For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మొటిమల సమస్య బాధిస్తుంటే..తప్పక గుర్తుంచుకోవల్సిన విషయాలు?!

|

సాధారణంగా అన్ని వయస్సుల వారిలో వచ్చే సాధారణ చర్మ సమస్య మొటిమలు, మచ్చలు!ఈ సమస్య కేవలం టీనేజ్ వారికి మాత్రమే పరిమితం కాదు. పెద్దవారిలో కూడా మొటిమలు కలిగి మరియు ముఖం మీద ఒక మచ్చలా ఏర్పడవచ్చు. మొటిమలను గిల్లడం వల్ల చర్మ సమస్యలకు పరిష్కారం కాదు. మొటిమలను నివారించడానికి అనేక మార్గాలు ఉన్నాయి. ఉదాహరణకు, మొటిమల చర్మం మీద నిమ్మరసాన్ని అప్లై చేయడం అనేది, ఇది ఒక బెస్ట్ హోం రెమడీ. ఇది చాలా చౌకైన మరియు ప్రభావంతమైన ఇంటి చిట్కా.

అదే విధంగా మిగిలిన వంటగది వస్తువులు ఉదా: గంథపు పొడి మరియు తేనె, కలబంద మరియు అరటి వంటివి కూడా మొటిమలను నివారించడానికి చికిత్సలో ఉపయోగించేటటువంటి చాలా సమర్థవంతగా ఉంటాయి. కాబట్టి మొటిమల నివారణకు రసాయన ఆధారిత ఖరీదైన ఉప్పత్తుల వాడకం మరియు ఖర్చుతూ కూడిన సెలూన్ల చుట్టూ తిరిగి పర్స్ ఖాళీ చేసుకోవడం కంటే వంటగదిలో ఉండే వస్తువులతో సహజంగా మొటిమలకు చికిత్స అంధించండి. మొటిమలు లేని ముఖం అందాన్ని సొంతం చేసుకోండి.

అయితే, కేవలం ఫేస్ ప్యాక్ లు అప్లై చేయడం వల్ల పనిచేయదు. ఇది కేవలం డైట్ వంటిదే. కానీ ప్రయోజనం ఉండదు. అందుకోసం మొటిమలను నివారించాలంటే మీరు కొన్ని ఆరోగ్య చిట్కాలను పాటించడం చాలా అవసరం. ముఖ్యంగా అధికంగా మొటిమల చర్మ సమస్యతో బాధపడే మహిళలు కొన్ని విషయాలను మనస్సులో గుర్తుంచుకోవాలి. ఉదాహరణకు: జుట్టు ముఖం మీద పడటం వల్ల కూడా ముఖంలో మొటిమలు విస్తరించడం జరుగుతుంది . కాబట్టి, తరచూ మొటిమల సమస్యకు గురిఅయ్యే మహిళలు తప్పకుండా గుర్తుంచుకోవల్సిన కొన్ని విషయాలున్నాయి...వాటి పరిశీలించండి..

మొటిమలు లేని స్వచ్ఛమైన చర్మాన్ని పొందాలంటే..!

మొటిమల మీద వత్తకూడదు లేదా గిల్లకూడదు: మొటిమలను గిల్లి లోపల ఉన్న పస్ (చీమును)తీసివేయడం మంచిదని బావిస్తే, అది తప్పు ఆలోచన. అలా చేయడం వల్ల ఆ ప్రదేశంలో నల్ల మచ్చలు ఏర్పడతాయి మరియు ముఖం మీద ఇతర ప్రదేశాల్లో మొటిమలు వ్యాప్తి చెందుతాయి.

మొటిమలు లేని స్వచ్ఛమైన చర్మాన్ని పొందాలంటే..!

శుభ్రం చేసుకోవడం: మొటిమల చర్మ సమస్యకు గురిఅయ్యే మహిళలు, తప్పక గుర్తించుకోవల్సిన విషయం ప్రతి రోజూ కనీసం రెండు సార్లు ముఖంను శుభ్రం చేసుకోవాలి. ఇలా రెగ్యులర్ గా చేయడం వల్ల మొటిమలకు కారణం అయ్యే జిడ్డు, ధూళి మరియు డెడ్ స్కిన్ సెల్స్ ను నిరోధిస్తుంది.

మొటిమలు లేని స్వచ్ఛమైన చర్మాన్ని పొందాలంటే..!

మొటిమలను తాకకూడదు: మొటిమలను చేతులతో తాకకూడదు. చేతుల్లు దుమ్ము లేదా కంటికి కనబడని క్రిములు ఉన్నప్పుడు చేతులతో తాకడం వల్ల మొటిమలు పగిలో లోపలికి ప్రవేశించడం వల్ల ఆప్రదేశంలో ఇన్ఫెక్షన్ అవ్వడం లేదా మొటిమలు మరింత పెరగడానికి కారణం అవుతుంది.

మొటిమలు లేని స్వచ్ఛమైన చర్మాన్ని పొందాలంటే..!

మేకప్ వస్తువులు శుభ్రం చేయాలి: మేకప్ వస్తువులను తరచూ శుభ్రం చేస్తుండాలి. అలా శుభ్రం చేయకుండా వాడిన వాటిని మళ్ళీ మళ్ళీ వాడటం వల్ల అపరిశుభ్రమైన మేకప్ బ్రష్ ల్లో బాక్టీరియా చేరి బ్రేక్ అవుట్స్ ను పెంచుతుంది. కాబట్టి వాటిని ఉపయోగించిన తర్వాత లేదా ఉపయోగించే ముందు వాటిని శుభ్రం చేసి పొడిగా ఆరబెట్టడం చాలా ముఖ్యం.

మొటిమలు లేని స్వచ్ఛమైన చర్మాన్ని పొందాలంటే..!

మేకప్ తొలగించాలి: నిద్రించే ముందు, మేకప్ ను తొలగించడం మర్చిపోకూడదు. మొటిమల చర్మ సమస్యలతో బాధపడే మహిళలు ఈ విషయాన్ని మర్చిపోకూడదు. మేకప్ తొలగించడం వల్ల మొటిమల బ్రేక్ అవుట్స్ ను మరియు మొటిమలను నివారిస్తుంది.

మొటిమలు లేని స్వచ్ఛమైన చర్మాన్ని పొందాలంటే..!

ఆయిల్ ఫ్రీ ఫౌండేషన్: ఆయిల్ ఫ్రీ ఫౌండేషన్ ను ఉపయోగించాలి. ఇది మొటిమలను హైడ్ చేయడమే కాదు, మొటిమలు రాకుండా నివారిస్తుంది.

మొటిమలు లేని స్వచ్ఛమైన చర్మాన్ని పొందాలంటే..!

ఎక్కువగా నీళ్ళు తాగాలి: మొటిమలకు కారణం అయ్యే మరియు డ్యామేజ్ చర్మానికి కారణం అయ్యే టాక్సిన్స్ మరియు ఫ్రీరాడికల్స్ ను శరీరం నుండి తొలగించాలంటే నీరును ఎక్కువగా తాగాలి.

మొటిమలు లేని స్వచ్ఛమైన చర్మాన్ని పొందాలంటే..!

ముఖం మీద కేశాలను పడనీయకూడదు: ముఖం మీద మొటిమలు కలిగి ఉన్నప్పటికీ, కురుల చూడటానికి సెక్సీగా ఉంటాయి. అయితే జిడ్డు గల జుట్టు మొటిమలు ఏర్పడటాన్ని పెంచుతుంది.

మొటిమలు లేని స్వచ్ఛమైన చర్మాన్ని పొందాలంటే..!

తగినంత నిద్ర: నిద్రలేమి కూడా చర్మ మీద తీవ్ర ప్రభావాన్ని చూపెడుతుంది . కాబట్టి మీరు ఫ్రెష్ గా మెరుస్తూ మొటిమలు లేని చర్మంతో అందంగా కనబడాలంటే తగినంత నిద్రను పొందండి.

మొటిమలు లేని స్వచ్ఛమైన చర్మాన్ని పొందాలంటే..!

తగినంత నిద్ర: నిద్రలేమి కూడా చర్మ మీద తీవ్ర ప్రభావాన్ని చూపెడుతుంది . కాబట్టి మీరు ఫ్రెష్ గా మెరుస్తూ మొటిమలు లేని చర్మంతో అందంగా కనబడాలంటే తగినంత నిద్రను పొందండి.

English summary

Have Acne Prone Skin? Remember These...

Acne is a common skin problem that is commonly spotted on people of all ages! It is not just restricted to teens. Even adults have acne and this can be a flaw on your face. Squeezing out the acne is not the solution to the skin problems.
Story first published: Monday, June 10, 2013, 13:36 [IST]
Desktop Bottom Promotion