం మీద క్రింది భాగం నుండి పైకి రోల్ చేస్తూ తొలగించాలి.

ఆరెంజ్ పీల్ మాస్క్:
ఆరెంజ్ తొక్కను ఎండలో బాగా ఎండబెట్టాలి. రెండు రోజులు ఎండలో ఎండిన తర్వాత, ఈ ఆరెంజ్ తోక్కలను మెత్తగా పౌడర్ చేయాలి . ఇప్పుడు స్టైమీద ఒక కప్పు నీళ్ళను వేడి చేసి, అందులో కొద్దిగా పంచదార వేసి, పూర్తిగా కరగనివ్వాలి. ఈ నీరు పంచదారతో కలిసి బాగా మరిగి, సగం అయ్యే వరకూ మీడియం మంట మీద ఉడికించుకోవాలి. ఈ చిక్కటి పంచదార సిరప్ లో ఒక టేబుల్ స్పూన్ ఆరెంజ్ తొక్క పౌడర్ ను మిక్స్ జోడించి, బాగామిక్స్ చేయాలి . తర్వాత ఈ మిశ్రమాన్ని మీ ముఖం మీద అప్లై చేయాలి . పదినిముషాలు అలాగే వదిలేసి, తర్వాత తొలగించాలి. ఇలా చేయడం వల్ల బ్లాక్ హెడ్స్ తొలగిపోవడం మాత్రమే కాదు, డెడ్ స్కిన్ సెల్స్ కూడా తొలగిపోతాయి.

ఈ సింపుల్ మరియు సులభం డ్రైపీల్ ఫేస్ మాస్క్ లను ప్రయత్నించి మంచి ఫలితాలను పొందండి. క్లియర్ స్కిన్ పొందండి.

English summary

DIY Peel Off Masks To Try At Home

First of all, DIY means 'Do It Yourself'. So DIY peel off masks are basically those face masks that are made at home. It is rare to find DIY peel off masks. There are lots of face mask recipes that can be easily made at home. But peel off masks are tough to prepare.
Desktop Bottom Promotion