For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

చర్మానికి సన్ స్ర్కీన్ లోషన్ రాయండి...వేసవి వేడిని తగ్గించుకోండి...

|

వేసివి కాలం మొదలైపోయింది. మరి ఈ వేసవిలో మీ చర్మానికి రక్షణ కల్పించడం చాలా అవసరం. ఎందుకంటే సూర్యరశ్మి నుండి వెలువడే ఆల్ట్రావయొలెట్ కిరణాలు చర్మానికి హాని కలిగిస్తాయి. ఈ సమ్మర్ సీజన్ లో సూర్యుని నుండి వెలువడే యూవీ కిరణాల వల్ల చర్మాన్ని రక్షించుకోవడానికి మన బ్యాగులన్నీ వివిధ సన్ స్ర్కీన్ లోషన్లతో నింపిబడి ఉంటాయి. సమ్మర్ సీజన్ మన చర్మ సంరక్షణలో భాగంగా చర్మాన్ని సన్ టాన్ మరియు వేడి వల్ల ఏర్పడే స్కిన్ డ్యామేజ్, వడదెబ్బ నుండి చర్మాన్ని రక్షించుకోవడానిక సన్ స్ర్కీన్ లోషన్ బయటకు వెళ్ళే అరగంట ముందే రాయాల్సి ఉంటుంది.

మనందరం అనుకుంటాం ఈ సన్ స్ర్కీన్ లోషన్లు రోజంతా మన చర్మాన్ని రక్షిస్తాయని నమ్ముతాం. అదే విధంగా, సన్ స్ర్కీన్ లోషన్ గురించి మరికొన్ని నిజాలను తెలుసుకోవాలి. సన్ స్ర్కీన్స్ లోషన్స్ 24గంటలూ చర్మానికి రక్షణ కల్పించవు. అందువల్లే ఎంత విలువైన సన్ స్క్రీన్ లోషన్ ఉపయోగించినా కూడా మీ చర్మ రంగు మారి పోతుంది. మరి ఇటువంటి నిజాలు సన్ స్ర్కీన్ గురించి మరికొన్ని తెలుసుకోండి.

Facts about Sunscreens...!

మళ్ళీ మళ్ళీ రాయడం అవసరం: సన్ స్ర్కీన్ లోషన్ రోజంత చర్మానికి రక్షణ కల్పిస్తుందని ఎవరు చెప్పారు?ఒక సారి ప్రయత్నించి చూసి మీ చర్మ రంగును పరిశీలించండి. ముఖ్యంగా వేసవి కాలంలో మీరు ఖచ్చితంగా మళ్ళీ మళ్లీ రెండు మూడు సార్లైనా అప్లైచేయాలి. అలా చేస్తేనే చర్మానికి ఏర్పడే సన్ డ్యామేజ్ ను అడ్డుకోవచ్చు.

రెండు సంవత్సరాల కంటే ఎక్కువగానే సన్ స్ర్కీన్: సన్ స్ర్కీన్ లోషన్ తెచ్చి పెట్టి దాన్ని కొన్ని నెలలుగా ఉపయోగించకపోయినా పర్వాలేదు, వాటిని పడేయకూడదు. సన్ స్ర్కీన్ లోషన్ కనీసం మూడు సంవత్సరాల టైమ్ కలిగి ఉంటుంది . అలాగే సన్ స్ర్కీన్ లోషన్ బాటిల్ మీద ఉన్న సూచనలు తప్పక చదవాలి. మరియు ఎక్స్ పైరీ డేట్ ను గుర్తుంచుకోవాలి. ఎందుకంటే అన్ని రకాల సన్ స్ర్కీన్ లోషన్స్ ఎక్కువ కాలం నిల్వ ఉండవు. చాలా వరకూ అటువంటి సన్ స్ర్కీన్ లోషన్స్ కలర్ మారుతుంటాయి. అటువంటప్పుడు వాటిని రీప్లేస్ చేయడం మంచిది.

నీటి విలువలు కలిగిన సన్ స్ర్కీన్ లోషన్ ఉత్తమమైనవి:
సన్ స్ర్కీన్ లోషన్ కొనడానికి మార్కెట్ కు వెళ్లితే, అక్కడ మీరు ఎస్ ఎఫ్ పి(సన్ ప్రొటక్షన్ ఫ్యాక్టర్ )గురించి కన్ఫ్యూజ్ అవ్వొచ్చు . కాబట్టి ఎస్ ఎఫ్ 24 కంటే ఎస్ ఎఫ్ పి 30కి ప్రాధాన్యత ఇవ్వడం చాలా మంచిది. ముఖాన్ని, లేదా చేతులను కడగడం వల్ల సన్ డ్యామేజ్ కు కారణం అవుతుంది. కాబట్టి మన్నికైన సన్ స్ర్కీన్ లోషన్ కొనడం మేలు.

అది సన్ టాన్ క్రీమా లేదా సన్ స్ర్కీన్ లోషనా అని గమనించాలి: సన్ టాన్ కు గురియైన చర్మాన్ని సన్ స్ర్కీన్ లోషన్ రక్షణ కల్పిస్తుందని నమ్ముతాం. అందువల్లే, సన్ టాన్ వల్ల చర్మ సంరక్షణ కోసం కూడా సన్ స్ర్కీన్ లోషన్ ను ఉపయోగిస్తారు. అది కూడా మీ చర్మ తత్వాన్ని బట్టి సన్ స్ర్కీన్ లోషన్ కొనడం మంచిది. సన్ టాన్ సన్ స్ర్కీన్ చర్మలోతుగా యూవీ కిరణాలు పడకుండా అడ్డుకుంటుది. సన్ టాన్ వల్ల మీ చర్మ రంగు మారకూడదనుకుంటే సన్ ప్రొటక్షన్ సన్ స్ర్కీన్ లోషన్ కొనడం మంచిది.

వివిధ రకాల సన్ స్ర్కీన్ లోషన్స్: మీరు సన్ స్ర్కీన్ లోషన్ ను , జెల్ ను చర్మానికి మరయు కేశాలకు అప్లై చేయాలనుకుంటే అది తప్పే అవుతుంది. ఉదాహరణకు, సన్ స్ర్కీన్ లోషన్ చర్మానికి అంటుకొని చర్మం లోనికి ఇంకిపోతుంది. ముఖం మరియు కళ్ళ క్రింద వంటి ప్రదేశాల్లో రాయవచ్చు . అయితే సన్ స్ర్కీన్ జెల్స్ అనేవి కేశాలకు, క్రీమ్స్ అనేవి ముఖానికి గుర్తించాలి. మరి సన్ స్ర్కీన్ అప్లై చేసి ముందు ఈ నిజాలను తెలుసుకోండి. సన్ స్ర్కీన్ లోషన్ గురించి మరికొన్ని నిజాలు ఉండవచ్చ . మీకేమైనా తెలుసుంటే మాతో షేర్ చేసుకోండి?

English summary

Facts about Sunscreens...! | చర్మానికి రాసే సన్ స్ర్కీన్ అప్లై చేసే ముందు కొన్ని నిజాలు..!

Summer is here and it is time to protect your skin from the harmful sun rays. We all stuff our bags with sunscreens to fight the harmful UV rays of the sun. We coat our skin with sunscreen 20-30 minutes before stepping out to prevent sun damage like sun tan or sunburn.
Story first published: Thursday, March 14, 2013, 8:36 [IST]
Desktop Bottom Promotion