For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

హాట్ సమ్మర్ లో మీ చర్మాన్ని ఉంచుకోండి కూల్ కూల్ గా..హాయి హాయిగా...

|

సాధారణంగా సంవత్సరం పొడవునా ప్రతి మూడు-నాలుగు నెలలకొకసారి కాలం(బుతువులు) మారుతుంటాయి. కాలంతో పాటు వాతావరణంలో అనేక మార్పలు వల్ల మన శరీరంలో కూడా మార్పులు చోటు చేసుకొంటాయి. అయితే రుతువును బట్ట మన శరీరానికి తగినంత రక్షణ కల్పించడం మన బాధ్యత. ప్రతి సీజన్ లో చర్మానికి రక్షణ కల్పించడం చాలా ముఖ్యం, వేసివి కాలం రాబోతోంది. ఈ వేసవికాలంలో చర్మం మీద డైరెక్ట్ uv కిరణాలు, మరియు దుమ్మ ధూళి వల్ల చర్మానికి హాని కలుగుతుంది. అంతే కాదు వేసవిలో ఎండల వల్ల వచ్చే చమటతో కూడా చర్మం పాడవుతుంది. కాబట్టి మీరు తప్పనిసరిగా చర్మం మీద తగినంత జాగ్రత్తలు తీసుకోవడం చాలా అవసరం. కూలింగ్ వస్తువులతో తాజా ఫేస్ ప్యాక్స్ వల్ల వేసవి టాన్ మరియు ఇతర చర్మ సమస్యల నుండి బయట పడటానికి సహాయపడుతుంది. మరి చర్మానికి చల్లదనాన్ని కల్పించి సూర్యుని తాపం నుండి రక్షణ పొందడానికి అనేక ఫేస్ ప్యాక్స్ ఉన్నాయి.

సమ్మర్ సీజన్ లో అతి వేడి వల్ల చర్మాన్ని డ్యామేజ్ చేస్తుంది మరియు అధికంగా చర్మ సంబంధిత సమస్యలను ఉదా: సన్ టాన్, సన్ బర్న్, ఏజింగ్ లేదా డార్క్ స్పాట్స్ కలుగజేస్తాయి. కాబట్టి ఈ సీజన్ లో సన్ స్ర్కీన్ లోషన్ రాయడం వల్ల మీ చర్మానికి రక్షణ కల్పించవచ్చు. లేదా ముఖానికి కవర్ అయ్యే విధంగా హాట్ లేదా స్టోల్ ధరించడం వల్ల ఎండ నుండి రక్షణ కల్పించబడుతుంది. ఏదేమైనా, ఈ సీజన్ లో మాత్ర చర్మానికి ఎక్స్ ట్రా కేర్ తీసుకోవడం మరియు చర్మాన్ని కూల్ గా ఉంచుకోవడం చాలా మంచిది.

ఈ వేసవికాలంలో చర్మ రక్షణకోసం సమ్మర్ ఫేస్ ప్యాక్స్ ఉపయోగించడంతో పాటు, మీరు హెల్తీ డైట్ మరియు ఎక్కువగా నీళ్ళు త్రాగడం కూడా పాటించాలి. వేసవి కాలంలో డైట్ సరిగా పాటించకపోయినా, నీరు తగినంత తీసుకోవకపోయినా శరీరం(చర్మం) డీహైడ్రేషన్ కు గురిఅవుతుంది. దాంతో వేసవికాలంలో అనేక చర్మ మరియు ఆరోగ్య సమస్యలను ఎదుర్కోవల్సి వస్తుంది కాబట్టి వాటర్ రిచ్ ఫుడ్స్ ను డైలీ డైట్ లో చేర్చువడంతో పాటు ముఖాన్ని తరచూ వాష్ చేసుకుంటుండాలి. వేసవి కాలంలో చెమట వల్ల మిమ్మల్ని డల్ గా మరియు డార్క్ గా కనబడేలా చేస్తుంది. మరి అలా ఉండకూడదనుకుంటే ఇక్కడ కొన్ని హోం మేడ్ ఫేస్ ప్యాక్స్ ఇస్తున్నాం. అవి మీచర్మానికి కూలింగ్ ఎఫెక్ట్ ను కలిగించడమే కాకుండా, సన్ టాన్ తో పోరాడుతుంది. ఈ హోం మేడ్ సమ్మర్ ఫేస్ ప్యాక్స్ వల్ల తాజాగా మరియు డిటాన్డ్ గా ఉండవచ్చు. మరి ఆ తాజాదనం కలిగించే వస్తువులేంటో ఒకసారి చూద్దాం...

హాట్ సమ్మర్ లో కూల్ ఫేస్ ప్యాక్స్ తో ఫేస్ ఫ్రెష్ గా..

నిమ్మ: ఈ సిట్రస్ పండ్లను డిటాన్ మరియు చర్మ రక్షణకు ఉపయోగించవచ్చు. తాజా నిమ్మ చక్రాన్ని తీసుకొని ముఖానికి మసాజ్ చేయాలి. లేదా మీ హోం మేడ్ ఫేస్ ప్యాక్ లో నిమ్మరసాన్ని మిక్స్ చేసుకోవాలి. ఇలా చేస్తే చర్మాన్ని శుభ్రపరచడంతో పాటు, డెడ్ స్కిన్ సెల్స్ ను తొలగిస్తుంది. డి టాన్ కలిగి ఉంటుంది.

హాట్ సమ్మర్ లో కూల్ ఫేస్ ప్యాక్స్ తో ఫేస్ ఫ్రెష్ గా..

తేనె: తేనెను ఎగ్ వైట్ తో కానీ లేదా ఇతర స్కిన్ కేర్ వస్తువులతో కానీ, మిక్స్ చేసినప్పుడు, తేనెలో అనేక స్కిన్ కేర్ బెనిఫిట్స్ కలిగి ఉన్నాయి. ఇది చర్మానికి మాయిశ్చరైజర్ గా మరియు డార్క్ పిగ్మెంటేషన్ ను తొలగిస్తుంది మరియు చర్మానికి కూలింగ్ ఎఫెక్ట్ ను కలిగిస్తుంది. దీన్ని మీ హోం మేడ్ ఫేస్ ప్యాక్స్ లో చేర్చుకొని ఈ సమ్మర్ సీజన్ లో ఉపయోగించండి.

హాట్ సమ్మర్ లో కూల్ ఫేస్ ప్యాక్స్ తో ఫేస్ ఫ్రెష్ గా..

బొప్పాయి: బొప్పాయిని మెత్తగా చేసి,అందులో పెరుగు లేదా తేనె మిక్స్ చేయాలి ముఖానికి అప్లై చేయడం వల్ల చర్మాన్ని శుభ్రపరచడంతోపాటు చర్మాన్ని టైట్ చేస్తుంది.

హాట్ సమ్మర్ లో కూల్ ఫేస్ ప్యాక్స్ తో ఫేస్ ఫ్రెష్ గా..

పెరుగు: ఈ వేసవికాలంలో పెరుగును చర్మ రక్షణకు,అదేవిధంగా కేశసంరక్షణకు ఉపయోగించవచ్చు.ఈ పెరుగు చర్మానికి తాజాదన్నాన్ని కలిగించడమే కాకుండా డిటాన్ మరియు చర్మాన్నిసాఫ్ట్ గా ఉంచుతుంది.

హాట్ సమ్మర్ లో కూల్ ఫేస్ ప్యాక్స్ తో ఫేస్ ఫ్రెష్ గా..

కీర దోసకాయ: ఈ వేసవికాలంలో చర్మాన్ని కూల్ గా.. ఫ్రెష్ గా ఉంచడానికి తాజా వెజిటేబుల్స్ ను కూడా ఉపయోగించవచ్చు. తాజా కీరదోసకాయ ముక్కతో ముఖానికి మసాజ్ చేయడం వల్ల చర్మం శుభ్రపరచడంతోపాటు, కీరకాయను చక్రాల్లా కోసి కళ్ళ మీద పెట్టుకోవడం వల్ల కళ్ళు విశ్రాంతి పొందుతాయి, కళ్ళ మంటలను నుండి ఉపశమనం పొందేలా చేస్తాయి.

హాట్ సమ్మర్ లో కూల్ ఫేస్ ప్యాక్స్ తో ఫేస్ ఫ్రెష్ గా..

టమోటో: టమోటో పాపులర్ స్కిన్ కేర్ ప్రొడక్ట్. టమోటోలో ఉన్నయాంటీఆక్సిడెంట్స్ మరియు విటమిన్ సి సన్ టాన్ తో పోరాడుతుంది, సన్ బర్న్ మరియు ఏజింగ్ సమస్యలతో పోరాడుతుంది. కాబట్టి టమోటో స్లైసులతో ముఖానికి, మెడకు మసాజ్ చేయండి. దాంతో చర్మాన్ని శుభ్రం చేసి, మెరుస్తూ ఉండేలా చేస్తుంది.

హాట్ సమ్మర్ లో కూల్ ఫేస్ ప్యాక్స్ తో ఫేస్ ఫ్రెష్ గా..

పుదీనా ఆకులు: పుదీనా ఆకుల వల్ల చర్మం కూలింగ్ ఎఫెక్ట్ ను పొందుతుంది. అంతే కాదు చర్మాన్ని శుభ్రంగా మరియు తాజాదనంతో ఉంచుతుంది. పుదీనా ఆకులను పేస్ట్ చేసి, అందులో రోజ్ వాటర్ మిక్స్ చేసి, ఈ మిశ్రమాన్ని మీ ముఖానికి మరియు మెడకు అప్లై చేయాలి. ఇది ముఖం మీద ఎండి లేదా తడి ఆరిన తర్వాత ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి.

హాట్ సమ్మర్ లో కూల్ ఫేస్ ప్యాక్స్ తో ఫేస్ ఫ్రెష్ గా..

సాండిల్ వుడ్ పౌడర్: మొటిమలు, మచ్చలు, చల్లదనానికి, చర్మాన్ని బిగుతుగా చేయడానికి మరియు చర్మాన్ని శుభ్రపరచడానికి ఈ సాండిల్ వుడ్ పౌడర్ పాపులర్ స్కిన్ కేర్ ప్రొడక్ట్ చాలా బాగా సహాయపడుతుంది. ఈ పౌడర్ ను రోజ్ వాటర్ తో కానీ, సాధారణ వాటర్ తో కానీ మిక్స్ చేసి బాగా పేస్ట్ లా తయారు చేసుకొని ముఖం, మెడ బాగంలో అప్లై చేసి అరగంట తర్వాత శుభ్రపరచుకోవాలి. చల్లటి నీటిని ఉపయోగించడం వల్ల మంచి ఫలితం ఉంటుంది.

హాట్ సమ్మర్ లో కూల్ ఫేస్ ప్యాక్స్ తో ఫేస్ ఫ్రెష్ గా..

వాటర్ మెలోన్(పుచ్చకాయ): అటు చర్మానికి ఇటు శరీరానికి కూలింగ్ ఎఫెక్ట్ అధికంగా కలిగించే పండు పుచ్చకాయ. కాబట్టి పుచ్చకాయను మీ ముఖానికి మసాజ్ చేయడం వల్ల చర్మం టైట్ గా మరియు డిటాన్ కలిగి ఉంటుంది.

హాట్ సమ్మర్ లో కూల్ ఫేస్ ప్యాక్స్ తో ఫేస్ ఫ్రెష్ గా..

ఐస్ క్యూబ్స్: మీ చర్మం తాజాగా మరియు కూల్ గా ఉండాలనుకొంటే, ఐస్ క్యూబ్స్ తో, రోజ్ వాటర్ తో మసాజ్ చేస్తే చాలు. ఇవి చర్మాన్నిశుభ్రపరుస్తుంది. సమ్మర్ లో మీ చర్మం తాజాగా ఉండటానికి సహాయపడుతుంది.

English summary

Face Packs For Cool Summer Skin | హాట్ సమ్మర్ లో కూల్ ఫేస్ ప్యాక్స్ తో ఫేస్ ఫ్రెష్ గా..

It is very important to care for your skin in every season. As summer is coming closer, your skin is going to get more exposed to sun and dirt. Sweating can also damage your skin so, you have to precisely pay attention to summer skin care. Fresh face packs with cooling ingredients can help fight summer tan and other skin related problems. From de-tan to cooling, there are many face packs for summer season.
Story first published: Thursday, March 21, 2013, 19:22 [IST]
Desktop Bottom Promotion