For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

జిడ్డుగా ఉన్న ముఖాన్ని కాంతివంతంగా మార్చే ఫ్రూట్ ప్యాక్స్....!

|

చర్మ సంరక్షణ విషయంలో చాలా మందికి సాధరణ చర్మం ఉంటుంది. కానీ కొందరిని ఆయిల్ చర్మ బాధిస్తుంటోంది. ఆయిల్ చర్మం వల్ల ముఖంలో జిడ్డుకారుతూ ఎంత తాజాగా కనబడాన్నా ప్రయోజనం ఉండదు. దానికి తోడు ఈ ఆయిల్ వల్ల ముఖం మీద మొటిమలు, మచ్చలు, జిడ్డుపేరుకుపోవడం వంటివి సమస్యలు ఎదురౌవుతాయి. పండ్లు ఆరోగ్యపరంగా చాలా ఆరోగ్యం అందుకే వాటిని మన డైలీ డయట్ లో చేర్చుతుంటాం. అంతే కాదు పండ్ల వల్ల స్కిన్ బెనిఫిట్స్ కూడా చాలానే ఉన్నాయి. చర్మతత్వాన్ని బట్టి పండ్లను ఎంపిక చేసుకొని చర్మ సమస్యలకు దూరంగా ఉండండి. ఉదాహరణకు: ఆయిల్ చర్మతత్వం ఉన్నవారికి అరటి, నిమ్మ, స్ట్రాబెర్రీ, ఆరెంజ్ మరియు కివి వంటివి బాగా పనిచేస్తాయి.

ఈ పండ్లతో వేసుకొనే ఫ్రూట్ ప్యాక్ తయారు చేయడం కూడా చాలా సులభం అంతే కాదు వీటి ప్రభావం కూడా మంచి ఫలితాలను అందిస్తాయి. కాబట్టి ఆయిల్ చర్మతత్వం ఉన్న వారు నేచురల్ హోమ్ మేడ్ ఫ్రూట్ ఫేస్ ప్యాక్ వేసుకోవాలనుకుంటున్నారా?ఇక్కడ ఇస్తున్న నాలుగు రకాల పండ్లు ఆయిల్ చర్మన్ని పోగొట్టి, తాజాగా ఉంచుతాయి.

1. అరటి: బాగా పండిన అరటి పండు ఆయిల్ స్కిన్ కి చాలా బాగా సహాయపడుతుంది. అరటి పండును మెత్తగా పేస్ట్ లా చేసుకొని అందులో కొన్ని చుక్కల తేనె, నిమ్మ రసం, వేసి బాగా మిక్స్ చేయాలి. ఈ ఫ్రూట్ ఫేస్ ప్యాక్ ను ముఖానికి మెడకు పట్టించాలి. అరగంట అలాగే ఉంచి, ఆ తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. అంతే ముఖంలో ఉండే మొటిమలు మచ్చలు నివారించబడం, చర్మం తాజాగా కనబడుతుంది. అరటిపండుకు ఇంకా కావాలనుకుంటే కొన్ని చుక్కల ఆరెంజ్ రసాన్ని కలుపుకోవచ్చు. సిట్రస్ పండ్లలో ఉండే యాసిడ్స్ ఆయిల్ గ్రంథుల మీద బాగా పినచేస్తాయి.

Fruit Face Packs To Treat Oily Skin

2. స్ట్రాబెర్రీస్: బెర్రీ అంటే బ్లూబెర్రీ మరియు స్ట్రాబెర్రీ. ఆయిల్ చర్మట్రీట్మెంట్ లో చాలా అద్భుతంగా పనిచేస్తుంది. కొన్ని స్ట్రాబెర్రీలను మెత్తగా పేస్ట్ చేసి, అందులో నిమ్మరసం కలిపి, ఫ్రూట్ ఫేస్ ప్యాక్ ను జిడ్డు చర్మం ఉన్న ముఖానికి పట్టించాలి. అరగంట తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇది ఆయిల్ చర్మం తో పోరాడటమే కాకుండా వయస్సు పైబడనియకుండా చేసి యాంటీఎజింగ్ గుణాలు ఇందులో పుష్కలంగా ఉన్నియి. కాబట్టి చర్మాన్ని తాజాగా మార్చి ముఖంలో ముడతలను తొలగిస్తుంది.

3. ఆరెంజ్: మీరు ఆరెంజ్ తొనలు లేదా ఆరెంజ్ రసం లేదా ఆరెంజ్ తొక్క ఏది ఉపయోగించినా చర్మానికి చాలా బాగా ఉపయోగపడుతాయి. ఆరెంజ్ తొక్కను ఎండబెట్టి మెత్తని పౌడర్ లా చేసి, గాలి చొరబడిని డబ్బాలో ఉంచి, ఫేస్ ప్యాక్ వేసుకొన్నప్పుడు ఉపయోగించుకోవచ్చు. ఆరెంజ్ లో విటమిన్ సి అదికంగా ఉండటం వల్ల ముసలితనపు లక్షణాలను కనబడనియ్యదు. చర్మతత్వాన్ని ఇప్రూవ్ చేస్తుంది. నిర్జీవమైన చర్మాన్ని పోగొట్టి డెడ్ స్కిన్ కణాలను తొలగిస్తుంది. ఆరెంజ్ జ్యూస్ ను ముఖానికి మర్ధన చేయవచ్చు లేదా ఫేస్ ప్యాక్ మిశ్రమంలో మిక్స్ చేసుకోవచ్చు.

4. నిమ్మ: చాలా రకాల ఫేస్ ప్యాక్ ల్లో ఈ నిమ్మరసాన్ని తప్పనిసరిగా ఉపయోగించి ఉంటారు. లెమన్ లో సిట్రస్ యాసిడ్ ఉండటం వల్ల చర్మాన్ని శుభ్రపరుస్తుంది. డెడ్ స్కిన్ సెల్స్ ను తొలగిస్తుంది. ముఖంలో జిడ్డును తొలగించి చర్మం తెల్లగా మార్చుతుంది. నిమ్మరసం మరియు తేనె రెండు మిక్స్ చేసి ముఖానికి పట్టించి జిడ్డు చర్మం నుండి బయటపడండి.

English summary

Fruit Face Packs To Treat Oily Skin | మీ ముఖం జిడ్డుగా ఉందా.. ఐతే ఈ ఫ్రూట్ ప్యాక్ మీకోసమే...

Having an oily skin can bring many skin related problems like acne, pimples and a greasy skin. Fruits are considered to be healthy and thus it is important to include them in our daily diet. However, fruits also have skin benefits. There are many fruits that offer many skin benefits.
Story first published: Tuesday, February 12, 2013, 15:45 [IST]
Desktop Bottom Promotion