For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ధూమపానం వల్ల మీ అందం అజ్ఞాతంలోకి వెళ్ళుతుంది...

|

ప్రస్తుత రోజుల్లో అందం కోసం..యవ్వనంగా కనబడటం కోసం ప్రజలు బ్యూటీ పార్లర్స్ మరియు జిమ్ లు, స్పా సెంటర్లు ఇలా ఒకటి కాదు పలు చోట్లకు పరుగులు తీస్తున్నారు. అయితే అలా అందం పాడవ్వడానికి కారణాలు తెలుసుకోకుండా తగిన జాగ్రత్తలు పాటించకుండా ఎన్ని ప్రయోగాలు చేసి ఫలితం మాత్రం శూన్యం. యవ్వనాన్ని దాచేసి, వయస్సు పైబడ్డవారిగా చేసే వాటిలో ధూమపానం కూడా ఒక ప్రధాన పాత్ర పోషిస్తుంది. స్మోకింగ్ వల్ల చర్మం, జుట్టు మరియు పళ్ళు చాలా అసహ్యంగా చేయడంమే కాదు మీ అందాన్ని హరించివేసి మీరు ఉన్న వయస్సుకన్నా పదింతలు ఎక్కువగా కనబడేలా చేస్తుంది. పొగత్రాగేవారి ముఖం గీతలు, ముడుతలు, గౌట్ లక్షణాలు మరియు గ్రే స్కిన్ వంటి మార్పులు చోటు చేసుకుంటుంది. చాలా ఎక్కువ సంవత్సరాల నుండి పొగత్రాగడం వల్ల చర్మం పాడవుతుంది. చర్మాన్ని తిరిగి యథాస్థితికి లేదా రిపేర్ చేసుకోలేనంతగా పాడవుతుంది. కాబట్టి పొగత్రాగేముందు చర్మానికి ఏవిధంగా హాని కలిగిస్తుందో తెలుసుకొని ఇప్పటికే ఆలస్యం అయుంటే వెంటనే పొగత్రాగడం మానేయండి...

Effects of Smoking on Skin
వృద్ధాప్యం చర్మం: వృద్ధాప్య ఛాయలు రానియ్యకుండా మీ చర్మాన్ని కాపాడుకోవడానికి సూర్యుని నుండి వెలువడే యూవీ కిరణాల రక్షణ కల్పించబడుతారా? సూర్యుని నుండి చర్మానికి హాని కలిగించే విధం కంటే ఇంకా ఎక్కువగా స్మోక్ చేయడం వల్ల చర్మానికి హాని కలుగుతుంది. గుప్పెడు సిగరెట్ పొగను పీల్చడం వల్ల శరీరంలో ఫ్రీరాడికల్స్ ట్రిలియన్లలో ఊపిరితిత్తులలో ఉత్పత్తి అవుతాయి. అవి శరీరం మొత్తం వ్యాప్తి చెందుతాయి. మీ శరీరం మీద ఉన్న చర్మానికి కావల్సిన ఆక్సిజెన్ స్థానంలో సిగరెట్స్ లోని రసాయనాలు అంధిస్తుంది. అవి శరీరంలో కొల్లాజెన్(మీరు యవ్వనంగా కనపడేందుకు సహాయపడే విటమిన్ సి) ఉత్పత్తిని క్షీణింపచేస్తాయి. దాంతో యవ్వనంగా కనబడాల్సిన మీరు చిన్న వయస్సులోనే వృద్ధాప్యం ఛాయలు మిమ్మల్ని వెంటాడుతాయి.

స్కిన్ క్యాన్సర్: స్మోకింగ్ వల్ల స్కిన్ క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఎక్కువని చాలా అద్యయనాలు నిర్ధారించాయి. సిగరెట్ మరియు పైపు ధూమపానం వల్ల చర్మ క్యాన్సర్ పెంపొందించుకోవడం రెండు రెట్లు పెరిగే అవకాశం ఉందని కనుగొనబడింది. స్మోకింగ్ వల్ల గతంలో వారిలో కంటే ప్రస్తుత ప్రజల్లో ఎక్కువ వచ్చే అవకాశం ఉంది.

ముడుతలు: పొగ త్రాగడం వల్ల మీ చర్మం సాగే గుణం తగ్గిపోతుంది. దాంతో ముడుతలకు దారితీస్తుంది. మీరు కనుకు అధికంగా స్మోక్ చేస్తున్నట్లైతే, పొగతాగని వారికంటే మీలో 5 రెట్లు ముడుతలు ఏర్పడే ప్రమాదం ఉంది. మీ కళ్ళ చుట్టూ ఉబ్బెత్తుగా మారడం మీరు గమనించవచ్చు. అది మీరు స్మోక్ చేసే సమయంలో కళ్ళను మూయడం వల్ల ఇలా ఏర్పడుతుంది.

స్కిన్ టోన్: ధూమపానం వల్ల వ్యక్తిగత లుక్ ను మరింత బక్కపలుచని మరియు పెద్దవారిలా కనబడేలా చేస్తుంది. ఇది అసమానమైన, చర్మ ఛాయను కలిగించేందుకు కారణం అవుతుంది. ఇది మీరు మర్కీ లేదా పుసుపు బూడిత రంగు ఇస్తుంది . ఇంకా మీ చర్మం పొడిబారడాన్ని మరియు శ్లేష్మ పొరలను గమనించవచ్చు.

చర్మం పల్చగా మారుతుంది: ధూమపానం వల్ల రక్త సరఫరాను పరిమితం చేస్తుంది, రక్తప్రసరణ ప్రభావితం మరియు రక్తనాళాలు తగ్గిపోవడానికి కారణం అవుతుంది. చర్మ కణాలకు రక్త నాళాల ద్వారా కొంత మొత్తంలో మాత్రమే ఆక్సిజెన్ అందుతుంది. ఇలా తక్కువ రక్తప్రసరణ కారణంగా, చర్మా చాలా బలహీనంగా కాంతిహీనంగా మరియు పల్చగా మారుటను మీరు గమనించవచ్చు.

ఇతర ప్రభావాలు: ధూమపానం వల్ల బ్లాక్ హెడ్స్ కు దారితీస్తుంది, రెసిన్ మరియు తార్, మీ చర్మ రంధ్రాలను మూసుకుపోయాల చేస్తుంది. దాంతో మీ చర్మం డీహైడ్రేషన్ కు గురిఅవుతుంది. పెదాలు నల్లగా మారుతాయి . ఇది మొటిమలు వంటి వైరల్ ఇన్ఫెక్షన్ ప్రమాధాన్ని పెంచుతుంది. ధూమపానం వల్ల మీ చర్మ డీహైడ్రేషన్ చెందినప్పుడు మీ చర్మం కాంతీహీనంగా, అసహజ, అనారోగ్యంగా కనడుతుంది. కాబట్టి ధూమపానం వల్ల ఆరోగ్యానికి మాత్రమే కాదు అందాన్ని కూడా పూర్తిగా దెబ్బతీస్తుంది కాబట్టి వెంటనే ధూమపానాన్ని నిలిపివేయడం ఉత్తమమైన మార్గం.

English summary

Effects of Smoking on Skin


 People are running around, trying to find different ways to look younger. But one fail-safe way to look older is by smoking. Smoking affects your skin, hair and teeth in the worst way possible and makes you look years older than you actually are. In 1985, the term 'smoker's face' was added to the dictionary. Its description includes lines, wrinkles, cheek lines, gaunt features, and pallid, grey skin.
Story first published: Tuesday, June 4, 2013, 11:34 [IST]
Desktop Bottom Promotion