For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మచ్చలు తొలగించటానికి కొన్ని పండ్ల రసాలు

By Derangula Mallikarjuna
|

మచ్చలు అనేవి మన శరీరంలో అత్యంత ఇబ్బందికరమైన మరియు అవాంఛిత భాగంగా ఉంటాయి. మచ్చలు అనేవి గతంలో ఒక గాయం లేదా గాయం కారణంగా శరీరంలో ఎక్కడైనా ఏర్పడతాయి. ప్రమాద కారణంగా,గాయం లేదా గాయం ప్రాంతంలో,ఇన్ఫెక్షన్ లేదా మోటిమలు ఉన్న ప్రదేశంలో వస్తాయి. ఆ ప్రదేశంలో చర్మం ప్రోటీన్ల కూర్పు వేరే విధంగా ఉంటుంది. అందువలన ఆ ప్రదేశం అసమానంగా మరియు కఠినముగా కనిపిస్తుంది.

ఒక మచ్చ కొంత సమయం అయిన తర్వాత లైట్ గా మారుతుంది. కానీ సమయంతో మెరుగు లేని సందర్భంలో,మీరు ఉపయోగించే కొన్ని చికిత్సలు ఉన్నాయి. మచ్చ తొలగింపు కోసం అనేక రసాయన ఆధారిత క్రీమ్లు అందుబాటులో ఉన్నాయి. కానీ స్వల్ప కాలంలో ప్రభావాలను అందిస్తుంది. అంతేకాక మీ చర్మం మీద ప్రభావం చూపుతుంది. అందువలన ఎల్లప్పుడూ చర్మ సమస్యలకు సహజ చికిత్స ఉపయోగకరంగా ఉంటుంది.

మచ్చ చికిత్సకు ఉపయోగించటానికి వివిధ రకాల మూలికలు, కూరగాయలు మరియు పండ్లు మొదలైన అనేక సహజ నివారణలు ఉన్నాయి. నేడు,మేము మచ్చ తొలగింపు కోసం కొన్ని పండ్ల రసాల గురించి చర్చిస్తున్నాము. పండ్లు చర్మం చాలా ఆరోగ్యంగా ఉండటానికి మరియు చర్మం సంబంధిత సమస్యల కొరకు చాలా బాగా ఉపయోగపడతాయి. అదేవిధంగా పండ్ల రసాలను కూడా ఆరోగ్యానికి మరియు మచ్చ సమస్యలకు ఉపయోగించవచ్చు. మచ్చల కోసం కొన్ని ఉపయోగకరమైన కొన్ని పండ్ల రసాలు క్రింద ఇవ్వబడ్డాయి: -

టమోటాలు

టమోటాలు

ఎరుపు మరియు జ్యుసి టమోటాలు మచ్చ తొలగింపు చికిత్సల కోసం ఉపయోగించే పండుగా ఉన్నది. టమోటా రసంను తీసి మచ్చలకు పూయాలి.10-15 నిమిషాలు తర్వాత చల్లటి నీటితో కడగాలి. టమోటో చర్మం మేకింగ్ మరియు మచ్చలు తొలగించటానికి సహజ లక్షణాలను కలిగి ఉంటుంది.క్రమం తప్పకుండా టమోటా ఉపయోగించటం వలన చర్మంనకు చాలా మంచిది. టమోటాలు మచ్చలను తొలగించుట మాత్రమే కాకుండా చర్మం ఆరోగ్యంగా మరియు అందముగా ఉండేటట్లు చేస్తుంది.

నిమ్మకాయ

నిమ్మకాయ

నిమ్మకాయ అనేక ఆరోగ్య మరియు శరీర సమస్యలు కొరకు ఒక ఔషధంగా ఉంది. ఇది కూడా మచ్చ తొలగింపు కొరకు ఉపయోగించే ఒక పండు.నిమ్మరసం చర్మం మచ్చలను తేలిక చేయుట మరియు చర్మం కాంతి మరియు ప్రకాశవంతముగా చేయడానికి సహజ బ్లీచింగ్ లక్షణాలను కలిగి ఉంది.నిమ్మరసంను నేరుగా ఉపయోగించవచ్చు. పేస్ ప్యాక్ లేదా ఫేస్ మాస్క్ లలో కలిపి ఉపయోగించవచ్చు. నిమ్మరసం సహజమైన ఆమ్ల గుణాన్ని కలిగి ఉంటుంది. మీరు మచ్చలపై ఉపయోగించటానికి ముందు మీ అరచేతిలో వేసుకొని రాయటానికి ప్రయత్నించాలి.

ఆరెంజ్

ఆరెంజ్

ఆరెంజ్ చర్మం కొరకు ఉపయోగకరంగా ఉండే విటమిన్లను కలిగి ఉంది. మచ్చలు ఉన్న ప్రదేశంలో ఆరెంజ్ రసం రాస్తే మచ్చలు పోయి చర్మం అందముగా తయారవుతుంది. ఆరెంజ్ రసంను మీ చర్మంపై రాసి 10-15 నిమిషాల తర్వాత ఒక మోస్తరు నీటితో కడగాలి.

స్ట్రాబెర్రీలు

స్ట్రాబెర్రీలు

స్ట్రాబెర్రీ రసం మచ్చలు చుట్టూ ఉండే అసమాన చర్మం ప్యాచ్ తొలగించడానికి స్క్రబ్ వలె ఉపయోగించవచ్చు.ఇతర పండ్ల రసాలతో పోలిస్తే కొద్దిగా తక్కువ ప్రభావం ఉంటుంది. అయితే,మచ్చలు కొరకు స్ట్రాబెర్రీ రసం కూడా ప్రభావవంతమైనది. స్ట్రాబెర్రీ రసంను చర్మంపై రుద్దితే చర్మ దోషాలను తగ్గిస్తుంది. అంతేకాక చర్మంను నునుపుగా మరియు శుభ్రంగా చేస్తుంది.

పుచ్చపండు

పుచ్చపండు

పుచ్చకాయ రసం వేసవి కాలంలో మాత్రమే మంచి శీతలకరణే కాక చర్మ సంబంధిత సమస్యలకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. పుచ్చకాయలు చాలా జ్యుసి పండ్లు మరియు అందువలన నేరుగా చర్మంపై రాసి మరియు కొన్ని నిమిషాల పాటు ఉంచి నీటితో కడగాలి. పుచ్చకాయ రసం మచ్చ తగ్గింపు మరియు తొలగింపు కొరకు బాగా పనిచేస్తుంది.

ఈ మచ్చ తొలగింపు మరియు చికిత్స కొరకు కొన్ని పండ్ల రసాలు ఉన్నాయి. మచ్చల కొరకు అల్లం, ఉల్లిపాయలు,బంగాళాదుంపలు మొదలైన కొన్ని మంచి ఇతర రసాలు ఉన్నాయి. మచ్చలు ఇబ్బందికరముగా మరియు న్యూన్యత అనుభూతితో ఉంటాయి. కానీ వాటిని కూడా కొద్దిగా ఓపిక మరియు అంకితభావంతో సమర్థవంతంగా తొలగించవచ్చు.

Desktop Bottom Promotion